శాస్త్ర.. ది టచ్ ! రోబో స్పెషలిస్ట్స్

రోబోటిక్స్‌లో మార్క్ సృష్టిస్తామంటున్న శాస్త్రజీవ పరిణామంలో మరుసటి దశ రోబోలతో సహజీవనమే!టచ్ స్క్రీన్ మార్కెట్ సామర్ధ్యం పెరగనుందంటున్న శాస్త్ర రోబోటిక్స్వేగం, ఖచ్చితత్వం, భద్రత పెరగాలంటే రోబోలు తప్పనిసరి ?

శాస్త్ర.. ది టచ్ ! రోబో స్పెషలిస్ట్స్

Saturday May 02, 2015,

2 min Read

ఇప్పుడంతా స్పీడ్ యుగం. మళ్లీ చెప్పాలంటే యాప్ యుగం. టెకీల నోరు తెరిస్తే అప్లికేషన్లు, డిజైనింగ్, డెవలపింగ్ అనే మాటలే వినిపిస్తాయి. ఇంతగా అభివృద్ధి చెందినా... ప్రస్తుతం డెవలపర్లు ఎదుర్కుంటున్న అతి ముఖ్య సమస్య అప్లికేషన్ల టెస్టింగ్. సమర్ధవంతంగానూ, అదే సమయంలో వేగంగానూ పరీక్షించగల టెస్టింగ్ సాధనాలు అందుబాటులో లేవు. ఈ సమస్యకు పరిష్కారం కనుగొన్నామంటోంది శాస్త్ర రోబోటిక్స్. ఈ సంస్థ అభివృద్ధి చేసిన SR-SCARA-Pro V2... టచ్ స్క్రీన్ డివైజ్‌లను ప్రపంచంలోనే అత్యంత వేగంగా టెస్టింగ్ చేయగల రోబోటిక్ మెషీన్‌గా చెబ్తోంది శాస్త్ర. డివైజ్‌లను, సాఫ్ట్‌వేర్‌లను సమర్ధవంతంగా పరీక్షించడమే కాకుండా ఖచ్చితమైన రిజల్ట్ ఇవ్వగల సామర్ధ్యం SR-SCARA-Pro V2కి ఉంది.

image


శాస్త్ర ది టచ్... !

ప్రస్తుతం మార్కెట్‌లోకి వస్తున్న ప్రతీ వస్తువుకు టచ్ స్క్రీన్ తప్పనిసరి. ఆఖరికి రిఫ్రిజిరేటర్లు, కూలర్లు వంటి గృహోపకరాణాలకూ టచ్ స్క్రీన్ తప్పనిసరిగా మారిపోయింది. కాబట్టి ఇప్పట్లో తమ మార్కెట్‌ పెరిగేదే తప్ప... తగ్గేది కాదంటుంది కంపెనీ. అదే సమయంలో అప్లికేషన్ల అభివృద్ధి, వాటికి అనుగుణంగా అందుబాటులోకి వస్తున్న సాఫ్ట్‌వేర్‌లు కూడా చాలా వేగంగా పెరుగుతున్నాయి. వీటిన్నిటికి సమర్ధవంతమైన టెస్టింగ్ టూల్స్ కావాల్సిందే. ఇప్పటికైతే టచ్ స్క్రీన్ విషయంలో స్మార్ట్ ఫోన్లకే ఫస్ట్ ప్లేస్. కానీ ఇప్పుడు నోట్‌బుక్‌లు, స్లేట్‌ పీసీలు వచ్చేస్తున్నాయి. వీటి సంఖ్య చాలా వేగంగా పెరిగిపోతోంది. రాబోయే రోజుల్లో మార్కెట్ లీడర్‌గా ఇవి అవతరించినా ఆశ్చర్యపోనవసరం లేదనే అంచనాలున్నాయి. అలాగే టచ్ స్క్రీన్‌లు మరిన్ని విభాగాల్లోకీ విస్తరిస్తున్నాయి. ఈ-రీడర్స్, కాసినో గేమింగ్ వంటి సాధనాలకూ ఇప్పుడు టచ్ స్క్రీన్ తప్పనిసరైంది. దీంతో తమ మార్కెట్‌కు తిరుగులేదని చెబ్తోంది శాస్త్ర.

image


పరిణామంలో తర్వాతి దశ

వినియోగదారులు, విద్యా సంబంధిత పరిశోధనలకే కాకుండా... పారిశ్రామిక రంగానికి కూడా రోబొటిక్ అవసరాలు తీర్చగల స్థాయి ఉంది శాస్త్ర రోబోటిక్స్‌కి. ఇప్పుడు తయారయ్యే వస్తువులకూ తెలివితేటలుంటున్నాయి. మానవుడి మేథస్సు ఎంతగా అభివృద్ధి చెందితే.. అదే స్థాయిలో ఆయా ఉత్పత్తలు పనితీరులోనూ నాణ్యత, నైపుణ్యం పెరుగుతోంది. మనుషులు, తెలివైన మెషీన్లు సహజీవనం చేసే స్థాయికి చేరుకోవడమే పరిణామ క్రమంలో తర్వాతి దశ అంటోందీ కంపెనీ. మానవుడి జీవితంలో వేగం, ఖచ్చితత్వం, భద్రత మరింతగా పెరిగేందుకు రోబోట్ల సహాయం తప్పనిసరి అన్నది శాస్త్రరోబోటిక్స్ వాదన.

image


నెక్ట్స్ జెన్ రోబోటిక్స్

భారత దేశంలోని కేరళ రాష్ట్రంలో కొచ్చిలో ఉంది టెక్నాలజీ అండ్ రోబోటిక్స్ కంపెనీ శాస్త్ర రోబోటిక్స్. తమ టీం గురించి కంపెనీ చాలా గొప్పగా చెప్తుంది. "నైపుణ్యం కలిగిన ఔత్సాహిక ఇంజినీర్లు మా దగ్గర ఉన్నారు. వీరంతా తర్వాతి తరం రోబోలను తయారు చేయడంలో నిమగ్నమై ఉన్నారు. ప్రస్తుతం స్టార్టప్ స్థాయిలో ఉన్న కంపెనీ... ఇప్పటికే పలు అవార్డులు, రివార్డు కూడా దక్కించుకుంది. 2012లో స్టార్టప్ విలేజ్ నిర్వహించిన పోటీలో మోస్ట్ ప్రామిసింగ్ జాబితాలో టాప్-5లో చోటు పొందాం. 2014లో టై-బెంగళూరు నిర్వహించిన మోస్ట్ ప్రామిసింగ్ ఎర్లీ స్టేజ్ స్టార్టప్ జాబితాలో... టాప్ 10లో స్థానం దక్కించుకున్నాం. వినూత్నమైన హైఎండ్ రోబోటిక్ టెక్నాలజీ అభివృద్ధి చేయడమే మా లక్ష్యం. మానవులకు సహాయపడేలా అప్లికేషన్ల తయారీలోనూ నిమగ్నమయ్యాం.

మిలటరీ ఆర్మ్ ప్రదర్శనలో భాగంగా శాస్త్ర రొబోటిక్స్ సహ వ్యవస్థాపకుడు ఆరోనిన్ పొన్నప్పన్

మిలటరీ ఆర్మ్ ప్రదర్శనలో భాగంగా శాస్త్ర రొబోటిక్స్ సహ వ్యవస్థాపకుడు ఆరోనిన్ పొన్నప్పన్


ఇదీ టీం : ఆరోనిన్ పి., అఖిల్ ఏ, అచు విల్సన్

వినూత్నమైన టెక్నాలజీని అందుబాటు ధరలోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని చెబ్తున్నాయి శాస్త్ర వర్గాలు. తమకు అప్పగించిన పని సకాలంలో, పూర్తి నాణ్యతతో పూర్తి చేసి, కస్టమర్లకు తగిన సేవలందిస్తున్నామని చెబ్తోంది. రోబోటిక్స్, ఆటోమేషన్, ఎలక్ట్రానిక్స్, ఎంబెడెడ్ సిస్టం డిజైన్, సాఫ్ట్‌వేర్ డిజైనింగ్, ట్రైనింగ్ సెషన్స్... ఇలా పలు రంగాల్లో సేవలందిస్తోంది శాస్త్ర టెక్నాలజీస్.