మీ పాతబూట్లే వాళ్ల పాదాలకు రక్ష

పాడైన స్పోర్ట్ షూస్‌తో చెప్పుల తయారీచెప్పులు ధరించే స్థోమతలేని వాళ్లకు సాయంతక్కువ డబ్బుకే నాణ్యమైన జోళ్లుశ్రీయాన్,రమేష్‌ల ‘గ్రీన్ సోల్’ కథ ఇది

మీ పాతబూట్లే వాళ్ల పాదాలకు రక్ష

Tuesday April 14, 2015,

3 min Read

ఓ వైపు విపరీతంగా మండిపోయే ఎండ.. అడుగుతీసి అడుగేయాలంటే కాళ్లు మంటలెక్కిపోతాయి. ఇంకో సారి జోరున వర్షం.. బురదలో కాలేయాలంటే.. ఎక్కడ ఏం గుచ్చుకుంటుందో తెలియని పరిస్థితి. ఇలా కాలమేదైనా... చెప్పులు లేకుండా మన జీవితాన్ని ఊహించుకోవడం కష్టం. ఏ గుడికో, గోపురానికో వెళ్లినప్పుడు మినహా.. చెప్పులో, బూట్లో మన కాళ్లకు వేలాడకుండా మాత్రం ఉండవు. కానీ తిండి తినడానికి కష్టంగా ఉన్న వాళ్ల సంగతేంటి ? వాళ్లు బాధలు పడాల్సిందేనా ? మనం వాడేసిన వాటితోనైనా వాళ్లకు ఏమీ చేయలేమా అనే ఆలోచన ఇద్దరు కుర్రాళ్లను సోషల్ ఎంటర్‌ప్రెన్యూర్లకు మార్చింది. వ్యాపారం సంగతి పక్కకుబెడితే స్థోమత లేని వాళ్ల కాళ్లకు హాయినిస్తూ ఓ అద్భుతమైన సామాజిక సేవకు ప్రాణం పోస్తోంది గ్రీన్ సోల్.

గ్రీన్ సోల్ ఉత్పత్తి ఇదే. పాత స్పోర్ట్స్‌కు కొత్త రూపు

గ్రీన్ సోల్ ఉత్పత్తి ఇదే. పాత స్పోర్ట్స్‌కు కొత్త రూపు


''నాపేరు శ్రీయాన్ బంఢారి.ముంబైలోని జైహింద్ కాలేజీలో మేనేజ్మెంట్ స్టడీస్ మూడో ఏడాది చదువుతున్నా. మా స్నేహితుడు రమేష్ ధామి, జాతీయ స్థాయి అథ్లెట్. ఉత్తరాఖండ్ నుంచి వచ్చిన తాము ఎలాంటి అత్యున్నత విద్యను అభ్యసించలేదు. మేం ప్రారంభించిన కంపెనీ పేరే గ్రీన్ సోల్. పాత పాదరక్షకులను రీసైకిల్ చేయడమేకాదు..వాటిని కోట్లమందికి చేరవేయడమే గ్రీన్ సోల్ లక్ష్యం. షూస్ ని చెప్పులుగా మార్చడం మా పని. ఏడాదికి 35కోట్ల స్పోర్ట్ షూస్ జతలు వాడేసి పడేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 120 కోట్ల మంది ఉట్టికాళ్లతో నిద్రలేస్తారంటే మనం నమ్మితీరాల్సిందే ! ఇది మన దేశ జనాభాకు ఇంచుమించు సమానం. వారి కాళ్లకు చెప్పులను చేరవేయడమే తమ అంతిమ లక్ష్యం" అంటూ గ్రీన్ సోల్ గురించి చెప్పుకొచ్చారు శ్రీయాన్.
గ్రీన్ సోల్ వ్యవస్థాపకుడు శ్రీయాన్ భండారి

గ్రీన్ సోల్ వ్యవస్థాపకుడు శ్రీయాన్ భండారి


ఆలోచన ఎలా మొదలైంది?

నేను,రమేష్ అథ్లెట్స్ కావడం వల్ల ఏడాదికి మూడు నుంచి నాలుగు జతల షూస్‌ను ఉపయోగిస్తుంటాం. అలాంటప్పుడే వాడేసిన షూలను చెప్పులుగా మార్చుకొని ఉపయోగించుకోవాలని అనుకున్నాం. ఇదే క్రమంలో ఇలాంటి అద్భుతమైన వెంచర్ కోట్లమందికి ఉపయోగపడుతుందని మేం గ్రహించాం. గ్రీన్ సోల్ కథ ప్రారంభానికి నాందీ ప్రస్తావన ఇదే. మా ఈ సామాజిక కోణానికి మంచి స్పందన వచ్చింది. మా మొదటి ప్రయత్నంలోనే ముంబైలో మేం జనానికి 50 జతలను అమ్మడమే కాదు , చెప్పులు లేని పేదలకు 100జ జతలను డొనేట్ చేయగలిగాం. మాకు రెండు రకాల ఇండస్ట్రియల్ డిజైన్ పేటెంట్లు(D262161 & D262162) ఉన్నాయి. మేం చేసే ప్రాడక్ట్ లను ఇవి ప్రతిబింబిస్తాయి.

మా చిరు ప్రయాణంలో కొంతమంది మార్గదర్శకులను కలుసుకోగలిగాం. ఇందులో ఉదయ్ వంకవాలా(నెన్ కన్సల్టెంట్, ముంబై), యదువేంద్ర మధుర్ (ఎగ్జిమ్ బ్యాంక్ చైర్మన్) అషద్ ఆర్ రహమని (బిఎన్హెఎస్ లో డైరెక్టర్) కె వి ఎస్ లాలోత్ర( అజ్మీర్ మాయో కళాశాల మాజీ ప్రిన్సిపాల్) ఉన్నారు. ఈ ప్రయాణం మాకో గుర్తింపునిచ్చింది. కొన్ని రోజుల క్రితం జరిగిన ఆర్-ఐడియా నేషనల్ బిప్లాన్ కాంపిటీషన్( Ridea National B-plan competition) లో మమ్మల్ని సెకెండ్ ప్లేస్ లోనిల్చోబెట్టింది. ఐఐటి బాంబే లో టెక్నాలజీ,సస్టైనబులిటీ అవార్డును తెచ్చిపెట్టింది. టాటా ఫస్ట్ డాట్‌లో టాప్ 25 స్టార్టప్ కంపెనీల్లో నిలిచాం. అహ్మదాబాద్‌కు చెందిన ఈడిఐఐ(EDII) మమ్మల్ని టాప్ 30 ఇన్నోవేటర్స్‌గా గుర్తించింది. జైహింద్ కాలేజి అండ్ నెన్ నిర్వహించిన బీప్లాన్ కాంపిటీషన్ ను గెలుపొందాం. జీవితం అనుకున్నంత సులువైనదైతే కాదు. ఎన్నో అడ్డంకులను దాటుకొని ఇక్కడి దాకా వచ్చాం. కుటుంబ సభ్యులు, స్నేహితులు, కాలేజి అధికారులు, మా మద్దతుదారులు ఇలా ప్రతి ఒక్కరి చేతా దీనిపై ఆమోద ముద్ర వేయించగలిగాం.


శ్రీయాన్, రమేష్

శ్రీయాన్, రమేష్


మా తర్వాతి ప్రణాళిక - మేం చేసే పనిని చాలమంది ఇష్టపడటం చూస్తుంటే మాకెంతో స్పూర్తినిస్తోంది. దీన్నే మా జీవిత మిషన్‌గా మార్చాలనుకుంటున్నాం. మేం చేపట్టిన ఈ పని ఎంతమందికి ఉపయోగపడగలదో అనే ఊహే మాకు మరింత స్పూర్తిని అందించింది. మేం అనుకున్న లక్ష్యంతో పనిచేసి.. పేదలకు పాదరక్షకులు ఇవ్వడమనే కాకుండా కచ్చితంగా దీర్ఘకాలం పాటు నిలదక్కుగోలమనే నమ్మకముంది.

మార్కెట్ ప్రకారం చూస్తే.. ప్రస్తుతానికి ఇండియాలో అన్నిచోట్లా మేం అనుకున్నట్లు పాత స్పోర్ట్స్ షూస్‌ని చెప్పులుగా మార్చేయాలి. తర్వాత ప్రపంచ వ్యాప్తంగా మా వ్యాపారాన్ని వ్యాపింపజేయాలి. ప్రపంచ జనాభాలో సగాని పైగా రోజుకి నూటయాభైరూపాయిల కంటే తక్కువ ఆదాయం ఉన్నవాళ్లే ఉన్నారు. వినడానికి కష్టంగా ఉన్నా ఇది నిజం. వీళ్లలో చాలామంది చెప్పులు వాడటం లేదు. కొనుక్కొనే స్థోమత లేదు. దీంతో కోట్లమంది వ్యాధుల బారిన పడి చనిపోతున్నారు. ఇలా జరక్కుండా చేయాలనే పెద్ద సంకల్పానికి.. ఇండియాలో చిన్న ప్రయత్నం మొదలు పెట్టాం.

ప్రస్తుతం మేం క్రౌడ్ ఫండింగ్ క్యాంపైన్ ప్రారంభించాం. మాకు మద్దతిచ్చే కమ్యూనిటీల ద్వారా ఈ ప్రకియను ముందుకు తీసుకెళ్తున్నాం. షూస్‌ కొనలేని వారికి వాటిని అందించడంతోపాటు నాణ్యమైన పాదరక్షకులు ఇచ్చే కంపెనీగా కమ్యూనిటీల మద్దతుతో మార్కెట్ లోకి వెళ్తున్నాం. చెప్పుల తయారీకి కార్బన్ ఫుట్ ప్రింట్‌ను తీసుకుంటున్నాం. కంట్రిబ్యూషన్‌ని ప్రోత్సహించే క్రమంలో మంచి బహుమతులను ఇస్తున్నాం. గ్రీన్ సోల్ జతల తోపాటు నేను రాసిన ‘బర్డ్స్ ఆఫ్ అరవెల్లిస్’ కాపీని ఇస్తున్నాం. భారత్ లో గ్రామాలను దత్తత తీసుకొన్న వారికి 40జతల గ్రీన్ సోల్ లను అందిస్తున్నాం.

ఇది మన మనసుకు దగ్గరగా అనిపించే అంశంగా భావిస్తున్నాం. మీరు కూడా మద్దతిస్తే.. మనం కలసికట్టుగా సమాజానికి మంచి చేయొచ్చు. మా ఈ కథ చదివిన తర్వాత. కమ్యూనిటీ సాయంతో సవాళ్లను పరిష్కరించుకోగలమనే స్పూర్తిని నింపిదనే అనుకుంటున్నా. మనమంతా ఒకే ప్రపంచంలో ఉన్నామనే విషయాన్ని మరోసారి గుర్తుచేస్తూ.. మా ఈ కథను ముగిస్తున్నా అన్నారు శ్రీయాన్.