హస్తకళల్ని ప్రపంచానికి పరిచయం చేస్తున్న 'టిజోరి’

భారతీయ హస్తకళల్ని విదేశాలకు పరిచయం చేస్తున్న మాన్సీనార్త్ అమెరికాతో ప్రారంభించి ఇండియాలో కూడా విస్తరిస్తున్న -టిజోరిసాంప్రదాయ మార్కెట్‌తో పోటీ పడుతూనే విదేశాల్లోనూ వ్యాపారం

హస్తకళల్ని ప్రపంచానికి పరిచయం చేస్తున్న 'టిజోరి’

Saturday April 18, 2015,

2 min Read

సమాజంతో పాటు పరిస్ధితులను కూడా ఎదురుకునే సామర్ధ్యం ఉన్న మాన్సీ గుప్తా, ‘టిజోరి’ (Tjori) ఆన్‌లైన్ మార్కెట్ సృష్టికర్త. 2013లో ప్రారంభమైన ‘టిజోరి’ భారతీయ హస్తకళలను నార్త్ అమెరికాలో విక్రయించే ఉద్దేశంతో మొదలైంది. మహిళా వ్యాపారవేత్తగా ఎన్నో సమస్యలను సమర్ధవంతంగా ఎదురుకున్న మాన్సీ, నిబద్ధత ఉంటే ఏదైనా సాధ్యమేనంటున్నారు.

మాన్సీ గుప్తా

మాన్సీ గుప్తా


జమ్ములో పుట్టి పెరిగిన మాన్సీకి చిన్నప్పటి నుండే ప్రయాణించడం అంటే ఇష్టం. అంతే కాకుండా మాన్సీ కుటుంబానికి కూడా అలాంటి అలవాట్లే ఉన్నాయి. వారంతా ఎక్కడికి వెళ్లినా అక్కడ ప్రత్యేకంగా దొరికే వస్తువులను కొనడం వారి హాబీ, అలా సాంప్రదాయంగా వస్తున్న అలవాటు మాన్సీ ని హస్తకళలవైపు ఆకర్శించింది.

ఎం.హెచ్.ఏ.సీ స్కూల్, నగ్‌బానీ మహారాజా హరిసింగ్ కాలేజిలో చదువుకున్న మాన్సీ, తన గ్రాడ్యుయేషన్ కోసం పుణే వెళ్లారు. అక్కడ బీసీఏ చేసి, యూకేలో తన పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసారు. ఇండియాకి తిరిగి వచ్చిన మాన్సీ ఐబీఎంలో కార్పొరేట్ సేల్స్‌లో అద్భుతంగా రానిచ్చారు.

అనంతరం వార్టన్‌లో చేరి వర్కింగ్ ప్రొఫెషనల్స్‌ ప్రోగ్రామ్ చేస్తున్న మాన్నీకి ‘టిజోరి’ ఐడియా వెలిగింది. వార్టన్ మొరొక్కొ పర్యటనలో ఎన్నో హస్తకళలను కొన్న తను లగేజ్ సమస్యల వల్ల మరిన్ని కొనలేకపోయారట.

వ్యాపారవేత్తగా ముందడుగు

భారతీయ హస్తకళలల మార్కెట్ 32 బిలియన్ డాలర్లు (రూ.2 లక్షల కోట్లపైనే) ఉందని తెలుసుకున్న మాన్సీ, వాటికి వార్టన్‌లో భారీ డిమాండ్‌తో పాటు రెడీ మార్కెట్ కూడా ఉందని గుర్తించారు. అయితే సంప్రదాయ మార్కెట్ కారణంగా ఆ వస్తువులు అక్కడికి చేరే సరికి ఖర్చు విపరీతంగా పెరిగిపోయేది. ఈ సమస్యపై ఆలోచించిన మాన్సీ, హస్తకళాకారుల నుండి నేరుగా కస్టమర్లకు తక్కువ ధరకే ఆ సరుకును సరఫరా చేయాలని భావించి ‘టిజోరి’ని ప్రారంభించారు. అయితే ఆ వస్తువులన్నీ పరిమితమైన సమయం వరకే అందుబాటులో ఉంటాయి. దాని వల్ల కొత్త మోడల్స్ రావడంతో పాటు వినియోగదారుల్లో ఓ ఆత్రుతను పెంచడానికి టైమ్ లిమిట్ పెట్టారు.

మాన్సి గుప్తా

మాన్సి గుప్తా


టిజోరి - (టిజోరి హిందీ పదం, నిధి దాగి ఉన్న వస్తువును టజోరి అంటారు)

మాన్సీ ఫిలడెల్ఫియాలో ఉంటున్నప్పుడే 'టిజోరీ' ఐడియా వచ్చింది. “అక్కడే ప్లానింగ్‌తో పాటు కొంత మంది సప్లయర్స్‌తో టై-అప్ కూడా పెట్టుకున్నాము. ఆగస్ట్ 2012 లో ఇండియా వచ్చి, అక్టోబర్‌లో పనులు ప్రారంభించాము. జనవరి 2013లో 'టిజోరి'ని లాంచ్ చేసారు”.

image


“టిజోరీ ప్రారంభమైన మొదటి రోజే 250 ఆర్డర్లు రావడంతో మా వెబ్‌సైట్ క్రాష్ అయింది. కొన్ని గంటల పాటు దాన్ని మూసి వేయాల్సి వచ్చింది. తరువాత టీమ్‌ని కాస్త పెంచుకుని మళ్లీ పనులు ప్రారంభించామంటున్నారు మాన్సీ"

కేవలం నార్త్ అమెరికా వరకే పరిమితంగా ఉన్న 'టిజోరి' ఇప్పుడు ఇండియాలో కూడా తమ వ్యాపారాన్ని విస్తరించారు. కేవలం కొద్ది సమయం వరకే ఆ హస్తకళలు అందుబాటులో ఉండటం టిజోరి ప్రత్యేకత అంటున్నారు మాన్సి. దాని వల్ల ఆ వస్తువులు కోల్పోకముందే వాటిని కొనాలనే ఆత్రుత కస్టమర్లలో పెరుగుతుందని అంటున్నారు.

image


ఎదురుకున్న సవాళ్లు

టిజోరీలో అన్ని కార్యకలాపాలూ మాన్సీ నిర్వహించగలరు. అది సప్లైతో మొదలుకుని, లాజిస్టిక్స్, మార్కెటింగ్ వరకు ఏదైనా సరే. ఈ ప్రయాణంలో ఎదురుకున్న పెద్ద సవాలు ఇండియాలో ప్రారంభించడమని అంటున్నారు మాన్సీ. తన పార్ట్‌నర్ అంకిత్ అనుభవం, సలహాలు టీజోరీని మరింతగా బలోపేతం చేసిందని అంటున్నారు.

స్ఫూర్తి

ప్రేరణ పొందడం మాన్సీకి పెద్ద విషయం కాదు. అయితే ఏ పనైనా బలవంతంగా చేయలేరు. ఏదీ చేసిన ప్రపంచం గుర్తుపెట్టుకునేలా చేయాలనేది ఆమె ఆలోచన. ఇక భవిఫ్యత్తులో 'టిజోరి' మరింతగా ఎదగాలని కోరుకుంటున్న మాన్సీ , తన టీం పెరగాలని, ప్రపంచంలోని ఇతర దేశాలకు కూడా విస్తరించాలని కోరుకుంటున్నారు.

మహిళా వ్యాపారవేత్తలకు మాన్సీ ఇచ్చే సలహా...

• ఏ పని చేసిన అంకిత భావంతో చేయండి

• మీరు చేసే పనిని ప్రేమించడంతో పాటు, మీకు నచ్చిన చోటే పని చేయండని.

• అందరితో ఫ్రెండ్లీగా ఉండాలి.