పిల్లలు భద్రంగా ఆడుకునేలా చేస్తున్న'కూచీ ప్లే'

ఆటల మార్కెట్లో ల్యాండ్ మార్క్కూచీ ఎంట్రీతో దేశంలో సేఫ్టీ గేమ్స్ ఇండియా నుంచి ఇంటర్నేషనల్ బ్రాండ్ దాకాగ్లోబల్ సర్టిఫికెట్స్‌తో వన్ స్టాప్ సొల్యూషన్

పిల్లలు భద్రంగా ఆడుకునేలా చేస్తున్న'కూచీ ప్లే'

Thursday May 07, 2015,

3 min Read

చిచ్చర పిడుగులు.. ఆటలాడుతూనే ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ప్లే గ్రౌండ్స్‌లో అయితే దెబ్బలు తగిలించుకోని చిన్నారి ఉండరంటే అతిశయోక్తి కాదేమో. చిట్టిపొట్టి చిన్నారులు సేఫ్టీకోసం దేశీయ వస్తు తయారీ సంస్థ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా అందరినీ తనవైపు తిప్పుకుంటోంది. దాని పేరే కూచీ ప్లే. ఆ సంస్థ ఫౌండర్ మాటల్లో దాని గురించి తెలుసుకుందాం. సాధారణంగా పిల్లలు పార్క్, ప్లే గ్రౌండ్‌లో ఎక్కడో ఒక చోట ఆడుకోవడం, కింద పడిపోవడం దెబ్బలు తగలడం కామన్. అయితే పేరెంట్స్‌కు వెంటనే కోపం రావడం కూడా సహజమే. కానీ ఇవి జరక్కుండా ఆగిపోవు. వీటికి ఫుల్ స్టాప్ పెట్టేందుకే మార్కెట్లోకి వచ్చిందే కూచీ అనే ఓ సూపర్ గ్లోబల్ బ్రాండ్.

image


అందరిలా తన పిల్లాడికి దెబ్బ తగిలిన వెంటనే.. ఇలాంటివి మళ్లీ జరగక్కూడదంటే ఏమి చేయాలా అని ఆలోచించారు రాబిన్ దాస్... పిల్లలకు క్రీడామైదానాల్లో సేఫ్ లేదంటారాయన. పేరంట్స్‌లో నాటుకుని ఉన్న మనస్తత్వం మార్చడానికి బెంగళూరుకు చెందిన రాబిన్ దాస్ ఉచితంగా క్రీడా పరికరాలు ఏర్పాటు చేశారు. ఇదే సేఫ్టీ ప్లేగ్రౌండ్ సృష్టించడానికి కారణమైంది. హాంగ్ కాంగ్‌లో వ్యాపార పర్యటన సందర్భంగా, ఆయన బహిరంగ ప్రదేశాలు పరిశీలించారు. అక్కడ పిల్లల భద్రతకు కట్టుదిట్టమైన నిబంధనలను ఉన్నట్లు గమనించారు. ఆట స్థలాల్లో సేఫ్టీపై చట్టాలు, నిబంధనలు ఉన్నాయని.. భారత్‌లో అలాంటివి లేవని గుర్తించారు.

"నేను భారతదేశం తిరిగి వచ్చినపుడు, వివిధ ప్రాంతాల్లో క్రీడామైదానాల్లో అధ్యయనం చేసి వివిధ భద్రతా నిబంధనలను తెలుసుకొనేందుకు రెండేళ్లు గడిపాను. " - రాబిన్

కూచీ ముందు

సేఫ్టీ ప్లేగ్రౌండ్ పరికరాలు మార్కెట్లోకి ప్రవేశించడానికి ముందు, రాబిన్ దాస్ అనేక కంపెనీలను లాభాదాయకంగా నడిపిన అనుభవం ఉంది. దిగుమతులు, ఎగుమతులు నిర్మాణం పరిశ్రమకు సంబంధించిన ఉత్పత్తుల పంపిణీలో నిమగ్నమయ్యారు. కుచ్ ఆలోచన వచ్చినపుడు ఆయన రాఫీ నిర్మాణం కెమికల్స్ ప్రెవేట్ లిమిటెడ్‌కు సీఈఓగా ఉండేవారు. 'కూచీ ప్లే' సంస్థ ఓ ఇండియన్ అంతర్జాతీయ బ్రాండ్ నిర్మించేందుకు కారణమైంది. అన్ని లాభదాయక వ్యాపారాలు అమ్మేసి, కొత్త బ్రాండ్‌లోకి డబ్బు, సమయం, కృషి ఉంచాలనే తన ఆలోచనను అంతా తప్పుబట్టారట. ప్లేగ్రౌండ్‌లో ఏ ప్రమాదం, ఎలా పొంచి ఉందో అర్ధం కాదు.. దురదృష్టవశాత్తు పిల్లవాడికి ఏదైనా ప్రమాదం జరిగితే జవాబు దారే లేడు. దానికి చెక్ చెప్పేందుకే.. ప్లేగ్రౌండ్ పరికరాల్లో విప్లవాత్మక మార్పులు చేశారు. ఇండోర్, అవుట్ డోర్ గేమ్స్‌కు తగ్గట్టుగా పరికరాలు తయారు చేశారు. కుచ్ ఎంట్రీతో భారతదేశంలో దీనికి ఇండస్ట్రీ స్టేటస్ వచ్చేసింది. 

మా డిజైన్, గుడ్ లుక్కింగ్ , ఉత్పత్తి ,మన్నిక , పిల్లల భద్రతా పరంగా అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్టుగా రూపొందించారు. ఈ ఉత్పత్తులు చిన్న పిల్లలను కోసం ఉద్దేశించినవి.. ప్లేగ్రౌండ్ పరికరాలు ప్రధానంగా రెండు రకాలు, ఉక్కు, ప్లాస్టిక్ భాగాలు కలిగే విధంగా తయారు చేశామంటారు కంపెనీ నిర్వాహకులు. అన్ని స్టీల్ భాగాలకు మొదట ఇసుక, పూత ప్రవాహం, వేడి డిప్ పోశారు. అందువల్ల పిల్లల సేఫ్టీకి ఒక అద్భుతమైన నునుపైన ప్లాస్టిక్ ఉపరితలం తయారైంది. మొదట్లో చాలా మంది.. పిల్లలకు అవసరమైన సేఫ్టీ ప్లేయింగ్ ఎక్విప్‌మెంట్స్ సాధ్యం కాదని ఎంతో మంది నిరుత్సాహపరించారు. అయితే నిరాశపడకుండా...ఈ సమస్యను పరిష్కరించడానికి నడుంకట్టారు. రాబిన్ సన్ EN1176, EN1177, AS4685, NZS4486, DIN79000 వంటి పేటెంట్ లను పొందారు.

image


ప్రారంభ రోజులు

ఆరు జట్లు ప్లే గ్రౌండ్స్ పై పరిశోధనలు చేశాయి. కూచీ ప్రాథమిక పరిశీలనలు ప్రారంభమయ్యాయి. మొదట్లో రాబిన్, అతని జట్టు క్రీడామైదానాల్లో గమనించి, ప్రమాదం ప్రాంతాలపై ఓ అంచనా వేసింది. స్కూల్స్, పార్కులు, నివాస సముదాయాలు చూస్తూ కూడా అంచనాలను తయారు చేశారు. ఏమి జరుగుతుందో తల్లిదండ్రులను అడిగి తెలుసుకున్నారు పిల్లలు ఆడుకోనే క్రీడామైదానాల్లో, పబ్లిక్ ప్రదేశాల్లో పర్యటన సాగించింది టీం. చాలా పాఠశాలలు, స్పోర్ట్స్ కాంప్లెక్సుల్లో 'ప్లేగ్రౌండ్ భద్రత' పై సర్వే చేసి ... వారికి అవగాహన కల్పించేవారు. ముందున్న వెంచర్లు ఉపసంహరించుకుని... ఆ నిధులన్ని కుచ్ ప్లేకు పెట్టుబడిగా మారాయి. అవగాహన లేని వ్యాపారంలో ఇంత పెద్దగా పెట్టడంపై చాల మంది నుంచి వద్దనే అభిప్రాయం వినిపించింది. దీంతో మా టీం ఎదుర్కొన్న అతిపెద్ద సవాలు భద్రత, సర్టిఫికేట్ పరికరాలు, ప్లేగ్రౌండ్ కోసం ఎందుకు అంటూ ప్రశ్నించడం మొదలు పెట్టారు. ఇక స్థానిక క్రీడాకారులు సైతం ఎక్కువ ఖరీదంటూ వెనుదిరగమన్నారు. అయితే, రాబిన్ టీం అందిస్తున్న అవగాహనతో నెమ్మదిగా మార్పు ప్రారంభమైంది. సగటు భారతీయ పిల్లలకు భద్రత పెంచాలనే డిమాండ్ ఉదయించింది. దీంతో నాణ్యమైన ఉత్పత్తులుకు డిమాండ్ పెరగడం ప్రారంభించింది. రిసార్ట్స్, పార్కులు, నివాస సముదాయం, మాల్స్, తోటలు, పాఠశాలలకు కుచ్ ప్లేగ్రౌండ్ అవసరమైంది. కుచ్ ఉత్పత్తులు దాదాపు ప్రతి ప్రధాన నగరంలో కనిపిస్తాయి. ఉత్తర షిల్లాంగ్ నుంచి దక్షిణాన కొచ్చిన్ వరకు దర్శనమిస్తాయి. అంతర్జాతీయంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, భూటాన్, మొరాకో, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, లెబనాన్, హాంగ్ కాంగ్, థాయిలాండ్, ఫిలిప్పీన్స్‌‌లో 'కూచీ ప్లే' వ్యాపారం విస్తరించింది. 'కూచీ ప్లే' ఐటెమ్స్ ప్రస్తుత్తం ఎనిమిది దేశాలు, నాలుగు ఖండాల్లో ఉన్నాయి. ప్రస్తుతం ఆస్ట్రేలియా, యూరప్ మరియు హాంగ్‌కాంగ్ వంటి దేశాల్లో చాలా ప్రజాదరణ పొందింది. 

"మేము ప్రజల కోసం ఉచితంగా ఢిల్లీ, బెంగళూరులో ప్రజా పార్కుల్లో పరికరాలు ఇన్‌స్టాల్ చేశాం. అవుటర్ ప్లేగ్రౌండ్ పరికరాలు, భద్రత ఫ్లోరింగ్ సొల్యూషన్స్ మరియు అవుట్‌డోర్ ఫిట్‌నెస్‌ పరికరాలతో అన్ని వయస్సుల వారి మనస్సులో స్థానం ఏర్పాటు చేసుకోగలిగాయి. మా ఖాతాదారులకు ఒక 'వన్ స్టాప్ సొల్యూషన్' అందించడానికి అవకాశం ఏర్పడింది. "కొన్నేళ్లలో కుచ్ ఐరోప లాటిన్ అమెరికాలో కార్యకలాపాలను విస్తరించేందుకు లక్ష్యంతో ముందుకు వెళుతోంది. ఇక భారత్‌లోనూ... 'కూచీ ప్లే' వ్యాపారం వేగంగా పెరుగుతోంది. ఇక నమ్మకం, నాణ్యత పెంచుతూ... దేశంలో టూ టైర్ నగరాలకు విస్తరించేందుకు చూస్తున్నామంటున్న రాబిన్‌సన్ . "మేము 2015-16 లో ఆదాయపరంగా 45 శాతం వృద్ధిసాధిస్తామని ధైర్యంగా చెబుతున్నారు..

కూచీ ప్లే ఫౌండర్ రాబెన్

కూచీ ప్లే ఫౌండర్ రాబెన్