ఈమె ఏడాదిలో ఇంత బరువు ఎలా తగ్గిందో తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు..!!

ఈమె ఏడాదిలో ఇంత బరువు ఎలా తగ్గిందో తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు..!!

Saturday October 29, 2016,

2 min Read

కాలం మారుతోంది. ఆహారపు అలవాట్లూ మారుతున్నాయి. కెలరీలకు కెలరీలు కడుపులో తోసేస్తున్నారు. ఫలితంగా దేహం మోయలేని భారమవుతోంది. కిలోల కొద్దీ కొవ్వు శరీరంలో పేరుకుపోతోంది. లైఫ్ స్టయిల్ డిసీజెస్ అన్నిటికంటే ప్రమాదకరం అని డబ్ల్యూహెచ్‌వో ఎప్పటికప్పుడు హెచ్చరిస్తునే ఉంది. వరల్డ్‌ హెల్త్ ఆర్గనైజేషన్ లెక్కల ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా 1.5 బిలియన్ల మంది అధిక బరువుతో బాధపడుతున్నారు. అంటే ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. ఓవర్ వెయిట్ ఉన్నవాళ్లందరినీ సెపరేట్ చేసి ఒక దేశంగా మారిస్తే.. ఇండియా, చైనా జనాభాను దాటేస్తారు. అదీగాక ప్రపంచ వ్యాప్తంగా 63 శాతం మంది లైఫ్ స్టయిల్ డిసీజెస్ కారణంగానే చనిపోతున్నారట. ఇంకా సూటిగా చెప్పాలంటే ప్రతీ పది మందిలో 6గురు అధికబరువు సంబంధిత వ్యాధులతో కన్నుమూస్తున్నారు.

ప్రపంచ వ్యాప్తంగా ఒబేసిటీ ఇంత ఘోరమైన పరిస్థితుల్లో ఉందని తెలుసుకుంటే ఒళ్లు జలదరిస్తోంది కదా! తలుచుకుంటేనే భయంగా ఉంది కదా! అయినప్పటికీ మేల్కోని వాళ్లు చాలామందే ఉన్నారు. వాళ్లందరికీ స్ఫూర్తిగా నిలుస్తోంది స్వప్నా వ్యాస్ పటేల్.

86 కిలోల బరువున్న స్వప్న ఏడాదిలో ఏకంగా 33 కిలోలు తగ్గి 53 కేజీలకు వచ్చింది. దీని వెనుక ఒకటే రీజన్. డైట్ కంట్రోల్. క్రమం తప్పని వ్యాయామం. అలాగని మనసు చంపుకుని కడుపు మాడ్చుకోవడం తన పద్ధతి కాదంటోంది. ఇష్టమైన ఐటెమ్స్ శుబ్బరంగా తింటుంది. కానీ ఏదీ అతిగా కాదు. ఏం తిన్నా రైట్ టైంలో తినాలనేది ఆమె చెప్పే సూత్రం. ఎన్నడూ క్రాష్ డైటింగ్ చేయలేదని చెప్తోంది. ఓవర్ ఎక్సర్ సైజ్ అన్నమాటే లేదు. మొదట్లో ఫ్యాట్ బర్నింగ్ కోసం కార్డియో వర్కవుట్ చేసేది. కానీ తర్వాత వెయిట్ ట్రైనింగ్ కి మారింది.

image


ఇంత బరువు తగ్గడమనేది అంత ఈజీగా జరగలేదంటోంది స్వప్న. హెల్దీ వెయిట్ లాస్ కోసం షార్ట్ కట్స్ లేవనేది ఆమె అభిప్రాయం. ఫ్యాట్ డైట్ వెంటనే శక్తినివ్వొచ్చుగాక, కానీ అదే మన పాలిట మృత్యువు అవుతుందంటారామె. ట్రిక్స్ ద్వారా ఏదో చేయొచ్చు అనుకుంటే అది మొదటికే మోసం అవుతుందని స్వప్న చెప్తోంది.

19 ఏళ్లప్పుడు నేను 86 కేజీల బరువు ఉండేదాన్ని. ఇప్పుడు 53 కేజీలకు వచ్చాను. అంటే 33 కిలోలు తగ్గాను. నేను మొదట్లో అంత బరువున్నా నాకేం నామూషీ కాలేదు. అయితే, కొందరు ఆంటీ అని.. అమ్మమ్మ అని రకరకాలుగా కామెంట్ చేశారు.. అది విని హర్టయ్యాను. ఆ చిన్న సంఘటనే నన్ను ఇలా మార్చింది. వాళ్ల మాటలు కొట్టిపారేయాలన్న కసితోనే నేను ఇలా మారిపోయాను- స్వప్న పాటిల్

నా డైట్ నన్నెప్పుడూ ఆకలితో ఉంచలేదంటారు స్వప్న. ఆల్మోస్ట్ ప్రతీ రెండు గంటలకోసారి తినేదట. కానీ తక్కువ మోతాదులో తినేదాన్నని చెప్తున్నారు. బేసిగ్గా మన శరీరం ఏదైతే కోల్పోతుందో దాన్నే ఎక్కువగా కోరుకుంటుంది. ఉదాహరణకు తీపి పదార్ధాలకు దూరంగా ఉన్నామనుకోండి.. శరీరం దాన్నే ఎక్కువగా కోరుతుంది. అందుకే రెగ్యులర్ గా ప్రొటీన్, ఫ్యాట్ చెక్ చేసుకుంటానని స్వప్న తెలిపింది.

భౌతికపరమైన మార్పు బయటకి కనిపిస్తుంది. కానీ అసలైన మార్పు మన మనసులో ఉంటుంది. వెయిట్ లాస్ ప్రాసెస్‌లో నేనెప్పుడూ ఒంటరిగా ఉండాలని ట్రై చేయలేదు. లైఫ్ స్టయిల్ మార్చుకోలేదు. ఈ క్రమంలో పెషెన్సీ పెరిగింది. డిసిప్లైన్ అలవడింది. డెడికేషన్ నేర్చుకున్నాను. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఆత్మవిశ్వాసం రెట్టింపైందని గర్వంగా చెప్తోంది.

image


బరువు తగ్గడానికి ఏవేవో సీక్రెట్స్ ఉంటాయని అందరూ అనుకుంటారు. కానీ అవేం లేవంటోందామె. రెగ్యులర్ గా డైట్ ఫాలో అయితే చాలు.. ఇంకేం అవసరం లేదని ఘంటాపథంగా చెప్తోంది.

స్వప్న ఇప్పుడొక ఫిటినెస్ ప్రొఫెషనల్. తన అనుభవం ద్వారా వందల మందికి బరువు తగ్గించుకునే మార్గం చెప్తోంది. ఫేస్ బుక్ లో సుమారు ఐదు వేల మంది స్వప్నను ఫాలో అవుతన్నారంటే.. ఎంతమందికి ఆదర్శంగా నిలిచిందో అర్ధం చేసుకోవచ్చు. హ్యాట్సాఫ్ స్వప్న.