విమన్ పవర్ కోసం వికల్ప్ సంస్థాన్

రాజస్తాన్‌లో వికల్ప్ ఉద్యమంయువశక్తితోనే కార్యక్రమాలుపెద్ద ఎత్తున ప్రచార పరంపరమహిళల కోసం ప్రత్యేక కేంద్రాలు

విమన్ పవర్ కోసం వికల్ప్ సంస్థాన్

Monday April 27, 2015,

3 min Read

ఆ దేవుడైనా ఓ తల్లికడుపు పుట్టిన బిడ్డే ! అలాంటి తల్లిలాంటి స్త్రీకి మన పురాణాల్లో ఇచ్చిన ప్రాధాన్యం అంతా ఇంతాకాదు. కానీ ఇప్పుడు ఎక్కడ చూసినా స్త్రీలపై దాడులు, వేధింపులు...!ప్రతీ రోజూ పేపర్లో మహిళపై దాడి అంటూ ఏదో ఒక వార్త దర్శనమిస్తూనే ఉంది. ఈ పరిస్థితి మార్చేందుకే వికల్ప్ సంస్థాన్ ప్రారంభమైంది. లింగవివక్ష ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ఒకటైన రాజస్తాన్‌లోఈ ఉద్యమానికి బీజం పడింది.

‘సమాజంలో మార్పు తీసుకురావాలంటే అది యువతతోనే సాధ్యం.’ ఇదే వికల్ప్ సంస్థాన్‌ని ముందుకు నడుపుతోంది. జెండర్ బేస్డ్ (లింగ ఆధారిత) దాడులపై పోరాటం చేయడానికి రాజస్థాన్ కేంద్రంగా ఓ ఉద్యమానికి వికల్ప్ నాంది పలికింది. ఎడ్యుకేట్ చేయడం ద్వారా యువతరంలో కొత్త మార్పు తీసుకురావడం దీని ముఖ్య ఉద్దేశం. 2004లో ప్రారంభమైన ఈ సంస్థ జెండర్ ఈక్వాలిటీ, ఆడపిల్లల చదువు, బాల్యవివాహాలు, మహిళలపై దాడులు లాంటి ఎన్నో సమస్యలపై నిరంతరంగా పోరాటం చేస్తోంది. వికల్ప్ అంటే ప్రత్యామ్నాయం అని అర్థం. అసమానత్వం, పక్షపాతం, హింస లాంటి వాటికి గురవుతున్న మహిళలకు ప్రత్యామ్నాయ జీవన విధానాన్నిఅనుసరించడానికి వికల్ప్ సాయం చేస్తుంది.

లింగవివక్ష కు వ్యతిరేకంగా జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న మహిళలు

లింగవివక్ష కు వ్యతిరేకంగా జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న మహిళలు


గ్రామాల్లో మీటింగులు ఏర్పాటు చేసి జనంతో మాట్లాడేవాళ్లం. ముందుగా వారి అభిప్రాయాలను సేకరించి.. మహిళా హక్కులపై పోరాటానికి సిద్ధంగా ఉన్నవారిని మాతో చేర్చుకొనే వాళ్లం. వీళ్లంతా విద్యావంతులు కావడం వల్ల వారి కమ్యూనిటీల్లో సానుకూల మార్పులు తీసుకొచ్చే ప్రయత్నం చేశామని ఈ సంస్థ నిర్వాహకులు యోగేశ్ వివరించారు. స్థానికంగా ఉన్న యువకులను సంస్థలో చేర్చుకోవడం వికల్ప్‌కు కలసొచ్చేవిషయం. సామాజికంగా మార్పులు వస్తున్నప్పటికీ గుడ్డి నమ్మకాలను, ఆచారాల పేరుతో వాటిని పాటిస్తూనే ఉన్నారు. జెండర్ ఈక్వాలిటీ గురించి రాజస్తాన్‌లో పోరాటం చేయడం అంత సులువైన విషయమైతే కాదు. ఆచార వ్యవహారాల్లో రాజస్తాన్ సమాజం ప్రత్యేకమైనది. ఆడవారికంటే మగాళ్లు పైచేయిగా ఉండాలని నమ్మే రకమైన సొసైటి అది. మన జీవన విధానం ఇంతే అని నమ్మే మనస్తత్వం వారిది. ఆడ శిశువు పుట్టిన దగ్గర నుంచి బాల్యవివాహం, కట్నకానుకలు లాంటి ఎన్నో సామాజిక రుగ్మతలు రాజస్థాన్‌ని పీడిస్తున్నట్లు అనేక సర్వేలో వెల్లడైంది.

వికల్పసంస్థాన్‌లో యువతరం

వికల్పసంస్థాన్‌లో యువతరం


అమ్మాయి, అబ్బాయి ఇద్దరూ సమానమనే భావన కలిగే సమాజం తయారు చేయడానికి వికల్ప్ ప్రయత్నిస్తోంది. మహిళా సంబంధమైన సమస్యలు అర్థం చేసుకుని వాటిని పరిష్కరించేందుకు స్థానిక యువకులను తన సంస్థలో జాయిన్ చేసుకున్నామని యోగేశ్ అన్నారు. ప్రతి ఇంటిలో మార్పు వస్తే అది సమాజంపై ప్రభావం చూపిస్తుందనే సిద్ధాంతాన్ని వికల్ప్ నమ్ముతుంది. ఈ ప్రాంతంలో జండర్ ఈక్వాలిటీపై పోరాటం చేస్తూ వికల్ప్ దూసుకుపోతోంది. మన చిట్టితల్లుల హక్కుల,మన ఆడపిల్లలను స్కూళ్లకు పంపుదాం, మహిళలపై దాడులను ఆపుదాం అనే కొన్ని నినాదాలను జనంలోకి తీసుకెళ్లింది వికల్ప్. మహిళలపై జరుగుతోన్న దాడులపై యుద్ధం చేయాల్సిన పరిస్థితి. మన సమాజంలో ఆడవారిపై అకృత్యాలు, రేపులు, కట్న వేధింపులు వంటి గృహ హింస రూపుమాపాలంటే యుద్ధం చేయడం తప్పితే మరో అవకాశం లేదు.

వికల్ప్ సేవాకేంద్రం దగ్గర మహిళలు

వికల్ప్ సేవాకేంద్రం దగ్గర మహిళలు


“ మహిళలపై జరిగుతున్న ఎలాంటి దాడినైనా వికల్ప్ సంస్థాన్ సహించదు,” అని యోగేశ్ అన్నారు. ప్రత్యేకమైన కౌన్సిలింగ్‌తో పాటు రక్షణ కల్పించే విధంగా మేం కొన్ని సెంటర్లను ఏర్పాటు చేశాం. మహిళా హక్కుల కోసం వారిని మేం ఎడ్యుకేట్ చేస్తున్నాం. దీంతో వారు స్థిరమైన అడుగు వేసేందుకు అవకాశం ఉందని ఆయన వివరించారు. “ వికల్ప్‌లో మహిళలు తమని తాము ఇష్టపడి, గౌరవించుకొనేలా చేస్తాం,” అని యోగేష్ చిరునవ్వుతో అన్నారు.

తమపై జరిగే దాడులను ఎదురొడ్డి నిలిచే ధైర్యాన్ని వికల్ప్ నూరిపోస్తుంది. సాధారణంగా అమ్మాయిలకు చదువులు ఎందుకనే సమాజం ఇక్కడుంది. ఇంట్లో ఉండే అమ్మాయికి చదువుతో ఏం పని అనేది వారి అభిప్రాయం. దీన్ని పోగొట్టే ప్రయత్నం చేస్తోంది వికల్ప్. అమ్మాయి చదువుకుంటే ఇంటిల్లిపాదీ ఎడ్యుకేట్ అవుతుంది. స్థానిక పాఠశాలలు, కమ్యూనిటీలతో పాటు ప్రతీ ఇంటికి వెళ్లి అమ్మాయి చదువుపై అవగాహన కల్పిస్తున్నామని యోగేశ్ అంటున్నారు. దాదాపు ఐదు వేలకు పైగా అమ్మాయిలు ఈ కార్యక్రమం ద్వారా తిరికి బడికి వెళ్లి ఎడ్యుకేషన్‌ను కంటిన్యూ చేశారు. బాల్య వివాహాల వల్లనే స్త్రీలు ఆర్థికంగా ఎదగలేకపోతున్నారు. ఇదే డొమెస్టిక్ వైలెన్స్ కు కారణంగా మారుతోంది. అమ్మాయిలను చదివిస్తే బాల్యవివాహానికి దూరం చేయొచ్చు. ఇదే సందేశాన్ని సాధ్యమైనంత ఎక్కువ మందికి ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు యోగేశ్ చెప్పారు.

అమ్మాయిలు, వారి కుటుంబసభ్యులతో పాటు స్కూలు అథారిటీలతో వికల్ప్ నిర్వహించిన మీటింగులతో అమ్మాయిలు ఒక్క రోజు కూడా బడితప్పకుండూ స్కూలుకు వెళ్తున్నారు. ఇప్పటి దాకా 875మంది అమ్మాయిలను బాల్యవివాహాలనుంచి రక్షించగలిగింది. సమాజంలో యువకులతో పాటు దేవాలయాల్లో ఉన్న పూజారులు, కులసంఘ నేతలు, ఇంటిపెద్దలు, పోలీసులు లాంటి అందరినీ తమతో చేతులు కలిపేలా కార్యక్రమాలు చేపడుతున్నారు. 

“రేపు మార్పు వస్తుందని వికల్ప్ సంస్థాన్‌లో ఎవరిని కదిపినా ధీమాగా చెబ్తారు ”