చేయి తిరిగిన చెఫ్‌ల వంటల డోర్ డెలివరీలో హోలాచెఫ్ హోరు

వంటకాల తయారీలో టెక్నాలజీ తోడైతే ఆ కాంబినేషన్ అదుర్స్మొదలైంది టేస్ట్ కోసం వెతుకులాటతోనేమౌత్ పబ్లిసిటీ తప్ప మార్కెటింగ్ వ్యూహం అవసరం లేదంటున్న హోలాచెఫ్ఇప్పటి జనరేషన్‌ని క్యాచ్ చేస్తే సక్సెస్ అయినట్లే అంటున్న సౌరభ్ సక్సేనా

చేయి తిరిగిన చెఫ్‌ల వంటల డోర్ డెలివరీలో హోలాచెఫ్ హోరు

Saturday July 25, 2015,

3 min Read

వెబ్ బేస్డ్ ప్లాట్‌ఫాంలలో మంచి రెస్టారెంట్ మాదే అంటారు హోలాచెఫ్.కాం వ్యవస్థాపకుడు సౌరభ్ సక్సేనా.

2014 సెప్టెంబర్‌లో ప్రారంభమైన హోలాచెఫ్.. అద్భుతమైన చెఫ్‌లు వండే అత్యంత రుచికరమైన ప్రపంచస్థాయి వంటకాలను మనింటికి చేరుస్తుంది. కస్టమర్ బేస్ పెరుగుతున్న వేగం.. ఈ సంస్థ అభివృద్ధి చెందుతున్న తీరుకు అద్దం పడుతోంది. రుచికరమైన వంటకాలపై ఉన్న ఇష్టమే... ఈరంగంవైపు అడుగులేయడానికి కారణంగా చెబ్తారాయన. ఈ-ఫుడ్ రంగంలో సాంకేతికత ఆధారంగా తమవైన కొన్ని మార్పులు చేస్తామని నమ్మకంగా చెబ్తారు సౌరభ్.

సౌరభ్ సక్సేనా, అనిల్ గెల్రా - హోలాచెఫ్ వ్యవస్థాపకులు

సౌరభ్ సక్సేనా, అనిల్ గెల్రా - హోలాచెఫ్ వ్యవస్థాపకులు


మా గురించి కొంతైనా చెప్పాలిగా..

హోలాచెఫ్ వ్యవస్థాపకుడు, సీఈఓ అయిన సౌరభ్ సక్సేనా ఐఐటీ-బాంబేలో పట్టభద్రులైన వ్యక్తి, ఈయన గతంలో మెక్సస్ ఎడ్యుకేషన్‌కు సహ వ్యవస్థాపకుడు, అలాగే సేల్స్&మార్కెటింగ్ విభాగాలకు డైరెక్టర్ కూడా. ఐకెన్ అనే సంస్థతో ఎంటర్‌ప్రెన్యూర్ అవతారం ఎత్తి, దేశ-విదేశాల్లో ఐదు లక్షల మందికి పైగా విద్యార్ధులతో అనుబంధం పెంచుకున్నారు సౌరభ్. ఈయన అనేక స్టార్టప్ కంపెనీలకు సహహాదారులు, మెంటార్ కూడా. హోలాచెఫ్ సహవ్యవస్థాపకుడు, సీటీఓ అనిల్ గెల్రా. ఈయన కూడా ఐఐటీ బాంబే స్టూడెంటే. అనిల్ గంతలో సోడెల్ సొల్యూషన్స్‌కు డేటాబేస్ ఆర్కిటెక్చర్ కం కోఫౌండర్ కూడా. ఇంటర్నెట్ ఆధారిత వెబ్, మొబైల్ అప్లికేషన్ల రూపకల్పన మేటి అనిల్. సోడెల్‌లో బాధ్యతలు నిర్వహిస్తున్న సమయంలో మిలియన్ల మంది రోజువారీ ఉపయోగిస్తుండగానే.. వాటిని విశ్లేషించగలిగే అప్లికేషన్లు తయారు చేశారు. ఈయన క్లయింట్స్‌లో థామ్సన్ రాయ్‌టర్స్, హఫింగ్‌టన్ పోస్ట్ కూడా ఉన్నాయి. డిజైనింగ్, డెవలపింగ్, అతి పెద్ద డేటాబేస్‌లను విశ్లేషించగలిగే తన సామర్ధ్యాన్ని... హోలాచెఫ్‌ కోసం ఉపయోగించారు అనిల్.

జిహ్వా చాపల్యమే నాంది

రుచుల మీద ఉన్న మమకారంతో కొత్తకొత్త పదార్ధాలపై చాలా పరిశోధన చేసేవారు. ప్రత్యేకమైన ఆహార పదార్ధాలు, ఎక్కడా దొరకని వంటకాలు, ధరలు భరించగలిగే స్థాయిలో ఉండే రెస్టారెంట్లు... ఇలా విపరీతమైన రీసెర్చ్ చేసేవారు సౌరభ్. తిండి విషయంలో సంతృప్తిగానే అనిపించినా... హైక్వాలిటీ ఫుడ్ కోసం చాలా ఎక్కువగా ఖర్చుపెట్టాల్సి వచ్చేది. కొంతకాలానికి మల్టీకూజిన్లంటే బోర్ కొట్టేసి... లోకల్ రెస్టారెంట్లలో ఫలహారాల రుచి చూడ్డం కూడా పూర్తయిపోయింది. అయితే టేక్ఎవే సర్వీసులు అందించే రెస్టారెంట్లు చాలా తక్కువగా ఉండడాన్ని ఆ సమయంలో గుర్తించారు.

"ఫైన్ డైన్ రెస్టారెంట్లు- వాటి అందుబాటు విషయంలో డిమాండ్‌కి తగినంతగా లేవనే విషయాన్ని అప్పుడే గ్రహించా. మంచి చెఫ్‌లతో పదార్ధాలు, వంటకాలు తయారుచేయించే, వాటిని డోర్ డెలివరీ చేయాలనే ఆలోచన వచ్చింది. అది కూడా బడా రెస్టారెంట్లతో పోల్చితే తక్కువ ధరకే అందుబాటులోకి తీసుకురావాలని భావించా. రోజువారీ ఆహారంలోనే హైఎండ్ ఫుడ్ ఉండడాన్ని సాధ్యం చేయాలనే తలంపే.. హోలాచెఫ్" అంటారు సౌరభ్ సక్సేనా.

చెఫ్‌ల ఎంపిక ఎలా ?

"మా దగ్గర వంట చేసేందుకు చెఫ్‌ల ఎంపికలో చాలా జాగ్రత్తలు తీసుకుంటాం. వాళ్లందరూ ప్రొఫెషనల్సే. అనుభవంతోపాటే ఏదైనా ప్రత్యేక వంటకంలో ప్రావీణ్యం ఉండడం తప్పనిసరి. ప్రపంచస్థాయి వంటకాలు రూపొందించాలనే తపన ఉంటేనే వాళ్లను ఎంపిక చేస్తాం. నిజమైన చెఫ్ వంట చేయడంలో ప్రేమ కనిపిస్తుంది. వడ్డించడంలో అతని నైపుణ్యం తెలుస్తుంది. రోజువారీ మెనూలు తయారు చేయగలగాలి. ఎందుకంటే రోజూ ఒకే వంటకం ఎవరికైనా బోర్ కొడుతుంది. తినేవారికైనా, వండేవారికైనా. ప్రతీరోజూ కొత్త వంటకం తప్పనిసరి. ఇవన్నీ ఆచరించగలిగే ఏ చెఫ్‌కైనా మా ఆహ్వానం ఎప్పుడూ ఉంటుంది. మా దగ్గర ప్రొఫెషనల్ చెఫ్‌లే కాదు... ఇంటి వంటకాలను అద్భుతంగా వండగలిగేవాళ్లూ ఉన్నారు. అందుకే హోలాచెఫ్ సూపర్ సక్సెస్" అంటారు సక్సేనా

స్పైసీ ఫుడ్‌కు సాంకేతిక తోడు

వంటకాల తయారీలో టెక్నాలజీ తోడైతే ఆ కాంబినేషన్ అదుర్స్. మా వ్యాపారంలో సాంకేతికత చాలా ముఖ్యం. ఆర్డర్లను ప్రాసెస్ చేయడం, సరఫరా మొత్తం ఆటోమేషన్ పూర్తి చేసింది హోలాచెఫ్. ఎక్కువమందికి సేవలందించేందుకు ఇది ఉపయోగపడుతుందని వీరు చెబ్తారు. డిమాండ్‌ని అంచనా వేయడంలోను, డెలవరీల ప్లానింగ్‌లోనూ టెక్నాలజీ చాలా కీలకమన్నది హోలాచెఫ్ ఉద్దేశ్యం.

"ప్రస్తుతం మొబైల్, వెబ్ వెర్షన్ల పరంగా యూజర్ ట్రాఫిక్ 65:35 నిష్పత్తిలో ఉంది. అంటే మాకొచ్చే ఆర్డర్లలో మూడోవంతు సెల్‌ఫోన్లు, ట్యాబ్లెట్ల నుంచే అన్నది ఈజీగా అర్ధమవుతుంది. ఇప్పటి ప్రజల లైఫ్ స్టైల్‌కి అనుగుణంగా మా వ్యాపారాన్ని డిజైన్ చేయడంలో మేము సక్సెస్ అయ్యామం"'టారు సక్సేనా.

హోలాచెఫ్ అభివృద్ధికి మౌత్ పబ్లిసిటీయే ఎక్కువ హెల్ప్ అయింది. మొత్తం ఆర్డర్లపై డిస్కౌంట్లివ్వడం, అదనంగా ఏవైనా పదార్ధాలు అందించడం, కొత్త కస్టమర్లను రిఫరెన్స్ చేస్తే ప్రోత్సాహకాలు ప్రకటించడం తప్ప... ప్రత్యేకంగా మార్కెటింగ్ జోలికి కూడా పోలేదు హోలాచెఫ్.

కస్టమర్ల సంఖ్యను పెంచుకోవడంపై ప్రస్తుతం దృష్టి పెట్టింది కంపెనీ. తిరిగి ఆర్డర్లిచ్చే వినియోగదారుల సంఖ్య ఎక్కువగానే కనిపిస్తోంది. ముంబైలోని ఇతర బడా రెస్టారెంట్ల స్థాయికి మించి వ్యాపారం చేయగలిగినపుడు వేరే మార్కెటింగ్ వ్యూహాలెందుకన్నది హోలాచెఫ్ వ్యవస్థాపకుల ప్రశ్న.

ఆన్‌లైన్‌లో ఆహార పరిశ్రమ

ప్రస్తుతం భారతీయ ఆహార పరిశ్రమ సామర్ధ్యం ₹3 లక్షల కోట్ల రూపాయలు. ఇది శరవేగంగా పెరుగుతోంది కూడా. ప్రస్తుత జనరేషన్ అలవాట్లు, అభిప్రాయాలు, సాంకేతిక రంగం... ఇలా అన్నీ ఫుడ్ ఇండస్ట్రీ పెరుగుదలకి కారణాలుగానే చెప్పొచ్చు. అవకాశాలను సరిగా అందిపుచ్చుకుంటున్న రంగాల్లో ఇది కూడా ఒకటని చెప్పొచ్చు. ప్రధానంగా ఆన్‌లైన్ ఫుడ్ బిజినెస్‌లో డోర్ డెలివరీ విభాగం సగటున ఏటా 40శాతం వృద్ధి సాధిస్తోంది. ఈ రంగంలో తాము మరింతగా వృద్ధి చెందడానికి ఉన్న అవకాశాలను ఈ గణాంకాలు నిరూపిస్తాయంటోంది హోలాచెఫ్. అయితే అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చితే... భారత దేశంలో ఈ ఆన్‌లైన్ ఆహార పరిశ్రమ ప్రారంభస్థాయిలో ఉందనే చెప్పాలి.

ఇండియో కోషియంట్ నుంచి కన్వర్టబుల్ నోట్ల రూపంలో రెండు కోట్లు సమీకరించింది హోలాచెఫ్. ₹25-30 కోట్లు సమీకరించి ముంబై నగరాన్ని పూర్తిగా కవర్ చేయడంతోపాటే... దేశవ్యాప్తంగా మరో 6-7నగరాలకు విస్తరించే లక్ష్యంతో ఉంది హోలాచెఫ్ టీం.

మరిన్ని వివరాల కోసం విజిట్ చేయండి