టెక్నాలజీ రంగంలో తమకు తిరుగులేదని నిరూపించిన స్టార్ మహిళలు

భారతదేశ సాంకేతిక రంగంలో ఐదుగురు శక్తివంతమైన మహిళలుప్రపంచ దిగ్గజ కంపెనీలకు సీఈవోలుగా వ్యవహరించిన మగువలుసాంకేతిక రంగాల్లో సాటిలేని ప్రతిభాపాఠవాలు భావి మహిళలు, యువతకు ఆదర్శంగా నిలుస్తున్న వనితలు

టెక్నాలజీ రంగంలో తమకు తిరుగులేదని నిరూపించిన స్టార్ మహిళలు

Wednesday July 22, 2015,

5 min Read

సాంకేతిక రంగాల్లో మహిళలు ఎక్కువగా లేరని ఎవరన్నారు..? నిజమే, ఉద్యోగాలు మానేసేవాళ్లు, బోర్డ్ స్థాయి కుర్చీల్లో వున్నవాళ్లకు సంబంధించి అయితే ఓకే. కానీ.. ఎన్నో సాంకేతిక సంస్థల్లో కీలక స్థానాల్లోవున్న భారతీయ మహిళల గురించి కూడా చెప్పుకోవాలి. కొన్ని వేల మంది ప్రజలకు వాళ్లు తెలుసు, వ్యాపార రంగాల్లో మహిళలు తమ శక్తిని పరిగణించాలని గర్తు చేస్తున్నారు.

image


మహిళా సీఈవోలు

ఇక్కడ మేం ఐదుగురు మహిళా నాయకురాళ్లను మీ ముందుకు తెస్తున్నాం. ఇప్పుడున్న యువతరం భాగస్వామ్యంతో ఎక్కువ మంది మహిళా సీఈవోలు కంపెనీలను ఏలుతున్నారు.


వనితా నారాయణన్, IBM ఇండియా మేనేజింగ్ డైరెక్టర్

వనితా నారాయణన్, ఐబీఎం(IBM) ఇండియా మేనేజింగ్ డైరెక్టర్

వనితా నారాయణన్, ఐబీఎం(IBM) ఇండియా మేనేజింగ్ డైరెక్టర్


వనితా నారాయణన్.. ఐబిఎం ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్. దక్షిణాసియాలో, భారత ప్రాంతీయ ప్రధాన కార్యనిర్వాహణాధికారి. జనవరి, 2013 లో ఈ నాయకత్వ స్థాయిని కట్టబెట్టింది ఐబిఎం. కంపెనీ ఉత్పత్తుల మార్కెటింగ్, అమ్మకం, సేవల్లో ఈమె కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. దక్షిణాసియాలో ముఖ్యంగా భారత్ లో ప్రపంచ వ్యాప్త పంపిణీ వ్యవహారాలు చూస్తున్నారు. బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక దేశాలకు సంబంధించిన వ్యాపార వ్యవహారాలను కూడా పర్యవేక్షిస్తున్నారు. భారతదేశం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా వుంటోంది. అందువల్ల ఐబీఎం కంపెనీ ఉత్పత్తులు, సేవలను ప్రపంచ వ్యాప్తంగా అందిస్తోంది ఇండియా.

1987 సంవత్సరంలో వనితా నారాయణన్ ఐబిఎంలో చేరారు. వివిధ దేశాల్లో క్లయింట్ లతో ఆమెకు 25 ఏళ్ల వ్యాపార అనుభవం వుంది. 2009 వరకు ఆమె ఐబిఎం కంపెనీకి భారత్, ఇతర దక్షిణాసియా దేశాల్లో సేల్స్, పంపిణీ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించారు. గ్లోబల్ బిజినెస్ సర్వీసెస్ (GBS)లో ఆమె నిర్వహణా భాగస్వామి( మేనేజింగ్ పార్ట్ నర్ ) గా పనిచేశారు. సమాచార విభాగంలో వైస్ ప్రెసిడెంట్‌గా.. ఆసియా పసిఫిక్, ఐబిఎం అంతర్జాతీయ ఉపాధ్యక్షురాలు (గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్ )గా వుంటూ ... టెలికామ్ పరిష్కారాలను చూపారు.

వనితా నారాయణన్ ఐబిఎం సమైక్య, విలువల బృందంలో గ్లోబల్ ఎక్జిక్యూటివ్‌గా.. ఐబీఎం చైర్మన్‌గానూ వున్నారు. 2012లో ఐబీఎంలో పరిశ్రమల శిక్షణ విభాగంలో అడుగుపెట్టారామె. నిపుణుల బృందం సహాయంతో నూతన ఐబిఎం పరిశ్రమల్లో సరికొత్త ఆలోచనలకు శ్రీకారం చుడుతూ నాయకత్వం వహించారు. భారత్, దక్షిణాసియాల్లో వనితా ఎన్నో వైవిధ్యభరిత, అభివృద్ధి కార్యక్రమాలకు నాయకత్వం వహించారు. మహిళల నాయకత్వం పెరగాలనే వారిలో ముందున్నారామె.

నిపుణులను చేర్చుకుంటేనే మంచి బృందం

అంతర్జాతీయ కార్యనిర్వాహకులంతా కలిసి ఐబీఎం చైర్మన్ ను ఎంపిక చేస్తారు. అలా 2012 లో వనిత ఐబీఎం పరిశ్రమల శిక్షణలో అడుగు పెట్టారు.

వనితా నారాయణన్ భారత జాతీయ పరిశ్రమల సమాఖ్య (CII) లో సభ్యురాలిగా 2013 నుంచి 2014 వరకు పనిచేశారు.

ఆమె వ్యాపార నిర్వహణ, మార్కెటింగ్ లో మద్రాస్ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ పూర్తి చేశారు. హ్యూస్టన్ యూనివర్సిటీ నుంచి వ్యాపార నిర్వహణలోనే సమాచార వ్యవస్థ కు సంబంధించి ఎంబీఏ పట్టాను అందుకున్నారు.

(ఫోటోలో ... నీలం ధావన్, హెచ్.పీ ఇండియా కార్యనిర్వాహణాధికారి)

(ఫోటోలో ... నీలం ధావన్, హెచ్.పీ ఇండియా కార్యనిర్వాహణాధికారి)


నీలం ధావన్, హెచ్.పీ ఇండియా ఎం.డి.

నీలం ధావన్ హ్యూలెట్ –ప్యాకర్డ్ ఇండియా (Hewlett-Packard India) ఎండిగా పనిచేస్తున్నారు. దేశవ్యాప్తంగా కంపెనీ ఆదాయం, లాభాలకు సంబంధించిన పూర్తి బాధ్యతలను చూస్తున్నారామె. హెచ్.పీ సేవలు, వ్యక్తిగత వ్యవస్థ మరియు ఇమేజ్ &ప్రింటింగ్ విభాగంలో యంత్రాల వినియోగాన్ని తీసుకొచ్చారు. మొత్తం వ్యవస్థను కంప్యూటరైజ్డ్ చేయడంలో కీలక పాత్ర పోషించారు.

మేనేజింగ్ డైరెక్టర్‌గా వుంటూనే బిపిఓ, సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్, పరిశోధన మరియు ఐటీ సర్వీసులపై నీలం దృష్టి పెట్టారు. హెచ్.పీ కంపెనీని దేశంలోనే ఓ ప్రధాన పరిశ్రమగా నిలబెట్టేందుకు , అద్భుతమైన వ్యాపార సూత్రాలతో కార్పొరేట్ తరహాలో అభివృద్ధి చేసేందుకు కీలకంగా మారారు.

అంతకు ముందు మైక్రోసాఫ్ట్‌కు భారతదేశంలో కార్యనిర్వహణాధికారిగా నీలం పనిచేశారు. ఆ స్థాయిలో 2005 నుంచి 2008 వరకు పనిచేశారు. ఆమె హయాంలో.. మైక్రోసాఫ్ట్ వ్యూహాత్మక దృష్టి, అభివృద్ధిని పెంచారు. మైక్రోసాఫ్ట్ ఆపరేటింగ్ సామర్థ్యాన్ని, నిర్వహణను తర్వాతి స్థాయికి తీసుకెళ్లారు. అలాగే కంపెనీ ఆర్థిక ప్రదర్శన , వినియోగదారుల సేవలపై దృష్టి పెట్టారు. మైక్రోసాఫ్ట్ కంటే ముందు నీలం ఎన్నో రకాల భారత ఐటీ కంపెనీల్లో వివిధ స్థాయిల్లో పనిచేసి విజయవంతమైన నాయకురాలిగా పేరు సంపాదించారు. అందులో హెచ్.సీ.ఎల్, ఐబీఎం లు కూడా వున్నాయి.

న్యూఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కళాశాలలో నీలం తన బ్యాచిలర్ డిగ్రీని అర్థశాస్త్రంలో పూర్తి చేశారు. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి వ్యాపార పరిపాలన, నిర్వహణలో మాస్టర్స్ డిగ్రీ ఎంబీఏ పట్టా పొందారు.

( ఫోటోలో అరుణ జయంతి, క్యాప్ జెమిని ఇండియా సీఈవో)

( ఫోటోలో అరుణ జయంతి, క్యాప్ జెమిని ఇండియా సీఈవో)


అరుణ జయంతి, క్యాప్ జెమిని ఇండియా సీఈవో

క్యాప్ జెమిని ఇండియా (Capgemini India) ప్రధాన కార్యనిర్వహణాధికారిగా పనిచేశారు అరుణ జయంతి. క్యాప్ జెమిని గ్రూప్ పలు వ్యాపార విభాగాలతో దేశంలోనే పెద్ద కంపెనీగా వుంది. ఈ వ్యాపార విభాగంలో అరుణ జయంతి పలు కీలక బాధ్యతలను నిర్వహిస్తున్నారు. టెక్నాలజీ, ఔట్ సోర్సింగ్ సేవల విషయంలో భారత దేశంపై అరుణ జయంతి ప్రత్యేక దృష్టి పెట్టారు. దీంతో 40 వేల మంది ఉద్యోగులతో కంపెనీ ధృఢమైన పునాదులను వేసుకోగలిగింది. క్యాప్ జెమినీలో సీఈవో అవకముందు అంతర్జాతీయ సరఫరాల అధికారిగా ఔట్ సోర్సింగ్ విభాగంలో పనిచేశారు. అక్కడే నాణ్యత, ఉత్పత్తి, లాభాలకు సంబంధించిన అంశాలపై ప్రపంచవ్యాప్తంగా కార్యకలాపాలు సాగించారు. ఐటీ సర్వీసుల్లో అరుణ జయంతికి రెండు దశాబ్ధాల సుదీర్ఘ అనుభవం వుంది. బహుళజాతీయ, ఆన్ లైన్ ఆధారిత కంపెనీల్లోనూ అరుణ జయంతి పనిచేశారు. యూరోప్, ఉత్తర అమెరికా లాంటి దేశాల్లో పనిచేస్తూ వినియోగదారులతో సమావేశాలయ్యేవారామె. క్యాప్ జెమిని సిబ్బంది వినియోగదారుల అంచనాలకు తగ్గట్లు మార్కెట్ ను ఏర్పరుచుకోవడంలో సఫలీకృతమయ్యేలా చేశారు. కొంత కాలంలోనే క్యాప్ జెమినీ కంపెనీకి సీఈవోగా నియమితులయ్యారు. భారతీయ వ్యాపారంలో అరుణ జయంతి తనదైన ముద్రను ఎంతో తొందరగా వేయగలిగారు.

భారత వ్యాపార దిగ్గజాల్లో 50 మంది శక్తివంతమైన మహిళల జాబితాలో మూడో ర్యాంక్ ను సొంతం చేసుకుని 2012 లో తన సత్తా చాటారు అరుణ జయంతి. తాజాగా కార్పొరేట్ ప్రపంచంలో అరుణ జయంతి ఇండియా టుడే 2013 మహిళా సమ్మేళనంలో... అవార్డును కూడా అందుకున్నారు.

( ఫోటోలో కీర్తిగ రెడ్డి, ఫేస్ బుక్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యాలయ అధికారి)

( ఫోటోలో కీర్తిగ రెడ్డి, ఫేస్ బుక్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యాలయ అధికారి)


కీర్తిగ రెడ్డి, ప్రధానకార్యాలయాధికారి, ఫేస్‌బుక్ ఇండియా

కీర్తిగ జాతీయ మార్కెటింగ్ సొల్యూషన్ బృందంలో ఉంటూ ప్రాంతీయంగా ఏజెన్సీలు, క్లయింట్లతో భారత్ వ్యూహాత్మక సంబంధాలను కొనసాగించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. కీర్తిగ జులై 2010 లో ఫేస్‌బుక్‌లో తొలిసారి అడుగు పెట్టారు. హైదరాబాద్ కేంద్రంగా ఇండియా వ్యాప్తంగా కార్యకలాపాలను నిర్వహించారు. కంపెనీ అభివృద్ధికి దోహదపడేలా సభ్యులను పెంచడంలోనూ, ప్రకటనలు, డెవలపర్స్‌ను ప్రపంచవ్యాప్తంగా విస్తృత పరచడంలో తనదైన ముద్రను వేశారు.

ఫేస్‌బుక్‌లో చేరక ముందు కీర్తిగ సాస్ (SaaS) అనే వినియోగదారుల భద్రతకు సంబంధించిన కంపెనీలో వైస్ ప్రెసిడెంట్‌గా, జనరల్ మేనేజర్‌గా, ఫీనిక్స్ టెక్నాలజీస్‌లో భారత వ్యవహారాలను చూసేవారు. అమెరికా, ఇండియా, జపాన్, కొరియా మరియు తైవాన్‌లలోని జాతీయ బృందానికి నాయకత్వం వహించారు. మోటరోలా మొబైల్స్‌లో కీర్తిగ ఉత్పత్తి నిర్వహణకు సంబంధించిన శాఖకు డైరెక్టర్‌గా పనిచేశారు. కాలిఫోర్నియా సిలికాన్ వ్యాలీలో సిలికాన్ గ్రాఫిక్స్ ఇంజినీరింగ్ లో డైరెక్టర్ గా , బూజ్ అలెన్ హామిల్టన్ లో అసోసియేట్ గానూ చేసిన అనుభవముంది.

స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో కీర్తిగ ఎంబీయే చేశారు. అర్జయ్ మిల్లెర్ స్కాలర్‌లో గ్రాడ్యుయేషన్ , సైరక్యూస్ యూనివర్సిటీ నుంచి ఎంఎస్ లో కంప్యూటర్ ఇంజినీరింగ్ చేశారు. భారత దేశంలోని అంబేద్కర్ యూనివర్సిటీలో బీఈ కంప్యూటర్ సైన్స్ విభాగాన్ని పూర్తి చేశారామె.

2013 లో టాప్ వంద మందిలో వ్యాపార నిపుణులైన వ్యక్తుల్లో ఒకరుగా నిలిచారు. యువ కార్యనిర్వాహకురాలిగా బిజినెస్ టుడేలో, భారత దేశంలోని దిగ్గజ 50 మంది శక్తివంతమైన మహిళల జాబితాలో చోటు సంపాదించారు. వందమంది భారత డిజిటల్ ఎకోసిస్టమ్‌లో ఐకాన్‌గా గుర్తింపును పొందారు. కీర్తిగ రెడ్డి ఇంటర్నెట్ , మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాకు వైస్ చైర్మన్‌గా కూడా వ్యవహరిస్తున్నారు. బాలల కోసం, మహిళల అభివృద్ధికోసం పనిచేసేందుకు ఎక్కువగా మక్కువ చూపుతారు ఆమె.

(ఫోటోలో .... కుముద్ శ్రీనివాసన్, ఇంటెల్ ఇండియా అధ్యక్షురాలు)

(ఫోటోలో .... కుముద్ శ్రీనివాసన్, ఇంటెల్ ఇండియా అధ్యక్షురాలు)


కుముద్ శ్రీనివాసన్, ఇంటెల్ ఇండియా అధ్యక్షురాలు

భారత్‌లో ఇంటెల్‌కు సంబంధించిన వ్యవహారాలు చూసే ప్రధాన కార్యనిర్వాహకుల్లో కుముద్ శ్రీనివాసన్ కూడా ఒకరు. వ్యాపారాభివృద్ధి వ్యవహారాలు, వ్యూహాత్మక కార్యక్రమాలు, సంస్థాగత అభివృద్ధి, మార్కెటింగ్ ప్రగతిలో ఇంజినీరింగ్ మరియు ఇన్నోవేషన్ , ప్రభుత్వ అనుబంధ పరిశ్రమలు, శిక్షణా సంస్థలు ఇలా పలు కీలక రంగాల్లో కూడా ముఖ్యపాత్ర పోషిస్తున్నారు.

ముందు కుముద్ ఐటీ సిలికాన్‌లో ఉపాధ్యాధ్యక్షురాలిగా, జనరల్ మేనేజర్‌గా పనిచేశారు. ఐటీ పరిష్కారాలు, సేవల్లో కుముద్ ఇంటెల్ హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ల పంపిణీ విభాగంలో పనిచేశారు. 1987 లో ఇంటెల్ కంపెనీలో చేరిన కుముద్ అందులో ఎన్నో వ్యాపార, సమాచార వ్యవస్థ శాఖల్లో పనిచేయడమే కాకుండా ఇంటెల్ యొక్క తయారీ, ఐటీ సంస్థల్లోనూ అనుభవాన్ని గడించారు.

కుముద్ శ్రీనివాసన్ సైరక్యూస్ యూనివర్సిటీలోని సలహాలు, స్కూల్ ఇన్ఫర్మేషన్ చదువులకు సంబంధించిన బోర్డులో సభ్యురాలిగా వున్నారు. అంతర్జాతీయ సమాచార సాంకేతిక సంస్థ (ఐఐఐటీ) బెంగళూరులోని పరిపాలనా విభాగంలో సభ్యురాలిగా పనిచేశారు. అనిత బోర్గ్ భారత సమాఖ్య సంస్థ (India Council of the Anita Borg Institute) లోనూ సేవలందిస్తున్నారు.

కుముద్ శ్రీనివాసన్ తన బ్యాచిలర్ డిగ్రీని 1981 సంవత్సరం అర్థశాస్త్రంలో కలకత్తా యూనివర్సిటీ నుంచి అందుకున్నారు. 1984లో సైరకస్ విశ్వవిద్యాలయంలో సమాచార, లైబ్రరీ మాస్టర్స్ డిగ్రీని చేశారు. అంతే కాకుండా బర్క్ లే, కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం నుంచి సమాచార శాస్త్రంలో డాక్టరల్‌ను కూడా పూర్తి చేశారు.

చూశారుగా.. ఇప్పుడు చెప్పండి.. టెక్‌లో వీళ్లంతా ఆదిపరాశక్తుల్లా విజృంభించడం బట్టే సీఈవో స్థాయికి కంపెనీలు చేరాయి. సో.. టెక్నాలజీలోనూ మహిళు కీలక స్థానాలను ఆక్రమించారనడంలో సందేహం లేదు. వీళ్లంతా భావి మహిళలకు, యువతకు స్ఫూర్తిదాయకమైన వ్యక్తులే.