ఫ్యాషన్‌ రంగంలో మెరుస్తున్న ఓ జర్నలిస్ట్ !

ఫ్యాషన్ డిజైనింగ్ డిగ్రీలు లేకున్నా... ఆ రంగంలో ట్రెండ్ శృష్టిస్తున్న ఒయిన్డ్రిల్లా...ఫ్యాషన్ అంటే కేవలం విలువైన దుస్తులు కాకుండా ప్రత్యేకతను చాటాలంటున్నారు ఓయిన్డ్రిల్లా...ఫ్యాషన్ పై ఆసక్తితో ఫ్యాషన్ ఆన్ లైన్ మార్కెట్లో వ్యాపారవేత్తగా మారిన జర్నలిస్ట్.

ఫ్యాషన్‌ రంగంలో మెరుస్తున్న ఓ జర్నలిస్ట్ !

Thursday April 23, 2015,

2 min Read

11 బిలియన్ డాలర్ల ఈ కామర్స్ మార్కెట్ ఉన్న మన దేశంలో, కేవలం ఫ్యాషన్ రంగం 559 మిలియన్ డాలర్ల మార్కెట్ ఉందంటే వాటికున్న క్రేజ్ ఏ విధంగా ఉందో అర్దం చేసుకోవచ్చు. ఈ రంగంలో ఇప్పటికే అనేక స్టార్టప్స్ ఉన్నా... ఒయిన్డ్రిలా దాస్ గుప్తా ప్రారంభించిన ‘ఈట్.షాప్.లవ్’(ESL) మాత్రం ఈ మార్కెట్లో ప్రత్యేకతను చాటుతుంది.

“ఫ్యాషన్ డిజైనింగ్ లో ఎలాంటి డిగ్రీ లేకపోయినా.., డిజైనింగ్ లో వినూత్నత ఎలా ఉండాలో తెలుసు. ‘వాన్ హ్యుసన్’ లాంటి కంపెనీ కోసం బ్రాండింగ్ మరియు అడ్వర్టైజింగ్ బాధ్యతలు చేపట్టిన నేను, అక్కడ మార్కెట్లో ఉండే ట్రెండ్స్ గురించి గమనించేదాన్ని. ఇక నా మొదటి ప్రెగ్నెన్సీ సమయంలో ఉద్యోగం వదిలేసిన తరువాత ఫ్యాషన్ పట్ల ఆలోచించడం ప్రారంభిచా, ఓ సంవత్సరం పాటు రిసర్చ్ చేసాక ‘ఈఎస్ఎల్’ లాంచ్ చేసానంటున్నారు ఒయిన్డ్రిల్లా”.
ఒయిన్డ్రిలా దాస్ గుప్తా, ఈఎస్ఎల్ వ్యవప్థాకురాలు

ఒయిన్డ్రిలా దాస్ గుప్తా, ఈఎస్ఎల్ వ్యవప్థాకురాలు


ప్రతీ రెండు నెలలకు కొత్తదనంతో అప్‌డేట్‌ అవుతూ ఆన్ లైన్ మార్కెట్లో ‘ఈఎస్ఎల్’ ప్రత్యేకతను చాటుతుందనేది ఓయిన్డ్రిలా విశ్వాసం.

జార్ఖండ్ లోని జమ్షెద్‌పూర్ లో పుట్టి పెరిగిన ఓయిన్డ్రిలా, మంచి పేరున్న విద్యా సంస్థల్లో చదువుకున్నారు. మీడియా స్టడీస్‌లో గ్రాడ్యూయేషన్ చేసి, జర్నలిస్ట్‌గా ‘ది హిందు’తో తన కెరీర్‌ని ప్రారంభించారు. ఆ తరువాత ఫెమీనా వైపు మళ్లిన ఓయిన్డ్రిలా, ఫ్యాషన్ ప్రపంచంలోని అన్ని విషయాలు తెలుసుకోగలిగారు. ఇక JWT ఎడ్వర్టైజింగ్‌ ఏజెన్సీలో చేరడం తన కెరీర్‌‌ను మలుపు తిప్పింది. అక్కడ చూసిన ఫ్యాషన్ ప్రపంచం తనను సొంత బ్రాండ్ ఏర్పాటు చేసుకునేందుకు ప్రొత్సహించింది. ఒయిన్డ్రిల్లా ఓ వ్యాపారవేత్తతో పాటు ఇద్దరు పిల్లల తల్లి, గృహిని కూడా.

‘ఫెమినా’, ‘జేడబ్లుటీ’లో ఉద్యోగం చేస్తున్నప్పుడు, ప్రత్యేకతకు, విలువైన దుస్తులకు మధ్య ఎంతో గ్యాప్ ఉన్నట్టు భావించారు. అంతే కాకుండా యావరేజ్‌కి సరసమైన ఫ్యాషన్ దుస్తుల మధ్య కూడా అదే గ్యాప్ కనిపించదని గమనించారు. ఈ గ్యాప్‌ని తీర్చి సరసమైన ధరకే ప్రత్యేకమైన ఫ్యాషన్‌ని అందుబాటులోకి తేవాలనేదే తన లక్ష్యమంటున్నారు.

ఇక తన సొంత ఆన్ లైన్ ఫ్యాషన్ బ్రాండ్ తయారుచేయడంతో పాటు ఈ రంగంలోని వ్యాపారాన్ని తెలుసుకునేందుకు బెంగుళూరు ఐఐఎం నుండి సోషల్ మీడియా మార్కెటింగ్ చేసారు ఒయిన్డ్రిలా.

2014 లో ప్రారంభమైన ‘ఈఎస్ఎల్’, జూలియా రాబర్ట్ సినిమా ‘ఈట్ ప్రే లవ్’ నుండి స్పూర్తిని పొంది ఆ పేరు పెట్టారు. ఆన్‌లైన్ బ్రాండ్‌గా ఉన్న ‘ఈఎస్‌ఎల్’ లో ఖచ్చితంగా ప్రత్యేకమైన దుస్తులు, జువెలరీ, షూస్ అమ్ముతామనేది ఒయిన్డ్రిలా మాట. ఫ్యాషన్ పట్ల కాంప్రమైజ్ కాని మహిళలు, అమ్మాయిలపై తన స్టార్టప్ ప్రత్యేక దృష్టి పెడుతుందని అంటున్నారు.

image


2014 లో సుమారు ఒక మిలియన్ డాలర్ల ఫండ్స్ కూడా రాబట్టగలిగారు ఒయిన్డ్రిల్లా. ఇక రెండు నెలల కన్నా ఎక్కువ కాలం తమ ప్రొడక్ట్స్ ఉండవని, సరసమైన ధరలకే అందుబాటులో ఉండే మా ప్రాడక్ట్స్, మార్కెట్లో సామాన్యంగా వేసుకునేవి కాదని, చాలా వరకు ఏకైక కలెక్షన్స్ మా దగ్గర ఉంటాయని అంటున్నారు.

తన వ్యాపారం లో కావాల్సిన పెట్టుబడితో పాటు ఫ్యూచర్ ప్లాన్ కూడా ఉండటం వల్ల, ఫండ్స్ రాబట్టడంలో సమస్య తలెత్తలేదని అంటున్నారు. తన కలెక్షన్స్ అయినా లేక ఇతర ప్రచారలైన సరే, ఇంకా బాగా చేయగలుతానని అనుకునే ఒయిన్డ్రిల్లా, ఓ కలెక్షన్ పూర్తయ్యే లోపే కొత్త వాటి కోసం తన ప్రయత్నం ప్రారంభిస్తానని అంటున్నారు.

ఓ వ్యాపారవేత్తగా మాట్లాడుతున్న ఒయిన్డ్రిల్లా, దేనికీ షార్టకట్లు ఉండవంటున్నారు, ప్రతీది కూడా శ్రమిస్తేనే వాటి ఫలితం ఉంటుందని అంటున్నారు. నిజాయితీగా ఏ పని చేసినా.., దాని ఫలితం మంచిదే ఉంటుందని భావిస్తారు.