చట్టసభల్లో మహిళల సంఖ్య పెరుగుతోందనడానికి యూపీ ఎన్నికలే నిదర్శనం

చట్టసభల్లో మహిళల సంఖ్య పెరుగుతోందనడానికి యూపీ ఎన్నికలే నిదర్శనం

Tuesday March 14, 2017,

2 min Read

ఏమాటకామాటే చెప్పుకోవాలి. చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం పెరుగుతోంది. రిజర్వేషన్ సంగతి పక్కన పెడితే, శాసనసభ, లోక్ సభల్లో మగువల సంఖ్య పెరగడం శుభపరిణామం. నిన్నటి ఉత్తరప్రదేశ్ ఎన్నికలే అందుకు నిదర్శనం.

మొన్నటిదాకా యూపీలో మహిళా ప్రజాప్రతినిధుల సంఖ్య చాలా పరిమితం. తాజాగా జరిగిన ఎన్నికల్లో మాత్రం ఏకంగా 38 మంది మహిళలు ఎమ్మెల్యేగా గెలిచారు. స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి నేటి వరకు ఏ రాష్ట్రంలో ఇంత పెద్ద మొత్తంలో మహిళలు గెలిచిన దాఖలాలు లేవు. ఇంకో ఇంట్రస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే- అన్ని రాజకీయ పార్టీలు కలిసి 96 మంది మహిళలకు టికెట్లిచ్చి పోటీకి నిలబెట్టాయి.

image


బీజేపీ 43 మంది మహిళలకు టికెట్లిచ్చింది. అన్ని పార్టీలతో పోల్చుకుంటే కమలం పార్టీదే హయ్యెస్ట్ నంబర్. అందులో 32 మంది గెలిచారు. బీఎస్పీ, కాంగ్రెస్ నుంచి నలుగురు చొప్పున గెలిచారు. ఎస్పీనుంచి, అప్నా దళ్ పార్టీల నుంచి ఒక్కొక్కరు విజయం సాధించారు. మొత్తం 38 మంది మహిళా ప్రజాప్రతినిధులు శాసనసభలో అడుగుపెట్టారు. టోటల్ 403 సీట్లలో వారి సంఖ్య తక్కువే కావొచ్చు. ప్రాతినిధ్యం 9 శాతమే అవ్వొచ్చు. కానీ గతంతో పోల్చుకుంటే ఆమాత్రం రావడం కూడా విశేషమే.

ఇక లోక్ సభలో ఉన్న 545 ఎంపీ స్థానాల్లో మహిళలు 62 మంది. ఈ నంబర్ కూడా గతంకంటే 11శాతం ఎక్కువే. 1952లో జరిగిన యూపీ మొదటి అసెంబ్లీ ఎన్నికల్లో 20 మంది మహిళలు గెలిచారు. 2007లో ముగ్గురు మాత్రమే ఎలక్ట్ అయ్యారు. ఆ తర్వాత 2012లో జరిగిన ఎలక్షన్లో అనూహ్యంగా 35 మంది విజయం సాధించారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో ఆ నంబర్ ఇంకాస్త పెరిగి 38 వరకు వచ్చింది. భవిష్యత్ లో చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం మరింత పెరుగుతుందనడానికి ఇదొక ఉదాహరణ.

నిజానికి 2012 యూపీ ఎన్నికల్లో మహిళలకే ఎక్కువ ప్రియారిటీ ఇచ్చింది బీజేపీ. అన్ని పార్టీలతో పోల్చుకుంటే ఆ పార్టీయే ఎక్కువ మందికి టికెట్లిచ్చింది. మొత్తం 42 మందికి టికెట్లిస్తే అందులో ఏడుగురే విజయ సాధించారు. అయితే ఈసారి ఏకంగా 32 మంది గెలిచి తమ సత్తా ఏంటో నిరూపించారు.

స్త్రీలు రాజకీయాల్లో తక్కువగా ఉండడానికి అనేక కారణాలు. ఆమెకు స్వతహాగా ఆసక్తి ఉన్నా నియంత్రించే శక్తులు ఎన్నో ఉన్నాయి. మహిళలకి సరైన ప్రాతినిధ్యం ఇవ్వక పోవడానికి కారణం ఆయా రాజకీయ పార్టీల వివక్షే.