దేశంలోనే ముంబై బాగా రిచ్.. నాలుగో స్థానంలో హైదరాబాద్  

టాప్ టూలో ఢిల్లీ, థర్ట్ ప్లేసులో బెంగళూరు

0

దేశ ఆర్ధిక రాజధాని ముంబై దేశంలోనే అత్యంత సంపన్న నగరంగా నిలిచింది. గ్లోబల్ వెల్త్ ఇంటెలిజెన్స్ కంపెనీ, న్యూ వరల్డ్ హెల్త్ నివేదికల ప్రకారం మొదటి స్థానంలో ముంబై నిలవగా, రెండో ప్లేస్ లో ఢిల్లీ, మూడో స్థానంలో బెంగళూరు, తర్వాతి ప్లేస్ హైదరాబాద్ దక్కించుకుంది.

46వేల మంది మిలియనీర్లు, 28 మంది బిలియనీర్లతో, 820 బిలియన్ డాలర్ల సంపదతో ముంబై నగరం సంపన్న నగరాల జాబితాలో అగ్రస్థానంలో వుంది. ఢిల్లీలో 23వేల మంది మిలియనీర్లు ఉండగా, 18 మంది బిలియనీర్లు ఉన్నారు. ఢిల్లీ సంపద విలువ 450 బిలియన్ డాలర్లు. ఇక బెంగళూరు సంపద మొత్తం 320 బిలియన్ డాలర్లు. ఆ నగరంలో 7,700 మంది మిలియనీర్లు, 8మంది బిలియనీర్లు ఉన్నారు. ఢిల్లీ, బెంగళూరు తర్వాతి స్థానంలో హైదరాబాద్ నిలబడింది. భాగ్యనగర సంపద విలువ 310 బిలియన్ డాలర్లు. 9వేల మంది మిలియనీర్లు,ఆరుగురు బిలియనీర్లు ఉన్నారు సిటీలో.

9,600 మంది మిలియనీర్లు, నలుగురు బిలియనీర్లతో కోల్ కతా హైదరాబాద్ తర్వాతి స్థానాన్ని దక్కించుకుంది. కోల్ కతా సంపద విలువ 290 బిలియన్ డాలర్లు. ఇక పుణెలో 4500 మంది మిలియనీర్లు, ఐదుగురు బిలియనీర్లు ఉన్నారు. దాని సందప విలువ 180 బిలియన్ డాలర్లు. 6,600 మిలియనీర్లు, నలుగురు బిలియనీర్లు, 150 బిలియన్ డాలర్ల సంపదతో చెన్నయ్ పుణె తర్వాత స్థానంలో నిలిచింది. ఇకపోతే గూర్గావ్ సంపద 110 బిలియన్ డాలర్లు కాగా.. అక్కడ 4,000 మంది మిలియనీర్లు, ఇద్దరు బిలియనీర్లు ఉన్నారు.

సూరత్, అహ్మదాబాద్, విశాఖ, గోవా చండీగఢ్ జైపూర్, వడోదర నగరాల్లోనూ సంపద గణనీయంగా పెరుగుతోంది. మొత్తంగా డిసెంబర్ 2016 లెక్కల ప్రకారం మనదేశ సంపద విలువ 6.2 ట్రిలియన్ కోట్లు. అందులో 2,64,000 మిలియనీర్లు, 95 మంది బిలియనీర్లు ఉన్నారు.

వచ్చే దశాబ్దం నాటికి ఐటీ, రియల్ ఎస్టేట్, హెల్త్ కేర్, మీడియా రంగాల మూలంగా దేశం ఆర్ధికంగా మరింత పుంజుకుంటుందని అంచనా. ముఖ్యంగా హైదరాబాద్, పుణె, బెంగళూరు నగరాల ఫైనాన్షియల్ గ్రోథ్ శరవేగంగా ఉంటుందని నివేదికలు చెప్తున్నాయి.

Related Stories

Stories by team ys telugu