TiE స్మాష్అప్ లో ఫండ్ రెయిజ్ చేసిన 4 స్టార్టప్స్

Monday February 29, 2016,

2 min Read

ది ఇండస్ ఆంట్రప్రెన్యూర్ (టిఐఈ) హైదరాబాద్ ఏర్పాటు చేసిన స్మాష్అప్ లో నాలుగు స్టార్టప్ లకు సీడ్ ఫండింగ్ అందింది. ఒక్కో స్టార్టప్ కి 20లక్షల చొప్పున్న ఫండ్స్ అందాయి. వోక్సన్ బిజినెస్ స్కూల్ కూడా ఈ ఈవెంట్ లో భాగస్వామి అయింది.

పాల్గొన్న20కి పైగా స్టార్టప్స్

హైదరాబాద్ నుంచి దాదాపు 20కి పైగా స్టార్టప్ లు స్మాష్అప్ లో పాల్గొన్నాయి. ఇందులో మూడు స్టార్టప్ లలో పెట్టుబడులు పెడుతున్నట్లు టిఐఈ హైదరాబాద్ ప్రెసిడెంట్ సురేష్ చల్లా తెలిపారు.

“టిఐఈ అనేది భవిష్యత ఆంట్రప్రెన్యూర్ లను తయారు చేస్తుంది,” సురేష్

స్మాష్ అప్ అనే ఫిండింగ్ కార్యక్రమం ఇందులో భాగమేనని అన్నారాయన. ముందుగా స్టార్టప్ లకు ఆహ్వానం పలికారు. వచ్చిన వాటిని షార్ట్ లిస్ట్ చేసి చివరి రౌండ్ కి ఎంపిక చేశారు. ఫైనల్ రౌండ్ కి వచ్చిన అన్నింటి నుంచి నాలిగింటిని ఎంపిక చేశారు. స్టార్టప్ కు ఉన్న టీం ప్రధాన క్రైటీరియాగా చెప్పిన సురేష్.. ప్రాడక్ట్ ను కూడా లెక్కలోకి తీసుకున్నామన్నారు. ఈకామర్స్ వ్యాపారమొక్కటే స్టార్టప్ కాదని ఆయన వ్యాఖ్యానించారు.

20లక్షల చొప్పున్న ఫండింగ్

టెక్నికల్, నాన్ టెక్నికల్ స్టార్టప్ లు స్మాష్అప్ లో పాల్గొన్నాయి. అందులోంచి ఎంపికైన ఒక్కోకంపెనీకి 20 లక్షల చొప్పున్న సీడ్ ఫండింగ్ ఇచ్చారు. దీంతో పాటు ఇన్వెస్టర్లు 10శాతం ఈక్విటీ స్టేక్ తీసుకున్నారు. ఈ నాలుగు కంపెనీలు హైదరాబాద్ కేంద్రంగా మొదలైనవే కావడం విశేషం. కపిడ్ కేర్ (CupidCare) ఇందులో మొదటిది. సెక్సువల్ హెల్త్ రంగంలో టెలీ హెల్త్ ప్లాట్ ఫాంలో ఈ స్టార్టప్ పనిచేస్తుంది. థెరనోసిస్ లైఫ్ సైన్సెస్ ఇందులో రెండోది. డయాగ్నోస్టిక్ ప్లాట్ ఫాంలో ఈ స్టార్టప్ రన్ అవుతోంది. గ్రీన్ పిరమిడ్ బైయోటెక్ మూడో స్టార్టప్. పండ్లు, కాయగూరలకు సంబంధించిన ప్రాడక్టులను ఈ స్టార్టప్ అందిస్తుంది. దీంతో పాటు న్యూస్ డ్యాష్ కు ఫండింగ్ అందింది. యాప్ ప్లాట్ ఫాంలో ఉన్న మీడియా సంస్థ న్యూస్ డ్యాష్.

“ఈ నాలుగు స్టార్టప్ లను తర్వాతి లెవెల్ కు తీసుకెళ్లడానికి ఈ ఫండ్స్ వినియోగిస్తాం,” సురేష్

ఫండింగ్ ప్రకటన అనంతరం కంపెనీ ఫౌండర్ల తో ఇన్వెస్టర్ల ఇంటరాక్షన్ సెషన్ జరిగింది.

ఫండింగ్ చేసిన కంపెనీల వివరాలు

యూనిటస్ సీడ్ ఫండ్, 50కె వెంచర్స్, అంతిల్ వెంచర్స్, సాహా ఫండ్, ఇండియన్ ఏంజిల్ నెట్ వర్క్, హైదరాబాద్ ఏంజిల్స్, పరంపర ఫండ్ లు ఈ కార్యక్రమం లో పాల్గొన్నాయి. ఏయే కంపెనీ ఎంత ఇస్తుందనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది. వీరితో పాటు కొంతమంది ఇండివీడ్యువల్ ఇన్వెస్టర్లు ఉన్నారు.అయితే ఈ కార్యక్రమం విజయవంతం కావడంలో టిఐఈ హైదరాబాద్ ముందు నుంచీ పక్కాప్రణాళిక తో ముందుకు పోయింది.

“ఫండింగ్ తీసుకు రావడమే కాదు వాటిని సరైన పద్దతిలో ఖర్చు చేయడం మరో సవాలని ముగించారు సురేష్”