క్యాబ్ సేవలన్నింటినీ ఒకే గొడుగు కిందికి తెచ్చిన 'ట్యాక్సీ పిక్సీ'

హైదరాబాద్ సెల్కాన్ మొబైల్ సంస్థ పెట్టుబడులు...నైజీరియాలో స్థానిక కంపెనీతో భాగస్వామ్యం...చిన్న ట్యాక్సీలతో మలేషియా, సింగపూర్ లో ఎంట్రీ...టెక్నాలజీతో దూసుకుపోతున్న ట్యాక్సీపిక్సీ స్టార్టప్...

క్యాబ్ సేవలన్నింటినీ ఒకే గొడుగు కిందికి తెచ్చిన 'ట్యాక్సీ పిక్సీ'

Saturday May 23, 2015,

4 min Read

రోజుకో సరికొత్త ఆఫర్లతో ట్యాక్సీ లు జనం ముందకొస్తున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే ఆన్‌లైన్ బుకింగ్స్‌లో ఇండియా నిండుగా కనిపిస్తోంది. భారతీయ ట్యాక్సీ మార్కెట్ 6 నుంచి 9 బిలియన్ అమెరికన్ డాలర్లు ఉంటుందని అంచనా. ముందు ముందు మరింత ఎదగడానికి అవకాశాలు కూడా పుష్కలంగా కనిపిస్తున్నాయి. భవిష్యత్ లో కస్టమర్ల డిమాండ్‌కు తగిన సర్వీస్ టాక్సీలు ఉండకపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

ట్యాక్సీ పిక్సీ

ఆన్ టైం టెక్నాలజీ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ , ఢిల్లీ కేంద్రంగా ట్యాక్సీపిక్సీని ప్రారంభించింది. సిఈఓ కాజల్ దూబె, కో ఫౌండర్లు జితేందర్ శర్మ, గౌరవ్ అగర్వాల్‌లు దీని వ్యవస్థాపకులు. ట్యాక్సీలకు కావల్సిన డ్రైవర్లు, క్యాబ్స్‌ని ట్యాక్సీపిక్సీ అందిస్తుంది. ప్రస్తుతం ఉన్న కోర్ టీంలో జియాద్ అజ్మి, భూపేష్ గోయల్ కూడా ఉన్నారు. ఈ ఐదుగురు టీం వందలమందికి ఉపాధిని కల్పించినందుకు గర్వపడుతున్నారు. అయితే కంపెనీ మీడియాకు ఎప్పుడూ దూరంగానే ఉన్నా.. యువర్ స్టోరీ ఎప్పటికప్పుడు వారితో కలిసే ప్రయత్నం చేస్తూ వచ్చింది. నిరుడు యువర్ స్టోరీ ఇంటర్వ్యూలో టాక్సీపిక్సీ లో వచ్చిచేరిన పెట్టుబడుల గురించి వెల్లడించారు సంస్థ ప్రతినిధులు. హైదరాబాద్‌కు చెందిన మొబైల్ కంపెనీ సెల్‌కాన్.. టాక్సీ పిక్సీలో కొంత ఇన్వెస్ట్ చేసింది.

ట్యాక్సీ పిక్సీ యాప్ పేజెస్

ట్యాక్సీ పిక్సీ యాప్ పేజెస్


టాక్సీపిక్సీ ఎలా ప్రారంభమైంది ?

ట్యాక్సీ పిక్సీ 25మంది డ్రైవర్లతో మే 2013న ప్రారంభమైంది. ఏడాది పూర్తయ్యే సరికి ఈ సంఖ్య 2 వేలకు చేరింది. వచ్చే ఆరు నుంచి పన్నెండు నెలల్లో 10వేల మంది డ్రైవర్లు ఉండటమే లక్ష్యంగా పెట్టుకుంది. డెయిలీ యాక్టివ్ రేట్(డిఎఆర్) ప్రస్తుతం 50శాతం ఉండగా. దీన్ని 80శాతం పెంచుకోడానికి ట్యాక్సీ పిక్సీ ప్రయత్నాలు ప్రారంభించింది. సాధారణంగా ట్యాక్సీ పిక్సీ ద్వారా యూజర్ క్యాబ్‌ను బుక్ చేస్తే.. అక్కడి దగ్గర్లో ఉన్న వేరు వేరు కంపెనీలకు సంబంధించిన డ్రైవర్లకు సందేశం వెళ్తుంది. వారితోపాటు ఆపరేటర్, అగ్రిగేటర్‌కు ఇదే సందేశం చేరవేస్తారు. రకరకాల క్యాబ్‌లతో పాటు ధరలను కూడా సరిచూసుకొనే వెసులుబాటు వినియోగదారుడికి కలిగించడమే దీని వెనకున్న కారణమంటారు సిఈఓ కాజల్ దుబె. ఉదాహరణకు ఢిల్లీలో ట్యాక్సీ అంటే ఎకానమి రేడియోక్యాబ్, రేడియో క్యాబ్, టూరిస్ట్ ట్యాక్సీ, ఎయువి ఇలా వివిధ రకాల ట్యాక్సీలకు సంబంధించిన సందేశం అటు వినియోగదారుడికి, ఇటు ట్యాక్సీ ఆపరేటర్లకు అందిస్తామన్నారామె. 

''మేం డ్రైవర్లతోనే డైరెక్ట్ గా పనిచేస్తాం. గతేడాది ఆగస్టులో గుర్గావ్‌కి చెందిన జి క్యాబ్స్(G-Cabs) తో ఫార్మల్ అగ్రిమెంట్ రాసుకున్నాం. జి క్యాబ్స్‌కు రేడియో ట్యాక్సీ, టూరిస్ట్ ట్యాక్సీ సెగ్మెంట్లలో దాదాపు 250 క్యాబులున్నాయి. ఢిల్లీ ట్యాక్సీపిక్సీతో అగ్రిమెంట్ చేసుకున్న డ్రైవర్లలో దాదాపు అన్ని కంపెనీలకు సంబంధించిన వారూ ఉన్నారు. లోకల్, ఔట్ స్టేషన్ బుకింగ్స్ మేం తీసుకుంటాం. ఇందులో అవర్లీ (గంటలవారీ), డెయిలీ(రోజువారీ) అద్దెలకు ట్యాక్సీలను అందిస్తాం. జర్నీ పూర్తిఅయిన తర్వాత కస్టమర్లు లెక్క చూసుకొని డ్రైవర్లకే డబ్బులను పే చేస్తారని'' ఆమె వివరించారు.

ట్యాక్సీ పిక్సీ యాప్

ట్యాక్సీ పిక్సీకి ఆండ్రాయిడ్, ఐఓఎస్ యాప్ లు ఉన్నాయి. క్యాబ్ ఎవైలబిలిటీ, మ్యాప్, 30 సెకెన్ లలో బుకింగ్ పూర్తి, స్టాటస్ సరిచూసుకోవడం, రియల్ టైం ట్రాకింగ్ తో పటు ఈటిఏ లాంటి ఫీచర్లు ఈ యాప్ లో ఉన్నాయి. ఎంతో ఈజీగా దీన్ని కస్టమర్లు ఉపయోగించొచ్చు.డ్రైవర్ తో మాట్లాడటానికి డైరెక్ట్ కాల్ ఆప్షన్ తోపాటు ఒక క్లిక్ తో క్యాన్సిల్ చేసేయొచ్చు.

image


విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం సెల్కాన్ మొబైల్స్‌లో ఇది ప్రీ ఎంబెడెడ్ చేశారు. అయితే యాప్ ఎడాప్షన్‌కు ఇది ఎంతవరకూ పనికొస్తుందనే విషయం ఇపుడు అప్రస్తుతం. ప్లే స్టోర్ నుంచి 60వేల యాప్ డౌన్ లోడ్స్ అయినట్టు టీం చెప్పుకుంటోంది. ట్యాక్సీపిక్సీ నాలుగు రకాల క్యాబ్‌లను అందిస్తోంది. ఎకానమి , ఎకానమీ ప్లస్, సాధారణ రేడియో ట్యాక్సీ. వీటి ధరలు వరుసగా కిలోమీటర్‌కు 10, 15 ,20 రూపాయిలు. ఇందులోనే చివరిది ప్రిమియం సెగ్మెంట్ ఎస్.యూ.వి.కి అయితే కిమీ 30రూపాయిలు గా నిర్ణయించారు.

నైజీరియాలో ట్యాక్సీపిక్సీ

ట్రాంజిట్ డాట్ ఎన్జీతో భాగస్వామ్యంతో ట్యాక్సీపిక అంతర్జాతీయ మార్కెట్ లోకి అడుగుపెట్టింది. స్థానిక ట్యాక్సీ కంపెనీల భాగస్వామ్యంగా ముందుకు పోవడమనే వ్యూహంతో గ్లోబల్ మార్కెట్ లో ఎదురుండదని భావించిన ట్యాక్సీ పిక్సీ అటువైపుగానే అడుగులేసింది. “ మేమే మొదటిసారి మలేషియా,సింగపూర్ లో చిన్న ట్యాక్సీ లను 2014 ఫిబ్రవరిలో ప్రారంభించాం. అప్పటి నుంచి అంతర్జాతీయ మార్కెట్ లో మరింత మెరుగ్గా ముందుకు పోవాలని నిర్ణయించుకున్నాం. సౌది అరేబియా, యూఏఈ, ఈజిప్ట్, అజెర్బైజన్, మలేషియా, ఇటలీల్లో మా లాంచింగ్ ఆపరేషన్స్ వివిధ స్థాయిల్లో ఉన్నాయి. ఈ అంతర్జాతీయ వ్యాపార విస్తరణ గురించి మేం పడిన శ్రమకి ఫలితమే ఈ నైజీరియా.” అని దుబే వివరించారు.

ఇటీవలే ఆఫ్రికాలో లాగోస్ కు చెందిన ట్యాక్సీ స్టార్టప్ ట్రాంజిట్ డాట్ ఎన్జి తో ఒప్పందం కుదుర్చుకుంది. దీనిలో బోరిస్ ముయివా, రొడ్నీజాక్సన్ కొలే, ఉగోచి నికోలె ఉగ్బొమేలు పెట్టుబడులు పెట్టారు. ట్రాంజిట్‌తో మేం భాగస్వామ్యం కాడానికి ప్రధన కారణం..వారు కొత్తగా వ్యాపారంలోకి వచ్చారు. విజయం పొందాలనే ఆకలి వారిలో కనిపించింది. వారికి మేం టెక్నాలజీ సాయం అందిస్తాం. వారు మాకు ఆఫ్రికాలో అడుగు పెట్టడానికి, విస్తరించడానికి కావల్సిన మద్దతిచ్చారు. అని చెప్పుకొచ్చారు దుబె.

ట్యాక్సీపిక్సీ కి సంబంధించిన అడ్వాన్స్డ్ ఈ హెయిలింగ్ టెక్నాలజీ ట్రాంజిట్ కు మార్కెట్ లో కొత్త ఊపునిచ్చింది. నైజీరియాలో మేం ఎదగడానికి ఇది ఎంతగానో సాయపడింది. ఇతర ఆఫ్రికా నగరాలకు విస్తరించాలనే యోచనలో ఉన్నామని ట్రాంజిట్ ఎండి ఉగోచ్ అన్నారు. ఈరెండు కంపెనీలు కలవడానికి మరో కంపెనీ కారణమట. అయితే దాని వివరాలు బయటపెట్టడానికి ఇరు వర్గాలు ఇష్టపడటం లేదు. ఈ కంపెనీల భాగస్వామ్యంతో మరిన్ని అద్భుతాలు చేయొచ్చని వీరు ఆశిస్తున్నారు.

ట్యాక్సీపిక్సీలో ఉన్న ప్రత్యేకత

ఇందులో రోబస్ట్ టెక్నాలజి ఉపయోగించారు. దీనిలో ఉన్న ప్రామాణికత, రోల్స్ తో పాటు యాక్సెస్ అనేవి వివిధ నగరాలు, ఒకే నగరంలో ఉన్న వివిధ ట్యాక్సీ కంపెనీలను ఒకే గొడుకు కిందకు తెచ్చి వాడకందార్లకు సౌకర్యవంతమైన సేవలను అందిస్తుంది. అన్నింటిన వాడే తలనొప్పిని తగ్గించడంతోపాటు ఒకే అప్లికేషన్ తో ధరను సైతం అందుబాటులోకి తీసుకొస్తోంది. ఇంగ్లీష్, అరబిక్, రష్యన్, టర్కిష్, అజెరి, స్పానిష్ లాంటి భాషలతో ఈ యాప్ ను ఉపయోగించకోవచ్చు. దీంతో పాటు మరెన్నో గొప్ప గొప్ప విషయాలు ట్యాక్సీపిక్సీని అందరిని తమవైపు తిప్పుకొనేలా చేస్తోంది. ఈ టెక్నాలజీ సాయంతో తక్కువ ఖర్చు పెట్టి ఎక్కువ లాభాలు పొందొచ్చు.

ట్యాక్సీ కంపెనీలాగ కాకుండా ఈ తరాన్ని లీడ్ చేయాలంటే ఇలాంటి ప్లాట్ ఫాం లేకపోతే సాధ్యపడదు. ధరను తక్కువగా ఇచ్చే ట్యాక్సీ కంపెనీలతో మాకు కాంపిటీషన్ తప్పడం లేదు. మా బ్రాండ్ ని ఉపయోగించుకోవడం మా స్థానిక భాగస్వామ్య కంపెనీలు లాభం చేకూరేలా మేం ఎదుగుతున్నాం. మేం ఎలాంటి డిస్కౌంట్లు ఇవ్వం. అదే విధంగా ఉన్న ధరకంటే ఎక్కువ వసూలు చేయం. ధరల విషయంలో తుది నిర్ణయం మా భాగస్వామ్య కంపెనీలదే. అని దొబె వివరించారు.

స్థానిక వ్యాపారమైన క్యాబ్ సర్వీసును, స్థానిక భాగస్వామ్యులు తప్పితే మరెవరు అర్థం చేసుకోలేరు. అయితే కస్టమర్లు మాత్రం ఆ సర్వీసును అర్థం చేసుకోవాలి. దీంతో పాటు డ్రైవర్ల సమయపాలన లాంటి అంశాలు కస్టమర్లకు మళ్లీ మళ్లీ అదే కంపెనీ ట్యాక్సీ లో వెళ్లాలనిపించాలని ఆమె చెప్పుకొచ్చారు. ఫుడ్ పాండా లనే ఓ రెస్టారెంట్ ఫుడ్ ఆర్డర్ యాప్ ఉంది. ఇది రెస్టారెంట్ కాదు. కానీ రెస్టారెంట్ ఫుడ్ ఆర్డర్ చేసుకోడానికి సాయపడుతుంది. అలాగే ఫుడ్ పాండా బ్రాండ్ ని వాడుకొని రెస్టారెంట్ లు వినియోగదారులను తమ రెస్టారెంట్ వైపు ఆకర్షిస్తున్నారు. మారి కూడా ఇలాంటి వ్యాపారమే. మా దగ్గర ట్యాక్సీలు లేకపోయినా.. ట్యాక్సీలున్న క్యాబ్ సర్వీసు కంపెనీలు మాతో భాగస్వామ్యం అవుతున్నాయి. సౌత్ ఈస్ట్ ఏషియాలో ఉన్న ట్యాక్సీ యాప్ లలో మేం మొదటి ప్లేస్ లో ఉండాలనేదే మా తదుపరి లక్ష్యంగా కాజల్ ముగించారు.