టాటూ వేయించాలంటే... బెస్ట్ ఆప్షన్‌ ఇంక్ ఓవర్ మీటర్

సంగీతం విని కళలపై మక్కువ పెంచుకున్న అనురాగ్డ్రాయింగ్ నుంచి పెయింటింగ్, తర్వాత టాటూలుతల్లిదండ్రులు మనస్ఫూర్తిగా వెన్నుతట్టడంతో మరింత ఉత్సాహంగా అడుగులునిత్య విద్యార్ధిగా వినూత్నత ఆపాదించుకుంటున్న వైనం

టాటూ వేయించాలంటే... బెస్ట్ ఆప్షన్‌ ఇంక్ ఓవర్ మీటర్

Thursday June 25, 2015,

3 min Read

మీరు రైటరో, పెయింటరో కావాలనుకుంటున్నారా ? లేదా ఏదైనా సృజనాత్మక రంగంలో పేరు సంపాదించాలని భావిస్తున్నారా ? అయితే ఇలాంటి లక్ష్యాలున్నవారికి ప్రధాన అడ్డంకి తల్లిదండ్రులను, స్నేహితులను ఇందుకు ఒప్పించగలగడమే. అయితే అనురాగ్ ప్రధాన్ ఈ విషయంలో చాలా అదృష్టవంతుడు. ఎందుకంటే... ఆయనకిష్టమైన మార్గంలో వెళ్లేందుకు అతని తల్లిదండ్రులు మనస్ఫూర్తిగా అంగీకరించి, సహకరించారు.

అనురాగ్ ప్రధాన్, వివేక్ సుబ్బా, ఇంక్ ఓవర్ మ్యాటర్‌ వ్యవస్థాపకులు

అనురాగ్ ప్రధాన్, వివేక్ సుబ్బా, ఇంక్ ఓవర్ మ్యాటర్‌ వ్యవస్థాపకులు


డార్జిలింగ్‌లో పుట్టి పెరిగిన అనురాగ్... తన స్నేహితుడు వివేక్‌తో కలిసి ఇంక్ ఓవర్‌ మీటర్ ప్రారంభించారు. 2012లో తన ఇంట్లోనే ఓ చిన్న స్టూడియోలో కంపెనీ మొదలుపెట్టారు అనురాగ్. అనేక తర్జన భర్జనల తర్వాత మైండ్ ఓవర్ మేటర్ నుంచి స్ఫూర్తి పొంది ఇంక్ ఓవర్ మేటర్ అనే పేరు పెట్టాలని ఫిక్స్ అయ్యారు ఇద్దరూ. చిన్నప్పటి నుంచి ఆర్ట్, డిజైన్ రంగాలపై మక్కువ ఉండడంతోనే ఈ రంగంలోకి వచ్చానంటారు అనురాగ్. కాలేజ్ డేస్‌లోనే ఈ మార్గాన్ని నిర్ణయించుకున్నానని చెప్తారాయన.

“నా చిన్నపుడు మా ఊరు డార్జిలింగ్‌లో... మ్యూజిక్ కల్చర్ అభివృద్ధి చెందుతోంది. చిన్నతనం, టీనేజ్ అంతా సంగీతంతో నిండిన వాతావరణంలోనే పెరిగాను. స్కూల్ డేస్‌నుంచి డ్రాయింగ్ అంటే నాకు చాలా ఇష్టం. డ్రాయింగ్, పెయింటింగ్ పోటీల్లో చాలా ఎక్కువగా పాల్గొంటుండేవాడిని ” అని గుర్తు చేసుకున్నారు అనురాగ్.

కళలకు సంబంధించి ఇతర రంగాలతో పోల్చితే... టాటూలు వేయడం కొంత రిస్క్‌తో కూడుకున్న వ్యవహారం. ఇక్కడ ఒక తప్పు జరిగితే ఇక వెనక్కు తీసుకునే అవకాశం ఉండదు. దానికి టచప్స్ వేసి కప్పిపుచ్చుకోవడం తప్ప... చేయగలిగింది ఏమీ ఉండదు. ఎవరికైనా టాటూ వేశారంటే.. అయితే వారి మెప్పు పొందడమో, లేదా తిట్లు తినడమో చేయాల్సిందే. మధ్యస్తంగా మరే ఆప్షన్ ఉండదు ఈ రంగంలో.

అదృష్టవశాత్తూ ఇప్పటివరకూ టాటూ ఆర్టిస్టుగా కస్టమర్ల సంతృప్తి తప్ప.. వారి కోపాన్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి రాలేదంటారు అనురాగ్.

ఇంక్ ఓవర్ మ్యాటర్‌కు మౌత్ పబ్లిసిటీయే అన్నిటి కంటే ప్లస్ అవుతోంది. వారి పనితనం గురించి కస్టమర్లే ఎక్కువగా చెప్పుకుంటున్నారు.

“నేను నా స్నేహితుల ద్వారా ఈ స్టూడియో గురించి విన్నాను. ఏడాదిన్నరగా ఒక టాటూ వేయించుకోవడానికి నేను ప్రయత్నిస్తున్నాను. నా కలను... ఈ ఇద్దరు స్నేహితులు సాధ్యం చేశారు” అంటున్నారు టాటూకోసం స్టూడియోకి మళ్లీ మళ్లీ వస్తున్న అదితి అనే కస్టమర్.

కస్టమర్లు తమ గురించి గొప్పగా చెప్పుకోవాలని ప్రతీ స్టార్టప్ నిర్వాహకులు అనుకుంటారు. అయితే దీనిపైనే ఆధారపడి వ్యాపారం చేయాలని అనుకునేవారు బహుశా ఉండరేమో. అయితే వివేక్ మాత్రం మౌత్ పబ్లిసిటీ పైనే ఆధారపడి కంపెనీ నడిపేస్తున్నామని చెబ్తున్నారు. ఇది తమ వ్యాపారాన్ని ఇంతింతై అన్న చందంగా పెంచుతోందని అంటున్నారు.

ఇంక్ ఓవర్ మ్యాటర్ స్టూడియోలో వేస్తున్న టాటూ

ఇంక్ ఓవర్ మ్యాటర్ స్టూడియోలో వేస్తున్న టాటూ


వచ్చిన ప్రతీ కస్టమర్‌కూ టాటూ వేసేయాలని తాము అనుకోబోమని చెబ్తున్నారు వివేక్. తమ దగ్గరకు వచ్చిన కస్టమర్‌కు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించుకోవాలని చెబ్తున్నారు వీరు. తల్లిదండ్రుల పేర్లను రాయించుకునేవారిని కూడా వారి అనుమతి విషయంలో హెచ్చరిస్తుంటారు. కొన్ని పెళ్లిళ్లే మూణ్నాళ్ల ముచ్చట అయిపోతుంటాయి. అందుకే ఇలాంటి విషయాల్లో ముందు చూపు చాలా అవసరమన్నది వీళ్ల వాదన.

“ఒకసారి మా దగ్గరకు ఓ వ్యక్తి వచ్చాడు. గర్ల్ ఫ్రెండ్ పేరును తన మొహంపై, కుడి కంటి కింద టాటూగా వేయాలని కోరాడు. అతనిని వారించడానికి మేం చాలా ప్రయత్నించాం. అయితే అతను మా మాట వినలేదు. చివరకు టాటూ వేయించుకున్నాడ”ని చెప్పారు వివేక్.

ఇంక్ ఓవర్ మ్యాటర్ టీంలో అనురాగ్ ప్రధాన్, వివేక్ సుబ్బాలే కీలకం. నాలుగేళ్ల నుంచి టాటూలు వేస్తున్నారు అనురాగ్. తన మేనేజ్మెంట్ స్కిల్స్‌తో స్టూడియో నిర్వహణ, రవాణా వంటి విషయాలను చూసుకుంటున్నారు వివేక్. రోలెన్ లాస్రాడో అనే ఆర్టిస్ట్ కూడా ఫ్రీలాన్సర్‌గా పని చేస్తున్నారు వీరి దగ్గర.

పాత టాటూకు కొత్త టచప్‌లు

పాత టాటూకు కొత్త టచప్‌లు


తన ప్రయాణంలో టాటూ ఆర్టిస్ట్‌గా అనేక పాఠాలు నేర్చుకున్నానని చెబ్తున్నారు అనురాగ్.

  • 1) మీరు ఏం కావాలని అనుకుంటున్నారో, దాన్ని నిర్ణయించుకునే శక్తి మీదే. మీరేదైనా మార్గాన్ని మనస్ఫూర్తిగా ఇష్టపడితే, అందులో మీకు సామర్ధ్యం ఉందని భావిస్తే, అడుగు వేయడమే కరెక్ట్. అందులో జీవితం ఉందనిపిస్తే ఇక ఆలోచించనక్కర లేదు. ఏదో తాత్కాలికంగా వచ్చే నాలుగు డబ్బుల కోసం మాత్రం రిస్క్ కరెక్ట్ కాదు.
  • 2) అడ్డంకులను అధిగమించాల్సిన అవసరం రావడం మంచిదే. గతంలో ఎదురైన సవాళ్లన నుంచే భవిష్యత్తుకు బాటలు వేసుకోవడం, చిక్కులు ఎదురైనపుడు వాటిని పరిష్కరించుకోగలిగే సామర్ధ్యం... దీని ద్వారానే అలవడుతుంది. సమర్ధవంతంగా సమస్యలను అధిగమించినపుడు... మరింత ఉత్సాహంగా అడుగులు వేయచ్చు.
  • 3) నిరంతర సాధన, నైపుణ్యం పెంపు చాలా ముఖ్యం. సుదీర్ఘ కాలం ఒక రంగంలో ఇమడగలగాలంటే... నిత్య విద్యార్ధి నైజం చాలా అవసరం.

ఇంత చదివాక టాటూ వేయించుకోవాలనిపిస్తోందా.. ఇక్కడ క్లిక్ చేయండి.