ఆర్ట్, డిజైన్ రంగాలకు సేవ చేయడమే 'ద ఫ్లాక్' లక్ష్యం

వినూత్న డిజైన్లు, ప్రపంచస్థాయి డిజైనర్లుడిజైనర్లను ప్రోత్సాహిస్తున్న 'ద ఫ్లాక్'ఈ వెబ్‌సైట్ స్టోర్ మాత్రమే కాదు జర్నల్ కూడాడిజైనర్ల ప్రతిభతో రూపొందించిన ఒరిజినల్ వస్తువులనే విక్రయించే 'ద ఫ్లాక్'

ఆర్ట్, డిజైన్ రంగాలకు సేవ చేయడమే 'ద ఫ్లాక్' లక్ష్యం

Thursday June 04, 2015,

3 min Read

ఈ-కామర్స్‌లో మలుపులు చాలానే ఉన్నా... ఫాలోయింగ్ మాత్రం పెరుగుతూనే ఉంది. 2011లో ఒక్కసారిగా స్లంప్‌లో కూరుకున్న ఈకామర్స్... తర్వాత మాత్రం స్థిరమైన అభివృద్ధి ప్రదర్శిస్తోంది. మన దేశంలో వేల కొద్దీ ఈ కామర్స్ స్టోర్స్ ఉన్నాయి. ప్రతీ కంపెనీకి వాళ్లు నమ్మిన ఓ సిద్ధాంతం కూడా ఉంటుంది. అయితే దిపాంకర్ ముఖర్జీ, నితిన్ గుప్తాలు... అంతకుమించి ఇంకేదైనా చేయాలని అనుకున్నారు. అందుబాటు ధర, నాణ్యత, ఒరిజినల్ డిజైన్‌లతో ఉత్పత్తులు అందించేలా ఈకామర్స్ స్టోర్ + జర్నల్‌కు బీజం వేశారు. అదే 'ద ఫ్లాక్'.

దిపాంకర్ ముఖర్జీ, నిత్యాగుప్తా, నితిన్ గుప్తా

దిపాంకర్ ముఖర్జీ, నిత్యాగుప్తా, నితిన్ గుప్తా


ఏళ్లపాటు సుదీర్ఘంగా ఆలోచించాక నిత్యాగుప్తాతో కలిసి దఫ్లాక్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు ముఖర్జీ, గుప్తాలు. ఇది ప్రత్యేకమైన డిజైన్స్ ఉండే ప్రపంచస్థాయి ప్రోడక్టులను అందుబాటు ధరల్లో అందించే ఈ-రీటైలర్‌ షాప్ 'ద ఫ్లాక్'. నాలుగేళ్లపాటు ఆలోచనలు బాగా నలిగాక... తమ ప్రణాళికలను ఓ రూపానికి తెచ్చారు ఈ పారిశ్రామికవేత్తలు.

“ ప్రతీవారికీ తమకోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన, రూపొందించిన వస్తువులపై చాలా మోజుంటుంది. అత్యుత్తమ నాణ్యత గల ప్రోడక్టులు భారీగా చెల్లించకుండా లభిస్తే... వాటిని సొంతం చేసుకుందామనే అనుకుంటారు. మేం ఆ తరహా ప్లాట్‌ఫాంను రూపొందించాం. ప్రపంచస్థాయి డిజైనర్లు... తమ ప్రతిభను ఉపయోగించి తయారు చేసే వినూత్నమైన డిజైన్లను విక్రయించే వేదికను ఏర్పాటు చేశామ”ని వివరించారు దిపాంకర్. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న డిజైనర్లు.. తాము వేటిని, ఏ స్థాయిలో తయారు చేయాలో నిర్ణయించుకునే స్వేచ్ఛ ఇక్కడ లభిస్తుంది. అలాగే వీలైనంత త్వరగా మార్కెట్లోకి ఎలా వెళ్లాలో, సరైన సమయంలో ఎంట్రీ ఎప్పుడు ఇవ్వాలో కూడా డిజైనర్లకు మార్గదర్శకం చేస్తుంది 'ద ఫ్లాక్'.

“ప్రస్తుతం ఈ-కామర్స్ రంగంలో వ్యవహారమంతా ఫాస్ట్‌ఫుడ్ కల్చర్ మాదిరిగా ఉంది. ఆ తరహా ప్రైస్ వార్‌లోకి చొరబడాలని మేం అనుకోవడం లేదు. మా వెంచర్‌కు మూడు అంశాలు చాలా కీలకం” అంటున్నారు దిపన్‌కర్ ముఖర్జీ.

  • 1. వినూత్నమైన కళా ఉత్పత్తులు, డిజైన్ల లోకంలోకి కొనుగోలుదారులను తీసుకెళ్లాలి
  • 2. daFlokk.com అనే పోర్టల్ ఒక స్టోర్, అదే సమయంలో జర్నల్ కూడా. షాపర్లను ఆయా డిజైనర్లు తయారు చేసిన ఉత్పత్తులకు సంబంధించిన చరిత్ర, వాటి తయారీ విధానం, తయారీలో ఉపయోగించిన వస్తువులు, ఫోటో ఎస్సేలు, ఇంటర్వ్యూలు, వీడియోలతో అలరిస్తుంది ఈ పోర్టల్. లేటెస్ట్ ప్రోడక్టులపై డీటైల్స్‌తోపాటే గ్లోబల్ ఆర్ట్, డిజైన్లపై అవగాహన కూడా కల్పిస్తుంది.
  • 3. కేవలం సొంత ప్రతిభతో డిజైనర్లు రూపొందించిన వస్తువులే 'ద ఫ్లాక్'‌లో కనిపిస్తాయి.

గోవా, ఢిల్లీల్లో కార్యాలయాలు నిర్వహిస్తున్న దఫ్లాక్ దగ్గర, 40 మంది డిజైనర్లు, ఆర్టిస్టులు ఉన్నారు. “గోవాలో కార్యకలాపాలు నిర్వహించడం ద్వారా... దేశంలోని నాలుగు డిజైనింగ్ హబ్‌లు అహ్మదాబాద్, ముంబై, పూనే, బెంగళూర్‌లకు దగ్గరగా ఉన్నాం. అలాగే అంతర్జాతీయ స్థాయి డిజైనర్లకు గోవా డెస్టినేషన్ కూడా” అంటున్నారు దిపన్‌కర్. ఒక్కో లావాదేవీపై లభించే కమీషన్ మోడల్‌పై దఫ్లాక్ పనిచేస్తుంది. పోర్ట్‌ఫోలియో ప్రదర్శనలు, బ్యాగ్ డిజైన్ ప్రాజెక్ట్స్, బల్క్ ఆర్డర్స్, వెబ్‌సైట్లో ప్రదర్శించినందుకు ప్రైవేట్ కమీషన్స్... ఇతర ఆదాయ మార్గాలు.

లగ్జరీ హోటల్స్‌లో దిగేవారు, ప్రీమియం రియల్ ఎస్టేట్ డెవలపర్స్, సేకరణదారులు, హై నెట్వర్త్ ఇండివిడ్యువల్స్... ఇలా పలు కాస్ట్లీ విభాగాలకు... అందుబాటులో ఉండే బ్రాండ్‌గా ఎదగాలన్నది 'ద ఫ్లాక్' ఆలోచన. ప్రపంచ స్థాయి డిజైన్లు, టాలెంట్‌కు కేరాఫ్ అడ్రస్‌గా తమ బ్రాండ్ డెవలప్ చేయాలని భావిస్తున్నారు. ప్రస్తుతం నిర్వహిస్తున్న వాటితోపాటు సబ్‌స్క్రిప్షన్ ఆధారిత సర్వీసును కూడా త్వరలో ప్రారంభించే యోచన ఉంది ఈ కంపెనీకి. మెంబర్లకు 'ద ఫ్లాక్' నిర్వహించే ప్రైవేట్ డిజైన్ ఈవెంట్లు, ఆక్షన్లలో పాల్గొనేందుకు ఈ సబ్‌స్క్రిప్షన్ సర్వీస్ ఉపయోగపడుతుంది. అలాగే తమ కొనుగోళ్లను పర్సనలైజ్ చేయడానికి, న్యూ కలెక్షన్‌పై ముందుగా వివరాలు తెలుసుకోవడంతో పాటే మరిన్ని ఆకర్షణీయమైన సేవలు.. కొత్త సర్వీస్‌తో అందుతాయని చెబ్తోంది 'ద ఫ్లాక్'.

'ద ఫ్లాక్' వ్యవస్థాపక త్రయం గిల్ట్‌స్ట్రీట్, క్రెవో వంటి స్టార్టప్‌లను సందర్శించి, అప్‌కమింగ్ డిజైనర్లకు ప్లాట్‌ఫాం అందించారు. “మా ముగ్గురికీ అద్భుతమైన మార్గదర్శకులున్నారు. మేం కావాలని అడిగితే ఏ సహాయమైనా చేసేందుకు సిద్ధంగా ఉంటారు. కళా ప్రపంచంనుంచి మనకు సమృద్ధిగా అనేక అంశాలు లభించాయి. ఆ ఆర్ట్ & డిజైన్ రంగానికి 'ద ఫ్లాక్' రూపంలో మేం అంతో ఇంతో తిరిగిస్తున్నాం” అంటున్నారు దిపాంకర్. ఎక్కువ మందికి కళా నైపుణ్యాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు 'ద ఫ్లాక్' ప్రయత్నిస్తోందని చెబ్తున్నారు 'ద ఫ్లాక్' ఫౌండర్లు. డిజైనర్లకు అతి సమీపంలో కార్యకలాపాలు నిర్వహించడమే కాకుండా... టాలెంట్ ఉన్నవారిని ప్రోత్సహించడం కూడా తమ బాధ్యత అంటోంది 'ద ఫ్లాక్'.

వెబ్ సైట్: www.daflokk.com