అతిపెద్ద హ్యాకర్ సమిట్‌కు వేదికైన హైదరాబాద్

భాగ్యనగరంలో అట్టహాసంగా జరిగిన హ్యాకర్స్ సమ్మిట్హాజరైన 400 మంది ప్రతినిధులుస్మార్ట్ సిటీస్ నిర్వాహణపై విస్తృత చర్చలుహైసియా, హైదరాబాద్ హ్యాకర్స్ ఆధ్వర్యంలో సమావేశాలుభాగ్యనగర్ భవిష్యత్ దిశానిర్దేశానికి ఇది నాంది

అతిపెద్ద హ్యాకర్ సమిట్‌కు వేదికైన హైదరాబాద్

Monday July 13, 2015,

3 min Read

హ్యాకర్లంతా ఒక్కచోట జతయ్యారు. ఓపెన్ సోర్స్, భవిష్యత్ సాంకేతిక పరిజ్ఞానమైన క్లౌడ్, మొబైల్, ఐఓటి, సెక్యూరిటీ, జెస్ ఆన్ మొబైల్ వంటి విషయాలపై విస్తృత జరిపారు. 16 మంది స్పీకర్లు, వందల మంది ఔత్సాహికులు, వేలకొద్దీ వినూత్న ఆలోచనలకు హైదరాబాద్ త్రిపుల్ ఐటి వేదికైంది. గతవారం 9 నుంచి 11 వరకూ మూడు రోజుల పాటు జరిగిన హ్యాకథాన్‌లో రాబోయే రోజుల్లో హైదరాబాద్ కేంద్రంగా జరగబోయే వృద్ధికి అద్దం పట్టింది.

సమ్మిట్‌లో గెలుపొందిన విజేతలు, నిపుణుల బృందం

సమ్మిట్‌లో గెలుపొందిన విజేతలు, నిపుణుల బృందం


హైదరాబాద్ సాఫ్ట్‌వేర్ ఎక్స్‌పోర్టర్స్ అసోసియేషన్ - హైసియా హైదరాబాద్ హ్యాకర్స్ డాట్ ఇన్ ( సభ్యులు - హ్యాక్ మానియా, అప్‌టెక్ ఐడియా ల్యాబ్స్, డెవ్‌థాన్.ఓఆర్‌జి, స్టార్టప్ వీకెండ్, గేమింగ్ హ్యాకథాన్, ఏంజిల్ హ్యాక్, ఫెస్ట్ డాట్ ఇన్ఫో, నల్ హైదరాబాద్, కోడింగ్ సాటర్‌డేస్, ఎడ్యుకినెక్ట్)తో కలిసి మొట్టమొదటిసారిగా హ్యాకర్స్ సమ్మిట్ ఏర్పాటు చేసింది. బిట్స్, మేరా ఈవెంట్స్, కొలాబ్ హౌస్, స్టార్టప్ సాటర్‌డే వంటి సంస్థలు కూడా ఈ సమావేశంలో పాల్గొని చురుకైన పాత్ర పోషించాయి.

మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటి) అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ రమేష్ రాస్కర్ ప్రారంభోపన్యాసంతో సమావేశాలు మొదలయ్యాయి. ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్‌స్టిట్యూట్ వీరేంద్ర సంగ్వాన్, హైసియా అధ్యక్షులు రమేష్ లోగనాధన్ కూడా ఈ ప్రధానోపన్యాసాలు చేశారు.

image


175 మంది హ్యాకర్లు పాల్గొన్న ఈ మూడు రోజుల సమావేశంలో స్మార్ట్ సిటీలలో ట్రాఫిక్ నిర్వాహణ, స్మార్ట్ అర్బన్ లైటింగ్, వేస్ట్ మేనేజ్‌మెంట్, నగర నిర్వాహణ, ఇంటెలిజెంట్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టం, స్మార్ట్ వైఫై, స్మార్ట్ గ్రిడ్స్, ఈ-గవర్నెన్స్, సేఫ్టీ మేనేజ్‌మంట్ వంచి అనేక థీమ్స్‌పై ఇక్కడ విస్తృత స్థాయి చర్చ జరిగింది.

ఫౌండేషన్ ఫర్ ఫ్యూచరిస్టిక్ సిటీస్ అధ్యక్షురాలు కరుణా గోపాల్, ప్రోగ్రెస్ సాఫ్ట్‌వేర్ ఎండి రమేష్ లోగనాథన్, త్రిపుల్ ఐటి హైదరాబాద్ ఆపరేషన్స్ హెడ్ టామ్ థామస్, ఎక్స్ క్యూబ్ ల్యాబ్స్ సిఈఓ భరత్ లింగమ్, జిప్పర్ సిఈఓ ఆదిత్య, అప్‌టెక్ ఐడియా ల్యాబ్స్ ఎండి పంకజ్ దివాన్ జ్యూరీ సభ్యులుగా పాల్గొన్నారు. వివిధ ప్రొడక్ట్స్‌ను పరిశీలించిన బృందం సృజనాత్మకత, డిజైన్‌తో పాటు అవి చూపే ప్రభావాన్ని కూడా పరిగణలోకి తీసుకున్నారు.

డిరెక్షన్ ఎస్ఎంఎస్‌ను రూపొందించిన నిఖిల్ కుమార్, వెంకటేష్ కడలి, హరిషానుమాన్, సృజన్ కుమార్‌లను విజేతలుగా హ్యాకర్స్ సమ్మిట్‌లో ప్రకటించారు. యునియాక్ట్ ప్రొడక్ట్ తయారు చేసిన ప్రశాంత్ పాశం, వంశి, షౌనక్ ఎరిక్, సూర్య ఆకాశం, క్రిష్ణలు మొదటి రన్నరప్‌లు ఇంటెలిజెంట్ ట్రైన్ ప్రొడక్ట్ తయారుచేసిన టీం రెండో రన్నరప్‌గా నిలిచింది.

image


గెలుపొందిన ఆలోచనలు ఇవే !

  • డిరెక్షన్ ఎస్ఎంఎస్ - 

సాధారణంగా ఎక్కడికైనా తెలియని ప్రాంతానికి వెళ్లాలనుకుంటే ఎవరినీ అడగాల్సిన అవసరం లేకుండా ఈ రోజుల్లో గూగల్ మ్యాప్స్‌ సాయంతో అక్కడికి చేరుకుంటున్నారు. అయితే అది స్మార్ట్ ఫోన్ ఉన్నవాళ్లకే సాధ్యం, ఒక్కో సారి ఫోన్ ఉన్నా మ్యాప్స్ లోడ్ అయ్యేందుకు సమయం పట్టడం, డైరెక్షన్స్ చూపించడంలో కొన్ని లోపాలు ఉండడాన్ని మనం గమనిస్తున్నాం. అందుకే ఈ సమస్యలన్నింటికీ పరిష్కారంగా వచ్చిందే డిరెక్షన్ ఎస్ఎంఎస్. ఇంటర్నెట్ అవసరం లేకుండా జస్ట్ ఒకే ఒక్క మెసేజ్‌లో మన ఫోన్‌కే నేరుగా డైరెక్షన్స్ వచ్చేస్తాయి. ఉన్న ప్రదేశం, వెళ్లాలనుకునే లొకేషన్ టైప్ చేసి ఓ నెంబర్‌కి మెసేజ్ పంపితే చాలు టెక్ట్ మెసేజ్ రూపంలో వివరాలన్నీ మొబైల్‌కే వచ్చస్తాయి. ఈ వినూత్నే ఆలోచనే విన్నర్‌గా నిలిచింది.

  • యునియాక్ట్ - (మొదటి రన్నరప్)

నగారాల్లో మెరుగైన జీవితానికి అవసరమైన సదుపాయలను కల్పించే ఉద్దేశంతో దీన్ని రూపొందించారు.

  • ఇంటెలిజెంట్ ట్రైన్ ఇంజన్ (రెండో రన్నరప్)

రైలు ప్రమాదాల నివారణ, కాపలా లేని రైల్వే క్రాసింగుల దగ్గర దుర్ఘటనలు చోటు చేసుకోకుండా దీన్ని రూపొందించారు. రైల్ వచ్చేటప్పుడు గేట్లు మూసుకుని, రైల్ రాకపోకలేవీ లేనప్పుడు గేట్లు తెరుచుకునే విధంగా దీన్నిరూపొందించారు. ఒకవేళ గేట్ తెరుచుకునే ఉన్న పరిస్థితుల్లో రైల్ డ్రైవర్‌కు బజర్ ద్వారా సమాచారం అందుతుంది. డ్రైవర్ అప్రమత్తంగా లేకపోతే ట్రైన్ దానంతట అదే రైల్ క్రాసింగ్‌ కంటే ముందే ఆగిపోయేలా చేస్తుంది.

పదకొండో తేదీ జరిగిన సమావేశానికి 400 మందికి పైగా హ్యాకర్లు హాజరయ్యారు. గూగుల్ హైదరాబాద్ ఇంజనీరింగ్ డైరెక్టర్ జయ్ కోటా, పే యు సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ప్రశాంత్ ఆదిత్య, వి సెక్యూర్ యాప్ ఫొండర్ అఖిల్ సహా ఎంఐటి మీడియా ల్యాబ్స్, అమెజాన్, విఎంవేర్, మైస్మార్ట్ ప్రైజ్, మైక్రోసాఫ్ట్ వంటి సంస్థల నుంచి ప్రతినిధులు హాజరై తన అనుభవాలను పంచుకున్నారు.

ఈ సందర్భంగా హ్యాకర్ హైరింగ్ కూడా జరిగింది. స్టార్టప్స్‌లో చేరాలనుకునే ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.