సక్సెస్‌ఫుల్ ఆంట్రప్రెన్యూర్ల సీక్రెట్స్ ఏంటి ?

సక్సెస్‌ఫుల్ ఆంట్రప్రెన్యూర్ల సీక్రెట్స్ ఏంటి ?

Friday August 21, 2015,

3 min Read

జీవితంలో ఏదైనా సాధించాలన్నది ప్రతి ఒక్కరి కల. అందరిలాగా ఉద్యోగం చేయకుండా, ఏదైనా సంస్థను ప్రారంభించడం యువత డ్రీమ్. అయితే విజయవంతమైన ఆంట్రప్రెన్యూర్‌గా ఎదగాలంటే కొన్ని నియమాలను పాటించాలి. కొంత నిబద్ధతతో ఉండాలి. సక్సెస్‌ఫుల్ ఆంట్రప్రెన్యూర్‌ ఏం చేయకూడదో ఉద్యోగి జీవితం నుంచి ఎదిగిన ప్రదీప్ గోయల్ వివరించారు.

రెండేళ్ల క్రితం ఒక కంపెనీలో పనిచేస్తున్నప్పుడు సమయం చాలా వృథా అయ్యేది. ఉదయం పది గంటలకు ఆఫీస్ మొదలైతే, సాయంత్రం ఐదున్నరకు ముగిసేవరకు చాలా సమయం పనికిరాని పనులతోనే గడిచేది. ఆఫీస్‌కు వెళ్లగానే ఈమెయిల్స్ చెక్ చేసుకోవడం, అనంతరం ఫలితమివ్వని సమావేశాలు, కొలిగ్స్‌తో ముచ్చట్లు, మళ్లీ మెయిల్స్ చెక్, కొద్దిసేపు పని.. ఈలోపు లంచ్ సమయం. బిజీగా ఉన్నట్టు నటన. లంచ్‌ సమయలో కొలిగ్స్ నా కోసం వేయిట్ చేసేవారు. లంచ్ తర్వాత కూడా అదే పద్ధతి. కొద్దిపాటి పని, మరోసారి మీటింగ్‌కు హాజరు, వెంటనే టీ టైమ్. కొద్దిసేపు అక్కడా ఇక్కడా గడిపిన తర్వాత మళ్లీ మెయిల్స్ చెక్, 5.30 వరకు వెయిట్ చేసి ఇంటికి వెళ్లేవాడని. కానీ నేను చేసిన పొరపాట్లేంటో.. జాబ్‌ను మానేసి, ఫుల్‌టైమ్ ఆంట్రప్రెన్యూర్‌గా మారిన తర్వాతే గ్రహించగలిగాను. ప్రతి ఒక్క ఎంటర్‌ప్రెన్యూర్‌ది విభిన్నమైన స్టోరీ. కాని కొన్ని అంశాలు మాత్రం కామన్. అందరిలోకి ప్రత్యేకంగా నిలబ్టేవి ఇవే..

image


image credit - shutterstock 

ఏం చేయాలో ఫిక్స్ చేసుకోవాలి..

ఆంట్రప్రెన్యూర్లు ఏదో ఒక పని ప్రారంభించకూడదు. ఆ రోజు ఏం చేయాలో ముందుగానే నిర్ణయించాలి. స్వల్పకాలిక ప్రణాళికలను, దీర్ఘకాలిక లక్ష్యాలను ఏర్పర్చుకోవాలి. ఒక నియమావళి ప్రకారం వెళుతూ చిత్తశుద్ధితో పనిచేయాలి. ప్రతి ఒక్క పారిశ్రామికవేత్త ఓ జర్నల్‌ను ఏర్పాటుచేసుకోవాలి. అందులో చేయాల్సిన పనులను రాసుకోవాలి. గతవారంలో ఏం చేశామో ఆత్మ పరిశీలన చేసుకోవాలి.

రేపు ఏం చేయాలో నేను ఈ రోజు నిర్ణయించుకుంటాను. పడుకునేముందు రేపటి షెడ్యూల్‌ను ఫిక్స్ చేసుకుంటాను. అప్పుడు నేను చేయాల్సిన పనిపై క్లారిటి ఉంటుంది. అలాగే తర్వాతి రోజును ఉల్లాసంగా ప్రారంభించేందుకు అది ప్రేరిపిస్తుంది.

2. ప్రాధాన్యత ఆధారంగా పని విభజన

ఏ పని చేయాలో రాసుకుంటే సరిపోదు. ఆ రోజు ఏం చేయకూడదో కూడా తెలుసుకోవాలి.

పనులు రెండు రకాలు. ఒకటి అత్యవసరమైనది, రెండోది ముఖ్యమైనది. అత్యవసర పని మన తక్షణ దృష్టిని డిమాండ్ చేస్తుంటుంది. కానీ అది ప్రతిసారీ ముఖ్యమైనది కాకపోవచ్చు. ఉదాహరణకు గత నెలలో ఫోన్ బిల్లు ఎక్కువగా వచ్చిన నేపథ్యంలో కాల్ సెంటర్ ఎగ్జిక్యూటివ్‌తో మాట్లాడటం అంత అర్జెంట్ కాదు. ముందుగా ముఖ్యమైన పనులు, డెలిగేట్ అర్జెంట్ పనులు పూర్తిచేయాలి. మనకు 80/20 రూల్ తెలిసుండాలి. 80% ఉత్పాదకతో 20 శాతం పనితోనే వస్తుంది. అలాంటి పనులేవో గుర్తించగలిగే నైపుణ్యం మనకు ఉండాలి.

image


3. మల్టీ టాస్కింగ్

ఒక్కో రంగంలో ఒక్కో ఆంట్రప్రెన్యూర్ నిష్ణాతుడు. కానీ మనం చాలా రంగాల్లో చక్కగా పనిచేయాల్సి ఉంటుంది. ఒక స్టార్టప్ కంపెనీకి సీఈవో అంటే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కాదు.. చీఫ్ ఎవ్రీథింగ్ ఆఫీసర్ కూడా. మంచి ప్రోగ్రామర్ అయి ఉండాలి. అవసరమైతే ఎన్ని రకాల పనులను చేసేందుకూ వెనుకాడకూడదు. టెస్టింగ్, డిజైన్, మార్కెటింగ్, సేల్స్, కస్టమర్ సపోర్ట్, హైరింగ్, పర్చేసింగ్, అకౌంట్స్ డిపార్ట్‌మెంట్లతోపాటు చైర్లను క్లీన్ చేయడం కూడా సీఈవోకు తెలిసి ఉండాలి. సంస్థ వృద్ధి చెందుతున్న కొద్ది వివిధ రంగాల్లో నిపుణులను ఉద్యోగంలోకి తీసుకోవచ్చు. కానీ అన్ని రంగాల్లో పనిచేయడం సీఈవోకి తెలిసుండాలి.

4. పనిపై నమ్మకం

విజయానికి దగ్గరి దారులు వెతకకూడదు. చేసే పనిని ప్రేమించాలి. పనిపై 100% మనసుపెట్టాలి. లాటరీని గెలిపించమని దేవుడిని కోరడం గాని, తన మనసులో కోరికలు తీర్చుకునేందుకు ఎక్కువ డబ్బు ఉన్న మామ దొరకాలని చూడకూడదు. మన భవిష్యత్‌ను వారి చేతిలో పెట్టకూడదు.

5. చదువు.. చదువు.. చదువు

నేను కలిసిన బిజినెస్‌మెన్‌లో పుస్తక పఠనం చేయని వారు ఒక్కరు కూడా లేరు. అలాంటి వారు ఎవరైనా ఉంటే నాకు సమాచారమివ్వండి. ఆనందం కోసం వారు పుస్తకాలను చదవడం లేదు. నేర్చుకునేందుకు, జీవితాన్ని విభిన్న కోణంలో చూసేందుకు చదువుతున్నారు. ఆత్మకథలు, సెల్ప్ హెల్ప్, ఆంట్రప్రెన్యూర్‌షిప్, స్పిర్చువాలిటి/మైథాలజీ, సైకాలజీ, పని సంబంధిత ఎన్నో బ్లాగులను వారు ఎప్పటికప్పుడు చదువుతుంటారు. ఎన్నో మ్యాగజైన్లను చూస్తుంటారు. కానీ న్యూస్ పేపర్‌ను మాత్రం అలా స్కాన్ చేస్తుంటారు.

6. టీవీలను చూడొద్దు

ఎక్కువమంది చేసే పని ఇది. టెలివిజన్ల ముందు కూర్చుని వారు సమయాన్ని వృథా చేసుకోరు. పుస్తకం చదవడానికో.. పిల్లలతో ఆడుకోవడానికో నేను ఇష్టపడతాను. మూవీలను, డాక్యూమెంటరీలను చూస్తుంటాం. కానీ అవసరమైనప్పుడు మాత్రమే వాటిని వీక్షిస్తుంటారు. వాటికి బానిసలు కారు. ఆసక్తికరమైనది చూసేందుకు గంటల తరబడి చానల్స్‌ను మార్చిన రోజులు నాకు ఇప్పటికీ గుర్తున్నాయి.

7. కంటినిండా నిద్ర పోవాలి

నిద్ర విషయంలో ఎవరూ రాజీ పడకూడదు. మంచి నిద్ర, శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. స్టార్టప్ పెట్టిన తొలినాళ్లలో తాము పడ్డ కష్టాలను కథలుగా చెప్పేందుకు బిజినెస్‌మెన్ ఇష్టపడాలి. కానీ ప్రతి ఒక్కరు సరైన నిద్రకు సంబంధించిన షెడ్యూల్‌ను ఏర్పాటు చేసుకోవాలి. ఆరోగ్యకరమైన శరీరంలో మెదడు చురుగ్గా పనిచేస్తుందన్న సామెతను మర్చిపోవద్దు.

నేను ఓ సాధారణ ఉద్యోగి నుంచి ఎంటర్‌ప్రెన్యూర్‌గా మారేందుకు సాయం చేసిన దేవుడిని, ఇతరులకు గ్రేట్‌ఫుల్‌గా ఉంటాను. మంచి అలవాట్లు కలిగి ఉండటం నా అదృష్టం. నా జీవితంలో ఎప్పుడూ ఊహించని అంశాలను కూడా నేను నేర్చుకున్నాను.


రచయత గురించి

ప్రదీప్ గోయల్..

చేస్తున్న ఉద్యోగాన్ని వదిలి ఆంట్రప్రెన్యూర్‌గా మారిన యువకుడు. గతంలో రెండు స్టార్టప్ కంపెనీలను ప్రారంభించిన పియూష్ గోయల్ తన సమయాన్ని ఎక్కువగా రాసేందుకు, మార్కెటింగ్, ఫైన్సాన్‌ను చదివేందుకు ఉపయోగిస్తుంటారు. అలాగే స్టార్టప్ కంపెనీలను ప్రారంభించడంలోనూ ఇతరులకు సాయం చేస్తుంటారు.