దేశీయ మార్కెట్లో టేస్టీ బీర్ పొంగిస్తున్న స్టార్టప్

దేశీయ మార్కెట్లో టేస్టీ బీర్ పొంగిస్తున్న స్టార్టప్

Monday May 09, 2016,

2 min Read


బీరు ప్రియులకు క్రాఫ్ట్ బీర్ అంటే ఏమిటో తెలిసే ఉంటుంది. అది పెద్ద పెద్ద కంపెనీలు తయారు చేసేది కాదు. చిన్న కంపెనీలే తాగేవారి టేస్టుకు తగ్గట్లు ట్రెడిషనల్ గా తయారు చేసేది క్రాఫ్ట్ బీర్. పబ్బుల్లోనూ, క్లబ్బులు, ఇంటి అవసరాలకోసం దీన్ని వినియోగిస్తారు. మార్కెటింగ్ కు సైతం పెద్ద కంపెనీలు వెళ్లవు. అంతా లోకల్ మేడ్. అయితే ఈ మార్కెట్ నే దున్నేస్తోంది స్టార్టప్ కంపెనీ కామా ఇంపెక్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఏకంగా దేశంలోని 30 శాతం బీర్ మార్కెట్ ను చేజిక్కించుకునేందుకు సన్నద్ధమవుతోంది.

విదేశాల్లో క్రాఫ్ట్ బీర్స్ వాడకం ఎక్కువ. ఇప్పుడు భారత్ లోనూ ఆ ట్రెండ్ వస్తోంది. ఇప్పటికే చాలా కంపెనీలు క్రాఫ్ట్ బీర్ తయారు చేస్తున్నాయి. సంప్రదాయ సారాయి కలిపి- గోధుమలు, బార్లీతో దీన్ని తయారు చేస్తారు. ఇదే టెక్నిక్ తో 2014 ఏప్రిల్ లో కామా ఇంపెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ ను స్థాపించారు అనుజ్ కుష్వా. 

ఆలోచన ఎలా వచ్చింది?

అనుజ్ కుష్వా లండన్ లో కొంతకాలం ఉన్నారు. అసలు సిసలైన క్రాఫ్ట్ బీర్ గురించి తెలుసుకున్నారు. లండన్ లో లోకల్ గా తయారుచేసే చాలా బీర్లను టేస్ట్ చేశారు. అలాంటి ఫ్లేవర్ బీర్స్ ఇక్కడ ఎందుకు తయారు చేయకూడదు అనుకున్నారు. ఇండియన్ ఆల్కో బెవరేజెస్ మార్కెట్ చాలా బ్రాండ్స్ ఉన్నాయని, అయితే సరైన టేస్టుల్లో బీర్ దొరకడం లేదని అనూజ్ గుర్తించారు. అంతేకాదు బీర్ ఉత్పత్తిలో కొత్త ప్రయోగాలు చేయడం లేదని తెలుసుకున్నారు. మారుతున్న లైఫ్ స్టైల్ కు అనుగుణంగా ప్రజలు కొత్త టేస్టులు కోరుకుంటున్నట్లు గుర్తించారు. దీన్నే బేస్ చేసుకుని విట్లింగర్ పేరుతో బీర్ తయారు చేయాలనుకుని స్టార్టప్ పెట్టారు.

image


భారత్ మార్కెట్ లో పోటీ

2001లో 468 మిలియన్ లీటర్లున్న బీర్ మార్కెట్ 2015 నాటికి 2,366 మిలియన్ లీటర్స్ కు పెరిగిందని ఇండియన్ బీర్ జర్నల్ తెలిపింది. భారత్ లో ఈ మార్కెట్ ఏడాదికి 15 చొప్పున పెరుగుతోందని బ్రిటన్ కు చెందిన మార్కెట్ రీసెర్చ్ కంపెనీ టెక్ నవియో అంటోంది. 

ఆ టేస్టే వేరు

దీని యునీక్ టేస్ట్ వల్ల త్వరలోనే దేశవ్యాప్తంగా ఇది పాపులరవుతుందని అంటున్నారు అనూజ్. అధికారికంగా లాంచ్ చేయకముందే కామా ఇంపెక్స్ ఒక్క ఢిల్లీ మార్కెట్ నుంచే 10 వేల కేసుల ముందస్తు ఆర్డర్స్ పొందింది. మేజర్ బార్లు, రెస్టారెంట్లు, క్లబ్బులు, ఫైవ్ స్టార్ హోటల్స్, కేఫుల్లో ఈ బీర్ కు చాలా క్రేజ్ ఉంది. బీర్ కేఫ్, వేర్ హౌస్ కేఫ్, టౌన్ హౌస్ కేఫ్, ఓపెన్ హౌస్, లార్డ్ ఆఫ్ డ్రింక్స్ లాంటి కేఫుల్లో దీనికి మంచి గుర్తింపే ఉంది. 

మార్కెట్ విశ్లేషణ

మార్కెట్లో క్రాఫ్ట్ బీర్ ను విట్లింగర్ కంపెనీ మాత్రమే తయారు చేయడం లేదు. బీ9, వైట్ జెన్, ఓల్డ్ టామ్, లెఫీ బ్లాండ్, షెపర్డ్ నీమ్ ఐపీఏ లాంటి కంపెనీలు ఈ తరహా బీరు తయారు చేస్తున్నాయి. ఈ కంపెనీల్లో కోట్ల రూపాలు పెట్టేందుకు పెట్టుబడిదారులు ముందుకు వస్తున్నారు. కామా ఇంపెక్స్ కంపెనీలో జెస్మీత్ మార్వో, అమిత్ ఆనంద్ కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టారు. అందుకే ఈ కంపెనీ సేల్స్ పై దృష్టిపెట్టింది. త్వరలోనే చిన్న చిన్న పట్టణాల్లోకి కూడా విస్తరించనుంది. స్థానిక బ్రూవరీస్ తో టచ్ లో ఉంది.

సవాళ్లు

భారత్ లో బీర్ వినియోగం ఏడాదికి సగటున 1.4 లీటర్లు. ప్రపంచ సగటు 65 లీటర్లు. అంటే ప్రపంచ సగటుకన్నా చాలా తక్కువన్నమాట. అయితే భారత్ లో బీర్ వినియోగం రాను రాను పెరుగుతోంది. అందుకే విదేశాల్లోకన్నా మన దేశంలోనే మార్కెట్ కు ఎక్కువ అవకాశాలున్నాయంటున్నారు అనూజ్. ఒక్కో రాష్ట్రంలో బీర్ వినియోగం, విధానాలు ఒక్కోలా ఉన్నాయి. ప్రభుత్వ విధానాలే మార్కెట్ పంపిణీ, వినియోగానికి అవరోధాలుగా ఉన్నాయంటున్నారు అనూజ్. అయితే ఎన్ని అడ్డంకులున్నా వినియోగదారులు మాత్రం పెరుగుతునే ఉన్నారు.