రియల్ టైం సొల్యూషన్ చూపించే స్టార్టప్స్ ‘పరంపర’ లక్ష్యం

రియల్ టైం సొల్యూషన్ చూపించే స్టార్టప్స్  ‘పరంపర’ లక్ష్యం

Wednesday March 16, 2016,

3 min Read


మిలియన్ డాలర్ల ఇన్వెస్ట్ మెంట్లతో హైదరాబాద్ వచ్చిన పరంపర.. రియల్ టైం స్టార్టప్స్ కోసం చూస్తోంది. ఆన్ లైన్ ఈ కామర్స్ కంటే మానిఫ్యాక్చరింగ్ రంగం, హార్డ్ వేర్ రంగాల్లో పరిష్కారం చూపగలిగే స్టార్టప్ లలో పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆ సంస్థ జనరల్ పార్ట్ నర్ వెంకట్ వల్లభనేని తెలిపారు.

మేకిన్ ఇండియాకే మా మద్దతు

మానిఫ్యాక్చర్ ఇండస్ట్రీల్లో పెట్టుబడులు పెట్టడానికి సిద్దంగా ఉన్నట్లు వెంకట్ చెప్పారు. వర్చువల్ ప్రపంచంలో ఉండే వాటికంటే రియల్ టైం సొల్యూషన్ చూపగలిగే వాటిపైనే ఆసక్తిగా ఉన్నామని ఆయన అన్నారు.

“ఎనభైశాతం స్టార్టప్ లన్నీ టెక్, యాప్ ద్వారా నడిచేవే, కానీ అవి మాటార్గెట్ కావు,” వెంకట్

టెక్ స్టార్టప్ లకు తాము వ్యతిరేకం కాదన్న వెంకట్, వాటికంటే భవిష్యత్ అవసరాలకు తయారీరంగమే తీర్చగలదని అన్నారాయన. మేకిన్ ఇండియాలో భాగస్వామ్యం కావాలనుకుంటున్నట్లు చెప్పుకొచ్చారు. అలాంటి కంపెనీలతో పనిచేయడం కోసమే ఇండియా తిరిగి వచ్చామని ఆయన అన్నారు.

image


పరంపర ప్రస్థానం

మొదట్లో వెంకట్ ఒక్కరే ఓ ఏంజిల్ ఇన్వెస్టర్ లా పెట్టుబడులు పెడుతూ ముందుకు పోయారు. క్రమంగా తనతో కలసి వచ్చేవారితో పనిచేయడం మొదలు పెట్టారు. అలా మొదలైన పరంపర ప్రస్థానం ఇప్పుడు 100కోట్ల వ్యాపార సామ్రాజ్యంగా విస్తరించింది.

“అంతా స్టార్టప్ లు ప్రారంభిస్తే, పెట్టుబడులు పెట్టేవారెవరు?” వెంకట్

యుఎస్ నుంచి భారత్ తిరిగి వచ్చాక ఎవరైనా స్టార్టప్ మొదలు పెట్టాలనుకుంటారు. అందులో తప్పులేదు. కానీ అందరిలా తను ఉంటే ఎలా.. అందుకే ఇన్వెస్టర్ లా మారారు. ఈ క్రమంలో తనతో కొందరు కలసి వచ్చారు. అలా ఈ స్థాయికి వచ్చామని చెప్పుకొచ్చారు. పరంపర ఇప్పటిక వరకు ముంబై, హైదరాబాద్ కలిపి మొత్తం 5 సంస్థల్లో ఇన్వెస్ట్ చేసింది. సెప్టెంబర్ నుంచి ప్రారంభమైన పరంపర.. నెలకొక స్టార్టప్ ను టార్గెట్ చేసుకుంది. మరో మూడు స్టార్టప్స్ నుర కన్ఫర్మ్ చేసుకుంది. అయితే ఇంకా ప్రకటన విడుదల చేయలేదు. ఒక్కో స్టార్టప్ లో మూడు నుంచి ఐదు కోట్ల పెట్టుబడులు పెట్టారు.

ఆ మూడు అంశాలు

పరంపర ఇన్వెస్ట్ చేయాలంటే స్టార్టప్ కు మూడు అంశాలు కంపల్సరీ అన్నారు వెంకట్. సాధారణంగా తమ కంపెనీ సీడ్ ఫండింగ్ జోలికి పోదని అన్నారు.

1. బిజినెస్ ఐడియా తో పాటు స్ట్రాటజీ ప్రధానంగా ఉండాలి. ఐడియా అందరికీ ఉంటుంది. కానీ దాన్ని ఎగ్జిక్యూషన్ చేయాలంటే స్ట్రాటజీ కాంపల్సరీ. ఆ స్ట్రాటజీ ఎంత గొప్పగా ఉంటే అంత ఇన్వెస్ట్ చేయడానికి సిద్ధమని వెంకట్ చెప్పారు. పదికోట్ల దాకా పెట్టుబడి పెడతామని అన్నారు.

2. పరంపర చూసే రెండో విషయం మేనేజ్మెంట్. ఫౌండర్ల క్వాలిఫికేషన్ చూసినప్పటికీ, దానితో పాటు ఫౌండర్ కి స్టార్టప్ పై ఏ స్థాయిలో కన్సర్న్ ఉందనేది ప్రధానం. ఈ విషయాన్నిబట్టి ఇన్వెస్ట్ మెంట్ ఆధారపడి ఉంటుందని అన్నారాయన.

3. ఇక చివరగా.. ఎగ్జిట్ పొటెన్షియల్. ప్రస్తుత పరిస్థితులకు స్టార్టప్ సొల్యూషన్ వర్కవుట్ అయినప్పటికీ, మరో ఆరు నెలల తర్వాత ఆ స్టార్టప్ అవసరం ఉండకపోవచ్చు. అలాంటప్పుడు స్టార్టప్ పై ఇన్వెస్ట్ చేయడంలో అర్థం లేదని వెంకట్ అభిప్రాయపడ్డారు.

image


పరంపర టీం

పరంపర టీం విషయానికొస్తే ముందుగా చెప్పుకునే వ్యక్తి వెంకట్ వల్లభనేని. దాదాపు రెండున్నర దశాబ్దాల అనుభవం ఉన్న వెంకట్ టెక్నాలజీ, మేనేజ్మెంట్ రంగాల్లో ఆరితేరారు. 20 ఏళ్లు అమెరికాలో ఉన్నారు. మణిపాల్ యూనివర్సిటీ నుంచి ఎంఎస్ కంప్యూటర్స్ పూర్తి చేశారు. 2005లో కన్బాయిన్ కొనుగోలు చేసిన ఎక్యూరమ్ సంస్థకు ఫౌండర్ సీఈఓగా గతంలో పనిచేశారు. సీనియర్ వైస్ ప్రెసిడెంట్ గా, బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగాల్లో వెంకట్ కి విశేష అనుభవం ఉంది. ఇక జతిన్ దేశాయ్ టీంలో మరో వ్యక్తి. బ్యాంకింగ్ రంగంలో ఆయనకు కూడా దాదాపు 25 ఏళ్ల అనుభవం ఉంది. శ్రీధర్ రాంపల్లి. అతను కూడా టీంలో కీలక సభ్యుడు. ఫైనాన్స్ రంగంలో దాదాపు రెండు దశాబ్దాల అనుభవం ఉంది. వీరితో పాటు మరో నలుగురు సంస్థలో పనిచేస్తున్నారు.

సవాళ్లు, భవిష్యత్ ప్రణాళికలు

సక్సెస్ ఫుల్ స్టార్టప్ ని గుర్తించడం అతిపెద్ద సవాలంటారు వెంకట్. సరైన స్టార్టప్ ను గుర్తించినప్పుడే తమలాంటి ఇన్వెస్ట్ మెంట్ కంపెనీలకు భవిష్యత్ ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. అమెరికాతో పోలిస్తే భారత్ లో పరిస్థితులు వేరు.. ఇక్కడ అంత తొందరగా స్టార్టప్ లు విజయవంతం కావు.. ఇకో సిస్టమ్ మార్పుకు పాటుపడటమే తమ బాధ్యత అన్నారు వెంకట్.

వచ్చే రెండేళ్లలో ముంబై, హైదరాబాద్ లలో 100 కోట్ల పెట్టుబడులు పెడతామన్నారు వెంకట్. దీని తర్వాత నిధుల సమీకరణ చేపడతామని చెప్పారు. ప్రస్తుతం నిధులకు ఏం ఢోకా లేదన్నారు. ఇతర మెట్రో నగరాల్లో తమ ఆలోచనలకు తగిన స్టార్టప్ లభిస్తే కచ్చితంగా ఇన్వెస్ట్ చేస్తామన్నారు.

“స్టార్టప్ ప్రారంభించడం కంటే, పెట్టుబడి పెట్టిన స్టార్టప్ ను సక్సెస్ ఫుల్ గా రన్ చేయడం, సస్టేయినబుల్ గా దాన్ని ముందుకు తీసుకెళ్లడం అన్నింటి కంటే కష్టమైన పని అని ముగించారు వెంకట్”