కొంచెం ఇష్టం…కొంచెం కష్టం..! అయినా కన్ఫ్యూజన్ మాత్రం కంటిన్యూ.. !!

Tuesday March 01, 2016,

3 min Read

దేశంలో ఈ కామర్స్ రంగం విజృంభిస్తోంది. మౌస్ క్లిక్ తో అన్ని ఇంటిదగ్గరకు వచ్చేయాలనుకుంటోంది యువతరం. టాటా, విప్రో, అలీబాబా లాంటి బడా కంపెనీలు సైతం దేశీయ ఈ కామర్స్ రంగంలోకి పెట్టుబడులు గుమ్మరిస్తున్నాయి. అయితే కేంద్ర బడ్జెట్ 2016-17లో మాత్రం ఈ కామర్స్ గురించి డైరెక్ట్ గా ప్రస్తావించలేదు. వ్యవసాయ, ఆరోగ్య, విద్యారంగాలను బడ్జెట్ ఆశ్చర్యపరిచింది. ఆన్ లైన్ బిజినెస్ ను మాత్రం బడ్జెట్ తీవ్ర నిరాశకు గురి చేసింది. అస్సలు ఈ కామర్స్ అనే పదాన్నే వాడలేదు. అందుకే ఈ కామర్స్ అంటే ఏమిటన్న విషయానికి చట్టం ద్వారా నిర్వచనం ఇవ్వాలని యువర్ స్టోరీ డాట్ కాం గతంలోనే కోరింది. ఈ కామర్స్ కు నిర్వచనం ఇవ్వకపోయినా… బడ్జెట్ స్టేట్ మెంట్ ఈ రంగాన్ని ప్రోత్సహించేలా ఉంది. ఏప్రిల్ ఒకటి తర్వాత వచ్చే స్టార్టప్ లకు… మూడేళ్లపాటు పూర్తిగా పన్ను మినహాయిస్తామన్నారు… అంటే ఈ కామర్స్ లో వచ్చే స్టార్టప్ లకు ఈ నియమం వర్తిస్తుందన్నమాట. టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న కొద్దీ … ఈ కామర్స్ రంగంలోనే ఎక్కువ స్టార్టప్స్ వస్తున్నాయి. అంతేకాదు… స్టార్టప్ ల రిజిస్ట్రేషన్ కోసం నెలలతరబడి ఆఫీసుల చుట్టూ తిరగక్కర్లేదు… ఒక్కరోజులోనే మొత్తం ప్రక్రియ పూర్తవుతుందని ఆర్థికమంత్రి జైట్లీ హామీనిచ్చారు. ఈ నిబంధన అమలుకు ప్రభుత్వ చిత్తశుద్ధి అవసరం.

జీఎస్టీ – ఇతర ఇబ్బందులు

వస్తుసేవల పన్ను (జీఎస్టీ ) బిల్లను కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. దీన్ని ఈ బడ్జెట్ సమావేశాల్లో ఆమోదింపజేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. విపక్షాల మద్దతు కోరుతోంది. అయితే మెజార్టీలేక రాజ్యసభలో బిల్లు పెండింగ్ లో పడింది. మేకిన్ ఇండియా, డిజిటల్ ఇండియా రథచక్రాలు ముందుకు కదలాలంటే జీఎస్టీ బిల్లు పాసవ్వడం తప్పనిసరి. జీఎస్టీ అమల్లోకి వస్తే పరోక్షపన్నులన్నీ తొలగిపోతాయి. అందుకే ఈ కామర్స్ కంపెనీలు… ఈ బిల్లు ఆమోదాన్ని కోరుకుంటున్నాయి.

 ”జీఎస్టీ బిల్లు ఆమోదం పొందితే సంస్కరణలకు ఊతమిచ్చినట్లే. అందుకే రాజకీయ ఏకాభిప్రాయం కుదరాలని మేం కోరుకుంటున్నాం. భారతదేశంలో వ్యాపారం చేయడం ఈజీ అవుతుంది.”అనూప్ వికాల్, స్నాప్ డీల్ఎఫ్ ఓ

ఆన్ లైన్ మార్కెట్ ప్లేస్

అమ్మకందారులకు కొనుగోలుదారులకు మధ్య వారధిలా ఉన్నాయి కొన్ని వెబ్ సైట్లు. ఇవి సర్వీస్ ట్యాక్స్ కట్టాల్సి వస్తోంది. అంతేకాదు రకరకాల పన్నుల భారాన్ని మోస్తున్నాయి. దీనికి ఒక డెఫినిషన్ వస్తేనే… ఎఫ్.డీ.ఐలు పెట్టవచ్చా లేదా అన్న విషయంలో ఒక స్పష్టత వస్తుంది. ఆన్ లైన్ షాపింగ్ దే భవిష్యత్… సంప్రదాయ వ్యాపారాలకు ఎదురుదెబ్బ… వ్యాపారాన్ని ఈ కామర్స్ సులభతరం చేస్తోంది అన్న మాటలు తరచూ వింటుంటాం. కానీ ప్రభుత్వం మాత్రం దీనిపై సష్టతనివ్వకపోవడం దురదృష్టకరం. జీఎస్టీ అమలైతే అందులోనే ఈ కామర్స్ ఉందంటున్నారు ఖైతాన్ అండ్ కంపెనీ సీఈఓ నిహాల్ కొఠారి.

“దేశమంతా ఒకే పన్నుల విధానం ఉండాలని కోరుకుంటున్నాయి. రాష్ట్రానికో పన్ను విధానం వల్ల ఇటు కంపెనీలకు … అటు కస్టమర్లకు నష్టం వాటిల్లుతోంది. అందుకే జీఎస్టీ బిల్లు ఆమోదం పొందాలి, ట్యాక్స్ విధానంలో ఏకీకృత విధానం అమలుకావాలి” అంటారు ఆస్క్ మీ బజార్ సీఈఓ కిరణ్ మూర్తి.

undefined

undefined



పచ్చ నోట్లు చెదిరిపోవాలి

దేశంలో నగదు లావాదేవీలు తగ్గాలి… క్యాష్ లెస్ ఎకానమీ దిశగా అడుగులు వేయాలి… ఈ కామర్స్ కంపెనీలు కోరుకుంటున్నది ఇదే. 2017 మార్చినాటికి దేశంలోని మూడు లక్షల చౌక దుకాణాల్లో ఆటోమేషిన్ సదుపాయాలు కల్పిస్తామని బడ్జెట్ లో చెప్పారు. ఆధార్ ను డిజిటలైజ్ చేస్తామన్నారు. ఇది ఈ కామర్స్ రంగానికి మేలు చేసేదే అంటారు ఫ్రీచార్జ్ సీఓఓ గోవింద్ రాజన్. సర్ ఛార్జ్, కన్వీనియెన్స్ ఫీజును ప్రభుత్వం రద్దుచేసింది. దీనివల్ల చౌకధరల దుకాణాల్లో నగదురహిత చెల్లింపులు పెరిగాయి. డిజిటల్ పేమెంట్స్ పెరగాలి”

రైతులకు పండగే

ఫుడ్ రిటైలింగ్ రంగంలోకి ఆర్థిక మంత్రి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్డీఐ)లను ఆహ్వానించారు. దేశంలోని రిటైల్ మార్కెటింగ్ రంగంలో ఎక్కువగా అమ్ముడవుతున్నవి ఆహార పదార్ధాలే. మిగతారంగాల్లోకి కూడా ఎఫ్డీఐలను ఆహ్వానించాలల్సిఉంది. రైతుల ఆదాయం ఐదేళ్లలో రెట్టింపు చేస్తామంటూ కేంద్రం ప్రకటించింది. ఈ ఏడాది ఏప్రిల్ 14న ఏకీకృత వ్యవసాయ విపణిని ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. ఇందులో భాగంగా 585 టోకు మార్కెట్లను అనుసంధానిస్తూ ఈ మార్కెట్ వేదిక ఏర్పాటు చేస్తానని బడ్జెట్లో జైట్లీ వెల్లడించారు. అంటే వ్యవసాయ ఉత్పత్తులకు ఆన్ లైన్ మార్కెట్ అందుబాటులోకి రానుందన్నమాట. ఇప్పుడున్న వ్యవసాయ మార్కెట్ల వల్ల ఉత్పత్తులను మండీల్లా పోసి అమ్మాల్సిన దుస్థితి. ఆన్ లైన్ మార్కెట్ అందుబాటులోకి వస్తే… దళారులు, వ్యాపారులు, మార్కెట్ కమిటీ ఛైర్మన్ల దయాదాక్షిణ్యాలపై ఆధారపడాల్సిన అగత్యం నుంచి అన్నదాతలు బయటపడ్డట్లే. “ ఆన్ లైన్ విధానం వచ్చాక కమీషన్ ఏజెంట్ల బెడద తప్పుతుంది. రైతులు సైతం ఇతర రాష్ట్రాలకు ఉత్పత్తులను తేలికగా అమ్ముకుంటారు. తమకు అవసరమైన వస్తువులను కొనుక్కుంటార”ని టెక్నోపార్క్ ఛైర్మన్ అరవింద్ సింఘాల్ అంటున్నారు.

నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్ పాలసీ -2015 కూడా ఈ కామర్స్ కే ప్రాధాన్యతనిస్తోంది. దేశంలోని అన్ని మండీలు , మార్కెట్లను ఆన్ లైన్లో అనుసంధానించాలని సూచిస్తోంది. ఇతర రాష్ట్రాల్లో ధరలను సరిపోల్చుకోవడం, లావాదేవీలకోసం వెబ్ సైట్ ప్రారంభించనుంది. 

ఆన్ లైన్ వేదిక చాలా మంచిదని… అయితే అమలులో ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉండాలంటున్నారు సేవ్ ఇండియా గ్రెయిన్ సీఈఓఅనురాగ్. ఈ కామర్స్ రంగానికి సర్టిఫికేషన్,మధ్యవర్తిత్వం, లిటిగేషన్ వ్యవస్థలు ఉండాలి. అలాంటివి వస్తాయని ఆశిస్తున్నాను. చట్టబద్ధత వస్తే ఈ రంగం మరింత అభివృద్ధి చెందుతుంది అంటారాయన.