వేరబుల్ డివైజ్ మార్కెట్లో భారతీయ కంపెనీ సత్తా

అడుగు, అడుగునే లెక్క వేసే వేరబుల్ డివైజ్‌లుసొంత సాఫ్ట్‌వేర్‌తో సత్తా చాటుతున్న భారతీయ కంపెనీతమ కస్టమర్లు రోజుకు 6 కోట్లకు పైగా అడుగులు వేస్తున్నారన్న గెట్ యాక్టివ్

వేరబుల్ డివైజ్ మార్కెట్లో భారతీయ కంపెనీ సత్తా

Thursday July 09, 2015,

4 min Read

“వేల కిలోమీటర్ల ప్రయాణమైనా... ఒక్క అడుగుతోనే మొదలవుతుంది.” ఇది చైనా ఫిలాసఫర్ లావోజి చెప్పిన మాట. అయితే.. ఒక ప్రయాణం పూర్తవడానికి 20లక్షల అడుగులు వేయాల్సి వస్తుందని ఆయనకు తెలిసి ఉండదు. అందుకే అలా చెప్పి ఉంటారు. ఇప్పుడు ఇలాంటి అడుగుల లెక్కలు కూడా చాలా తేలిక అయిపోయాయి. టెక్నాలజీ అంతగా పరుగులు పెట్టేస్తోంది. ముఖ్యంగా శరీరంపై ధరించే ఎలక్ట్రానిక్ వస్తువులు(వేరబుల్ డివైజ్‌లు)... కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకుని.. మన భౌతిక చర్యలను పసిగడుతున్నాయి. ధరించేవారి ఆరోగ్యాన్ని అనుక్షణం ఆనవాలు కడుతున్నాయి.

image


2013లో డిజిటల్ ఫిట్‌నెస్ డివైజ్ మార్కెట్ విలువ 330 మిలియన్ డాలర్లు. దీనిలో ఫిట్‌బిట్స్, జాబోన్ యుపిస్, నైక్ ఫ్యుయల్ బ్యాండ్స్‌లే 97 శాతం సొంతం చేసుకున్నాయి. 2018నాటికి వేరబుల్ డివైజ్‌ల మార్కెట్ విలువ 19 బిలియన్ డాలర్లుగా అంచనా. ఈ గణాంకాలు చూస్తే.. మార్కెట్లో కొత్త కంపెనీలకు చాలా స్కోప్ ఉందనే విషయం అర్ధమవుతోంది.

సంస్థాగత మదుపర్లు కూడా వేరబుల్ కంప్యూటింగ్ డివైజ్‌లపై పెట్టుబడులకు ఉత్సాహం చూపుతున్నారు. క్వాల్‌కాం వెంచర్స్, ఎస్ఏపీ వెంచర్స్, సాఫ్ట్ బ్యాంక్ కేపిటల్ నుంచి 43మిలియన్ డాలర్లను సమీకరించింది ఫిట్‌బిట్స్. ఇక విథింగ్ సంస్థ బీపీఐ ఫ్రాన్స్, ఇడిన్వెస్ట్, 360 కేపిటల్ పార్ట్‌నర్స్, వెన్‌టెక్‌ల నుంచి 30మిలియన్ డాలర్లను సేకరించింది. 18మిలియన్ డాలర్లను క్లీనర్ పెర్కిన్స్, ఆసెల్‌ల నుంచి మైఫిట్నెస్‌పాల్ పెట్టుబడులుగా పొందింది. ఔత్సాహిక ఆంట్రప్రెన్యూర్లు కూడా ఈ రంగంలో ప్రవేశించేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. ఐదేళ్లలో 25 రెట్లు పెరిగే మార్కెట్‌ వైపు ఈ మాత్రం పరుగులు ఉండడం అంతగా ఆశ్చర్యపోయే విషయమేం కాదు.

భారత్ నుంచి ఓ వేరబుల్ డివైజ్‌ల కంపెనీ

గెట్ యాక్టివ్ అనే ఓ కంపెనీ... మన దేశం నుంచి వేరబుల్ డివైజ్‌ల మార్కెట్‌లో వాటా దక్కించుకునేందుకు పోటీ పడుతోంది. (టెక్‌స్పార్క్స్‌కు చెందిన టెక్30 స్టార్టప్). మహమ్మద్‌కు మానస పుత్రిక ఈ కంపెనీ. ఇప్పటికే యాక్టివిటీ ట్రాకర్, గెట్ యాక్టివ్ ట్యాప్, గెట్ యాక్టివ్ ఈజీ, గెట్ యాక్టివ్ స్లిమ్‌లను మార్కెట్లో ప్రవేశపెట్టింది గెట్ యాక్టివ్. రిస్ట్ బ్యాండ్‌ను త్వరలో లాంచ్ చేయనున్నారు. హెల్త్‌కేర్ టెక్నాలజీ రంగంలో మహమ్మద్‌కు రెండు దశాబ్దాలకు పైగా అనుభవం ఉంది. దీంతో కన్జూమర్ అవసరాలను సరిగ్గా గుర్తించగలగడం ఆయనకు కొట్టిన పిండే. లాంఛ్ చేసిన తొలి ఏడాదే 10వేలకు పైగా డివైజ్‌లను విక్రయించి... ఓ రికార్డే సృష్టించింది గెట్‌యాక్టివ్.


గెట్‌యాక్టివ్ స్లిమ్.

గెట్‌యాక్టివ్ స్లిమ్.


ఈ సంస్థకు ముర్తాజా, శ్రీజిత్, సౌరవ్‌లు సహ వ్యవస్థాపకులు. వీరందరికీ కార్పొరేట్ రంగంలో తగిన బ్యాక్‌గ్రౌండ్ ఉంది. వారి అనుభవాన్ని సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామింగ్, ప్రోడక్ట్ డిజైన్, బిజినెస్ డెవలప్మెంట్ కోసం ఉపయోగిస్తున్నారు. “హెల్త్‌కేర్ అంటే.. అత్యవసరాలకే అనే దురభిప్రాయం ప్రజల్లో ఉంది. మన ఆరోగ్యం కోసమే ఈ రంగం అనే భావన ప్రజలకు కలగడం లేదు. ఈ పరిస్థితిలో చాలా మార్పు రావాల్సి ఉంది. అంటే ఆరోగ్యం విషయంలో ముందు జాగ్రత్తలు తీసుకునేలా ప్రజలు మారాలి” అంటూ తన అనుభవాలను పంచుకున్నారు మహమ్మద్.

పరిశోధన, అభివృద్ధి విభాగాలను 2011లోనే ప్రారంభించింది గెట్‌యాక్టివ్. తొలి ప్రొడక్ట్‌ను మాత్రం 2013లోనే లాంఛ్ చేశారు.

ఇవి ధరిస్తే ఆరోగ్యం మీ చెంతే

ఈ డివైజ్ అందరికీ అవసరమైనదే అంటోంది గెట్ యాక్టివ్. టెక్నాలజీ ఆధారిత ఆరోగ్య కార్యక్రమాల ద్వారా వర్క్, లైఫ్‌లను బేలన్స్ చేయడమే తమ కంపెనీ లక్ష్యంగా చెబుతున్నారు మహమ్మద్. వ్యక్తులు తమ యాక్టివిటీలను పూర్తిగా వారే పరిశీలించుకోలేరు. అందుకే ఇలా మానిటర్ చేసే డివైజ్‌లను ఉపయోగించడం.. ఇప్పటి లైఫ్‌స్టైల్‌కు తప్పనిసరి అంటున్నారు మహమ్మద్. సబ్‌స్క్రయిబర్ల సంఖ్య పెంచుకోవడానికి... రివార్డ్ ప్రోగ్రామ్స్, సోషల్ నెట్వర్క్‌లలో కాంపిటీషన్స్, గేమిఫికేషన్‌లపై ఆధారపడింది గెట్ యాక్టివ్. కస్టమర్లను ఆకట్టుకోవడంతోపాటు.. ఒకే డివైజ్‌పై బోర్ కొట్టకుండా.. గేమిఫికేషన్ ఉపయోగపడుతోంది. రివార్డులు, కాంపిటీషన్స్ వంటివి కస్టమర్ల దృష్టి కంపెనీపై కొనసాగించేందుకు తోడ్పతున్నాయి.

రిమోట్ డేటా మానిటరింగ్ ద్వారా.. కస్టమర్ల యాక్టివిటీలకు సంబంధించి డేటా రూపొందించి, దానితో వారికి కౌన్సిలింగ్ ఇచ్చే ప్రాసెస్‌ను కూడా ప్రారంభించబోతోంది గెట్ యాక్టివ్. “వేరబుల్ టెక్నాలజీ ఆధారిత డివైజ్‌లలో వీలైనన్ని అవసరమైన ఫీచర్స్ అందించడం ద్వారా.. పోటీ మార్కెట్‌లో సత్తా చాటడమే మా లక్ష్యం”అంటున్నారు మహమ్మద్. ఒక డివైజ్‌నో, ప్రోడక్టునో విక్రయించి చేతులు దులిపేసుకోవమే కాకుండా... ఆరోగ్యం విషయంలో కస్టమర్ల మైండ్‌సెట్ మార్చేలా ఉండాలన్నది తమ ప్రణాళికగా చెబ్తున్నారు.

గెట్ యాక్టివ్ స్మార్ట్ వాకోమీటర్

గెట్ యాక్టివ్ స్మార్ట్ వాకోమీటర్


ఇప్పటికే ఏంజెల్ రౌండ్ నిధుల సమీకరణ పూర్తి చేసిన గెట్ యాక్టివ్... ప్రస్తుతం 3రకాల ఉత్పత్తులను మార్కెట్లో అందుబాటులోకి తెచ్చింది. వీటిలో గెట్ యాక్టివ్ ట్యాప్.. బ్లూటూత్ ఆధారిత హెల్త్‌బ్యాండ్. కేవలం ఫుట్ స్టెప్స్‌ను కౌంట్ చేయడమే కాకుండా.... హార్ట్ బీట్, ఫిజికల్ యాక్టివిటీలలో కెలోరీల వినియోగం వంటి వాటిని కూడా ఇది కనిపెడుతుంది. వర్కవుట్స్ విషయంలో ఎప్పుడు ఆపాలో కూడా ఇండికేట్ చేయడం దీని ప్రత్యేకత. రక్తంలో ఆక్సిజన్ స్థాయి, గ్లూకోజ్ మానిటరింగ్, బాడీ టెంపరేచర్‌లను కూడా తెలుసుకునేలా ట్యాప్‌ను రూపొందించారు. సబ్‌స్ర్కయిబర్లకు... ఆరోగ్యాన్ని పెంచే అన్ని అంశాలకు సంబంధించిన అలర్ట్‌లను.. తమ డివైజ్‌‍లలో అమర్చాలని ప్రయత్నిస్తోంది గెట్ యాక్టివ్.

మహమ్మద్, గెట్ యాక్టివ్ కో-ఫౌండర్

మహమ్మద్, గెట్ యాక్టివ్ కో-ఫౌండర్


నడక, హార్ట్ బీట్‌లను కొలిచే సెన్సర్లు గతంలోనే అందుబాటులో ఉన్నా.. వాటిని ఉపయోగకరమైన డేటాగా మార్చడంలోనే.. ఈ కంపెనీల ప్రతిభ తెలుస్తుంది. ఇందుకోసం తాము సొంతంగా రూపొందించిన సాఫ్ట్‌వేర్, అల్గారిథమ్స్‌పైనే ఆధారపడుతోంది గెట్ యాక్టివ్. ఇలా సొంత సాఫ్ట్‌వేర్‌తో పని చేస్తున్న అతి తక్కువ సంస్థల్లో గెట్ యాక్టివ్ కూడా ఒకటి కావడం విశేషం.

మార్పులో మేము సైతం

కంపెనీ విక్రయించిన మొదటి 10వేల డివైజ్‌లను కొనుగోలు చేసినవారిలో.. అపోలోమ్యూనిచ్, కేపీఎంజీ, ఎస్ఏపీ, విప్రో వంటి కంపెనీలు ఉన్నాయి. కార్పొరేట్ కంపెనీలతో చేసే డీలింగ్స్ విషయాల్లో సక్సెస్ సాధించగలిగితే... మార్కెట్లో త్వరగా క్లిక్ కావచ్చనేది మహమ్మద్ ఆలోచన. ఒక కమ్యూనిటీని, విభాగాన్ని టార్గెట్ చేసినపుడు.. వ్యక్తిగత అభిప్రాయాలకు, రివ్యూలకు ప్రాధాన్యతనివ్వాలంటారు ఆయన. కస్టమైజ్డ్ ప్లాట్‌ఫాం ద్వారా బ్యాక్ఎండ్ సర్వీసులు, డేటా మానిటరింగ్, అనలైటిక్స్ కూడా నిర్వహిస్తున్నారు.

“సమాజంపై సుదీర్ఘకాలంపాటు ప్రభావం చూపగలిగే అంశంపై పని చేసేప్పుడు, ఆవిష్కరించే అవకాశం వచ్చినపుడు.. దాన్ని వదిలిపెట్టకూడదు. ఎలాగైనా సాధించాలంతే. డబ్బు కోసం ఆలోచించినా దీన్ని అందుకోలేం. నే ప్రయాణించాల్సిన దూరం ఎంతున్నా సరే... సబ్‌స్క్రయిబర్స్‌ కోసం ఖచ్చితంగా ఆ లక్ష్యాన్ని అందుకుంటా. ప్రతీ రోజూ మా కస్టమర్లు 6 కోట్లకు పైగా అడుగులు వేస్తున్నారు. దీన్ని రోజుకు 100 కోట్లకు చేర్చాలన్నదే మా ప్రాథమిక లక్ష్యం” అంటున్నారు మహమ్మద్.

వేరబుల్ డివైజ్‌ల విభాగం చిన్నగానే మొదలైనా.. ఇప్పుడు కీలక స్థాయికి చేరుకుంది. ప్రజలకు చాలా ప్రోడక్టులు అందుబాటులోకి వచ్చాయి. అయితే ఇవి అందిస్తున్న సమాచారమే చాలా ముఖ్యం.