స్కూల్ చదువులకు రుణాలిస్తున్న ఇద్దరు సోషల్ ఆంట్రప్రెన్యూర్లు

స్కూల్ చదువులకు రుణాలిస్తున్న ఇద్దరు సోషల్ ఆంట్రప్రెన్యూర్లు

Saturday February 06, 2016,

4 min Read


మన దేశంలో చాలా చిత్రమైన పరిస్థితి ఉంటుంది. విదేశాలకు వెళ్లి చదువుకోవాలనుకునే విద్యార్థులకు బ్యాంకులు భారీ ఎత్తున రుణాలు ఇస్తాయి. అదే స్కూలింగ్‌కు అవసరమైన లోన్లు ఇచ్చేందుకు మాత్రం వెనుకాడుతాయి. అదే అనేక మంది పిల్లలు.. స్కూళ్లకు వెళ్లకపోవడానికి ఓ కారణవుతోంది. పిల్లలను చదివించేందుకు పేద, మధ్యతరగతి జనాల దగ్గర సమయానికి డబ్బు లేకపోవడం కూడా డ్రాప్ అవుట్స్ పెరిగేందుకు మరో కారణంగా చెప్పుకోవాలి. ఈ సమస్యకు పరిష్కారం చూపించేందుకు సిద్ధమయ్యారు ఇద్దరు చెన్నై చార్టర్డ్ అకౌంటెంట్లు. 42 ఏళ్ల వి ఎల్ రామక్రిష్ణన్, 40 ఏళ్ల జాకబ్ అబ్రహాం.. ఇద్దరూ కలిసి శిక్షా ఫైనాన్స్ పేరుతో ఓ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీని స్థాపించారు.

image


బ్యాంకింగ్, రిటైల్, ఫైనాన్స్, స్ట్రాటజీ, క్రెడిట్, లెండింగ్ వంటి రంగాల్లో 40 ఏళ్ల అనుభవం ఉన్న ఇద్దరూ కలిసి ఆర్బీఐ అనుమతితో ఎన్‌బిఎఫ్‌సితో మొదలుపెట్టారు. సాధారణ సూక్ష్మ రుణ సంస్థల్లానే పనిచేసే కంపెనీ తమిళనాడులోని విద్యార్థుల తల్లిదండ్రులకు, స్కూళ్లకు రుణాలను ఇస్తుంది. భారత దేశంలో మొట్టమొదటిసారిగా ఈ తరహా లోన్లను అందిస్తున్న సంస్థగా శిక్షా ఫైనాన్స్ నిలించింది. ఎల్‌కెజి నుంచి ఇంటర్మీడియెట్ వరకూ వెళ్లే పిల్లల చదువుల కోసం పేద, మధ్యతరగతి కుటుంబాలకు రుణాలు ఇచ్చి, డ్రాప్ ఔట్స్‌ను తగ్గించడం ఈ సంస్థ ముఖ్య ఉద్దేశం.

శిక్షా సంస్థ డైరెక్టర్, సిఈఓ అయిన రామక్రిష్ణన్‌ను బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ రంగాల్లో ఇరవై ఏళ్లకు పైగా అనుభవం ఉంది. డిసిబి బ్యాంక్, జీఈ క్యాపిటల్, చోళ ఫైనాన్స్ లాంటి సంస్థల్లో ఉన్నతోద్యోగాలు నిర్వహించారు. మహారాష్ట్రలో సూర్యోదయ మైక్రోఫైనాన్స్ అనే సంస్థకు సహ వ్యవస్థాపకుడు కూడా. ఈ మధ్యే ఈ సంస్థకు స్మాల్ బ్యాంక్ లైసెన్స్ కూడా వచ్చింది. మరో సహ వ్యవస్థాపకుడు జాకబ్, ఇందులో సిఓఓ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

ఈయనకు కూడా బ్యాంకింగ్ సంబంధ రంగాల్లో అనుభవం ఉంది. సుందరం, చోళమండలం, ప్రైజ్‌వాటర్‌ హౌజ్‌కూపర్స్ సంస్థల్లో పనిచేశారు. అండర్ రైటింగ్‌లో విశేష్ అనుభవం ఉంది.

మేమే స్కూళ్లకు నేరుగా ఫీజ్ చెల్లిస్తాం. అవసరాన్ని బట్టి స్కూలుకు కూడా రుణాలు ఇస్తాం. వర్కింగ్ క్యాపిటల్, మౌలిక సదుపాయల కల్పనకు సంబంధించి రుణాలను విద్యా సంస్థలకు ఇస్తాం. పిల్లలకు మెరుగైన, నాణ్యమైన విద్యను అందడమే మా అంతిమ లక్ష్యం అంటారు రామక్రిష్ణన్.. అలియాస్ రాంకీ.

ఈ స్టోరీ చదవండి

image


పేద, మధ్య తరగతి ప్రజలు పిల్లల చదువుల విషయంలో చాలా ఇబ్బంది పడుతుంటారు. స్కూలు ఫీజులు చెల్లించే సమయానికి డబ్బులు చేతిలో ఉండకపోతే ఆ ఇబ్బందిని మాటల్లో చెప్పలేం. అంతే కాదు ఈ మధ్య స్కూల్ విద్య ఖర్చే ఓ కుటుంబ బడ్జెట్లో మెజార్టీ వాటా తినేస్తోంది. అలాంటి అత్యవసర స్థితిలో ఉన్న తల్లిదండ్రులకు మేం సాయం చేస్తాం. అందరి పిల్లలకూ కాన్వెంట్ చదువులు చదుకోవాలనేది మా సంస్థ ప్రధాన ఉద్దేశమని వివరిస్తారు.

అవసరమైనప్పుడు డబ్బు వాళ్లకు అందుబాటులో ఉంచడమే మా లక్ష్యం. వేగం, అతి సులువైన ప్రాసెసింగ్‌ వ్యవస్థ ఉంది. ఈక్విటీ, రుణం ద్వారా మేం నిధులను సేకరించి వడ్డీలు చెల్లిస్తాం. మేం విద్యార్థుల తల్లిదండ్రులకు, విద్యా సంస్థలకు రుణమిచ్చి వడ్డీ తీసుకుంటాం. మేం కట్టే వడ్డీకి, తీసుకున్న వడ్డీకి మధ్య ఉన్న వ్యత్యాసం నుంచి నిర్వాహణా ఖర్చులు, మొండి బకాయిలు పోగా మిగిలేదే ఆదాయం. బయటి మార్కెట్లో జనాలు చెల్లించే దానికంటే మా దగ్గర వడ్డీ కనీసం యాభై శాతం తక్కువగా ఉంటుంది అనడంలో సందేహం లేదు అంటారు రాంకీ.

సూక్ష్మరుణ సంస్థల్లానే ఓ విభిన్నమైన సోషల్ కొలేటరల్ భాగస్వామ్యంతో స్కూళ్లు, విద్యార్థులకు శిక్షా సంస్థ రుణాలను అందిస్తుంది.

''మాది యునిక్ బిజినెస్ మోడల్. విద్యార్థుల తల్లిదండ్రులు, స్కూళ్లు, శిక్ష సంస్థ ప్రయోజనం పొందుతారు. స్థిరమైన ఆదాయం వచ్చే రెవెన్యూ మోడల్ ఉంది. క్రమం తప్పకుండా ఈఎంఐ చెల్లించే వాళ్లకు తర్వాత ఏడాది కూడా తప్పకుండా రుణమిస్తాం. ఇదే ఎంతో మందిని ఆకర్షిస్తోంది. పిల్లల చదువులకు బ్రేక్ రాకుండా ఉండేందుకు తల్లిదండ్రులు కూడా కష్టపడ్తున్నారు'' - రాంకీ.

రుణం పొందేందుకు స్కూళ్లు మొదటగా రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. అందుకు మెరుగైన మౌలిక సదుపాయాలు కావాలి. వర్కింగ్ క్యాపిటల్ ఇబ్బందులు ఉండటం వల్ల ఏదైనా శాశ్వత నిర్మాణాలు చేపట్టాలంటే తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది. అందుకే ప్రైవేట్ ఫైనాన్సర్ల నుంచి స్కూళ్ల యాజమాన్యాలు రుణం పొందుతాయి. అలాంటి కస్టమర్లకు మేం యాభై శాతం కంటే తక్కువ వడ్డీతోనే లోన్లు ఇస్తాం. దీనివల్ల క్యాష్ ఫ్లోస్ ఇబ్బంది ఉండదు.

రుణాన్ని తీర్చే గడువు కూడా 24 నుంచి 60 నెలలు ఉంటుంది. ప్రైవేట్ ఫైనాన్సర్ల దగ్గర ఈ గడువు 10 నెలలే ఉంటుంది. 4-5 ఏళ్ల గడువుతో 10 లక్షల నుంచి కోటి రూపాయల వరకూ కొలేటరల్ లోన్లు ఇస్తున్నారు.

శిక్ష సంస్థ ప్రారంభం నాటి నుంచి ఇప్పటివరకూ 120 మంది విద్యార్థులకు అవసరాన్ని బట్టి రూ. 10వేల నుంచి 15 వేల మధ్యలో లోన్లు ఇచ్చింది. ప్రభుత్వ గుర్తింపు పొందిన 15 స్కూళ్లకూ రుణాలు ఇచ్చారు. వీటి విలువ సుమారు రూ.5 కోట్ల వరకూ ఉంటుంది.

ప్రస్తుతం దేశంలో ఏ ఫైనాన్స్ సంస్థ కూడా ప్రాధమిక విద్య దశలో రుణాలు ఇవ్వడం లేదు. మొదట సొంత నిధులతో ప్రారంభమైన ఈ సంస్థకు ఇప్పుడు కొంత మంది ఏంజిల్ ఇన్వెస్టర్లు మద్దతునిస్తున్నారు.

image


చట్టం ప్రకారం ఎన్‌బిఎఫ్‌సి లైసెన్స్ పొందాలంటే కనీసం రెండు కోట్ల మూలధనం ఉండాలి. మా వ్యాపారానికి డబ్బే ఇంధనం, ఇలాంటి సంస్థలకు రుణం సమీకరించడం కూడా అంత సులువైన పనేం కాదు. ఇప్పటివరకూ కొంత మంది ఇన్వెస్టర్ల నుంచి రూ.1 కోటి వరకూ సమీకరించగలిగాం అంటారు జాకబ్.

వీళ్లిద్దరీ కష్టం మెల్లిగా ప్రతిఫలాలను అందిస్తూ ఉంది. ఒక్కో మెట్టూ ఎక్కుతూ.. మైలురాళ్లను అధిగమించడం చూస్తుంటే.. కష్టాన్ని మరిచిపోతున్నారు. పిల్లల తల్లిదండ్రుల్లో ఆనందం వీళ్లిద్దరికీ బూస్టింగ్ ఇస్తోంది. ''చెన్నైలో భారీ వరదలు వచ్చినా కూడా మాకు డిసెంబర్ ఈఎంఐ వసూళ్లలో పెద్దగా ఆలస్యమైన ఘటనలు కనిపించలేదు. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు.. తల్లిదండ్రులకు విద్యకు ఇస్తున్న ప్రాధాన్యత ఏంటో'' అంటారు జాకబ్.

చిన్న విత్తుగా మొదలైన ఈ ప్రాజెక్ట్ ఇప్పుడిప్పుడే సత్ఫలితాలు అందివ్వడంతో విస్తరణపై దృష్టిపెట్టారు ఈ ఇద్దరు చార్టర్డ్ అకౌంటెంట్లు. భవిష్యత్తులో కర్నాటకకు కూడా విస్తరించాలని ఆలోచనలో ఉన్నట్టు వివరించారు ఈ సోషల్ ఆంట్రప్రెన్యూర్లు.

website

ఈ స్టోరీ కూడా చదవండి

ఈ స్టోరీ కూడా చదవండి

ఈ స్టోరీ కూడా చదవండి