దీపాలకూ ఆర్గానిక్ హంగులు

0

ప్రతి ఆదివారంలాగానే ఈ వారం కూడా ఆర్గానిక్ బజార్ జరిగింది. అయితే ఈ సారి దీపావళి సందర్భంగా ప్రత్యేకత సంతరించుకుంది. రంగురంగుల ప్రమిదలు, బట్టలు, కొవ్వొత్తులు ఆకర్షణగా నిలిచాయి. రెండు ప్రమిదలు(పెయిర్) 30రూపాయిల నుంచి మొదలై 100రూపాయిల దాకా ధరను పలికాయి.

రంగుల ప్రమిదలు

రకరకాలైన ప్రమిదలు అమ్మకానికి పెట్టారు. ఆదివారం ఆర్గానికి బజార్‌కి వచ్చిన కస్టమర్లు వీటిని కొనడానికి క్యూకట్టారు. ఆరోమా క్యాండిల్స్ (సుగంధం వెదజల్లే కొవ్వొత్తులు) లతో పాటు పాటు రంగుల ప్రమిదలు ఎక్కువగా అమ్ముడు పోయాయి. నూనె వేసి దీపాన్ని పెట్టుకోవచ్చు అలాగే కొవ్వొత్తులు వెలిగించుకోడానికి కూడా ఇవి అనుకూలంగా ఉంటాయని షాప్ వెండార్స్ చెబ్తున్నారు. సాంప్రదాయబద్దమైన పండగని గుర్తు చేసేలా ఇవి ఉన్నాయని కస్టమర్లు అభిప్రాయపడ్డారు.

ధర విషయంలో కూడా ఆక్షణీయంగా ఉండం వల్ల జనం వీటిని తీసుకెళ్లడానికి ఎగబడ్డారు. ఉదయం పదిగంటల నుంచి మధ్యాహ్నం వరకూ సేల్ కొనసాగింది.

ఫెస్టివల్స్ స్పెషల్ ఈ బజార్

రంజాన్ సీజన్‌లో ఇక్కడ ఇరానీ రుచులతో కూడిన వంటకాలను ప్రదర్శనకు పెడుతుంటారు. ఇప్పుడు దీపావళి కావడంతో దానికి సంబంధించిన వస్తువులను సమకూర్చారు. కాటన్ బట్టలు, కుర్తాలు కూడా ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. వారాంత బజారుగా చెప్పుకునే ఈ లామకాన్ ఆర్గానికి బజార్ ఎప్పటికప్పుడు తన ప్రత్యేకతను సంతరించుకుంటోంది. ఇక్కడకొచ్చే కస్టమర్ల ఇళ్లలో రంగుల ప్రమిదలు,దీపాలు, కొవ్వొత్తులు వెలుగులు వెలిగించాయనే చెప్పాలి.