హోటల్ యాజమాన్యాలు.. ట్రావెల్ సంస్థలు - కస్టమర్లను కలిపే వేదిక యాక్సిస్ రూమ్స్

హోటల్ యాజమాన్యాలు.. ట్రావెల్ సంస్థలు - కస్టమర్లను కలిపే వేదిక యాక్సిస్ రూమ్స్

Tuesday August 25, 2015,

2 min Read

హోటల్ ఇండస్ట్రీకి సంస్థాగతంగా కొన్ని ఇబ్బందులు ఉండేవి. నగరంలోని ఒక ప్రాంతంలో.. రూములు ఖాళీగా ఉండేవి. అయితే వాటి గురించిన సమచారం కస్టమర్‌కు తెలియదు. అందుకే అదే ఏరియాలో ఎక్కువ రేటు పెట్టి మరీ రూమ్ బుక్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దీని వల్ల ప్రత్యక్షంగా... పరోక్షంగా అటు కస్టమర్‌తో పాటు ఇటు హోటళ్ల నిర్వాహకులపైనా, పరిశ్రమపైనా భారం పడ్తుంది. ఈ తరహా పంపిణీ సమస్యను పరిష్కరించేందుకు ఏర్పాటైన వ్యవస్థే యాక్సిస్ రూమ్స్. ఇది వివిధ ఆన్ లైన్ పోర్టళ్లకు, హోటల్స్ యాజమాన్యాలకు మధ్య వారధిగా పనిచేస్తుంది.

ఈ వ్యవస్థ వల్ల తమ హోటల్‌లో ఉన్న ఖాళీ రూములు, ధరలు, డిమాండ్ వంటి వాటిని ఎప్పటికప్పుడు ఒకే డాష్ బోర్డ్ ద్వారా ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేసేందుకు వీలుపడ్తుంది. దీని వల్ల ఈ సమాచారం ఆన్‌లైన్ సైట్లలోనూ తక్షణం అప్ డేట్ అవుతుంది. ఇది ఒక రకంగా హోటళ్లకు చాలా మేలు చేకూర్చే అంశం. ఉన్న రూములను ఖాళీగా ఉంచుకోవాల్సిన అవసరం లేకుండా.. ఇన్వెంటరీ తెలియడం వల్ల మరింత ప్రయోజనకరంగా ఉపయోగించుకునేందుకు వీలుపడ్తుంది. దీనివల్ల పరోక్షంగా ఆదాయమూ పెరుగుతుంది.

యాక్సిస్ రూమ్స్ కో ఫౌండర్ రవి

యాక్సిస్ రూమ్స్ కో ఫౌండర్ రవి


" మేము డాష్ బోర్డు సాయంతో ఎప్పటికప్పుడు సమాచారం సేకరించి.. రూముల ఖాళీ జాబితా, వాటి ధర అందిస్తూ.. ఆన్‌లైన్ పోర్టళ్లకు షేర్ చేయడం ద్వారా డిస్ట్రిబ్యూషన్ పక్కాగా ఉంటుంది '' - యాక్సిస్ రూమ్స్ కో ఫౌండర్ రవి తనేజా.


హోటల్ వ్యవస్థ ఎప్పటి నుంచో డిమాండ్ -సప్లై మధ్య అంతరాన్ని తెలుసుకోలేక నిత్యం సవాళ్ళను ఎదుర్కొంటూనే ఉంది. ఇప్పడు యాక్సిస్ రూమ్స్ అందుబాటులోకి రావడంతో, డిమాండ్ పై స్పష్టమైన అవగాహన వస్తోంది. అంతే కాదు డిమాండ్ ఆధారంగా రేట్లు పెంచడానికో, లేదా ప్రాపర్టీని మరింత అభివృద్ధి చేసుకునేందుకు ఛాన్స్ ఉంటుంది. కస్టమర్‌కు కూడా అవసరాన్ని బట్టి మెరుగైన సేవలు, డిమాండ్ లేనప్పుడు తక్కువ ధరకు ఆఫర్లతో రూములు ఇచ్చేందుకు దోహదపడ్తుంది.

" వినియోగదారులు, హోటల్ యజమానులు, ఆన్‌లైన్ ట్రావెల్ కంపెనీలు, పర్యాటక నిర్వాహకులు వంటి ఆన్ లైన్, ఆఫ్ లైన్ ఛానెల్స్ ద్వారా మా క్లయింట్స్ అందించే అభినందనలు కొండంత బలాన్ని ఇస్తున్నాయి. ఇక్కడ క్లయింట్స్ ఎప్పుడూ తమ పనితీరును సమీక్షించుకుంటూ వృద్ధి చెందుతున్నారు. అటు వినియోగదారులకూ ఒకేసారి ఎక్కువ హోటల్స్‌లో రూమ్స్‌ను ఆప్షన్స్‌గా ఇవ్వడం వల్ల ప్రయోజనకరంగా ఉంటుందని '' రవి చెప్తున్నారు. 

ఇన్నోవేటివ్ వేదిక

ఇన్నోవేటివ్ వేదిక


ఇన్నోవేటివ్ వేదిక

డిస్ట్రిబ్యూషన్ ఛానల్ నిర్వాహణ వ్యవస్థలో యాక్సిస్ రూమ్స్ ఒక వినూత్న వేదిక. ఈ మధ్యే హోటల్ ఎక్స్చేంజ్ (హెక్స్) పేరుతో మరో బిటుబి ప్లాట్‌ఫాం వేదికను సిద్ధం చేసింది. దీని ద్వారా హోటల్ ఓనర్లు కస్టమర్ల మధ్య లావాదేవీలు కూడా సులువుగా పూర్తవుతాయి. 


పెట్టుబడులు

యాక్సిస్ రూమ్స్ స్వీయ నిధులతో ఏర్పాటైన సంస్థ. రూ 1.8 కోట్ల ప్రారంభ పెట్టుబడితో బృందం ఏర్పాటు, డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ తయారీ, ప్రొడక్ట్ రూపకల్పనకు ఖర్చు చేశారు. అన్నింటికంటే ముఖ్యంగా ప్లాట్‌ఫాంకు ట్రాక్షన్ తీసుకురావడానికి కూడా ఉపయోగించారు. సెప్టెంబర్ 2013 లో ఈ సంస్థ 1 మిలియన్ డాలర్ల మొత్తాన్ని సీడ్ ఫండింగ్ కింద సమీకరించింది. దీనివల్ల ప్రొడక్ట్‌ను మరింత వృద్ధి చేయడంతో పాటు ఆన్ లైన్ ట్రావెల్ కంపెనీలకే కాకుండా ఆఫ్ లైన్ సంస్థలకు కూడా సేవలను విస్తరించేందుకు దోహదపడింది. 

ప్రస్తుతానికి Maximojo, Rategain, Ratetiger, Siteminderవంటి ఆన్ లైన్ సంస్థలే ఈ రంగంలో ఉన్నాయి.