ఓ ప్రొఫెషనల్ బ్లాగర్ కోట్ల రూపాయలు ఎలా సంపాదిస్తున్నాడు ?

దేశ తొలి ప్రొఫెషనల్ బ్లాగర్ అమిత్ అగర్వాల్ విజయగాథకోడింగ్‌ను వదిలి బ్లాగింగ్‌లో బాట పట్టిన అమిత్ అగర్వాల్హైదరాబాద్ ఏడీబీలో ఐదేళ్లు పనిచేసిన అమిత్కస్టమర్లకు సేవలందిస్తూ కోట్లలో ఆదాయం సంపాదిస్తున్న ల్యాబ్‌నాల్ల్యాబ్‌నాల్‌ను ప్రతి నెలా సందర్శిస్తున్న 30 లక్షల మంది విజిటర్లు

ఓ ప్రొఫెషనల్ బ్లాగర్ కోట్ల రూపాయలు ఎలా సంపాదిస్తున్నాడు ?

Tuesday August 18, 2015,

6 min Read

సాఫ్ట్‌వేర్‌లో కానీ, హార్డ్‌వేర్ రంగంలో కానీ అత్యున్నత స్థాయికి చేరాలంటే ఆ రంగంపై చెప్పలేనంత ఇష్టముండాలి. కేవలం పనిచేయడం ఒక్కటే కాదు. మనసుతో పనిచేయగలగాలి. అప్పుడే ఈ రంగంలోనైనా అగ్రస్థాయిలో నిలవగలుగుతాం. దేశంలో తొలి ప్రొఫెషనల్ బ్లాగర్‌ను సృష్టించిన‌ అమిత్ అగర్వాల్ కూడా అలా అగ్రస్థాయికి చేరినవారే. నచ్చినది, మనసు మెచ్చినది చేసినప్పుడే పనిచేస్తున్న రంగంలో ఉన్నత స్థాయికి చేరుతామని అమిత్ అంటున్నారు.

ఢిల్లీకి దక్షిణ దిశలో 260 కిలోమీటర్ల దూరంలో ఆగ్రా ఉంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువమంది జనాభా గల నగరాల్లో ఆగ్రా కూడా ఒకటి. ప్రపంచ ప్రసిద్ధ పర్యాటక ప్రదేశంగా పేరొందిన ఆగ్రా టెక్నాలజీలో మాత్రం చాలా వెనుకబడి ఉంది. దేశంలో టెక్నాలజీ లేదా టెక్ టాలెంట్‌లో అంశంలో టాప్‌టెన్‌ జాబితాలో ఆగ్రాకు చోటేలేదు.

అమిత్ అగర్వాల్.. అందరిలాగా సాధారణ పౌరుడే కానీ.. ఆయన స్థాపించిన ల్యాబ్‌నాల్ బ్లాగ్ మాత్రం సంచలనాల సృష్టిస్తున్నది. ఈ బ్లాగ్‌ను ప్రారంభించిన 11 ఏళ్లలోనే సమీకరణలన్నీ మారిపోయాయి. 2004లో అమిత్ అగర్వాల్ Labnol.org పేరిట ఓ టెక్నాలజీ బ్లాగ్‌ను స్థాపించారు. తన మనసు టెకీగా ఉండిపోయేందుకే ఇష్టపడుతున్నా, ప్రొఫెషన్‌గా మాత్రం రైటర్ అయిన అమిత్‌కు ఎన్నో ఆఫర్లు వచ్చి పడ్డాయి. 

టెకీ ట్యూస్ డే సందర్భంగా అమిత్ యువర్‌స్టోరీతో తన మనసులోని భావాలను పంచుకొన్నారు. తన ప్రయాణాన్ని వివరించారు. తన విజయగాథను చెప్పారు. తాను ఈ రోజు ఈ స్థాయిలో ఉండేందుకు తాను పడ్డ కష్టాలను చెప్పొకొచ్చారు. ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారో వివరించారు.

ల్యాబ్‌నాల్ వ్యవస్థాపకుడు అమిత్

ల్యాబ్‌నాల్ వ్యవస్థాపకుడు అమిత్


వ్యాపార కుటుంబం నుంచి ఇంజినీర్

బిజినెస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన అమిత్.. కుటుంబ వ్యాపారంలోకి అడుగుపెట్టక తప్పలేదు. చిన్నతనం నుంచి క్లాస్‌లో టాప్‌గా నిలిచిన అమిత్‌ ఎప్పుడు కూడా కంప్యూటర్‌పై కానీ, ఇంజినీరింగ్‌పై కాని మక్కువ చూపలేదు. మ్యాథమెటిక్స్ మాత్రం తనకు ఎంతో ఇష్టమైన సబ్జెక్ట్. మ్యాథ్స్ కారణంగానే టెన్ ప్లస్ టూ తర్వాత ఇంజినీరింగ్‌ను ఎంపికచేసుకునేలా చేసింది. సంప్రదాయ కుటుంబం కావడంతో ఆ ఫ్యామిలీలో మహిళలు మాత్రం అమిత్‌ ఆగ్రాలోనే ఉండి చదువుకోవాలని పట్టుబట్టగా, మగవాళ్లు మాత్రం అమిత్ ఎక్కడైనా తనకు ఇష్టమొచ్చింది, ఇష్టమొచ్చిన చోట చేసుకునేందుకు ప్రోత్సహించారు. మెడిసిన్‌తో పోలిస్తే ఏ రంగంలోకైనా వెళ్లేందుకు ఇంజినీరింగ్ అనువుగా ఉండటంతో ఇంజినీరింగ్‌ను ఎంచుకున్నారు అమిత్. ప్రతి ఒక్క విద్యార్థి ఎంతో కలలు కనే ఐఐటీ రూర్కీలో కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్‌లో టాప్‌లో నిలిచారు. అకడమిక్ విషయానికొస్తే, కాలేజీలో అమిత్‌కు ఎలాంటి సమస్యలు ఎదురుకాలేదు. ఫస్ట్ ఇయర్ ముగిసే సరికి తన బ్యాచ్‌లో టాపర్‌లలో ఒకరిగా నిలిచారు. అప్పటి విషయాలను ఆయన ఇలా గుర్తుచేసుకున్నారు.

‘‘ఎప్పుడైతే నేను కంప్యూటర్ కొనుక్కున్నానో, అప్పుడు నా మనసు కోడింగ్ వైపు వెళ్లలేదు. ఇన్‌స్టలేషన్‌వైపు మళ్లింది. కంప్యూటర్ లోపల ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు ఆసక్తి ప్రదర్శించేవాడిని. ఇన్‌స్టలేషన్ సందర్భంగా ఎలాంటి ఫైల్స్ మోడిఫై అవుతున్నానో గమనించేవాడిని. ఇప్పుడు కూడా అదే విధంగా గమనిస్తున్నాను’’ అని వివరించారు.

ఇంజినీరింగ్ ఫైనల్ ఇయర్‌లో ఉన్న సమయంలో ప్రాజెక్ట్‌పై కొన్నాళ్లు మారుతి (గుర్గావ్ ఫ్యాక్టరీ)లో ఇన్వెంటరీ మేనేజ్‌మెంట్‌లో పనిచేశారు. అప్పటి రోజులను గుర్తుకు చేసుకోవడం ఆయనకు చాలా ఇష్టం.

‘అప్పట్లో నెట్‌స్కేప్ నేవిగేటర్ ఒక్కటే బ్రౌజర్. అలాగే డెస్క్‌టాప్స్ అన్ని యూనిక్స్ ఆపరేటింగ్‌ సిస్టమ్‌పై రన్ అయ్యేవి. అప్పట్లో ముగ్గురం కలిసి ఒక ఈ-మెయిల్‌ను షేర్ చేసుకునేవాళ్లం. అలాగే లైబ్రరీలో కేవలం రెండే కంప్యూటర్లుండేవి. అవకాశం వచ్చేందుకు చాలా సమయం పట్టేది’’ అని ఆయన పేర్కొన్నారు.

హైదరాబాద్‌లో తొలి ఉద్యోగం

1999లో అమిత్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి హైదరాబాద్ ఏడీపి ఇంక్‌లో చేరారు. ఐదేళ్లపాటు డేటాబేస్‌లో పనిచేశారు. గోల్డ్‌మన్ సాచ్స్, మెరిల్ లించ్ వంటి క్లయింట్స్ తరఫున ట్రాన్సాక్షన్స్ క్యాప్చరింగ్, యూనిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్‌, పెర్ల్‌, పీహెచ్‌పీపై నడిచే రిపోర్టింగ్ కేపబిలిటీ పనులను చేసేవారు. తాను పనిచేసిన సంస్థలో 70-80 మంది ఉద్యోగులు పనిచేస్తుండేవారు. అయితే కొద్ది కాలంలోనే అమిత్‌కు కంపెనీలో మంచి గుర్తింపు లభించింది. రెండేళ్లలోనే టీమ్‌ లీడర్‌గా ఎదిగారు. ఆ తర్వాత తన చూపంతా కోడింగ్ నుంచి మేనేజ్‌మెంట్‌వైపు మళ్లింది. అప్పటి జాబ్ గురించి అమిత్ ఇలా చెప్తారు..

‘‘ఏడీపీలో నేను పనిచేసిన కాలంలో జరిగిన మంచి ఏంటంటే, చక్కటి మిత్రులు దొరకడం. పనిచేస్తున్న సమయంలో నేను ఎంతో కష్టపడేవాడిని. నైట్ అవుట్‌లు చేసి కోడింగ్ చేస్తుండేవాడిని. ఆ సమయంలో ఎంతో నేర్చుకోగలిగాను. చక్కటి అనుభవం దక్కింది’’ అని వివరించారు.

క్లయింట్స్‌తో టీమ్ మేట్స్‌తో, సాధారణ ప్రజలతో ఎలా వ్యవహరించాలో ఏడీపీలో పనిచేస్తున్న సమయంలో అమిత్ నేర్చుకున్నారు.

‘‘ఒకవేళ కుటుంబ వ్యాపారంలో కొనసాగి ఉంటే ఇవన్నీ నేర్చుకుని ఉండేవాడిని కాదేమో. ఇప్పుడు నేను చేస్తున్నదంతా ఏడీపీలో పనిచేసిన సమయంలో నేర్చుకున్నదే. కాలేజీలో ఉండగా కేవలం థియరీ పార్ట్‌ మాత్రమే నేర్చుకోగలిగాం. కానీ అసలైన లైవ్ ప్రాజెక్ట్స్, ఏడీపీలోనే తెలుసుకున్నాను’’ చెప్పారు.

image


దేశ తొలి ప్రొఫెషనల్ బ్లాగర్..

అమిత్‌కు ఎప్పుడూ కుటుంబంతో ఉండటమంటే ఎంతో ఇష్టం. అలాగే అవకాశాలను ఓపెన్‌గా పెట్టడం కూడా. ఏడీపీలో ఐదేళ్లపాటు పనిచేసిన తర్వాత, మళ్లీ తన సొంత ఊరు ఆగ్రాకు వెళ్లేందుకు అమిత్ సిద్ధమయ్యారు. అదే సమయంలో పెళ్లి కూడా అయింది.

‘‘ఎప్పుడైతే నేను వెనక్కి వెళ్లానో, అప్పుడు ఫ్రీలాన్సర్‌గా పనిచేయడం మినహా మరో ఆప్షన్ లేదు. 2004లో బ్లాగింగ్ చాలా కొత్తది. సోషల్ మీడియా లేకుండా, ఆన్‌లైన్ నెట్‌వర్కింగ్‌/సోషల్ టూల్స్ లేకుండా అదో విభిన్న ప్రపంచం’’ అని అప్పటి రోజులను గుర్తుచేసుకున్నారు.

2004లో అమిత్ ల్యాబ్‌నాల్‌ను స్థాపించి తొలి ప్రొఫెషనల్ బ్లాగర్‌గా గుర్తింపు పొందారు. ల్యాబ్‌నాల్‌ అని పేరు పెట్టేందుకు ప్రత్యేకమైన కారణమేమీ లేదు. ఆ పేరు కాస్త విభిన్నంగా ఉండటం వల్లే ఆ పేరు ఎంపిక చేసుకున్నారాయన. 2005లో ఎక్కువ మంది చదివిన బ్లాగ్ దేశీపండిట్. ఇందులో ఎక్కువ కంటెంట్స్ అమిత్ రాసినవే కావడం విశేషం. దేశంలో వివిధ నగరాల్లో నిర్వహిచింన క్యాంప్స్‌లలో ఆయన పాల్గొన్నారు. అలాగే తొలి ప్రొఫెషన్ బ్లాగర్ కావడంతో పలు చోట్ల మంచి గుర్తింపు లభించింది.

ల్యాబ్‌నాల్ సుదీర్ఘ ప్రయాణం..

గత 11 ఏళ్లుగా ల్యాబ్‌నాల్ దృష్టి కన్జూమర్ సాఫ్ట్‌వేర్‌పై నుంచి ఏ మాత్రం మళ్లలేదు. ఆ ప్రయాణం గురించి అమిత్ ఇలా చెప్తారు..

‘‘రాసే విధానంలో గణనీయమైన మార్పు వచ్చింది. మొదట్లో టెక్ట్స్ ఎక్కువగా ఉండేది. ఇప్పుడు విజువల్స్‌ను (ఆడియో, వీడియో, యానిమేషన్) ఎక్కువగా వినియోగిస్తున్నాం. లాంగ్‌ఫామ్ రైటింగ్ ల్యాబ్‌నాల్‌లో చాలా సహజం. కొత్తవారి నుంచి తెలుసుకోవడం కంటే సాఫ్ట్‌వేర్‌/ప్రాడక్ట్ గురించి నా సొంత అభిప్రాయాలను చెప్పడంపై నాకు చాలా స్పష్టత ఉంది. గూగుల్ ఫోటోస్‌ను ప్రకటించిన తర్వాత, దానిపై నెలలపాటు పనిచేసిన తర్వాతే సవివరమైన రివ్యూను రాసేందుకు నిర్ణయించుకున్నాను’’ అని తెలిపారు.

30 లక్షల విజిటర్లు..

సిమిలర్ వెబ్ లెక్కల ప్రకారం ప్రతి నెలా ల్యాబ్‌నాల్‌ను మూడు మిలియన్లమంది వీక్షిస్తుంటారు. ‘‘మా రీడర్స్‌లలో 47 శాతం అమెరికాకు చెందినవారే. 30% మంది ఇడియన్లు. ఇక మిగతా 30% వివిధ దేశాలకు చెందినవారు’’ అని అమిత్ పేర్కొన్నారు.

సంస్థ ప్రారంభమైన ఏడాది తర్వాతే ల్యాబ్‌నాల్‌కు ఆదాయం మొదలైంది. ప్రస్తుతమైతే పలు మార్గాల ద్వారా అమిత్‌కు ఆదాయం సమకూరుతున్నది. గూగుల్ యాడ్స్ సెన్స్, కన్‌టెక్స్‌టువల్ యాడ్ నెట్‌వర్క్స్, బ్లాగ్ యాడ్స్, ఐడీజీ టెక్‌నెట్వర్క్స్‌ వంటి డైరెక్ట్ యాడ్స్ ద్వారా ఆదాయం వస్తున్నది.

తన పిల్లలతో అమిత్ అగర్వాల్

తన పిల్లలతో అమిత్ అగర్వాల్


డబ్బే డబ్బు..

నెట్‌వర్కింగ్‌లో స్టఫ్‌ సృష్టించే టెక్నాలజి అంటేనే అమిత్‌కు ఎంతో ఇష్టం.

‘‘టెక్నాలజీయే నా జీవితం. నేనెప్పుడూ దాని గురించే ఆలోచిస్తుంటాను. అలా చేయడం వల్లే మరింత ప్రొడక్టివ్‌గా, నాలెడ్జబుల్‌గా ఎదిగాను’ అని వివరించారు.

టూల్‌ను రూపొందించడం/సాఫ్ట్‌వేర్ సమస్యను పరిష్కరించడాన్ని అమిత్ ఎప్పుడూ ఇష్టపడుతుంటారు. బ్లాగ్‌ను విజయవంతంగా నిర్వహించేందుకు ఇది ఎంతో ఉపయోగపడుతుందని ఆయన భావన. గత రెండేళ్లలో అమిత్ ఎన్నో ప్రాజెక్ట్‌లపై పనిచేశారు. దీంతో ఆయన దృష్టి రైటింగ్ నుంచి బిల్డింగ్‌ వైపు మళ్లింది. సింగిల్ పేజ్ యాప్స్, ఎంపీ3 టూల్స్ ఎనేబ్లింగ్, వెబ్ బ్రౌజర్‌లో ట్రాన్స్‌స్క్రిప్షన్, పాడ్ క్యాస్ట్ గ్యాలరీ, గూగుల్‌ డ్రైవ్‌లో ప్యాడ్‌కాస్ట్ వంటివి చేస్తున్నారిప్పుడు. గూగుల్ డాక్యుమెంట్‌/డ్రైవ్‌లో బహువిధాలుగా స్ర్కిప్ట్స్ రాస్తున్నారు. జీరో డాలర్ మూవీస్ ప్రాజెక్ట్ రెడ్‌డిట్, ఫ్రెండ్స్, యూజర్లు, ఫోరమ్‌ల నుంచి అమిత్ సోర్స్ తీసుకుంటారు.

‘‘చిన్నపాటి విండో ఉండటం కారణంగా తత్కాల్‌లో టికెట్లను బుక్ చేసుకోవడం కష్టంగా ఉందని నా స్నేహితుడొకరు చెప్పారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు మరికొన్ని అవసరమైన ఫీల్డ్స్‌ను జత చేయాలని నేను అనుకున్నాను. ప్రజల కోసం దీన్ని నేను రిలీజ్ చేసినప్పుడు దేశవ్యాప్తంగా ప్రజలు, ట్రావెల్ ఏజెంట్స్‌ దీన్ని కొనుగోలు చేశారు’ అని అమిత్ వివరించారు.

ఇందుకోసం ప్రీమియం మోడల్‌ను అనుసరిస్తున్నారాయన. కొన్ని ఫీచర్లను ఉచితంగా, మరికొన్నింటిని ప్రీమియంగా కస్టమర్లకు అందుబాటులో ఉంచుతున్నారు. ప్రస్తుతం ల్యాబ్‌నాల్ ఆదాయం ఏడాదికి కోట్లలో ఉంది.

నిరంతర విద్యార్థి..

ప్రస్తుతం అమిత్‌కు ఉన్న ప్రధాన అడ్డంకి ఏంటంటే.. ఇతర ప్రాంతాల్లో దీన్ని విస్తరించేందుకు సరైన టీమ్‌ను రూపొందించలేకపోవడం. టెక్కీస్, ఆన్‌లైన్ కమ్యునిటీస్ కోసం అమిత్ కొన్ని సలహాలు ఇస్తున్నారు.

1. సాధ్యమైనంత వరకు థింగ్స్‌ను సింపుల్‌గా ఉంచుకునేందుకే ప్రాధాన్యమివ్వాలి. ఒక పని, అది కూడా చక్కటి ఫలితాలను ఇచ్చే డ్రాప్‌బాక్స్‌లాంటి ప్రాడక్ట్స్‌నే నేను ఇష్టపడుతాను.

2. కన్జూమర్ ప్రాడక్ట్ కంపెనీలు, బ్రాండ్లు మరింత కమ్యునికేటివ్‌గా ఉంటే, కస్టమర్లకు ఎంతో సాయంగా ఉంటుంది. వినియోగదారుల సమస్యలను, ప్రశ్నలను ఎలా డీల్‌ చేస్తారన్న అంశమే ఎంతో కీలకమైనది.

3. అకస్మాత్తుగా డెస్క్‌టాప్‌లను పక్కనపెట్టి మొబైల్‌ వైపు వెళ్లాలనుకుంటారు. అది సరైన దృక్పథమని నేను అనుకోను.

దేశ అత్యుత్తమ బ్లాగర్‌గా ఎలా ఎదగాలంటే ?

1. మనకు నచ్చింది, మనం చక్కగా ఉపయోగించుకోగలిగింది మాత్రమే సృష్టించేందుకు ప్రయత్నించాలి. అలాగే స్నేహితులు, కుటుంబసభ్యులకు రికమండ్ చేయాలి.

2. ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నించాలి. అలాంటి సమస్యలకు కొదవలేదు.

3. ఫుల్‌టైమ్ బ్లాగింగ్ చేయాలని అనుకుంటే ఒక్కసారి పునరాలోచించాలి. మీ నియంత్రణలో లేని ఎన్నో ఫ్యాక్టర్స్ మీమీద ప్రభావం చూపుతాయి.

4. మీ పరిధులేమిటో గుర్తించాలి. దేశంలో చురుకుగా ఉన్న బ్లాగర్ల గురించి ఇండియన్ బ్లాగర్స్.ఆర్గ్‌లో ఉన్నది. ఎప్పుడైనా ఇతర ఆఫర్లు వచ్చినా, లేదంటే ఇతర కారణాలతో బ్లాగర్లు తరుచుగా ఆసక్తి కోల్పోతుంటారు.

5. డబ్బు సెకండ్ ప్రయారిటీ. పనిమీద ప్రేమే అన్నిటికంటే ముఖ్యం. అమిత్ ఈ స్థాయికి చేరాడంటే, ఆయన తనకు నచ్చినది రాయడం కారణంగానే.

6. ఆడియన్స్‌తో నిజాయితీగా వ్యవహరించాలి. అలాగే మనకు తెలియని విషయాలను నేర్చుకునేందుకు మొహమాటపడకూడదు.