డబ్బెలా సంపాదించాలో చెప్పే అవర్ ఫస్ట్ మిలియన్ స్టార్టప్

డబ్బెలా సంపాదించాలో చెప్పే అవర్ ఫస్ట్ మిలియన్ స్టార్టప్

Tuesday February 14, 2017,

2 min Read

చాలా కాన్ఫరెన్సులు ఎలా వుంటాయంటే.. ఒక వక్తని పిలుస్తారు. స్పీచ్ ఇవ్వమంటారు. వాళ్లు ఇదే సందు అనుకుని సొల్లు మొదలుపెడతారు. కొత్తదనం ఏమీ లేకుండా మైకు ముందు కొన్ని గంభీరమైన పదాలను పోగేసుకుని, అరగంట, గంట మైకుని నమిలేస్తారు. చప్పట్లు కొట్టించుకుంటిని దులుపుకుంటారు. ప్యాషనేట్ గా వుండాలి.. అవకాశాల కోసం ఎదురుచూడాలి.. హార్డ్ వర్క్ చేయాలి.. ఇవే మాటలు చర్విత చరణం. 

ఈ రొటీన్ సొల్లుపురాణం కాదు. మాట్లాడితే రోమాలు నిక్కబొడవాలి. కళ్లలో నీళ్లు చిప్పించాలి. నరాల్లో కరెంట్ ప్రవహించాలి. మనమెందుకు అలా అవకూడదు అనే కసిరావాలి. అలాంటి స్ఫూర్తిదాయక ప్రసంగాలు కావాలి. విజయపథాన నిలిచిన వ్యక్తుల స్వానుభవం మాటల రూపంలో కావాలి. వాళ్ల అచీవ్మెంట్ వాళ్ల నోటినుంచే వినిపించాలి. అలాంటివారి ప్రసంగాలు మోటివేట్ చేస్తాయి.

image


రొడ్డకొట్టుడు స్పీకర్లను తెచ్చి మాట్లాడమని మైకిస్తే నమిలిపారేయడం తప్ప ప్రయోజనం శూన్యం. నిట్ స్టూడెంట్ శ్రేయకు ఇది చాలాచోట్ల అనుభవమైంది. ఎన్నో స్టార్టప్ కాంక్లెవ్స్, బీప్లాన్ కాంపిటిషన్లలో ఆమె పాల్గొన్నది. ప్రతీచోటా గెస్టులుగా వచ్చినవారు చెప్పిందే చెప్పి విసుగు పుట్టించారు. ఆ విరక్తిలోంచి పుట్టిందే అవర్ ఫస్ట్ మిలియన్ స్టార్టప్.

జనానికి సొల్లు కబుర్లు అవసరం లేదు. ఇది క్లియర్. గంభీరమైన పదాల పొందిక అసలే వద్దు. ఇది ఇంకా క్లియర్. మరేం కావాలి..? సొంత అనుభవంలో నాలుగు మాటలైనా చాలు. జనం కోరుకునేది అదే. వాళ్లెలా కష్టపడ్డారు..? ఎలా పైకొచ్చారు..? ఎంత సంపాదిస్తున్నారు..? ఔత్సాహికులకు వారిచ్చే సలహా ఏంటి..? గంటల కొద్దీ డాక్యుమెంటరీ కాదు. క్రిస్ప్ గా. చిన్నపాటి స్పీచ్. మోటివేట్ చేసేలా.. ఉత్సాహపరిచేలా.. ఉద్వేగంగా ఉండేలా... ఆంట్రప్రెన్యూర్స్ కాన్ఫరెన్స్ లో ఆ వీడియో క్లిప్పింగ్ స్ఫూర్తినింపేలా.. రియల్ పీపుల్.. రియల్ స్టోరీస్.. రియల్ మనీ.. అదే అవర్ ఫస్ట్ మిలియన్ స్టార్టప్ టాగ్ లైన్.

2016 అక్టోబర్ లో లాంఛ్ చేశారు. హెచ్ ఆర్ నుంచి వచ్చిన సలిల్ రంగా తనకున్న పరిచయాల ద్వారా సంస్థకు ఎస్సెట్ అయ్యాడు. బిట్స్ పిలానీ గ్రాడ్యుయేట్ అశుతోష్ తోడయ్యాడు. అతను మంచి కన్వర్జేషనలిస్ట్. అనేక మందిని ఇంటర్వ్యూ చేసిన అనుభవం ఉంది అతనికి. శ్రేయ నాగ్ పూర్ వినిట్ నుంచి ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ చేసింది. ఆమె మార్కెటింగ్ విభాగం చూసుకుంటుంది.

స్టార్టప్ పేరు వెనుక

ఫస్ట్. తొలుత అనే ఏ విషయంలోనైనా మరపురానిదే. ఫస్ట్ అనేది ఎప్పటికీ డిఫికల్టే. ఉదాహరణకు ఫస్ట్ కిస్.. అదెంత కష్టం. ఫస్ట్ కంపెనీ.. అదెంత పెయిన్. ఫస్ట్ ఇన్వెస్ట్ మెంట్.. ఎంత చెమటోడ్చాలి.. అలా ఫస్ట్ అనే పదంలో కష్టముంటుంది. ఆనందమూ ఉంటుంది. అందుకే ఫస్ట్ ఈజ్ ద బెస్ట్ అని.. స్టార్టప్ కు అవర్ ఫస్ట్ మిలియన్ అని పేరుపెట్టారు.

రెవెన్యూ గ్రోథ్

ఆదాయం ఇప్పటికిప్పుడు కనిపించడం లేదు. పెద్దపెద్ద ఈవెంట్స్ చేస్తేగానీ రెవెన్యూ రాదని టీం భావిస్తోంది. అది పక్కన పెడితే, కొన్ని ఈ-బుక్స్, టీ షర్ట్స్, మగ్స్, మొబైల్ కవర్స్ సేల్ చేస్తున్నారు. ఈ సమ్మర్ లో మొట్టమొదటి ఫస్ట్ అవర్ మిలియన్ కాన్ఫరెన్స్ నాగ్ పూర్ లో ఏర్పాటు చేయబోతున్నారు. ద ఆర్ట్ ఆఫ్ మేకింగ్ మనీ అనే అంశపైనే ఎక్స్ క్లూజివ్ గా ఫోకస్ చేస్తున్నారు.

మార్కెట్ సైజ్

గత ఏడు సంవత్సరాల్లో దేశంలో సగటు మనిషి వయసు 29 ఏళ్లు. రొటీన్ గా నైన్ టు ఫైవ్ వర్క్ చేయడకంటే, తనకంటూ సొంతంగా, కొత్తగా ఇంకేం సాధించవచ్చు అని ఆలోచించడానికి అదే సరైన వయసు. పల్లెటూరైనా, పట్టణమైనా డబ్బు సంపాదించడం ఎలా అన్నది ఆల్వేస్ ఇంట్రస్టింగ్ పాయింటే. గూగుల్ ట్రెండ్స్ కూడా అదే చెప్తోంది. అందుకే మార్కెట్ ఇదీ అని కొలమానం లేదు.

మానెటైజేషన్ స్ట్రాటజీ

ప్రస్తుతానికి వెబ్ సైట్ రీచింగ్ బాగానే ఉంది. రెగ్యులర్ గా సైట్ ని సందర్శిస్తున్నారు. 80 శాతం సబ్ స్క్రైబర్లు ఉన్నారు. వాళ్లకు ఈ బుక్స్, ఆడియో బుక్స్ ప్రొవైడ్ చేయాలని చూస్తున్నారు.

వెబ్ సైట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి