హైదరాబాద్ లో ముగిసిన సాహితీ కళా వేడుక

హైదరాబాద్ లో ముగిసిన సాహితీ కళా వేడుక

Monday January 11, 2016,

2 min Read

భాగ్యనగర వాసుల జీవన శైలిని ప్రతిబింభించే హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్ ముగిసింది . తెలుగు, మరాఠా సాహిత్యాలకు సంబంధించిన అనేక విశ్లేషణలకు వేదికంది. సాహితీ అభిమానులు, సిటీజనాలతో పాటు దేశవిదేశాలనుంచి వచ్చిన ప్రతినిధులతో కళకళలాడింది.

“వివిధ అంశాలపై విస్తారంగా చర్చ జరగాలి,” అక్కినేని అమల

డిఫరెంట్ వరల్డ్ ఆర్డర్ చర్చలో పాల్గొన్న అమల లిటరరీపై మరిన్ని చర్చలు జరగాలన్నారు. ఇలాంటి వేడులు జరుగుతున్నప్పుడు సాహితీ వనం తాలూకు పరిమితులు అర్థం అవుతున్నాయన్నారు.

image


ప్రత్యేక స్క్రీనింగ్

ఫెస్ట్ లో ప్రదర్శితమైన మరాఠీ, ఇంగ్లీష్, హిందీ చిత్రాలు అలరించాయి. మొదటి తరం బ్లాక్ అండ్ వైట్ మూవీల నుంచి లగాన్ కలర్ సినిమాల దాకా ఎన్నో సామాజిక నేపధ్యం ఉన్న సినిమాలు ప్రదర్శించారు. ఇటీవల ఆస్కార్ నామినేషన్ దాకా వెళ్లిన కోర్ట్ సినిమా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సింగపూర్ నుంచి వచ్చిన కొన్ని అసాధారణ సినిమాలు అలరించాయి. విద్యార్థులతో పాటు విద్యావేత్తలకు ఓ అపూర్వమైన అనుభవాన్ని కలిగించింది. మొత్తం దాదాపు లక్షకు పైగా విజిటర్స్ వచ్చినట్లు సమాచారం. మారుతున్న కాలంతో పాటు కల్చర్ లో ఎంతో మార్పొస్తోంది. దీన్ని అనుగూణంగా మారుతునే మన గతాన్ని మరవకూడదని వక్తలు అభిప్రాయపడ్డారు. కొత్త తరానికి మన కల్చర్ తెలియాల్సిన అవసరంపై ప్రసంగంలో వివరించే ప్రయత్నం చేశారు.

image


కళలకే అగ్ర తాంబూలం

వివిధ కళావిభాగాలకు సంబంధించిన ప్రదర్శనలు ఫెస్ట్ లో సెంట్రాఫ్ అట్రాక్షన్ గా నిలిచాయి. ప్రతిరోజు సాయంత్రం మరాఠీ, హిందీ, ఇంగ్లీష్ నాటకాల ప్రదర్శన జరిగింది. కామెడీతో పాటు ఆర్ట్స్ కి ప్రాధాన్యం ఇచ్చే ఇన్నోవేటివ్ ఆలోచనతో థాయేటర్ గ్రూపులు చేసిన ప్రదర్శనలు జనాన్ని అలరించాయి. నాట్యకళారీతులతో కూడిన ప్రదర్శనల గురించి ఇక చెప్పక్కర్లేదు.

image


చిత్రకారులు వేసిన బొమ్మలు సైతం ఆలోచింపజేసాయి. ఆర్ట్స్ ప్రదర్శన లో ఫెస్ట్ మొదలైన రోజు నుంచి చివరి రోజు దాకా వివిధ ప్రాంతాలకు చెందిన ఆర్టిస్టులు వేసిన బొమ్మలు ప్రత్యేక ఆకర్షణగా నిలవగా, చిన్నారులు వేసిన స్కెచ్ లు సైతం ప్రదర్శనలో పెట్టడం విశేషం.

మిళితమైన నాట్యం

గతంలో మరాఠా, తెలుగు నాట్యరీతులు కలసి ఉండేదని. ఆ తర్వాత కాలక్రమేనా కూచిపూడి, మరాఠా నాట్యం వేరయ్యాయని ప్రముఖ నాట్య కళాకారిణి యశోద ఠాకూర్ అన్నారు. వివిధ డ్యాన్స్ రీతులపై చర్చ జరిగింది.

“నిజాం నవాబు కాలంలో ఉర్దూ నాట్యానికి ప్రాధాన్యం పెరిగింది,” యశోద

నాయక రాజుల కాలంలో తెలుగు, మరాఠా నాట్యాలకు విశేష ఆదరణ ఉండేదని, తర్వాత నిజాం పిరియడ్ లో ఉర్దూకి ప్రాధాన్యం పెరిగిందని యశోద చెప్పుకొచ్చారు. కూచి పూడి కంటే మరాఠా, తెలుగు నాట్య భంగిమలు కలసిన దేవదాసీ నాట్యం ఉండేదని అన్నారామె.

image


మీడియాలో మార్పొచ్చింది

గతంలో మీడియా పరిస్థితి వేరు, ఇప్పుడు వేరు. ఈరోజుల్లో ఒపినియన్ జర్నలిజం నడుస్తోంది. కొన్ని పార్టీలు, రాజకీయ నాయకులు మద్దతుగా మీడియా సంస్థలు వ్యవహరిస్తున్నయి. దీనిపై మీడియా మాగ్జనైలేజ్డ్ అనే చర్చ జరిగింది. సామాన్య జనానికి ఎదురవుతున్న సమస్యలపై మీడియాలో కధనాలొస్తే అది సమాజానికి ఉపయోగపడుతుందని వక్తలు అభిప్రాయపడ్డారు.

భాగ్యనగరంలో ఉండే కల్చర్ దేశంలో ఎక్కడా ఉండదు. దేశంలో అన్ని ప్రాంతాల నుంచి వచ్చిన వారంతా ఇక్కడ సహజీనం చేస్తున్నారు. నాలుగు వందల ఏళ్లుగా ఇది కొనసాగుతోంది. ఇక్కడి కల్చర్ ని ప్రతిబింబించేలా సాగిన హైదరాబాద్ లిటరరీ ఫెస్ట్ వచ్చే ఏడాది మళ్లీ నగరానికి అందుబాటులోకి వస్తానని గుడ్ బై చెప్పేసింది.