మీకు చౌక మందులను సూచించే డాక్టర్ 'ట్రూఎండి'

జెనిరిక్ మందులపై అవగాహన కల్పిస్తూ ఉచిత సేవలు అందిస్తున్న ‘ట్రూ ఎండీ’బ్రాండెడ్ మందులకు ప్రత్యమ్నాయ వివరాలుడాక్టర్ సమీర్ శర్మను ఆదర్శంగా తీసుకున్న బిట్స్ పిలానీ విద్యార్ధులుఆరోగ్య రంగంలో విప్లవాత్మకమైన మార్పు రావాలనే లక్ష్యం

మీకు చౌక మందులను సూచించే డాక్టర్ 'ట్రూఎండి'

Friday June 05, 2015,

3 min Read

ఎఫ్‌డిఏ (అమెరికన్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్) ప్రకారం, “జెనిరిక్ మందులు క్వాలిటీ, తయారీ, వాడకం సహా అన్ని విభాగాల్లో బ్రాండెడ్ మందులతో సమానంగా, సురక్షితంగా పనిచేస్తాయి".

image


అసలు ఎఫ్ డీ ఏ అనుమతి లేనిది ఏ మందులు కూడా మార్కెట్లో అమ్మడానికి వీలు లేదు. అయితే జెనెరిక్ మందులు కూడా బ్రాండెడ్ మందులకు సమానంగా ‘సురక్షితంగా’ ఉండాలి లేదా ‘ప్రమాదకరమైనా’ ఉండాలి.

2012 లో ప్రముఖ నటుడు ఆమిర్ ఖాన్ ఆధ్వర్యంలో ప్రసారమైన టీవీ షో ‘సత్యమేవ్ జయతే’ ఓ కధనాన్ని ప్రసారం చేసింది, “మన దేశ ఆరోగ్య రంగానికి చికిత్స అవసరమా” అనే ప్రశ్నను లేవనెత్తుతూ, ఖరీదైన మందులను అదుపు చేయడానికి డాక్టర్ సమీర్ శర్మ చేస్తున్న కృషిని అందులో చూపించారు. రాజస్ధాన్ మెడికల్ సర్వీసెస్ కార్పొరేషన్ మాజీ అధ్యక్షుడైన ఆయన, జెనెరిక్ మందులు మాత్రమే అమ్మే విధంగా చిత్తోర్‌గర్ లో ‘జన్ ఔషధీ’ పేరుతో అనేక డిస్పెన్సరీలను ప్రారంభించారు.

‘ట్రూ ఎండీ’

image


ఆయన సేవలతో ప్రభావితులైన కొంత మంది బిట్స్ పిలానీ విద్యార్ధులు, భారీ సంఖ్యలో మన దేశంలో దొరికే మందుల గురించి డాటా బేస్ సేకరించారు. కొంత మేరకు డాక్టర్ శర్మ సహకారం తీసుకోవడంతో పాటు, ఎన్‌పీపీఏ (నేషనల్‌ ఫార్మాసూటికల్ ప్రైజింగ్ అధారిటీ) వంటి కొన్నిసంస్ధలను సంప్రదించి, 2014, జూన్ 17న ‘ట్రూ ఎండీ’ ని ప్రారంభించారు. ఈ వెబ్ సైట్‌లో సుమారు లక్షకు పైగా మందుల వివరాల డాటాబేస్ ఉంది. ఈ సర్చ్ ఇంజన్ మీకు జెనెరిక్ మందులతో పాటు బ్రాండెడ్ ముందులకు ప్రత్యామ్నయంగా చౌక ధరలో దొరికే మందుల వివరాలను అందిస్తుంది.

‘బిట్స్ పిలాని’ లో ఫైనల్ ఇయర్ చదువుతున్న ఆయుష్ అగర్వాల్, ఆయుష్ జైన్, అద్భుత్ గుప్తా, ఆదిత్య జోషి, యశ్వర్ధన్ శ్రీవాత్సవ ఈ వెబ్ సైట్ వ్యవస్ధాపకులు.

ట్రూ ఎండీ నిర్వాహకులు

ట్రూ ఎండీ నిర్వాహకులు


ఇందులో సర్వీస్ ఉచితంగా ఇవ్వడంతో పాటు, సమాజానికి ఉపయోగ పడేలా ఎవరైనా హెల్త్ కేర్ యాప్స్ తయారు చేయడానికి వీలుగా ఉండటానికి ఓపన్ సోర్స్ ఏపీఐలను కూడా అందిస్తున్నారు. ఇప్పటికే ట్రూ ఎండీ అందించిన ఏపీఐల సహకారంతో ఆండ్రాయిడ్ మరియు, ఐఓఎస్‌లో ఆప్‌ను కొంత మంది ప్రారంభించారు. ఎటువంటి స్వార్ధం లేకుండా, సేవా భావంతో చేస్తున్న ‘ట్రూ ఎండీ’ టీమ్ ను ఎంతో మంది ప్రముఖులు మెచ్చుకున్నారు.

జెనిరిక్ ఔషధాల రేటు ఎందుకు తక్కువ ?

జనరిక్ తయారీదారులు ఎవరూ ఔషధాల పరిశోధన, అభివృద్ధి చేయరు. అప్పటికే మార్కెట్లో సక్సెస్ అయిన ఫార్ములానే వాడుకుంటారు. వాళ్ల పేటెంట్ కాలం ముగిసిన తర్వాత అదే కంపోజిషన్‌తో మందును తయారు చేస్తారు. అప్పటికే రెడీమేడ్‌గా ఉన్న ఫార్ములాను వాడి మందును తయారు చేయడం వల్ల ఖర్చు కూడా చాలా తక్కువ. కొన్ని సార్లు బ్రాండెడ్‌తో పొల్చుకుంటే 100 శాతం తక్కువ ఖర్చుతో కూడా జెనిరిక్స్ దొరుకుతాయి.

చేదు నిజం

ఈ మందుల్లో ఇంత తేడా ఉంటే, మా డాక్టర్ వీటినే ఎందుకు రికమండ్ చేయరనే అలోచన చాలా మంది పేషెంట్స్ లో ఉంటుంది. కానీ మనకు ఎంత తెలిసిన డాక్టరైనా ఖరీదైన మందులనే రాస్తారనే విషయాన్ని మనం జీర్ణించుకోవాల్సిందే. అయితే ఇదంతా కేవలం భారీ స్దాయిలో దొరికే లాభం కోసం చేసే పని, అంతే కాకుండా ప్రజల్లో అవగాహన లేకపోవడం కూడా వారి వ్యాపారానికి అండగా మారింది.

“ఒకే రకమైన మందుల్లో పెద్ద ఎత్తున తేడా చూస్తుంటే ఆశ్చర్య పోవాల్సిందే. అందుబాటు ధరల్లో వైద్యం ఓ హక్కుగా మారాలంటారు ఈ వెబ్ సైట్ వ్యవస్ధాపకులు ఆయుష్ జైన్”.

యూఎస్, భాతర దేశాల్లో పరిస్ధితులు.

అమెరికాలో డాక్టర్లు రాసే సుమారు 80 శాతం ప్రిస్క్రిప్షన్లు జెనెరిక్ మందులనే సిఫారసు చేస్తారు. అదే మన దేశంలో వాటిని ఎవరూ పట్టించుకోరు. అసలు ఆశ్చర్యకర విషయం ఏంటంటే, ప్రపంచంలో ఎక్కువ జెనెరిక్ మందుల ఎగుమతిదారుల్లో భారత దేశం కూడా ముందుంది. మొత్తం ఆరోగ్య రంగంపై అయ్యే ఖర్చులో 50శాతం మందులకే వాడుతారని అంచనా. అదే జెనెరిక్ మందులు వాడితే పెద్ద ఎత్తున ఖర్చుని తగ్గించవచ్చు.

ట్రూ ఎండీ భవిష్యత్తు ప్రణాళిక

ఈ ప్రాజెక్ట్ తో పాటు ఆరోగ్య రంగంలో భారీ మార్పు తెచ్చే విధంగా మరో ప్రాజెక్ట్ ప్రారంభించబోతున్నారు. పేషెంట్ ఎక్కడి నుండైనా డాక్టర్‌ను సంప్రదించే విధంగా ఓ టెలీమెడిసిన్ ప్లాట్ ఫార్మ్ ను తయారు చేస్తున్నారు. అందే కాకుండా యూజర్ ఆరోగ్య వివరాలన్నీ భద్రంగా ఉంచే విధంగా ఈ ప్లాట్ ఫార్మ్ సహాయపడుతుందని అంటున్నారు.

image


సూచన: మందులు వాడే ముందు డాక్టర్ ను సంప్రదించగలరు.