టాస్క్ మీది.. రిస్క్ మాది ! పనేంటో చెప్పండి చేసేస్తాం!

నలుగురు ఫాలో అవ్వాలి ! పదిమంది భేష్‌ అని మెచ్చుకోవాలి!! టాస్క్‌ మిత్రకు అలాంటి కాంప్లిమెంట్సే!!!

టాస్క్ మీది.. రిస్క్ మాది ! పనేంటో చెప్పండి చేసేస్తాం!

Monday November 23, 2015,

3 min Read

తిన్నామా పడుకున్నామా తెల్లారిందా! ఇంతకు మించి ఎవరి లైఫ్‌లో అయినా ఇంకేం ఉంటుంది! నిస్తేజంలో ఉన్నప్పుడు ఇలాంటి సినిమా డైలాగులు- జీవితం అంటే ఇంతే కదా అనిపిస్తాయి. కానీ, అలాగే ఎందుకుండాలి? అందరిలా ఎందుకుండాలి? అందరు నడిచే దారిలో ఎందుకు నడవాలి? కొత్తది క్రియేట్ చేయాలి! ట్రెండ్‌ సెట్‌ చేయాలి! నలుగురు మనల్ని ఫాలో అవ్వాలి! పదిమంది భేష్‌ అని మెచ్చుకోవాలి. ప్రస్తుతం టాస్క్‌ మిత్రకు అలాంటి కాంప్లిమెంట్సే వస్తున్నాయి!

అలా వచ్చింది ఐడియా!

బోధివృక్షాల కిందనే జ్ఞానోదయం కావాలని రూలేం లేదు. బుర్రలో మేటర్ ఉండాలేగానీ బార్‌లో కూచున్నా, బజారులో నిలబడి కబుర్లు చెప్పినా, ఆలోచనలు వాటంతట అవే వస్తుంటాయి. అలా నలుగురు కలిసి క‌బుర్లు చెప్పుకుంటుంటే వచ్చిందో బ్రహ్మాండమైన ఐడియా! ఇలా అయితే కష్టం గురూ! ఏదోక‌టి సాధించాలి! ఈ టాపిక్ మీద డిస్కషన్ మొదలైంది ఎక్కడో కాదు. న్యూ ఇయ‌ర్ పార్టీలో. ఆ చర్చ వాళ్ల జీవితాలనే మారుస్తుందని ఊహించలేక పోయారు. ప్రశ్నలతో మొదలుపెట్టి ఆన్సర్‌తో ముగించారు. ఏది కావాలి? ఎంత‌లో కావాలి? ఎలా కావాలి? సాధారణంగా వీటన్నిటికీ ఒకే ఆన్సర్ ఇంటిగ్రేడెట్‌గా దొరకడం కష్టం. అయితే అలాంటి సమాధానం మనమే ఇస్తే ఎలా వుంటుంది? అదిగో! సరిగ్గా అదే పాయింట్ మీదే పుట్టింది- టాస్క్ మిత్ర అనే ఐడియా.

ఆల్ ఇన్ వన్

అన్ని సర్వీసులు కలిపి ఒకే చోట దొరికితే? అంత‌కంటే ఎవ‌రికైనా కావాల్సింది ఏముంది.? ఆ స‌ర్వీసులు అందించే సంస్థలు కానీ.. ఫ్రీలాన్సర్లు కానీ కస్టమ‌ర్ల కోసం ఎలాగూ ఎద‌రుచూస్తుంటారు. ఇద్దరినీ ఒకే చోట క‌లిపేస్తే? ఇదే టాస్క్ మిత్ర కాన్సెప్ట్‌! మార్చి 2015 లో మొదలయిన ఈ కంపెనీ దగ్గర్లో అన్ని స‌ర్వీసులు ఎవ‌రెవ‌రు అందిస్తున్నారో లిస్ట్ అవుట్ చేస్తుంది. ఆవ‌కాయ పచ్చడి నుంచి ఆడీ కారు దాకా! ఏయే వ‌స్తువు ద‌గ్గర్లో ఎవ‌రెవ‌రు అమ్ముతున్నారో ఈజీగా ఇన్ఫర్మేష‌న్ ఇక్కడ దొరుకుతుంది. బిజినెస్ టు బిజినెస్‌, క‌స్టమ‌ర్ టు క‌స్టమ‌ర్‌, బిజినెస్ టు క‌స్టమ‌ర్‌. ఇలా అంద‌రినీ ఒకేగొడుగు కిందకి తీసుకువ‌చ్చేలా దీన్ని డిజైన్ చేశారు. ఒక అవ‌స‌రాన్ని పోస్ట్ చేయ‌డం, దాన్ని అది చేయ‌గ‌లిగిన వాళ్లు కాంటాక్ట్ చేయ‌డం. క‌స్టమ‌ర్ అవ‌స‌రాన్ని తీర్చడ‌మ‌నే మూడు కాన్సెప్టుల మీద‌నే టాస్క్ మిత్ర ప‌నిచేస్తుందంటారు ఆ కంపెనీ సీటీవో గౌత‌మ్.

image


మ‌రి రెవెన్యూ మోడ‌ల్ ఎలా?

పెద్దగా పెట్టుబడి లేదు. కేవ‌లం రూ.4లక్షల ఫండింగ్. అంతే. కంపెనీ మొదలైంది. ప్రస్తుతానికి రూ.10లక్షలు పెట్టుబ‌డులు వ‌చ్చాయి. 27వేల మంది ఈ కంపెనీ స‌ర్వీసుల‌ను ఉపయోగించుకుంటున్నారు. 30శాతం మంది మ‌ళ్లీ మ‌ళ్లీ ఇదే ప్లాట్‌ఫామ్‌ను వాడుకుంటున్నారు. 2016 నాటికి 2 ల‌క్షల 50వేలమంది వెరిఫైడ్ క‌స్టమ‌ర్లను త‌యారుచేసుకోవ‌డ‌మే టార్గెట్ అంటారు సీటీవో గౌత‌మ్‌. ప్రస్తుతం ముంబై న‌గ‌రం వరకే స‌ర్వీసులు అందిస్తున్న ఈ కంపెనీ 2016 ఫస్ట్ క్వార్టర్ నాటికి పుణె, బెంగ‌ళూరు న‌గ‌రాల్లోనూ అడుగుపెట్టాల‌ని ప్లాన్ చేస్తోంది. అన్నిటికంటే ముందుగా లోక‌ల్ ఇంట‌ర్‌ఫేస్‌తో ఒక మొబైల్ యాప్‌ని డెవ‌ల‌ప్ చేయ‌డం ద్వారా క‌స్టమ‌ర్లకు మరింత ద‌గ్గర ‌కావాల‌ని ప్లాన్ చేస్తున్నారు.

క‌స్ట‌మ‌ర్ డేటాను స్ట‌డీ చేయ‌డం

ఒక‌సారి త‌మ సంస్థ ద్వారా స‌ర్వీసులు పొందిన క‌స్టమర్ల డేటాను జాగ్రత్తగా అన‌లైజ్ చేయ‌డం ద్వారా త‌ర్వాత ఏం చేయాల‌నే దానిపై క్లారిటీ వ‌స్తుంద‌ని టాస్క్ మిత్ర టీం అంటోంది. అందుకే డేటా అన‌లైజేష‌న్ అనే కాన్సెప్ట్కి ఎక్కువ ప్రియారిటీ ఇస్తామ‌ని చెబుతున్నారు.

పోటీ ఎక్కడైనా ఉంటుంది

భార‌త‌దేశంలో లోక‌ల్‌గా ఇలాంటి స‌ర్వీసులు అందిచే మార్కెట్ విలువ దాదాపుగా రూ.3,31,400 కోట్లు ఉంటుంది. అది ఏడాదికేడాది పెరుగుతూనే వ‌స్తోంది. అర్బన్ క్లాప్‌, డోర్‌మింట్‌, టైమ్ సేవ‌ర్స్‌, మిస్టర్ రైట్‌, టాస్క్ బాబ్‌, జెప్పర్ లాంటి సంస్థలు ఇప్పటికే ఈ వేల‌కోట్ల మార్కెట్‌పై క‌న్నేశాయి. ఇక జ‌స్ట్ డయల్‌, సులేఖ, యెల్లో పేజెస్ లాంటివి ఆన్‌లైన్‌లో స‌ర్వీస్ లిస్టింగ్ అందిస్తున్నాయి. ఈ ఏడాది ఆగస్టులో డోర్‌మింట్ సంస్థలో హీలియ‌న్ వెంచ‌ర్స్‌, ఓరియోస్ వెంచ‌ర్స్ క‌లిసి దాదాపు 20 కోట్ల రూపాయ‌ల‌ పెట్టుబ‌డి పెట్టాయి. అలాగే అర్బన్ క్లాప్ సంస్థలో కూడా ఐడీజీ వెంచ‌ర్స్‌, ఓమ్‌డియార్ నెట్‌వ‌ర్క్స్‌ 13.5 కోట్ల రూపాయ‌ల‌ డాల‌ర్ల పెట్టుబడులు పెట్టాయి.

క్వాలిటీ ఇవ్వాలేగానీ పోటీ ఖతర్నాక్

క్వాలిటీ బేస్డ్ స‌ర్వీసుల‌ను అందించ‌డం ద్వారా మిగ‌తా కాంపిటీట‌ర్స్ కంటే భిన్నంగా ఉండాల‌న్నది తమ లక్ష్యం అని కంపెనీ సీటీవో గౌత‌మ్ అంటున్నారు. మానవసంబంధాల‌ను టెక్నాల‌జీ ద‌గ్గర‌చేస్తున్న ఈ త‌రుణంలో.. అదే టెక్నాల‌జీని వినియోగించి కస్టమ‌ర్లను స‌ర్వీసుల‌ను ఈజీగా క‌నెక్ట్ చేసే ప్లాట్‌ఫామ్‌ను త‌యారుచేస్తామంటున్నారు.

విజయం మాదే

స‌ర్వీస్ బేస్డ్ ఇండ‌స్ర్టీలో ఆఫ‌ర్లు పెరుగుతున్న స‌మ‌యంలో భిన్నంగా ఆలోచించ‌డంకంటే క‌స్టమ‌ర్ రిలేష‌న్స్ను జాగ్రత్తగా కాపాడుకోవ‌డంతో పాటు క్వాలిటీ స‌ర్వీసుల‌ను అందిస్తే.. విజ‌యం మ‌న‌దేన‌న్న సూత్రాన్ని ఫాలో అవుతున్న టాస్క్ మిత్ర‌.. భ‌విష్యత్తులో కాంపిటీట‌ర్స్ నుంచి ఎదుర‌య్యే పోటీని త‌ట్టుకుంటామ‌ని అంటోంది..