డెలివరీ బిజినెస్‌లో ముగ్గురు ఐఐటి కుర్రాళ్ల దూకుడు !!

పేరుకు తగ్గట్టే అనుకున్న సమయానికి డెలివరీ--మొదటి ఐదు నెలల్లోనే 15వేలకు పైగా డెలివరీలు

డెలివరీ బిజినెస్‌లో ముగ్గురు ఐఐటి కుర్రాళ్ల దూకుడు !!

Tuesday December 08, 2015,

3 min Read

వ్యాపార రహస్యాలు చాలా ఉన్నాయి. కానీ ఈకామర్స్ జనరేషన్ లో డెలివరీకి ఉన్నంత ప్రాధాన్యం అంతా ఇంతాకాదు. డెలివరి ఇన్ టైంలో చేస్తే ఆ సంస్థకు కస్టమర్లు క్యూ కడతారు. ఆన్ లైన్లో ఆర్డర్లు పెరగాలంటే, డెలివరీ రేషియో బాగుండాలి. డైరెక్ట్ కస్టమర్లకే కాదు బిటుబి లో కూడా డెలివరీ ప్రాధాన్యం చాలానే ఉంది. స్టాక్ ఇన్ టైంలో వస్తేనే.. కస్టమర్లకు అనుకున్నసమయానికి సరుకులు అందించడానికి అవకాశం ఉంటుంది. దీన్నే వ్యాపారంగా మార్చుకుంది సెండ్ ఫాస్ట్ స్టార్టప్ .

image


ఇలా మొదలు

ఐఐటి ఖరగ్ పూర్ లో చదివిన ముగ్గరు తెలుగు కుర్రాళ్లు ప్రారంభించిన స్టార్టప్ ఇది. కాలేజీ పూర్తయిన తర్వాత స్టార్టప్ ప్రారంభించాలనుకుని మార్కెట్ రీసెర్చ్‌ చేశారు. దేశంలో బిలియన్ డాలర్ల డెలివరీ మార్కెట్ ఉంది. దీంట్లో ఉన్నఇతర ప్లేయర్స్ ఎలా పనిచేస్తున్నారనేది తెలుసుకున్నారు. 2014లో కాలేజి నుంచి పాసవుట్ అయిన రోజు నుంచే ఈ స్టార్టప్ కు అంకురార్పణ జరిగింది. డెలివరీని ఆర్గనైజ్డ్ సెక్టార్ లోకి తీసుకు వస్తే మరిన్ని వండర్స్ క్రియేట్ చేయొచ్చని కో ఫౌండర్లు చెప్పుకొచ్చారు. అదే ఉద్దేశంతో తమ స్టార్టప్ ప్రారంభమైందట.

“డెలివరీలో ఆప్టమైజేషన్ తీసుకు రావాలనుకుంటున్నాం. ఆ దిశగా పనిచేస్తున్నాం.” కిరణ్ కుమార్

కిరణ్ కుమార్ సెండ్ ఫాస్ట్ కి కో ఫౌండర్ గా వ్యవహరిస్తున్నారు. తమ స్టార్టప్ మొదలు పెట్టిన రోజు నుంచి ఆదాయం రావడం ఆనందంగా ఉందంటున్నారాయన.

image


సెండ్ ఫాస్ట్ పనితీరు

ఇంట్రాసిటీ డెలివరీలో సెండ్ ఫాస్ట్ ఎంతో ఫాస్ట్ గా దూసుకుపోతుంది. ప్రారంభించిన ఐదు నెలలు కాలేదు ఇప్పటికే 15వేలకు పైగా డెలివరీలు చేసింది. ఇందులో 2వేల మంది రిపీటెడ్ కస్టమర్లున్నారు. ప్రతి రోజు 15కు పైగా డెలివరీలు చేస్తారు. పూర్తిగా బిటు బి ప్లాట్ ఫాంలో అందుబాటులో ఉంది. చిరు వ్యాపారులకు కావల్సిన వస్తువులను అందిస్తున్నారు. ప్రస్తుతానికి ఫుడ్, మెడిసిన్ ఎక్కువగా డెలివరీ చేస్తున్నారు. ఇప్పుడిప్పుడే గ్రాసరీ ఆర్డర్లు కూడా వస్తున్నాయి. లాండ్రీ సర్వీసు కూడా ప్రారంభించారు. అంతా టెక్ సపోర్ట్ తో సాగిపోతుంది. ఒక డెలివరీకి వెళ్తే రిటర్న్ లో మరోటి పిక్ అప్ చేసుకుని వస్తారు డెలివరీ బాయ్స్. పూర్తి స్థాయి ఆర్గనైజ్డ్ స్టార్టప్ ఇది. ప్రతి విషయాన్నీ ఆన్ లైన్లో అప్ డేట్ చేస్తారు. డెలివరీ మొదలైన సమయం నుంచి ట్రాకింగ్ ఉంటుంది. మ్యాప్ లో బైక్ ఎక్కడెక్కడ ఆగింది.. ఎటునుంచి పోతోంది అనే వివరాలన్నీ కనిపిస్తాయి.

“థర్డ్ పార్టీ లాజిస్టిక్స్ ని ఆర్గనైజ్డ్ సెక్టార్ లోకి తీసుకురావాలనేది మా లక్ష్యం.” శశాంక్
image


సెండ్ ఫాస్ట్ టీం

సెండ్ ఫాస్ట్ కు ముగ్గురు కో ఫౌండర్లున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి, ఐఐటి ఖరగ్ పూర్ లో ఇంజనీరింగ్ పూర్తి చేశారు. సెండ్ ఫాస్ట్ లో ఆపరేషన్స్ చూస్తున్నారు. మరో కో ఫౌండర్‌ శశాంక్ రెడ్డి. అతను ఐఐటి ఖరగ్ పూర్ నుంచి ఎమ్మెస్సీ కెమిస్ట్రీ పూర్తి చేశారు. సెండ్ ఫాస్ట్ లో మేనేజ్‌మెంట్‌ వ్యవహారాలు చూస్తున్నారు. నాగ కార్తీక్ మరో కో ఫౌండర్. అతను కూడా ఐఐటి ఖరగ్ పూర్ నుంచి ఇంజనీరింగ్ కంప్లీట్‌ చేశారు. ఇతను టెక్ సపోర్ట్ అందిస్తున్నారు. వీరితో పాటు హైదరాబాద్ లో 40 మంది డెలివరీ బాయ్స్ ఉన్నారు. చెన్నైలో మరో పదిమంది డెలివరీ కుర్రాళ్లున్నారు.

ఇతర పోటీ దారులు

రోడ్ రన్నర్ ఈ ప్లాట్ ఫాంలో పెద్ద ప్లేయర్ గా చెప్పొచ్చు. ఒపీనియో అనేది మరో ప్లేయర్. అయితే ఇవన్నీ మిలియన్ డాలర్ బిజినెస్ చేస్తున్నప్పటికీ అప్టమైజేషన్, ఐడియల్ టైం విషయంలో తమకు పోటీదారులు కావని నాగ కార్తీక్ అంటున్నారు. తమ స్టార్టప్ అందించే సేవలు యునిక్‌గా ఉంటాయని అభిప్రాయపడ్డారు. రియల్ టైం ట్రాకింగ్ లాంటివి ఎక్స్‌ట్రా ఫీచర్స్ గా చెప్పుకొచ్చారు.

ఫండింగ్, లక్ష్యాలు

ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ నుంచి సీడ్ ఫండింగ్ వచ్చింది. దాంతోనే ఇప్పటి వరకూ లాక్కొచ్చారు. అయితే బిటుబి వ్యాపారం కావడం వల్ల మొదటి రోజు నుంచే రెవెన్యూ జనరేట్ చేయగలిగారు. దీంతో ఇప్పట్లో ఫండింగ్ కు వెళ్లే ఆలోచన లేదు. రోజుకి ఒక బాయ్ 15 డెలివరీలు చేస్తున్నాడు. డెలివరీ రెటింటివిటీతో పాటు సంఖ్యని కూడా పెంచాలని యోచిస్తున్నారు.

భవిష్యత్ ప్రణాళికలు

వచ్చే ఏడాది పూర్తయ్యే లోపు మెట్రో సిటీల్లో ఆపరేషన్స్ మొదలుపెట్టనున్నారు. దాంతోపాటు చిన్నచిన్న నగరాల్లో కూడా వ్యాపారాన్ని విస్తరించాలని చూస్తున్నట్లు కిరణ్ అన్నారు. కస్టమర్ స్టిక్ నెస్ అనేది చాలా ముఖ్యమైన విషయం. డెలివరీ స్టార్టప్ కు దీని అవసరం ఎంతో ఉంది కనుక దీంతోపాటు కొత్త కస్టమర్లను పెంచుకోవాలని చూస్తున్నారు.