విదేశీ ఉద్యోగం వదిలి వెడ్డింగ్‌ మార్కెట్‌లోకి దూకిన యంగ్ లేడీ

విదేశీ ఉద్యోగం వదిలి వెడ్డింగ్‌ మార్కెట్‌లోకి దూకిన యంగ్ లేడీ

Tuesday October 20, 2015,

4 min Read

2015 జనవరిలో ఇషా పెళ్లికి సిద్దమైంది. పెళ్లి నిశ్చయంగా కాగానే ప్రారంభంలో ఉండే ఆనందం పాళ్లు కాస్త తగ్గగానే.. భారతీయ సాంప్రదాయాలకు అనుగుణంగా వివాహం జరుపుకోవాలనే ఆలోచన వచ్చింది. పెళ్లి రోజు మాత్రమే కాకుండా.. ఆ ముందు జరిగే తతంగంపై కూడా ఇషాకు మక్కువ కలిగింది. జీవితంలో ఒకేసారి చేసుకునే పెళ్లి విషయంలో.. తాను జీవితకాలానికి సంబంధించిన అనుభూతులను కోల్పోతానని ఆమె భయపడింది. కేవలం మూడు ముళ్లతో ఈ వేడుకను ముగించడం ఆమెకు ఇష్టంలేదు. ఆ సమయంలో సన్నా వోహ్రా నిర్వహిస్తున్న ఇన్‌డియర్.ఇన్ గురించి ఇషాకు తెలిసింది.

ఇన్‌డియర్ వ్యవస్థాపకురాలు సన్నా వోహ్రా

ఇన్‌డియర్ వ్యవస్థాపకురాలు సన్నా వోహ్రా


వివాహాన్ని ఓ వేడుకగా, ఓ పండుగలా జరపుకోవాలని కోరుకునే వారికి.. సన్నా తన ప్లాట్‌ఫాం ద్వారా వెడ్డింగ్ ప్లాన్స్ ఇచ్చి సహాయం చేస్తుంది. ఈమెకు ఇదేమీ మొదటి వెంచర్ కాదు. 2009 ఫిబ్రవరిలో, 18 ఏళ్ల వయసులోనే రెస్టారెంట్లలో డిస్కౌంట్స్ అందించేలా తన తొలి వెంచర్‌ను ప్రారంభించింది సన్నా. బ్రౌన్‌ యూనివర్సిటీ స్టూడెంట్స్‌ ప్రధానంగా ఏర్పాటు చేసిన ఈ వెంచర్ పెద్ద హిట్. కాలేజ్ పూర్తయ్యాక.. మోర్గాన్ స్టాన్లీ సంస్థ కోసం న్యూయార్క్‌లో అనలిస్ట్‌గా విధులు నిర్వహించిందీమె. అయితే ఆంట్రప్రెన్యూర్‌గా ఎదగాలనే కోరిక మాత్రం ఏమాత్రం సడలలేదు. 2014లో సన్నా ఓసారి తన స్నేహితురాలి చెల్లెలి పెళ్లి కోసం ముంబై రావాల్సి వచ్చింది. పెళ్లికి మండపం, వెన్యూ, వస్త్రాలు, డెకరేషన్, ఇన్విటేషన్స్.. ఇలా పలు కార్యక్రమాల కోసం.. అనేక మందిని కాంటాక్ట్ చేయాల్సి రావడాన్ని ఆమె గమనించింది. కుప్పలకొద్దీ ఈమెయిల్స్ చూడాల్సి రావడం, వాట్సాప్ గ్రూప్‌లలో సెర్చింగ్, వెబ్‌సైట్ల పరిశీలన, ఎంక్వైరీలతోనే టైం గడిచిపోవడాన్ని ఆమె పరిశీలించారు.

“ ఏ పని ఎవరితో చేయించాలనే ఆలోచనకే సమయం సరిపోయేది. ఇక పూర్తి స్థాయిలో కార్యక్రమాలు నిర్వాహణ సమర్థంగా నిర్వహించడం కష్టమే. పెళ్లిళ్ల విషయంలో ఇది చాలా కీలకం కూడా. ఏర్పాట్ల కోసం తగిన ప్రణాళికలు ఖచ్చితంగా అవసరం. ఆ మ్యారేజ్ తర్వాత నేను మళ్లీ జాబ్ కోసం యూఎస్ వెళ్లిపోయాను. కానీ ఈ అంశంపై పరిశోధన చేయడం మాత్రం ఆపలేదు. పెళ్లిళ్ల విషయంలో తగిన వ్యవస్థ లేదనే విషయం అర్ధమైంది. కొన్ని నెలల తర్వాత ఇండియాకి తిరిగొచ్చేశాను. ఏప్రిల్ 2014లో ఇన్‌డియర్ ప్రారంభమైంది. భారతీయ వివాహాల విధానాలకు సంబంధించిన ప్లానింగ్, షాపింగ్‌లకు సంబంధించిన వన్ స్టాప్ పోర్టల్ ఇన్‌డియర్.ఇన్” అని చెప్పారు సన్నా.

ఎలా సహాయం చేస్తుందంటే ?

భారతీయ వివాహాలకు వన్ స్టాప్ షాప్‌ అయిన ఇన్‌డియర్.. పెళ్లికి సంబంధించిన కంటెంట్, ఉత్పత్తులను విక్రేతలు, డిజైనర్లు, నిర్వాహకుల నుంచి నేరుగా పొందచ్చు. పెళ్లి ప్రణాళికలను ఇది సులభతరం చేస్తుంది.

స్ఫూర్తి

పిన్‌టెరెస్ట్ మాదిరిగా.. యూజర్లు తమకు నచ్చిన కంటెంట్‌ను బోర్డ్స్‌పై పిన్ చేసి.. తమ కుటుంబంతో షేర్ చేసుకోవచ్చు. అయితే ఇది ఇక్కడితే ఆగిపోదు. ఆయా కంటెంట్, వస్తువులు ఎక్కడి నుంచి వస్తాయో తెలుసుకుని, నేరుగా వెండార్లను కాంటాక్ట్ చేయచ్చు. ఒకే వస్తువుకు సంబంధించిన వివిధ కేటగిరీలను సెర్చ్ చేసి.. ప్రస్తుత ట్రెండ్‌కు అనుగుణంగా, తమకు అనుకూలంగా ఉన్నవాటిని ఎంపిక చేసుకోవచ్చు.

పెళ్లి పనులు ఒక వ్యక్తి నిర్ణయాలతో జరిగిపోయే విషయం కాదు. అనేక మంది నుంచి అనుమతులు పొందాకే కార్యక్రమాలు ప్రారంభించే అవకాశం ఉంటుంది.

“ పెళ్లి లాంటి వేడుకల్లోనూ సరిపెట్టుకోవాల్సిన అవసరం లేదు. తమకు ఏం కావాలో నవతరం వధూవరులకు తెలుసు. తమ పెళ్లి ఎలా జరగాలో, ఏమేం కావాలో.. వారికి ఒక ఐడియా ఉంది. ప్రత్యేకమైన ఏర్పాట్లను వాళ్లు కోరుకుంటున్నారు. ముకేష్ దుపట్టా, గోల్‌పట్టి లెహంగా వంటి కోరికలు వధువులకూ ఉన్నాయి. ఎగువ మధ్య తరగతి, అంతకంటే ఎక్కువ స్థాయిలో ఉన్నవారికి ఈ వేదిక చాలా విస్తృతమైన సేవలు అందించగలదు. తాము అందించే సేవల్లో నాణ్యత, ప్రత్యేకత కస్టమర్లను ఖచ్చితంగా ఆకట్టుకుంటాయని ఇన్‌డియర్ వ్యవస్థాపకురాలు అంటున్నారు.

2015 ఆగస్ట్‌లో కార్యకలాపాలు ప్రారంభించిన ఈ వెంచర్‌ అందించే ప్లాట్‌ఫాంలోని.. షాప్ సెక్షన్‌లో ఇప్పటికే 40 మంది విక్రేతలు నమోదు చేసుకున్నారు. ప్యాకేజింగ్, డెలివరీలకు సంబంధించి డెల్హివరీతో పాటు ఇతర కొరియర్ కంపెనీలతో ఒప్పందాలు కూడా పూర్తయ్యాయి. ప్రస్తుతం వీరు చేస్తున్న డెలివరీల సగటు ఆర్డర్ విలువ ₹రూ. 5వేలు. ముంబై, ఢిల్లీ, బెంగళూరుల నుంచి అత్యధికంగా ట్రాఫిక్, ఆర్డర్స్ ఉంటున్నాయి. ఆ తర్వాత చెన్నై, హైద్రాబాద్ నగరాలు ఉన్నాయి. లూధియానా, జైపూర్ వంటి సిటీల నుంచి కూడా వెబ్‌సైట్‌కు ట్రాఫిక్ పెరుగుతోంది. ఎన్నారైల నుంచి కూడా విజిట్స్ వస్తుండడం విశేషం.

ఇన్‌డియర్.ఇన్ టీం

ఇన్‌డియర్.ఇన్ టీం


భవిష్యత్తుపై ఓ నజర్

2016 నాటికి అన్ని విభాగాలకు సంబంధించిన సొల్యూషన్ ప్రొవైడర్‌గా ఎదిగేందుకు ప్రయత్నిస్తోంది ఇన్‌డియర్. యూజర్లు పర్సనల్ ప్లానర్‌గా మారి నచ్చినట్లుగా ప్రణాళిక రూపొందించుకునేలా ప్లానింగ్ టూల్‌ని డిజైన్ చేయబోతున్నారు. పెళ్లి కూతుళ్లను కొన్ని ప్రశ్నలు అడిగి, సమయానికి తగినట్లుగా ప్రణాళిక రూపొందించి, మ్యారేజ్‌ డేకి ముందు ఏమేం చేయచ్చో సూచించేలా ఈ ప్లాట్‌ఫాం పనిచేస్తుంది.

తమ వేదిక ద్వారా సర్వీసులను ఆయా విక్రేతల నుంచి నేరుగా బుక్ చేసుకునేలా మార్కెట్‌ ప్లేస్‌ను లాంచ్ చేసే ఆలోచన కూడా ఉంది.

అభివృద్ధి తీరు

ఇన్‌డియర్, ఇన్‌డియర్ షాప్, ఇన్‌డియర్ బ్లాగ్‌లకు కలిపి.. ప్రస్తుతం విజిటర్ల సంఖ్య రోజుకు 6 వేల మార్క్‌ను దాటింది. నవంబర్‌ నాటికి ఈ సంఖ్య రెట్టింపవుతుందనే అంచనాలున్నాయి. ఏ రోజుకి ఆ రోజు తీసిన పిక్చర్స్‌.. సైట్‌లో మొత్తం 40వేలకు పైగా కనిపిస్తాయి. ఈ పోర్టల్‌కి వచ్చిన ఎవరైనా.. కనీసం 5 నిమిషాల పాటు గడుపుతుండడం విశేషం.

దీపావళి నాటికి సెల్లర్స్ సంఖ్యను 80కి పెంచేందుకు ప్రయత్నిస్తోంది ఇన్‌డియర్ టీం. కంటెంట్ భాగస్వాముల సంఖ్యను ఈ ఏడాది చివరకు వెయ్యికి పెంచాలన్నది ఆలోచన. సెప్టెంబర్ 2015నాటికి వీరి సంఖ్య 350గా ఉంది. ఆమ్రపాలి, ఫారెస్ట్ ఎసెన్షియల్స్, తాజ్ గ్రూప్‌ ఆఫ్ హోటల్స్ వంటి కంపెనీలతో పాటు రితూ కుమార్, అనితా డొంగ్రేల నుంచి కంటెంట్ సమీకరిస్తున్నారు.

2014లో భారతీయ వెడ్డింగ్ ప్లానింగ్ ఇండస్ట్రీ విలువ 38 బిలియన్ యూఎస్ డాలర్లుగా అంచనా వేశారు. ఈ సంఖ్య ఏటా 25-30శాతం వేగంతో వృద్ధి చెందుతోంది. ఖరీదైన వస్తువులు, సేవల విషయంలో భారతీయుల కొనుగోళ్లు చాలా వేగంగా పెరుగుతున్నాయి. మహిళలు ప్రభావం చూపే వస్తువుల విషయంలో 2012-2016 మధ్య అభివృద్ధి 5 రెట్లుగా ఉండడం విశేషం. ఈ పెళ్లిళ్ల మార్కెట్‌లో అవకాశాలు చాలా ఉన్నాయి. ఈ రంగం ఇప్పుడే ఆన్‌లైన్ బాట పట్టడం మరో అనుకూల విషయం.

వెబ్‌సైట్