సెలబ్రేషన్ ఏంటో, ఏ రోజో చెప్పండి చాలు.. వేదిక సంగతి వీళ్లు చూసుకుంటారు!!

సెలబ్రేషన్ ఏంటో, ఏ రోజో చెప్పండి చాలు.. వేదిక సంగతి వీళ్లు చూసుకుంటారు!!

Friday July 21, 2017,

2 min Read

రాకేశ్ శర్మ ఒక ఫైనాన్షియల్ కన్సల్టెంట్. కొడుకు పెళ్లి చేయాలనుకున్నాడు. ముంబైలో మంచి వెన్యూ కోసం వెతికాడు. జుహు లాంటి ప్రాంతమైతే బావుంటుందని భావించాడు. సముద్రం ఒడ్డున ఉప్ప గాలుల సవ్వడిలో తనయుడి వివాహం ఉన్నంతలో వైభవంగా చేయాలనుకున్నాడు. కొన్ని హోటళ్లను సంప్రదించాడు. కొటేషన్ చూసే అదిరిపోయాడు. అంతంత రేట్లా అని నోరెళ్లబెట్టాడు. 300 మంది అతిథులకే అంత కాస్ట్ పెట్టలేకపోయాడు. అప్పుడెవరో చెప్పారు.. వావ్ వెన్యూ గురించి. వాళ్లతో వెళ్లి మాట్లాడి షాకయ్యాడు. అంతకు ముందు హోటళ్లు చెప్పిన రేటు కంటే 40 శాతం తక్కువ. పైగా అద్భుతమైన వివాహ వేదిక దొరికింది. అతని సంతోషం మాటల్లో చెప్పలేం.

image


పెళ్లి, బర్త్ డే పార్టీ, ఆడిటోరియం, ఎగ్జిబిషన్, పెట్ పార్టీ వెన్యూ, ప్రైవేట్ డైనింగ్ రూమ్స్, కాన్ఫరెన్స్ హాల్స్, మీటింగ్ రూమ్స్, క్లబ్, లాంజ్, పబ్, రెస్టారెంట్, బార్, చివరికి రిసార్ట్ కావాలన్నా సరే, వావ్ వెన్యూ సమకూరుస్తుంది. అనుకున్న రీతిలో, అనుకున్న బడ్జెట్ లో, అద్భుతమైన వేదికను వెతికి పెడుతుంది.

గణేశ్ రాజ్, గీతా రాత్వాని మిత్రద్వయానికి వచ్చిన ఆలోచన ఇది. గతంలో పనిచేసిన వెంచర్లో వేదిక దొరక్క సతమతమైన క్లయింట్ల కష్టాలను కళ్లారా చూసి, ఇలాంటి ఆన్ డిమాండ్ ప్లాట్ ఫామ్ తామే ఎందుకు పెట్టకూడదని నిర్ణయించుకున్నారు. అలా ఇద్దరు కలిసి వావ్ వెన్యూ స్టార్టప్ మొదలుపెట్టారు.

పెళ్లయినా, బర్త్ డే పార్టీ అయినా, కాన్ఫరెన్స్ హాలైనా సమయానికి అనుకున్న స్థలాలు అనుకున్న ధరలో దొరకవు. పెళ్లి ఒక రిసార్ట్ లో ప్లాన్ చేసుకుంటారు. చివరికి వేదిక తేలక ఎక్కడో చోట అని రాజీపడి, హోటల్లో కానిచ్చేస్తారు. బీచ్ లో బర్త్ డే పార్టీ అనుకుంటే, చివరికి నాలుగ్గోడల మధ్య చేసుకోవాల్సి వస్తుంది. ఒక టేస్టూ, ఒక అభిరుచి ఉన్నవారికి సరైన వెన్యూ దొరకడం ఆషామాషీ కాదు. అలాంటి డ్రీమ్స్ ని ఫుల్ ఫిల్ చేస్తోంది వావ్ వెన్యూ.

image


వావ్ వెన్యూ గురించి అనుకోగానే సరిపోలేదు. మూడేళ్లు దానిపై స్టడీ చేశారిద్దరు. ముందుగా కస్టమర్ పెయిన్ పాయింట్స్ ఏంటో రీసెర్చ్ చేశారు. ఆ తర్వాత 2016 ఏప్రిల్ లో లాంఛ్ చేశారు. మొదటగా వెన్యూ ఓనర్లందరినీ ఒకే గొడుగు కిందకి తెచ్చారు. బ్వాంకెట్ హాల్ నుంచి కాన్ఫరెన్స్ హాల్ దాకా అన్ని రకాల సదుపాయలున్న 5 స్టార్ హోటళ్లతో టై అప్ అయ్యారు.

అతి తక్కువ టైంలోనే వావ్ వెన్యూ నిజంగానే వావ్ అనిపించింది. ప్రస్తుతానికి 500 మంది క్లయింట్స్ ఉన్నారు. వెయ్యికి పైనే వేదికలు అగ్రిగేట్ చేసుకున్నారు. త్వరలో మొబైల్ వెబ్ ప్లాట్ ఫాం ద్వారా వ్యాపారాన్ని ప్రపంచ వ్యాప్తంగా విస్తరించాలనే ప్లాన్ లో ఉన్నారు. మరో మూడు నెలల తర్వాత యాప్ లాంఛ్ చేయబోతున్నారు. వచ్చే ఏడాది చివరికల్లా 5,000 వేదికలు తమ సంస్థ జాబితాలో ఉండబోతున్నాయి. వావ్ వెన్యూ 16 కేటగిరీల్లో సర్వీసులు అందిస్తోంది.

ఇండియన్ బ్రాండ్ ఈక్వాలిటీ ఫౌండేషన్ ప్రకారం హాస్పిటాలిటీ మార్కెట్ సైజ్ లక్ష కోట్ల పైనే. ఇంత పెద్ద మార్కెట్లో కనీసం 1 శాతమైనా క్యాప్చర్ చేయాలనేది గీతా, గణేశ్ లక్ష్యం. అంటే వాళ్ల టార్గెట్ వంద కోట్ల బిజినెస్. టెక్నాలజీని అప్ గ్రేడ్ చేసి దాన్ని సాధిస్తామని ఫౌండర్లు దీమాగా ఉన్నారు. అదే నిజమైతే ఆ విజయాన్ని సెలబ్రేట్ చేసుకోడానికి వాళ్లకో మంచి వేదిక కావాలి? కాదంటారా..? 

వెబ్ సైట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి