హైదరాబాదీలచేత హమ్ చేయిస్తానంటున్న ‘హమ్’

హైదరాబాదీలచేత హమ్ చేయిస్తానంటున్న ‘హమ్’

Tuesday May 10, 2016,

2 min Read

హైదరాబాదీలు చాలా ఎఫక్టనేటీవ్. అందరికీ కలుపుకుపోయే తత్వం ఇక్కడి వారిది. వందల ఏళ్లుగా కులాలు, మతాలు, ప్రాంతాలకతీతంగా సహజీవనం చేస్తున్నారు భాగ్యనగర వాసులు. నగరానికి ఎవరైనా కొత్తగా వచ్చారంటే వారికి ఏమాత్రం కొత్త ప్రాంతానికి వచ్చామనే ఫీలింగ్ ఉండదు. ఇక్కడి వాతావరణం అలాంటిది. సిటీ ఆఫ్ నవాబ్స్ అని పేరున్నా ఇక్కడంతా సాధాసీదాగానే ఉంటారు. ఇటీవల గజిబిజిగా మారిన నగర వాసుల జీవన విధానంలోకి చాలా ఈవెంట్లు మళ్లీ కలుపుగోలు తనాన్ని తీసుకొస్తున్నాయి. అలాంటిదే ఈ ‘హైదరాబాద్ అర్బన్ మేకోవర్’ కూడా. జూన్ 4, 5 తారీఖుల్లో ఈ హమ్ ఎగ్జిబిషన్ జరగనుంది

హమ్(HUM)

హైదరాబాద్ అర్బన్ మేకోవర్ కు షార్ట్ ఫాం ఈ హమ్. హిందీలో హమ్ అంటే మనం. అంతా కలసి ఉండటం అనే అర్ధం కూడా ఉండటం ఈ పేరును పెట్టారు.

“సోషల్ కమ్యూనిటీలను ఒక చోటికి చేర్చడం మా హమ్ ముఖ్య ఉద్దేశం,” విశాల

విశాల హమ్ ఫౌండర్. అందరినీ ఒక చోటికి చేర్చి, పరస్పరం సహకరించుకునే చర్చా వేదికను ఏర్పాటు చేయడమే హమ్ అని అన్నారామె.

ఇది మొదలు

4ఏళ్లుగా విశాల చాలా సోషల్ యాక్టివిటీస్ లో తన దైనయాక్టివ్ రోల్ ని పోషిస్తున్నారు. 2012 లో ప్రారంభించిన రాహగిరి సూపర్ సక్సెస్ అయింది. అంతా ఒక చోటికి రావడం వల్ల ఇది సాధ్యపడిందని అంటారామె. రాహగిరి ప్రారంభించిన దక్షిణాది నగరంగా హైదరాబాద్ గుర్తించబడింది. ఆ తర్వాత కార్ ఫ్రీ థర్స్ డే. అవార్డ్ విన్నింగ్ ఇనిషియేషన్ ఇది. ఇలా అందరూ కలసి పనిచేయడం అనేది, కమ్యూనిటీలు గా ఏర్పడటం లాంటివాటి వల్ల ఈ రకమైన ఈవెంట్లు సక్సెస్ అయ్యాయి. దీనిలో టిఎస్ఐఐసి, తెలంగాణ ఐటి, ట్రాన్స్ పోర్ట్, సైబరాబాద్ పోలీస్, హైసియా, ఎస్సీఎస్సీ, లాంటి ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు కలసి కట్టుగా సాధించిన విజయం ఇది.

“ఇదే స్పూర్తితో మరిన్ని సంస్థలను దగ్గరకు చేర్చి మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని అనుకుంటున్నాం,” విశాల

దీనికోసం హమ్ అనే సంస్థను ఏర్పాటు చేసినట్లు ఆమె చెప్పారు.

మొదటి విడత కార్యక్రమాలివే

హమ్ పేరుతో జూన్4,5 తారీఖుల్లో హైదరాబాద్ హైటెక్స్ లో ఓ భారీ ఎగ్జిబిషన్ ని ఏర్పాటు చేస్తున్నారు. దీనిలో పబ్లిక్ ప్రైవేట్ పాట్నర్షిప్ లో ప్రధానంగా 6 ఏరియాలపై ఫోకస్ చేయనున్నారు.

image


1. నీటి పరిరక్షణ(Water Conservation). నీటి సమస్య ఏస్థాయిలో ఉందో ఇటీవల నగర వాసులకు తెలిసొచ్చింది. నీటి వనరులను పరిరక్షించాల్సిన పద్దతులను మొదటి అజెండాగా పెట్టుకున్నారు.

2. ఎనర్జీ మేనేజ్మెంట్ (Energy Management). అన్ని విషయాల్లో ఎనర్జీ మేనేజ్మెంట్ పై అవలంభించాల్సిన పద్దతులపై ఒక క్లారిటీ తీసుకురావడం.

3. గ్రీన్ కవర్(Green Cover). చెట్ట పరిరక్షణ. కొత్తగా మొక్కలను నాటడం లాంటివాటిపై ఓ ప్రణాళికను తీసుకొచ్చేలా చర్చించనున్నారు.

4. స్వచ్ఛ హైదరాబాద్. స్వచ్ఛ భారత్ అజెండాతో స్వచ్ఛ హైదరాబాద్ ను తీర్చి దిద్దేందుకు సైతం ప్రణాళిక చేయనున్నారు.

5. సస్టేనబుల్ ట్రాన్స్ పోర్టేషన్. పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ ను ప్రొత్సహించేలా, పొల్యూషన్ లేని నగరంగా మార్చే దానికి కూడా చర్చించనున్నారు.

6. పీపుల్ ఇన్ క్లూసన్ అండ్ పబ్లిక్ ప్లేస్. ఈ కేటగిరీలో పబ్లిక్ గేదరింగ్ కోసం ప్రత్యేక ప్రాంతాలను ఏర్పాటు చేయడం , ఉన్నవాటిని వినియోగించుకునేలా, వాటిని పరిరక్షించడానికి ప్రత్యేక సంస్థలను ఏర్పాటు చేయనున్నారు.

ప్రధానంగా ఈ అంశాలపైనే మొదటి విడతో హమ్ పనిచేయనుంది. దీనిపై ఆసక్తి ఉన్న వారు తమతో కలసి రావాలని ఆహ్వానం పలుకుతోంది. ఎగ్జిబిషన్ లో పాల్గొని దానికి తగిన ప్రజెంటేషన్ తీసుకుని రావాలని కోరుతోంది.

భవిష్యత్ తరాలు జీవించడానికి హైదరాబాద్ సరైనదిగా మార్చడానికి అంతా కలసి రావాలని విశాల ముగించారు.