రాజకీయ నాయకులకూ ఓ దిక్సూచి ఈ 'జిగ్యాస'

జనం గురించి ఆలోచించాలి అంటున్న జిగ్యాసఅమెరికా నుంచి ఇండియాకు వచ్చిన జిగ్యాసభాష భేదాలు లేని జిగ్యాస

రాజకీయ నాయకులకూ ఓ దిక్సూచి ఈ 'జిగ్యాస'

Friday May 29, 2015,

2 min Read

ప్రజలు ఎన్నుకున్న తరువాత నాయకులను ఏ కారణం చేతా అనర్హులుగా నిందించకూడదు. చట్టసభల్లో ప్రవేశించి తమ మాట వినిపించడానికి అర్హులా కాదా అనేది నిర్ణయించేది అంతిమంగా ప్రజలే. నేరస్తులు ఎన్నికవుతున్నారంటే అందుకు ప్రజల్లో చైతన్యం లేకపోవడం ఒక కారణం కావచ్చు. దీనికి చికిత్స ప్రజల్లో చైతన్యం పెంచడమే.

అమెరికాలోని Katharine Harrisకు సెనెటర్‌గా పనిచేసిన రిత్విక భట్టాచార్య తన జీవిత అనుభవాలను yourstory తో పంచుకున్నారు. అమెరికాలో ఉన్నప్పుడు అక్కడి వనరులను ఎలా సద్వినియోగం చేసుకోవాలో బాగా అర్థం చేసుకున్నారు రిత్విక.

అయితే భారతీయ రాజకీయ వ్యవస్థకు అమెరికా విధానాలకు ఎంతో తేడా ఉందంటారు రిత్విక. రాజకీయ రంగంలో మార్పులు అంత త్వరగా సాధ్యం కాదంటారామె.

image


హార్వర్డ్ యూనివర్సిటీలోని జాన్ ఎఫ్ కెనెడీ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్‌లో పట్టభద్రురాలైన ఈమె తన ఎన్‌జీఓ సంస్థ Swainiti ద్వారా తీసుకు వచ్చిన మార్పుల గురించి చెప్పుకొచ్చారు,

విజ్ఞానం, మన దగ్గరున్న సమాచార విశ్లేషణ, ప్రభుత్వ పథకాలు గురించి అందరికి తెలియచేయడం, రాజకీయ నాయకులకు వారివిధుల గురించి అవగాహన కల్పించడం జిగ్యాస చేస్తున్న పనులు.

తమ నియోజకవర్గాల్లో నెలకొన్న పరిస్థితులను , ప్రజల సమస్యలను, వాటికి పరిష్కార మార్గాలను సూచించడం జిగ్యాస ప్రధాన విధులు. ప్రస్తుతం రాజకీయ వ్యవస్థలో కొన్ని అవలక్షణాలున్నా ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని కాస్త ఓపిగ్గా చక్కదిద్దుకోవాలంటారు రిత్విక.

image


ఎన్నికలు ముందు రాజకీయ నాయకులు ఇచ్చిన హామీలు, అవి అమలు జరిగిన తీరును జిగ్యాస ప్రజల ముందు ఉంచుతోంది. గత పదేళ్లుగా వివిధ నియోజక వర్గాల్లో జరిగిన అభివృద్ధి పనులను తన వెబ్‌సైట్‌ ద్వారా అందుబాటులోకి తెస్తుంది.

జిగ్యాసలో ఎనిమిది మంది సభ్యులు వుంటారు. ఆయా నియోజక వర్గాల్లో జరిగిన వివిధ పనులను సమాచార హక్కు చట్టం RTI ద్వారా తెలుసుకుంటారు. అధికారులు, స్థానిక ప్రజలు, ఇతర సంస్థల సహకారంతో ఎనిమిది మంది సభ్యుల్లో ఇద్దరు coders వాటిని డేటాలో ఉంచుతారు.

ప్రస్తుత పాలనా కాలంలో ఒక సదరు నియోజక వర్గంలో ఎలాంటి అభివృద్ధి జరిగిందో అంతా డేటా ప్రకారం జిగ్యాసలో పొందుపరుస్తున్నారు. తాము తీసుకుంటున్న SAMPLES లోనూ విశ్వసనీయత ఉండేలా జాగ్రత్త పడుతుంది టీమ్.

గ్రామీణ ప్రాంతాల్లో బాలింతల మరణాలు, అప్పుడే పుట్టిన పిల్లల ఆరోగ్యం, వారి ఆహారం గురించి సమస్త సమాచారం సేకరించి అందరికి అందుబాటులో ఉంచుతారు. మారుతున్న వాతావరణం, జీవన ప్రమాణాలు, జీవించే కాలాన్ని సర్వే ద్వారా క్రోడీకరిస్తారు.

జిగ్యాస రూపొందించిన సర్వేలో భాగంగా ఒక ప్రాంత విశ్లేషణ

జిగ్యాస రూపొందించిన సర్వేలో భాగంగా ఒక ప్రాంత విశ్లేషణ


గ్రామాల్లో నెలకొని వున్న వాతావరణం, ఓటింగ్ విధానం కూడా వీళ్ల పరిశీలనలో తెలుస్తుంది. ప్రభుత్వ యంత్రాగం కొత్త విధానాలు తయారు చేయలనుకున్నపుడు మా డేటాను పరిశీలించుకోవచ్చు అంటారు రిత్విక.

మా టీంలో ఉన్నవారంతా విద్యాధికులు. ఏదో ఆషామాషిగా పనిచేయం. మేం ఇచ్చే సమాచారం అందరికి ఉపయోగపడాలి. భవిష్యత్ తరాల వారికి స్ఫూర్తినిచ్చేదిగా వుండాలంటారు బృంద సభ్యులు.

దినేష్ చంద్

దినేష్ చంద్


మా టీం లోని Shantanu Agarwal అందరినీ సమన్వయం చేసుకుంటూ ఉంటారు. దేశవ్యాప్తంగా వున్న మా టీం మెంబెర్స్‌కు కాస్త భాషాపరమైన ఇబ్బందులు వస్తుంటాయి. అయితే అనుభవమున్న వారి సలహాలతో వాటిని అధిగమిస్తున్నాం. skype కాల్స్ ద్వారా మా అభిప్రాయాలను పంచుకుంటాం. దూరంగా వున్నా కమ్యూనికేషన్ విప్లవం వల్ల అంతా సుసాధ్యం అయిపోతోంది అంటున్నారు రిత్విక.

శంతను అగర్వాల్

శంతను అగర్వాల్


జిగ్యాస చేస్తున్న కార్యక్రమాలను రాజకీయ నాయకులూ ఎంతగానో మెచ్చుకుంటున్నారు. తమకు తెలియని ఎన్నో విషయాలను తెలుసుకుంటున్నామని... నాయకులే మాకు చెబుతున్నారు అంటారు రిత్విక.