మనలో ఉన్న మానసిక శక్తి ఎంతో చెప్పేసే తమరాయ్

మీ నిజమైన అంతర్గత శక్తి మీకు తెలుసా ?నాడీ వ్యవస్థ పనితీరు, భాష... రెంటినీ సమ్మిళతం చేసే ప్రోగ్రాంమన శక్తి తెలిస్తే మనమేం చేయాలో అంచనాకు రావచ్చుకలలను సాకారం చేసుకోవడంలో మా సహాయం అందిస్తామంటున్న తమరాయ్

0

తమరాయ్... ఇదో ట్రైనింగ్ కన్సల్టెన్సీ. వ్యక్తిగత, ఉద్యోగిత సామర్ధ్యాలను అంచనావేసి, వారు ఎందులో నిపుణులో తెలుసుకుని... తమ కలలు, కోరికలను సాకారం చేసుకునేందుకు ప్రోత్సహించే కంపెనీ తమరాయ్.

లోటస్ సిద్ధాంతం ప్రకారం భావోద్వేగాలను, సాధ్యాసాధ్యాలను ఏకతాటిపైకి తెచ్చే వెంచర్ ఇది. న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్(NLP), అద్భుతాలను అందుకునే సైన్స్ ఇది. ఆలోచనలు, నడవడిక, చర్యలను బలవంతంగా అయినా ఒక చోటకు చేర్చి, ఎదుగుదలకు అవసరమైన కిటుకులను నేర్పే సాధనం ఎన్ఎల్‌పీ.

తన కెరీర్ మొత్తం లెర్నింగ్ & డెవలప్మెంట్ విభాగంలోనే గడిపారు పాయల్. ప్రతీ వ్యక్తిలోనూ అంతర్గత సామర్ధ్యం ఉంటుందని నమ్ముతారామె. తమలో మార్పులను నిజ జీవితంలోకి తెచ్చుకోవడానికి పరిపూర్ణమైన సైకాలజీ సహాయపడుతుందని పాయల్ విశ్వాసం. చిన్నపాటి తేడాలను గుర్తించి పూర్తిస్థాయి మార్పు చెందడంలోనే వ్యక్తుల పరిపూర్ణత బయటపడుతుంది. అందుకు ఎన్ఎల్‌పీ సహాయపడుతుంది అంటారు పాయల్.

పాయల్ , ఎన్ఎల్‌పి ట్రైనర్
పాయల్ , ఎన్ఎల్‌పి ట్రైనర్

తమరాయ్‌ ఎదుర్కున్న సవాళ్లు

కార్పొరేట్ వర్కర్ నుంచి ఓ పారిశ్రామిక వేత్తగా మారడం నిజంగా సవాలే అంటారు పాయల్. భద్రమైన జీవితపు స్థాయి నుంచి బయటకు రావడమే. ఇతరులకు సేవ చేసే దృక్పథంతో వేసిన అడుగులను... ఓ సాహసంగా చెప్పుకుంటారు ఆమె. ఓ వెబ్‌సైట్ నుంచి బేసిక్స్ నేర్చుకోవడంతో మొదలైన వెంచర్... ట్రైనింగ్, మార్కెటింగ్, ప్రమోటింగ్, డెవలప్మెంట్.. ఇలా వ్యాపారంలో ప్రతీ అడుగునూ పాయల్ గుర్తు పెట్టుకున్నారు. తను చేసే పనిపై పూర్తి స్థాయి విశ్వాసం, నమ్మకంతో చేయాలని.. ఈ వెంచర్ నేర్పింది ఆమెకు. “నీకు నీవు పెట్టుకున్న నిబంధనలతో పని చేయడం చాలా సులువుగానే కనిపిస్తుంది. కానీ దానికి ఎంతో క్రమశిక్షణ, ఏదో ఒకటి నేర్చుకోవాలనే తపన, అంతకు మించిన పట్టుదల చాలా ముఖ్యం” అంటారు పాయల్.

ఆర్థిక లావాదేవీల నిర్వహణ, కంపెనీ అభివృద్ధి తీరుపై అంచనాలపై... అతి తక్కువమంది మహిళలకు మాత్రమే పట్టు సాధ్యమవుతుంది. అలాగే వెంచర్‌లో రిటర్నులు సాధించడం కూడా కొంతమంది మహిళలే చేయగలరు.

అనుభవాలను బట్టి నేర్చుకోవడం, కొత్త తరం ఆలోచనలు అందిపుచ్చుకోవడం వంటివి... మన దేశంలో ఇంకా ప్రాథమిక స్థాయిలోనే ఉన్నాయన్నది తన స్వానుభవం అంటున్నారు పాయల్. అసలు ఈ లెర్నింగ్ & డెవలప్మెంట్ అనే కాన్సెప్ట్... కార్పొరేట్లు తమ ఉద్యోగులపై ఇన్వెస్ట్ చేయడంతో మొదలైంది. తమ స్టాఫ్‌ పనితీరు మెరుగుపరచడం కోసం చేసిన వ్యక్తిగత ప్రయత్నాల్లోంచే ఇది పుట్టుకొచ్చింది.

ఎవరి కోసం ఎన్ఎల్‌పీ ?

తమ స్వీయ వృద్ధి కోసం దీర్ఘకాలిక దృష్టితో పెట్టుబడులు చేసే వ్యక్తులు చాలా కొద్ది మందే ఉన్నారు. బయట అవకాశాలు వెతికి, అందిపుచ్చుకోవడం కోసం తమలో ఉన్న సామర్ద్యాన్ని తెలుసుకోవడమన్మది నిజానికి ఛాలెంజ్ లాంటిది. అయితే ఈ విధమైన స్వయం ఆవిష్కరణ జీవితంలో చాలా ముఖ్యం. ఒకే తరహా సినిమాలు చూడ్డానికి అలవాటు పడిపోయినపుడు... ఓసారి వేరే ఇతర జోనర్ మూవీ ఏదైనా చూడాల్సి వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో.. ఇదీ అంతే. ఓ కొత్త అభివృద్ధి బాట వేసుకున్నట్లే. ప్రాచీన భారతదేశంలో గురుకులం లాంటి సెటప్ ఇది. ప్రస్తుతం చాలా మందికి ఐక్యూ లెవెల్స్ ఎక్కవగానే ఉంటున్నా.. లైఫ్ స్కిల్స్ చాలా తగ్గిపోతున్నాయి. ఈ పరిస్థితిని డీల్ చేసే తమరాయ్.. ఎందుకు అనే భావన నుంచి... ఎలా అని అనుకునేలా.. నేర్చుకునే భావన కలిగిస్తుంది. మనం మన శరీరాన్ని కాపాడుకునేందుకు డబ్బులు ఎలా వెచ్చిస్తామో... మన ఆలోచన, వ్యక్తిత్వాలను డీల్ చేసేందుకు ఎన్ఎల్‌పీ పైనా అలాంటి దృక్పథమే ఉండాలి.

క్లైంట్ల నుంచి వివరాలు సేకరిస్తూ.. వారికి మార్గదర్శనం చేస్తున్న పాయల్
క్లైంట్ల నుంచి వివరాలు సేకరిస్తూ.. వారికి మార్గదర్శనం చేస్తున్న పాయల్

కార్పొరేట్ సెక్టార్, వెల్‌నెస్ రంగం, మెడికల్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నవారు, మూవీస్, ట్రైనింగ్, కోచింగ్ రంగాల్లో ఉన్న ప్రజలు ఎన్ఎల్‌పీపై ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. ప్రజలకు తమను తాము అర్ధం చేసుకోవడానికి, తమ భావోద్వేగాలను నియంత్రించుకోడానికి, వ్యక్తిగత-ఉద్యోగ సంబంధాలను మెరుగుపర్చుకోవడానికి ఉపయోగపడుతుంది. రెండు రోజుల పాటు నిర్వహించే వర్క్‌షాపుల ద్వారా తాము సాధించాలని అనుకునేవాటిలో సాధ్యాసాధ్యాలను తెలుసుకునేందుకు సహాయపడ్తాయి.

పలు సామాజిక అంశాలపై అవగాహన, పని చేసే ప్రాంతాల్లో వేధింపుల నియంత్రణ వంటి ఇతర అంశాలనూ డీల్ చేస్తోంది తమరాయ్. ఓ ప్రముఖ న్యాయ సంస్థకు సంబంధించిన లైంగిక వేధింపుల కమిటీలో మెంబర్‌గా ఉన్నారు పాయల్. త్వరలో వర్క్‌షాపుల ద్వారా సాధారణ ప్రజలకూ సేవలందించాలని చూస్తున్నారామె. అలాగే కార్పొరేట్ల నుంచి మధ్యస్థాయి మేనేజ్మెంట్ లెవెల్స్ వరకూ తమ సర్వీసులు అందించే యోచనలో ఉన్నారు. అలాగే మహిళల కోసం ప్రత్యేకంగా ఎన్ఎల్‌పీ కార్యక్రమాలు నిర్వహించనున్నారు కూడా.

ఆటిజం వంటి వాటితో ఇబ్బంది పడుతున్న ప్రత్యేకమైన పిల్లలను... తల్లిదండ్రులతో సహా ఔట్ స్టేషన్లకు తీసుకెళ్లడం వంటి కార్యక్రమాలు నిర్వహించే కొంతమంది మహిళా పారిశ్రామిక వేత్తలకు ఇప్పటికే సహాయం చేస్తున్నారు పాయల్. ఈ పేరెంట్స్‌లో చాలామందికి ఎన్నో ఏళ్ల తర్వాత ఇదే మొదటి టూర్ కావడం విశేషం. ఎన్ఎల్‌పీ ద్వారా తల్లిదండ్రుల భావోద్వేగాలను నియంత్రించి, వారిలో ఆశలు చిగురింపచేసేందుకు ఈ మొత్తం ప్రయాణాన్ని ఉపయోగించుకుంటున్నారు.