2016లో స్టార్టప్ భవిష్యతేంటి?

2016లో స్టార్టప్ భవిష్యతేంటి?

Sunday December 27, 2015,

7 min Read

టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోంది. రోజుకో కొత్త టెక్నాలజీ వచ్చి చేరుతున్నది. కంప్యూటర్ సాఫ్ట్‌ వేర్లే కాదు.. కొత్త కొత్త యాప్‌ లు వస్తున్నాయి. టెక్నాలజీ ఎప్పుడెలా మారుతుందో ఎవరూ ఊహించలేరు. ఇంటర్నెట్ ఆరంభమైన దశలో ఈ స్థాయికి చేరుతుందని ఎవరూ అంచనా వేయలేదు. ఇప్పుడైతే ఇంటర్నెట్ వినియోగదారుల చేతుల్లో నృత్యం చేస్తున్నది. కొన్నాళ్ల కిందటి వరకు డాట్‌ కామ్ బూమ్, ఇప్పుడు స్టార్టప్ బూమ్... డాట్‌ కామ్ బూమ్ సమయంలో అందరూ డాట్‌ కామ్‌ ల వెంబడి పడ్డారు. అయితే అది బుడగలా పేలిపోయింది. ఇప్పుడు స్టార్టప్ బూమ్ కూడా అలాంటిదేనా అని అనుమానం సహజం. కానీ అలా జరగదు అంటున్నారు సాఫ్ట్‌ వేర్ నిపుణులు. 2016లో టెక్నాలజీ ఎలా ఉండబోతున్నదో యువర్‌ స్టోరీ గెస్ట్ రచయిత, గుటెన్‌ బర్గ్ కమ్యునికేషన్‌ లో వర్క్ చేస్తున్న ఆదిత్య వెంకటేశన్ విశ్లేషణ...

బాలకృష్ణ నటించిన ఆదిత్య 369కి మూలమైన బ్యాక్ టు ఫ్యూచర్ మూవీని ఇష్టపడని వారుండరు. అలాంటి వారికి టెక్ ప్రెడిక్షన్లను కూడా బాగా నచ్చుతాయి. టెక్ ఇండస్ట్రీలో అనలిస్టుల నుంచి లీడర్స్ వరకు అందరూ భవిష్యత్‌లో టెక్నాలజీ ఏ స్థాయికి వెళుతుందో అంచనా వేస్తుంటారు. చాలా ఏళ్లుగా టెక్నాలజీ గురించి ఎంతో ఊహించాం. అనుకున్నవి కొన్ని తిరగబడ్డాయి కూడా. చాలినన్ని వీడియోలను ఎందుకు అప్ లోడ్ చేయడంలేదో యూ ట్యూబ్ ఫౌండర్ స్టీవెన్ చెన్ సింపుల్‌ గా చెప్పడంతోపాటు ప్రఖ్యాత కంప్యూటర్ సైంటిస్ట్, ఫ్యూచరిస్ట్ రే కుర్జివెల్లి చెప్పినట్టుగా డాటాపూల్‌ ను నేరుగా మెదళ్లలోకి ఎక్కించడం గురించి ఎన్నో చర్చోపచర్చలు. టెక్ రేంజ్ గురించి అంచనాలు వావ్ అనే స్థాయి నుంచి క్రేజీ వరకూ చేరుకున్నాయి.

image


1999లో ఓ రచయిత దర్జాగా అడిగిన కొన్ని ప్రశ్నలను గుర్తు చేసుకుందాం.. ‘‘సర్ఫింగ్, ఈమెయిల్ చాటింగ్‌ ల కోసం కంపెనీలు బిలియన్ డాలర్ల వృథా చేస్తున్నాయా? అంటూ ఓ కథనాన్ని వండి వార్చారు. ‘‘సైబర్‌లాకింగ్ ఎపిడెమిక్ (ఇంటర్నెట్ ఓ అంటువ్యాధి)’’ శీర్షికతో మార్క్ జైమైన్ ఓ కథనాన్ని రాశారు. ఆఫీసుల్లో ఇంటర్నెట్ వాడకం ఓ అంటువ్యాధిలా మారిపోయిందన్న అర్థంతో ఆయన స్టోరీ రాశారు. ఉద్యోగం వదిలి ఆఫీసుల్లో ఉద్యోగులు ఈమెయిల్ చాటింగ్‌ లు చేస్తున్నారని, వీటి కారణంగా కంపెనీలు ఏటా బిలియన్ డాలర్లు వృథా చేసుకుంటున్నాయని అభిప్రాయపడ్డారు.

ఇప్పుడు ఒక్కసారి ఇంటర్నెట్ వినియోగాన్ని పరిశీలిస్తే ఒక్క ఫేస్‌ బుక్ మార్కెట్ క్యాపే దాదాపు మూడొందల బిలియన్ల అమెరికన్ డాలర్లు.

1998లో అమెరికా ప్రముఖ ఆర్థికవేత్త పాల్ క్రుగ్‌ మెన్ కామెంట్స్‌ ను ఒక్కసారి గుర్తుచేసుకుందాం. ఇంటర్నెట్ అంతా చెత్తేనని, పరస్పరం మాట్లాడుకునేందుకు ఎవరికీ పెద్దగా విషయముండదని ఆయన తీసిపారేశారప్పుడు. టెక్నాలజీ మార్పు చాలా నెమ్మదిగా సాగుతోందని, ఇంటర్నెట్ కారణంగా వచ్చే ఉద్యోగాలు కూడా అంతంత మాత్రమేనని, ఐటీ స్పెషలిస్టులకు భవిష్యత్‌లో పెద్ద ఉద్యోగాలేమీ దొరకబోవని ఆయన అప్పట్లో తేల్చిపారేశారు. ఆయన అంచనాలు ఎంత తప్పో ఇప్పుడందరికీ తెలుసు. పాల్ చేసిన కామెంట్స్‌ స్క్రీన్‌ షాట్ ఇక్కడ చూడండి..

image


ప్రఖ్యాత మార్కెట్ రీసెర్చ్ కంపెనీ గార్టనర్ చేసిన ప్రిడిక్షన్ ఏంటంటే యాపిల్ కంపెనీ 2006లో హార్డ్‌వేర్ బిజినెస్ నుంచి తప్పుకుంటుందని, అలాగే న్యూయార్క్ టైమ్స్ కూడా యాపిల్ గురించి సరిగ్గానే అంచనా వేసింది. యాపిల్ కంపెనీ ఎప్పటికీ సెల్‌ఫోన్లను తయారు చేయబోదని పేర్కొంది.

కానీ టెక్నాలజీ గురించి అంచనావేయడం అంత ఈజీ కాదు. టెక్నాలజీ రూపాంతరం చెందినట్టుగా ఏ ఇండస్ట్రీ కూడా మారలేదు. టెక్నాలజీ గురించి అంచనా వేయడం చాలా కష్టంగా మారిపోయింది. అందుకు కారణం గత కొన్నేళ్లలో స్మార్ట్‌ ఫోన్లు ఏస్థాయిలో రూపాంతరం చెందాయో మనకందరికీ తెలిసిందే.

టెక్ బబుల్..

ఈ ఏడాది అక్టోబర్ వరకు టెక్ బబుల్స్ గురించి రెండువేలకు పైగా ఆర్టికల్స్ రాశారు. అంటే ప్రతిరోజు సగటున 5.4 ఆర్టికల్స్ రాశారన్నమాట. కానీ మనం అనుకున్నట్టుగా బబుల్‌ లా టెక్ పేలిపోలేదు. దాని బాబులా వెలిగిపోతూనే ఉంది. 2016లో కూడా పేలిపోయే అవకాశాలైతే కనిపించడం లేదు. మొబైల్ ఫోన్లు ఊహించని స్థాయిలో వృద్ధి గురించి ఎవరూ ముందుగా ఊహించలేదు. మొబైల్స్ జోరు ఇప్పుడెలా ఉందో అందరం చూస్తూనే ఉన్నాం. డాట్‌కామ్ బూమ్‌లా టెక్ బబుల్ లా పేలిపోయే అవకాశమేలేదు. ఇప్పుడున్న పరిస్థితిలో పేలిపోవడమనేది టెక్నాలజీ విషయంలో అతిశయోక్తి మాత్రమే.

డాట్‌కామ్ బూమ్‌ తో ప్రస్తుత పరిస్థితిని మూడు విధాలుగా పోల్చొచ్చు.

- అప్పట్లో ఐపీఓకు వచ్చిన ఓ కంపెనీ సాధారణ వయసు కేవలం నాలుగేళ్లు మాత్రమే. ఇప్పుడు 11 ఏళ్లు.

- అప్పట్లో మొబైల్స్ రెవల్యూషన్ లేదు. కానీ ఇప్పుడు మూడు కోట్ల మంది ప్రజలు మొబైల్స్ ద్వారా ఆన్‌లైన్‌ లో చక్కర్లు కొడుతున్నారు.

- అప్పట్లో 61 అమెరికా దిగ్గజ కంపెనీల మొత్తం విలువ, ఇప్పటి ఒక్క ఫేస్‌ బుక్ వాల్యూ కంటే తక్కువే.

ప్రస్తుతం అమెరికా స్కూల్స్‌ లో ఉపయోగిస్తున్న కంప్యూటర్లలో సగం క్రోమ్స్ బుక్సే. భారత్, మలేసియా వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలు సైతం టెక్నాలజీ ఎడ్యుకేషన్‌ కు పెద్ద పీట వేస్తున్నాయి. అలాగే ఆర్థిక వ్యవస్థలు సైతం అదే రేంజ్‌ లో వృద్ధి చెందుతున్నాయి.

ఎరిక్‌ సన్ విశ్లేషణ ప్రకారం స్మార్ట్‌ ఫోన్ ఉపయోగిస్తున్న నలుగురు జపనీయుల్లో ఒకరు సంప్రదాయ వాయిస్ కాల్‌ ను ఉపయోగించడం లేదు. చాటింగ్‌ ల ద్వారానే తమ సన్నిహితులతో టచ్‌ లో ఉంటున్నారు.

ఇండియాలో కూడా 20% మంది ఇంటర్నెట్‌ను ఉపయోగిస్తున్నారు. భారత్‌లో ప్రధాన ఆన్‌ లైన్ క్యాబ్ సర్వీస్‌ లను నిర్వహిస్తున్న ఓలా ప్రతి రోజు పది లక్షల రైడ్లను తన ఖాతాలో వేసుకుంటున్నది.

గూగుల్ వర్సెస్ ఫేస్‌ బుక్..

ఇప్పుడు ప్రతి ఒక్కరు డిజిటల్ సాయం కోసం ఎదురుచూస్తున్నారు. బలహీనమైన డాటా కారణంగా యాపిల్‌ కు చెందిన కంప్యూటర్ ప్రోగ్రామ్ సిరీ వినియోగదారుల నమ్మకాన్ని కోల్పోయింది. కోర్టానా యాప్ గురించి కూడా ఎవరూ పట్టించుకోవడం లేదు. దీంతో ఫేస్‌ బుక్ ఎం, గూగుల్ నౌ మధ్య ప్రధాన పోటీ. ఫేస్‌ బుక్ ఎం కూడా మొబైల్స్‌ లో ఇటీవల వచ్చినదే. దీంతో ఈ యాప్‌ లో కోరుకున్న అంశాలు లేవని కొందరు వినియోగదారులు అంటున్నారు. గూగుల్ నౌ మాత్రం అన్ని బాక్సెస్‌ ను చెక్ చేసుకునే అవకాశాలు కల్పిస్తుంది. జీమెయిల్ ప్రైమరీ ఇన్ బాక్స్ అకౌంట్ అయితే, షెడ్యూలర్ కోసం క్యాలెండర్, ఫొటోలను స్టోర్ చేసుకునేందుకు గూగుల్ ఫోటో ఇలా వినియోగదారులకు అవసరమైన అన్ని సదుపాయాలు గూగుల్ కల్పిస్తున్నది. ఇంటర్నెట్ యూజర్‌ ను గూగుల్ అర్థం చేసుకున్నట్టుగా మరే కంపెనీ అంచనా వేయలేదు. వినియోగదారుల డాటాను భద్రంగా దాచేందుకే గూగుల్ రూపొందిందా? అని అనిపిస్తుంది.

సైబర్ సెక్యూరిటీ-ఐడెంటిటీ థెఫ్ట్

ప్రస్తుతానికైతే టెక్నాలజీకి వచ్చిన ముప్పేమీ లేదు. 2016లో అందరూ ప్రధానంగా భయపడుతున్నది సైబర్ సెక్యూరిటీ గురించే. సైబర్ సెక్యూరిటీ గురించి చెప్పాలంటే ముందుగా గుర్తేచ్చేది ఓ తండ్రి కొడుకు రూపొందించిన టానియం స్టార్టప్ కంపెనీనే. వినియోగదారుల వైపు నుంచి ఆలోచిస్తే.. ఓ సాధారణ మొబైల్ యూజర్ సెల్ ఫోన్‌ లో 10-15 యాప్స్ వుంటాయి. ఇందుకోసం ఐదు నుంచి ఆరు వరకు వేర్వేరు పాస్‌ వర్డులుంటాయి. సాధారణంగా చాలామంది యూజర్లు ఫేస్‌ బుక్ నుంచే లాగిన్ అవుతుంటారు. ఈ సమయంలో ఒక్క పాస్‌ వర్డ్ హ్యాక్ అయితే, జరిగే నష్టం అపారం. ఈ నేపథ్యంలో ఐడెంటిటీ థెఫ్ట్‌ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి . దీంతో 2016లో సెక్యూరిటీకి ఎంతో ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది.

సెర్చ్ వర్సెస్ మొబైల్..

సోషల్ మీడియాలో తిరుగులేని రారాజు ఫేస్‌ బుక్ సెర్చ్ ఇంజిన్ కింగ్‌ గూగుల్‌కు టఫ్ ఫైట్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నది. ఇదే సమయంలో మొబైల్‌లో ఫేస్‌బుక్ ఆధిపత్యానికి గండికొట్టాలని గూగుల్ ప్రయత్నాలు జరపడం ఖాయంగా కనిపిస్తున్నది. మొబైల్ రంగంలో ఆండ్రాయిడ్ దూసుకెళుతుండటంతో గూగుల్ కాస్త వెనకబడిందనే చెప్పాలి. ఆండ్రాయిడ్ ఇక నుంచి ఓపెన్ సోర్స్‌ గా ఉండబోవడం లేదు. దీంతో ఆండ్రాయిడ్‌ తో కలిసి ఐఓఎస్‌ కోసం గూగుల్ రిలీజ్ చేసిన మార్ష్‌ ముల్లా స్మార్ట్‌ ఫోన్లలో హల్‌ చల్ చేయనుంది. వీడియోల కోసం యూట్యూబ్‌ లో, వైరల్ వీడియోల కోసం ఫేస్‌ బుక్‌ లో అంతా సెర్చింగ్ చేస్తున్నారు. ఈ రెండింటిని వినియోగిస్తూ ఆన్‌ లైన్ వినియోగదారులు పూర్తి సంతృప్తిగా ఉంటారనడంలో సందేహం అక్కర్లేదు.

ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటీ)..

ఇంటర్నెట్ యూజర్లలో చాలామందికి ఐఓటీ గురించి తెలుసు. అందరూ దీని గురించే మాట్లాడుకుంటున్నారు కూడా. వెచ్చని కంబళ్ల నుంచి చల్లబర్చే రిఫ్రిజిరేటర్లు, కాఫీ మెషీన్ల వరకు ఐఓటీకి ఎగ్జాంపుల్స్. ఇప్పటివరకైతే ఐఓటీ ఇండస్ట్రీ వేర్‌ హౌజ్. బీ2బీ మోడల్‌ లో పనిచేస్తున్నది.

వియరబుల్ టెక్..

వియరబుల్ టెక్నాలజీకి నేనంత పెద్ద ఫ్యాన్‌ నేమీ కాదు. అది మరింత పెద్ద స్థాయిలో పనిచేయాల్సిన అవసరమున్నది. అపాయింట్‌ మెంట్లను బుక్ చేయడం, మంచి వాయిస్ అసిస్టెంట్‌ గా ఉండటం, కాల్స్‌ ను యాక్సెప్ట్ చేసేందుకు ఓ మైక్‌ లా ఉండటం, అంతేకాదు ఓ డార్న్ బ్యాటరీ కనీసం వారంపాటు ఉండటం. వాటిపైన సెక్యూరిటీ లేయర్‌ ను యాడ్ చేయాల్సి ఉంటుంది. దాన్ని సెక్యూర్డ్‌ గా ఉంచాలంటే అదొక్కటే సరిపోదు.

విర్చువల్, అగ్మెంటెడ్ రియాలిటీ..

విర్చువల్ రియాలిటీ (వీఆర్) సత్తాపై ఇంకా సందేహాలు వీడనేలేదు. ప్రాజెక్ట్‌ లను రిమోట్‌ గా కొలాబరేట్ చేసేందుకు కొన్ని కార్యాలయాలు వీఆర్‌ ను ఉపయోగిస్తున్నాయి. కానీ గేమింగ్, మూవీస్ కోసం ఇది అద్భుతంగా పనిచేస్తుందన్నది నా అభిప్రాయం. ఆగ్మెంటెడ్ రియాలిటీ (ఏఆర్) ఈ అనుభవాలను మళ్లీ నిర్వచిస్తున్నది. అయితే ఇది మరింత అభివృద్ధి చెందేందుకు ఇంకా చాలా కాలం పట్టొచ్చు. ప్రస్తుతం గేమ్స్ ఇండస్ట్రీ రూపొందిస్తున్న గేమ్స్‌ మరింతగా యానిమేటెడ్‌ గా చేసేందుకు అవకాశం ఉంది. ఇంతకుముందు అనుభవంలోకి రాని పరిస్థితులను చవిచూసే ఆస్కారం ఉంది. వాస్తవంగా బాల్‌ ను కిక్ చేయకుండా రెండు వేల చదరపు అడుగుల రూమ్‌ లో ఫుట్‌ బాల్ ఆడే అనుభూతిని వీడియో గేమ్స్ కలిగిస్తాయా? అయితే ఇది 2017 కల్లా సాధ్యపడొచ్చు.

యాడ్ బ్లాకర్, ఆథర్స్: ఉచిత ఇంటర్నెట్ కోసం పోటీ

మీరు యాడ్ బ్లాకర్‌ ను కనుక సిస్టమ్‌లో ఇన్‌ స్టాల్ చేసుకుని ఉంటే.. మీ సిస్టమ్‌లో కొన్ని సైట్లు ఓపెన్ కావు. ప్రస్తుతానికి యాడ్ బ్లాకర్లు రైజ్‌ లో ఉన్నాయి. అలాగే యాడ్ టెక్ ఇండస్ట్రీ కొన్ని క్లిష్టపరిస్థితులు ఎదుర్కొంటున్నాయి. గతంలో అయితే వీలైనన్ని యాడ్లను ప్రదర్శించేందుకు వెబ్‌ సైట్లు ప్రయత్నించేవి. అప్పుడు పబ్లిషర్, బ్రాండ్లు రెండు సంతృప్తికరంగా ఉండేవారు. ఒక్క యూజర్‌ కు మాత్రమే కోపమొచ్చేది. కానీ బింగో, యాడ్ బ్లాకర్‌ లు ఇప్పుడొచ్చేశాయి. ఈ రెండు సంస్థలకు కొంత సొమ్ము చెల్లిస్తే యాడ్లను బ్లాక్ చేయకుండా సైట్లలో ప్రదర్శించేందుకు అనుమతి ఇచ్చేవి. ఇప్పుడు ఓ సంఘాన్ని ఏర్పాటు చేశారు. దీంతో రచయితలకు గడ్డు పరిస్థితి నెలకొంది. 2016లో ఇండస్ట్రీని క్రమబద్ధీకరించుందుకు స్వతంత్ర బాధ్యతలు కలిగిన బాడీ ఏర్పడుతుందా?

3-డీ ప్రింటింగ్...

అలంకరణ కోసం చాలామంది ఇప్పుడు 3-డీ ప్రింటింగ్‌ ను వినియోగిస్తున్నారు. అయితే 3-డీ ప్రింటింగ్ వినియోగిస్తున్నది పెద్ద పెద్ద సంస్థలే. అందునా హెల్త్‌ కేర్ రంగంలోనే ఎక్కువగా అవసరం ఉంటుంది. ఆ రంగంలోనూ ఈ టెక్నాలజీని అంతగా ఉపయోగించుకోవడం లేదు. 2017లో 3-డీ ప్రింటింగ్ వినియోగం ఎక్కువగా ఉంటుందేమో.. ఈ ఏడాది 3-డీ ప్రింటింగ్‌కు ఇంటెస్ట్రింగ్ ఇయర్. ఎందుకంటే స్ట్రాట్‌ సిస్, మార్కెట్ బాట్ వంటి కంపెనీలు 3-డీ ప్రింటర్ల అమ్మకాల్లో వినియోగదారులను ఎలా ఆకర్షిస్తాయో వేచి చూడాలి. 3-డీ ప్రింటర్లను మార్కెట్‌ లోకి తీసుకెళ్లేందుకు ముందుగా మంచి పీఆర్ ఏజెన్సీని చూసుకోవాలేమో..

డిజిటల్ వ్యాలెట్స్..

ఐసీఐసీఐ, యాక్సిక్ వంటి కంపెనీలు తమ పురాతనమైన పద్ధతులను కొత్త పుంతలు తొక్కించాలనుకుంటున్నాయి. మార్కెట్‌ ప్లేస్ మోడలే అన్నిటి కంటే ఆకర్షణీయంగా కనిపిస్తున్నది. ఈ రంగంలోకి స్నాప్‌ డీల్ ఆలస్యంగా ప్రవేశించినప్పటికీ, మొదట్లో వ్యతిరేకించినా మార్కెట్‌ ప్లేస్ మోడలే బెస్ట్ అన్న భావనకు వచ్చి ప్రత్యర్థి ఫ్లిప్‌ కార్ట్‌ ను అనుసరించక తప్పడంలేదు. అయితే ఈ రంగంలో పేటీఎంకు ఎంతో భవిష్యత్ ఉందన్నది నా భావన. డిజిటల్ పేమెంట్ల విషయంలోనే కాదు.. మొత్తంగా ఈ-కామర్స్ రంగంలోనే పేటీఎందే భవిష్యత్. అన్ని సంస్థలు ప్రత్యేక డిస్కౌంట్లు ప్రకటిస్తున్నప్పటికీ, క్యాష్‌ బ్యాక్‌ ఆఫర్లు కూడా ప్రత్యర్థుల కంటే పేటీఎం ఎంతో మానసికంగా ముందుండడానికి కారణమవుతున్నది. ఈ రంగంలో రెండు సమస్యలు అలాగే ఉన్నాయి. చివరి నిమిషంలో డెలివరీ, కస్టమర్లకు సేవలు అందించడంలో విఫలమవడం.. ఈ రెండింటిని కంపెనీలు పరిష్కరించుకోవాల్సి ఉంది. ఈ సేవల విషయంలో నా ఓటు మాత్రం స్నాప్‌ డీల్‌ కే. అయితే ఇటీవల అమీర్‌ ఖాన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు స్నాప్‌ డీల్‌ పై ఏ స్థాయిలో ప్రభావం చూపాయో ఇంకా అనిశ్చితిగానే ఉంది. ఫుడ్ యాప్ విషయంలో జమాటోతో పోలిస్తే స్విగ్గీ వైపే మొగ్గుచూపుతాను. ఇంకా కొన్ని విషయాలను నేను మిస్సయి ఉండొచ్చు. చూద్దాం 2016లో ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకుంటాయో..

(గమనిక:ఈ ఆర్టికల్‌లో వ్యక్తం చేసిన అభిప్రాయాలు కేవలం రచయితవి మాత్రమే. వాటితో యువర్‌ స్టోరీకి ఎలాంటి సంబంధంలేదు. యువర్‌ స్టోరీ ఏ విధంగానూ బాధ్యత వహించదు.)