ఇరవైలల్లో ఆ అయిదింటికీ దూరంగా ఉంటే లైఫ్ అదుర్స్

ఇరవైలల్లో ఆ అయిదింటికీ దూరంగా ఉంటే లైఫ్ అదుర్స్

Sunday October 18, 2015,

3 min Read

ఇరవయ్యవ ఏట అడుగుపెట్టిన అమ్మాయిల్లో ఏది చేయాలన్నా, ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్నా కొంత కలవరం, తత్తరపాటు ఉండడం సహజం. భారతదేశంలోనే కాదు పశ్చిమ దేశాల్లో ఉంటున్న ఏ యువతికైనా ఇదే విధమైన మానసిక స్థితి ఉంటుంది. ఈ వయస్సులోనే వాళ్ళు నిజమైన ప్రపంచంలోకి తొలిసారిగా అడుగుపెడతారు. ఓ వైపు టీనేజ్‌ను దాటి రావడం మరో వైపు సమాజంలో కొత్తగా అడుగు పెడుతుండడంతో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కాస్త తడబాటు ఉంటుంది. టీనేజ్ వదిలిపెట్టి కొత్తగా వృత్తి జీవితంలోకి అడుగు పెట్టబోతున్న ఈ సమయంలో యువతులు దేన్నీ సీరియస్‌గా తీసుకోరు. ఏదో ఒక ప్రయత్నం చేస్తారు. ఆ ప్రయత్నాల్లో తప్పులు దొర్లడమూ సహజమే. ఇలాంటివి జరగడానికి ఆ వయస్సు యువతుల్లో సరైన అవగాహన లేకపోవడం, సరైన నిర్ణయం తీసుకోలేకపోవడం, ఏదో ఒక ప్రయోగం చేస్తూనే ఉండడం కారణం అవుతుంటాయి. ఏ పనినైనా సక్రమంగా నిర్వహించే అనుభవం, అవగాహన కలిగే వరకూ ఇరవైల్లోని యువతుల్లో ఇలాంటివి అత్యంత సహజం. జాబ్ చేస్తున్న యువతులు కావచ్చు, రాత్రిపూట బార్లలో పాటలు పాడే వారైనా కావచ్చు లేదా ఒకే సంవత్సరంలో నాలుగు నగరాల్లో జీవించే వారయినా కావచ్చు. జీవితంపై అవగాహన వచ్చే వరకూ స్వేచ్ఛగా, స్వతంత్రంగా ఉండడానికే ఇష్టపడుతుంటారు.

image


ఈ విశాల ప్రపంచంలో ఏ యువతైనా తన కెరీర్‌ను ఇరవైల్లోనే ఎంచుకుంటుంది. మరీ ముఖ్యంగా భారతీయ యువతులు కెరీర్ విషయంలో మరింత స్పష్టతతో ఉంటారు. పద్దెనిమిదవ ఏట అడుగుపెట్టినప్పటి నుంచీ యువతులు తమలో ఉన్న ప్రణాళికలను, మనసులోని భావాలను బయటికి వ్యక్తీకరించడం మొదలుపెడతారు. 20 ఏట వయస్సు దాటి 25 ఏళ్ళు పూర్తయ్యే సరికే తన కెరీర్, కుటుంబాన్ని ఏర్పర్చుకోవడం, పిల్లల్ని కనడం లాంటివన్నీ నెరవేరిపోవాలని వారి కుటుంబ పెద్దలు భావిస్తారు. పెద్దలు అనుకునే ఇలాంటివన్నింటినీ సక్రమంగా నెరవేరితే ఆ యువతి జోలికి వారు రారు. వాటిలో ఆమె విఫలమైనా, ఒకటికి రెండు ఉద్యోగాలను వదిలేసినా ఆమె జీవితాన్ని సీరియస్‌గా తీసుకోవడంలేదనే భావనకు వచ్చేస్తారు.

ఇరవైల్లోకి వచ్చిన భారతీయ యువతులు తమ జీవితంలో అత్యుత్తమమైన దశాబ్దంగా మలచుకోవాలంటే ఈ ఐదు అసాధారణ సూత్రాలను పాటిస్తే మేలు.

డెడ్ లైన్లను గుర్తుచేసే గడియారాన్ని బద్దలు కొట్టండి

ఇతరుల ఆలోచనల నుంచి వచ్చిన టైమ్ బౌండ్ డెడ్ లైన్లను దూరం జరగండి. మీ జీవితాన్ని మీరెలా గడుపున్నారో తెలుసుకోండి. సాంప్రదాయ భారతీయ కుటుంబానికి చెందిన యువతి పెళ్ళి, జీవితంలో స్థిరపడడం లాంటి విషయాల్లో తప్పు చేయడానికి ఆస్కారం ఇచ్చే వయస్సు 20 ఏళ్ళు. వైవాహిక జీవితాన్ని ప్రారంభించి, మనవళ్ళు, మనవరాళ్ళతో కుటుంబాన్ని విస్తరించడానికి కూడా ఈ వయస్సే ఎంతో ఉచితమైన ప్రారంభ సమయం. అయితే.. కెరీర్‌ను మలుచుకునే అత్యంత కీలకమైన ఈ వయస్సులో ఇలాంటి బరువు బాధ్యతలకు ఇప్పుడే కట్టుబడి ఉండాలా అనే భావన ఈ వయసు యువతుల్లో ఉంటుంది. దీంతో వారు తమ జీవిత లక్ష్యాలను చేరుకునే క్రమంలో అనవసర ఒత్తిడికి గురవుతుంటారు. ప్రశాంతంగా నడుస్తున్న జీవితం అనే బోటును వదిలిపెట్టేసినా, కెరీర్ అనే ప్రవాహాన్ని మన అదుపులో ఉంచుకోకపోయినా వైవాహిక జీవితం కష్టాల్లోకి జారిపోతుంది. అందుకే కెరీర్, సంప్రదాయం వీటిలో దేనికి ప్రాధాన్యం ఇవ్వాలో తెలియక బుర్ర వేడెక్కితే వాటి నుంచి కొంత విరామం తీసుకోండి.

సంతోషంగా ఉండేందుకే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి

ఏ మనిషి జీవితంలో అయినా 20 ఏళ్ళ వయస్సు ఎంతో శక్తివంతమైనది. ఇనుముకు తుప్పు ఎలాంటిదో మన మెదడులో బోర్ అనేది అలాంటిదే. మన జీవితం ఎంతో చిన్నది. ఇరవై ఏళ్ళ వయస్సులో ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండేందుకే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. నిలకడైన జీవితాన్ని సాధించగలనో లేదో అనే విచారం మనల్ని ప్రతి రోజూ వెంటాడుతూ ఉంటుంది. ఇలాంటి భయాలు, విచారాలను వదిలిపెట్టి సంతోషంగా జీవించేందుకే ప్రాధాన్యం ఇవ్వండి.

ఎక్కువగా ప్రణాళికలు వేయొద్దు

సాధారణంగా ఇరవై ఏళ్ళ యువతులు తమ కృషి, పట్టుదల కంటే అదృష్టంపైనే ఎక్కువగా ఆధారపడుతుంటారు. ఏదైనా లక్ష్యాన్ని సాధించడం కోసం ఎక్కువగా ప్రణాళికలు వేస్తుంటారు. అలా అధికంగా ప్లానింగ్ చేయడం లేదా అతి సాధారణంగా ప్రణాళికల వల్ల ఎలాంటి ప్రయోజనమూ ఉండదు. ఈ వయస్సులో యువతులకు ఎన్నెన్నో అవకాశాలను ఈ ప్రపంచం కల్పిస్తుంది. ఏదన్నా సాధించడం కోసం ఈ వయస్సు యువతులు రిస్క్ తీసుకోకపోవడానికి కారణం ఏదీ కనిపించదు. ఏదో అద్భుతం సాధించేందుకు అసలు మార్గాన్ని కాదని కొత్త మార్గం అన్వేషణించవచ్చు. ఇలా చేయడం వల్ల తిరుగులేని లక్ష్యాన్ని సాధించలేకపోయినప్పటికీ జీవన యానాన్ని మరింత ఆసక్తికరంగా చేస్తుంది.

వైఫల్యాలకు భయపడొద్దు

మన ప్రయత్నాల్లో ఏవైనా వైఫల్యాలు ఎదురైనప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. ఈ భూమ్మీద నేనే అందరి కన్నా అత్యంత ఆదరణ గల వ్యక్తినని భావించకూడదు. జీవితంలో ఏదో ఒకటి సాధించే వరకూ మానకుండా ప్రయత్నం చేస్తూనే ఉండాలి. అవకాశాలను అందిపుచ్చుకోవాలి. వైఫల్యాలను జీవిత పాఠాలుగా మలచుకోవాలి. మీరు కోరుకోనిది, మీ కోసం పనిచేయనిదేంటో కచ్చితంగా అధ్యయనం చేయాలి.


చిన్న విజయాలనూ సెలబ్రేట్ చేసుకోవాలి

జీవితంలో అతి పెద్ద విజయం నుంచి అత్యంత చిన్న విజయం వరకూ ఏది సాధించినా సెలబ్రేట్ చేసుకోవాలి. ఇరవై ఏళ్ళ వయస్సులో కుటుంబాన్ని పోషించాల్సిన బరువు ఉండదు. ఆ వయస్సు వారిపై ఆధారపడే వాళ్లూ ఉండరు. అందుకే ఇష్టమైన పనులను ఈ వయస్సులోనే చేసేయండి అంటారు జెస్సీ గోల్డెన్-బర్గ్. జీవితంలో సంపాదించిన తొలి చెక్కును అందుకున్నప్పుడు, తొలిసారి వచ్చిన ప్రమోషన్, మన ఉత్పత్తిని తొలిసారిగా అమ్మినప్పుడు, తొలిసారిగా క్లయింట్ నుంచి సానుకూలమైన ఫీడ్ బ్యాక్ వచ్చినప్పుడు, మొదటి స్కూటర్... ఇలా ప్రతీ చిన్న విజయాన్నీ సెలబ్రేట్ చేసుకోండి. ‘నేను సంతోషంగా ఉన్నాననే భావనే ‌హ్యాపీనెస్‌కు అసలైన సీక్రెట్’!

మా రోజువారీ వార్తాలేఖ కోసం సైన్ అప్ చేయండి