ప్రభుత్వ పాఠశాలల ప్రగతి కొరకు ‘ఇండియా లిటరసీ ప్రాజెక్ట్’

ప్రభుత్వ పాఠశాలల ప్రగతి కొరకు ‘ఇండియా లిటరసీ ప్రాజెక్ట్’

Thursday May 05, 2016,

3 min Read


25ఏళ్లగా భారత దేశంలో విద్యారంగానికి ఎనలేని సేవలందిస్తున్న సంస్థ ఇండియా లిటరసీ ప్రాజెక్ట్. దేశంలో నూటికి నూరు శాతం అక్షరాస్యత సాధించడమే లక్ష్యంగా సంస్థ పనిచేస్తోంది. ఇది ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. లాభాపేక్ష లేకుండా ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాలను మెరుగుపరచడంతో పాటు, అనేక సేవలను అందిస్తోంది.

image


మారుమూల పల్లెలే టార్గెట్

మారుమూల పల్లెలు ఇతర ట్రైబల్ ప్రాంతాల్లో ఈ సంస్థ ప్రధానంగా సేవలందిస్తోంది. దేశవ్యాప్తంగా 17 రాష్ట్రాల్లో ఈ సంస్థ తన కార్యకలాపాలను విస్తరించింది. దళితులు, లంబాడాలు ఉన్నాచోట సేవలను అందిస్తోంది. ఈ ప్రాంతాల్లో చదువుకున్నవారికి ఉద్యోగం ఇవ్వడంతో పాటు ఇక్కడున్న సర్కారు బడుల్లో పిల్లలకు నాణ్యమైన విద్య అందేలా ఈ సంస్థ పనిచేస్తోంది. దీనికోసం స్థానికంగా ఉన్న వ్యక్తులతో కమ్యూనిటీని ఏర్పాటు చేసి వారికి చేరువయ్యేలా వివిధ కార్యకలాపాలను చేపడుతున్నారు. ప్రభుత్వ రంగ సంస్థలు, ఇతర స్థానిక సంస్థలతో కలసి పనిచేయడం చేయడంలాంటి మార్గాల ద్వారా మరిన్ని కార్యకలాపాలను విస్తరిస్తున్నారు. ఇప్పటి వరకూ 100కు పైగా లిటరసీ, ఎడ్యుకేషన్ ప్రొగ్రాంలు చేపట్టారు. ప్రస్తుతం ఏడు రాష్ట్రాల్లో 12 వందల గ్రామాల్లో సరికొత్త కార్యక్రమాలను చేపట్టి దూసుకుపోతున్నారు. ఇది డైరెక్టుగా మూడులక్షల మందికి ఉపయోగపడుతుంది.

“స్థానికంగా ఇంక్యబేషన్ ప్రాజెక్టులను ఏర్పాటు చేయడమే మా ముందున్న లక్ష్యం”- మన్మోహన్ జైన్

హైదరాబాద్ ఐఎల్పీ ఫౌండర్ అయిన మన్మోహన్.. కమ్యునిటీ లైబ్రరీలు, మల్టీ డైమన్షనల్ లెర్నింగ్ ప్రాంతాలను ఏర్పాటు చేసే పనిలో ఉన్నారు. ఈ విషయంలో ప్రభుత్వంతో భాగస్వామ్యం అయితే.. తమవంతు సహకారం అందిస్తున్నామని చెప్పుకొచ్చారాయన.

image


హైదరాబాద్ ఐఎల్పీ సేవలు

దేశ వ్యాప్తంగా వివిధ చాప్టర్లు తమ కార్యక్రమాలను చేపడుతున్నాయి. స్థానికంగా ఉన్న మన హైదరాబాదీ చాప్టర్ అందరికంటే మెరుగైన సేవలను అందిస్తోందని మన్మోహన్ అంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో వివిధ విద్య కార్యక్రమాల్లో హైదరాబాద్ టీం చురుగ్గా పాల్గొంటోంది. ప్రస్తుతం హైదరాబాద్ నగర శివారులో ఉన్న ప్రభుత్వ స్కూళ్లలో చేపడుతున్న కార్యక్రమాల వివరాలిలా ఉన్నాయి..

1. పుస్తకం, వాలంటీర్ల సాయంతో ప్రాధామిక పాఠశాల పిల్లలకి ఇంగ్లీష్ క్లాసులను చెబుతారు.

2. మొబైల్ లైబ్రరీ, ఈ కార్యక్రమంతో 6 ప్రభుత్వ పాఠశాలలకు ఒక లైబ్రరీని ఏర్పాటు చేస్తారు.

3. ఇన్ స్కూల్ లైబ్రరీ, ఎంపిక చేసి స్కూళ్లలో ఏర్పాటు చేశారు.

4. కంప్యూటర్ ల్యాబ్ , ఎంపికి చేసిన 3స్కూళ్లలో నెలకొల్పారు.

5. మెంటారింగ్, హైస్కూలు పిల్లలకు కెరియర్ కౌన్సిలింగ్ ఇస్తున్నారు. ఐదు స్కూళ్లను దీనికోసం ఎంపిక చేసుకున్నారు.

6. సమ్మర్ క్యాంప్ , మూడు పాఠశాలల్ని దీనికి ఎంపిక చేశారు. వీళ్లకి సమ్మర్ క్యాంప్ లను నిర్వహిస్తున్నారు.

7. పోస్ట్ టెన్త్ స్టుడెంట్స్ కి స్కాలర్షిప్, ప్రతి ఏడాది 25 మంది టెన్త్ పాసైన విద్యార్థులకు ఈ స్కాలర్షిప్ లు అందిస్తున్నారు.

8. మెరుగైన వసతుల కల్పన, కార్పొరేట్ కంపెనీల సహకారంతో స్కూళ్లలో మరింత మెరుగైన వసతులను ఏర్పాటు చేస్తున్నారు.

మాదాపూరు, గచ్చిబౌలి చుట్టుపక్కల ఉన్న సర్కరీ బడుల్లో ఈ కార్యక్రమాలు ప్రస్తుతం అమలవుతున్నాయి.

ఐఎల్పీ టీం.. ఇతర వివరాలు

1990లో ఇండియా లిటరసీ ప్రాజెక్టును అమెరికాలోని ఎన్నారైలు ప్రారంభించారు. హైదరబాదులో దీన్ని 2005లో మన్మోహన్ జైన్ మొదలుపెట్టారు. ప్రస్తుతం ఆయన ఐఎల్పీ ఇండియాకు చైర్మన్, బొర్డ్ ఆఫ్ ట్రస్టీగా వ్యవహరిస్తున్నారు. సీఏ టెక్నీలజీస్ వైస్ ప్రెసిడెంట్ గా పనిచేసి ఉద్యోగానికి రాజీనామా చేశారు. దాదాపు రెండు దశాబ్దాల కార్పొరేట్ జీవితానికి గుడ్ బై చెప్పారు. ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో చిన్నారుల జీవితాల్లో మార్పు తీసుకు రావడానికి పనిచేస్తున్నారు. శ్రావణ్ కుమార్- టీంలో మరో కీలక సభ్యుడిగా ఉన్నారు. ప్రాజెక్టు కో ఆర్డినేటర్ గా ఉన్నారీయన. మాస్టర్ డిగ్రీ చేసిన శ్రావణ్.. లండన్ లో 4 ఏళ్లు పనిచేసి ఇండియాకు వచ్చేశారు. 2014 నుంచి ఐఎల్పీ లోనే పనిచేస్తున్నారు. వీరితో పాటు ఆరుగురు ఉద్యోగులున్నారు. 50కిపైగా వాలంటీర్లు ఉన్నారు. ఐటి, హౌస్ వైవ్స్, ఎంబియే గ్రాడ్యుయేట్లు, కాలేజీ స్టూడెంట్లు ఈ వాంటీర్ల జాబితాలో ఉన్నారు.

image


ఐఎల్పీ భాగస్వామ్యులు

ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థలతో ఐఎల్పీ కలసి పనిచేస్తున్నది. స్థానికంగా ఉన్న ఆర్గనైజేషన్స్, విద్యాసంస్థలను భాగస్వామ్యులుగా చేర్చుకుంటుంది. కార్పొరేట్ ఫండ్స్ తో పాటు సీఎస్ఆర్, వ్యక్తిగత దాతల నుంచి ఫండ్స్ ని రెయిజ్ చేస్తుంది. హైదరాబాద్ లో అయితే సీఏ టెక్నాలజీస్, గూగుల్, జెనసార్క్ టెక్నాలజీస్, మైక్రోసాఫ్ట్, సీఏఎఫ్, ప్రొగ్రెస్ సాఫ్ట్ వేర్, డాక్టర్ రెడ్డీస్ లాబ్ లాంటి ఎన్నో సంస్థలు ఐఎల్పీ భాగస్వాములుగా ఉండటం విశేషం.

గ్రామీణ భారత దేశంలో ప్రభుత్వ పాఠశాల సంఖ్య లక్షల్లో ఉంది. వీటన్నింటిని సక్రమంగా నిర్వహించగలగితే నూటికి నూరుశాతం అక్షరాస్యత సాధించడం పెద్ద కష్టమేం కాదనేది ఐఎల్పీ ఆలోచన అని ముగించారు మన్మోహన్ జైన్