నవీన్ గులియాను చూస్తే వైకల్యానికే వణుకు !

పక్షవాతం వచ్చినా మొక్కవోని ధైర్యం ఎవరెస్ట్ అంత ఎత్తుపై టాటా సఫారీ డ్రైవింగ్ లిమ్కా బుక్ ఆఫ్ రికార్డుల కెక్కిన నవీన్ సంకల్పం బలంగా ఉంటే దూరం అదే తగ్గిపోతుంది- నవీన్ గులియా కాళ్ళు చచ్చుబడిపోయినా ఎగరాలనే నీ కోరికను ఎవరూ చంపలేరు-నవీన్ గులియా

0

కొన్నిసంఘటనలు జీవిత గమనాన్నిమార్చేస్తాయి మరికొన్ని తీరని వేదనను మిగలుస్తాయి. సాఫీగా సాగిపోయే జీవితంలో తుఫాను అలలు వచ్చిపడ్డట్టయింది. వేగంగా పరిగెత్తే ఓ యువకుడు అకస్మాత్తుగా వీల్ ఛైర్‌కి పరిమితమయిపోయాడు. ఎన్నో కలలు కన్న అతని జీవితం అర్థాంతరంగా ఆగిపోయింది.

నవీన్ గులియా జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు మనకు మతి పోగొడతాయి. పూణెలోని క్వీన్ మేరీ టెక్నికల్ ఇనిస్టిట్యూట్లో ఇండియన్ మిలటరీ అకాడమీ శిక్షణ పొందుతున్నాడు నవీన్ గులియా. అకస్మాత్తుగా ఆకాశం మేఘావృతమై ఉంది. అనుకోని సంఘటన అతని జీవితాన్ని మార్చేసింది. శిక్షణలో ఉండగా జరిగిన ప్రమాదంలో అతని మెడకింది భాగం చచ్చుబడిపోయింది. పక్షవాతం వచ్చినట్టుగా మారిపోయింది. వెన్నెముక స్పర్శను కోల్పోయింది. ఆ సంగతినే నర్సు చెబితే... అదంతా జోక్ అనుకున్నాడు. అయితే అది నిజమని కాళ్ళు కదిపాక గానీ నవీన్‌కు అర్థం కాలేదు. ఆఫీసర్ హోదా కోసం ఇండియన్ మిలటరీ అకాడమీతో పోరాటం చేశాడు నవీన్. శిక్షణ అంతా పూర్తయ్యాక ఇలా జరగడంలో తన తప్పులేదన్నాడు.

నవీన్ గులియా
నవీన్ గులియా

శిక్షణలో ఉండగా తనతోటి శిక్షకుడి పొరపాటుకి నవీన్ బలయ్యాడు. ‘‘ప్రమాదం జరిగినందుకు నేను చింతించడం లేదు. ప్రమాదాలు జరగడం మామూలే. విధిని ఎదిరించడమే మనముందున్న కర్తవ్యం’’ అంటాడు నవీన్.

మొక్కవోని ధైర్యంతో ముందుకు సాగాలని నిర్ణయించాడు నవీన్. వైద్యులు, ఫిజియోథెరపిస్టుల సాయంతో ముందుకు సాగాడు. వెన్నెముకను కదపడానికి విశ్వ ప్రయత్నంచేశాడు నవీన్. 

``నేనిక ఆర్మీ ఆఫీసర్‌ని ఎప్పటికీ కాలేను. నేను ఏమీ రాయలేను. అంగుళం కూడా నా అవయవాలను కదపలేను.. అయినా నేనేదో చేయాలని ఉంది.. చెప్పాల్సింది చాలా ఉంది’’ అంటాడు నవీన్.

హాస్పిటల్ బెడ్‌పై ఉండగానే ఏదో చేయాలని నిర్ణయించాడు. మానసిక స్థైర్యాన్ని పెంపొందించుకున్నాడు. ఖాళీ చెస్‌బోర్డుపై ప్రాక్టీస్ చేశాడు. కంప్యూటర్ విద్యలో ప్రావీణ్యం సంపాదించాలని నిర్ణయించుకున్నాడు. Aptech లో 99 శాతం మార్కులతో కోర్పు పూర్తిచేశాడు. మిత్రుల సాయంతో Symbiosis ఇనిస్టిట్యూట్‌లో 40 అంతస్తులు ఎక్కి కంప్యూటర్ మేనేజ్‌మెంట్‌లో మాస్టర్స్ డిగ్రీ ఫస్ట్ క్లాస్‌లో పాసయ్యాడు.

బతకడానికి ఏదో ఒక ఉద్యోగం చేయాలి కాబట్టి కంప్యూటర్ సైన్స్ లెక్చరర్‌గా జాయిన్ అయ్యాడు. ఎలాగైనా కారు డ్రైవ్ చేయాలని నిర్ణయించాడు. అయితే కారు కంపెనీలు మాత్రం చేత్తో కంట్రోల్ చేసే కారు విడిభాగాలను తయారుచేసి ఇవ్వడానికి విముఖత చూపించాయి.

‘‘వందశాతం ఎందుకూ పనికిరావని డాక్టర్లు తేల్చేసినా నవీన్‌లో ఆత్మస్థైర్యం మాత్రం తగ్గిపోలేదు. ఎలాగైనా, ఏదైనా సాధించాలని నిర్ణయించుకున్నాడు. కారు నడపాలనే నిర్ణయించుకున్నాడు. ప్రాక్టీస్ చేస్తే ఏదైనా సాధించవచ్చని భావించాడు. నా టార్గెట్ పెద్దగా ఉన్నా.. అధైర్యం నా దరిదాపులకు కూడా రానివ్వలేదు’’ అంటాడు నవ్వుతూ నవీన్.

భుజాలు కదుపుతూ, చేత్తో ఆటోమొబైల్ క్లచ్‌లు ఆపరేట్ చేయడం మొదలుపెట్టాడు నవీన్. ‘‘డ్రైవింగ్ కంటే ఎగరడం చాలా ఈజీ’’ అంటాడు నవీన్.

సంక్షోభంలో కొట్టుమిట్టాడుతూనే రొమాన్స్‌కి చోటిచ్చాడు నవీన్. ఖుషి అనే అమ్మాయిని ప్రేమించిన నవీన్ ఆమె తల్లిదండ్రుల సమ్మతితో పెళ్ళిచేసుకున్నాడు. నవీన్ ఎంతగా మారిపోయాడంటే ఏదైనా సాధించగలననే నమ్మకం అతనికి కలిగింది.

నమ్మకాన్ని మించిన మిత్రుడు లేడు... అపనమ్మకాన్ని మించిన శత్రువు మరొకడు రాడు అని బాగా నమ్ముతాడు నవీన్. అత్యంత ఎత్తయిన పర్వతంపై టాటా సఫారీ నడిపి చూపించాడు నవీన్. అంతేకాదు ఈ సాహస కార్యానికి నవీన్ పేరును లిమ్కా బుక్ ఆఫ్ రికార్డులో నమోదు చేశారు నిర్వాహకులు.

ఎవరెస్ట్ బేస్ క్యాంప్ కంటే అత్యంత ఎత్తయిన 18632 అడుగుల ఎత్తులో ఈ సాహసకార్యానికి నడుం బిగించాడు నవీన్. టాటా కంపెనీ పోలియో లాంటి శారీరక ఇబ్బందులున్నవారికోసం కొన్ని వాహనాలను డిజైన్ చేస్తూ ఉంటుంది. యుద్ధరంగంలో గాయాల పాలైన, అవయవాలు కోల్పోయినవారికి కొత్తజీవితం ఇచ్చేందుకు నవీన్ ఇప్పుడు పనిచేస్తున్నాడు.

War Wounded Foundation, Delhiలో సీనియర్ కో ఆర్డినేటర్‌గా నవీన్ విధులు నిర్వహిస్తున్నాడు. అంతేకాదు ADAA మరియు Jan Jagriti అనే స్వచ్ఛంద సంస్థలను కూడా నవీన్ నడుపుతున్నాడు. 2005లో హర్యానాలోని బర్హానా అనే గ్రామాన్ని కూడా దత్తత తీసుకున్నాడు. గ్రామాల్లో రోజురోజుకీ తగ్గిపోతున్న లింగనిష్పత్తిపై దృష్టిపెట్టాడు నవీన్.

హర్యానాలో బ్రూణహత్యలు బాగా పెరిగిపోతున్నాయని ... 1000 మంది అబ్బాయిలకు అక్కడ ఉన్నది 376 మంది ఆడపిల్లలు ఉన్నారని...ఇలా అయితే పెళ్ళిళ్ళు కావడం కష్టం అంటాడు నవీన్. సమాజంలో ఇలాంటి ధోరణులను దూరం చేయాలి. ఆడపిల్లల తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇవ్వాలంటారు నవీన్.

తన జీవితంలో జరిగిన సంఘటనలను అక్షరీకరించాడు. ‘In Quest of the Last Victory’ అనేపేరుతో తన ఆత్మకథను ఇంగ్లీషు, హిందీల్లో రాస్తున్నాడు. మొదటి ఎడిషన్ ఇప్పటికే లక్ష కాపీల సర్క్యులేషన్ దాటిపోయింది. 2005లో ఆర్మీ చీఫ్ నుంచి నేషనల్ రోల్‌మోడల్ అవార్డు అందుకున్నాడు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం చేతులమీదుగా అవార్డు అందుకోవడం తనకు జీవితంలో లభించిన అదృష్టం అంటాడు నవీన్ గులియా.

తల్లిదండ్రులు, భార్య ఖుషితో జీవితాన్ని గుర్గావ్‌లో సరదాగా గడిపేస్తున్నాడు నవీన్ గులియా.

Sr. Correspondent @ yourstory.com

Related Stories

Stories by ABDUL SAMAD