ఆటలతోనూ అదిరిపోయే వ్యాపారం చేస్తున్న లేజర్ రిపబ్లిక్‌

0

మన దేశంలో పట్టణీకరణ పెరిగిపోవడంతో ఆట స్థలాలు కనుమరుగయ్యాయి. దీంతో సిటీ చిన్నారులకు శారీరకంగా కష్టపడే యాక్టివిటీ ఉండడంలేదు. వీటన్నిటికి తోడు... యాక్షన్ వీడియో గేమ్‌లు ఆడుకునేప్పుడు కూడా జంక్ ఫుడ్ తింటం బాగా అలవాటయిపోయింది మనతోపాటు మన పిల్లలకు కూడా.

స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి గ్రూపులగా అప్పుడప్పుడూ టూర్లకు వెళుతూనే ఉంటాం. “అమెరికా లాంటి దేశాల్లో కిడ్స్ పార్టీస్ ఓ కల్చర్. అయితే ఇవన్నీ ఏదైనా యాక్టివిటీ బేస్డ్‌గా ఉంటాయి. మన దేశంలో ఇది తక్కువే. కానీ లేజర్ ట్యాగ్ లాంటి ఆటలు మన దేశంలోనూ ఇప్పుడు బాగానే ఆకట్టుకుంటున్నాయి. అయితే... ఈ ఆటల విధానంలోనూ, గేమింగ్ అనుభూతిలోనూ కొన్ని మార్పులు రావాల్సి ఉంది. దీన్నే అవకాశంగా మార్చుకున్నాం” అంటున్నారు లేజర్ రిపబ్లిక్ సహ వ్యవస్థాపకుడు నవ్‌జీత్.

లేజర్ రిపబ్లిక్ సంస్థ లేజర్ ట్యాగ్ వంటి గేమింగ్, ఎంటర్టెయిన్మెంట్ ఉత్పత్తులను తయారు చేస్తుంది. నిజంగా లేజర్ గన్స్‌ని ఉపయోగిస్తున్నామన్నంత భ్రమ కలిగే స్థాయిలో ఉంటాయవి. నవతరం చిన్నారుల నెక్స్ట్ జనరేషన్ ఆటలను అందించడమే తమ లక్ష్యంగా చెబ్తోంది ఈ కంపెనీ. “లేజర్ ట్యాగ్ ఎక్విప్‌మెంట్ తయారీలో మేం దేశంలోనే అత్యున్నత స్థాయిలో ఉన్నాం. ప్రస్తుతం ఉన్న మార్కెట్లో అత్యంత క్వాలిటీతో వీటిని సరఫరా చేసింది మేమే” అని చెప్పారు నవ్‌జీత్.

ఈ స్టార్టప్ కంపెనీ పలు బర్త్‌డే, వీకెండ్, కార్పొరేట్ పార్టీలను కూడా నిర్వహిస్తోంది. “కార్పొరేట్ పార్టీలలో మేం పోటీలు నిర్వహిస్తుంటాం. విజేతను ఎంపిక చేసేందుకు మా దగ్గరో నిర్దిష్టమైన విధానముంది” అంటున్నారు నవ్‌జీత్.

లేజర్ బీమింగ్

“ ప్రస్తుతం 7 లేజర్ ట్యాగ్ సెంటర్లు మా ఎక్విప్‌మెంట్ ఉపయోగిస్తున్నాయి. ఇంకా చాలామంది ఎంక్వైరీ స్థాయిలో ఉన్నారు. ఈ వ్యాపారంలో చాలా వేగంగా ఆదాయం సమకూరే అవకాశముండడంతో.... దీనికి బాగా క్రేజ్ ఉంది. ఇది వినూత్నమైనదే కాకుండా... దీనికి మార్కెట్ అవకాశాలున్నాయి.”- నవ్‌జీత్.

త్వరలో మొబైల్ సెటప్స్ కూడా నిర్వహించేందుకు సిద్ధమవుతోంది లేజర్ రిపబ్లిక్. థీమ్ పార్కులు, ఎమ్యూజ్‌మెంట్ పార్కుల్లో వీటిని నిర్వహించేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఎక్విప్‌మెంట్ విక్రయాలే కాకుండా... దానికి అవసరమైన సర్వీసింగ్‌పైనా ఆదాయం సమకూరే స్టార్టప్ ఇది.

“వ్యాపారులు, కస్టమర్లు... ఇద్దరినీ సంతృప్తిపరచే కాన్సెప్ట్ ఇది. అలాగే కస్టమర్ల నుంచి రియల్ టైం ఫీడ్ బ్యాక్ తీసుకోవచ్చు. గేమ్‌, ఎక్విప్‌మెంట్‌లో కీలక మార్పులు... కస్టమర్ల అభిరుచికి అనుగుణంగా చేసినవే. మార్కెట్ డిమాండ్ ఆధారంగా... మా ఉత్పత్తిలో పలు వేరియంట్లను కూడా ప్లాన్ చేసుకుంటున్నాం” అని చెప్పారు నవ్‌జీత్.

ఆటకి సవాళ్లు

“ఆటలో ఎంజాయ్‌మెంట్ పెంచడమే మా ప్రధాన లక్ష్యం. కస్టమర్లను సంతృప్తి పరచేలా.., ఈ ఆటలో పలు మార్పులు చేస్తూనే ఉండాలి” అంటారు నవ్‌జీత్. ఈ గేమింగ్ ఎక్విప్‌మెంట్ డిజైన్ సమయంలోనే తీసుకున్న జాగ్రత్తల కారణంగా... పలు వేరియంట్లు, గేమింగ్ ఆప్షన్లను పరిచయం చేసే అవకాశముంది. అలాగే నచ్చినట్లుగా మార్చుకుంటూనే ఉండొచ్చు. కస్టమర్లకు గేమ్ ఎప్పటికీ బోర్ కొట్టకుండా ఉండేందుకు ఈ జాగ్రత్తలు అవసరమంటుంది లేజర్ రిపబ్లిక్.

తామే అభివృద్ధి చేసిన హార్డ్‌వేర్ డిజైన్(మెకానికల్, ఎలక్ట్రానిక్), ఫిర్మ్‌వేర్, సాఫ్ట్‌వేర్‌లను నిర్వహించాల్సి ఉండడం, కాపాడుకోవడం కూడా లేజర్ రిపబ్లిక్‌కు సవాలే అని చెప్పాలి.

ఈ రెండింటితో పాటు... కస్టమర్లకు వీలైనంత త్వరగా కస్టమైజ్డ్ ఎక్విప్‌మెంట్ అందించడం అసలు సవాల్ అని చెప్పాలి. “ మా దగ్గరున్న డిజైన్, ఆర్కిటెక్చర్‌ల సాయంతో... పూర్తి స్థాయి లేజర్ ట్యాగ్ బిజినెస్ ఎక్విప్‌మెంట్‌ను కస్టమర్‌కు 5వారాల్లో అందించగలమ”ని చెప్పారు నవ్‌జీత్.

గేమ్ ఫీచర్స్

“గేమ్‌లో ఉపయోగించే ఫేజర్లు నిజమైన గన్స్ ఉపయోగించే అనుభూతినిస్తాయి. ఫైర్ చేసినపుడు సౌండ్, లైటింగ్ చాలా ముఖ్యం. ఫేజర్లను రెండు చేతులతో పట్టుకుంటే మాత్రమే పని చేస్తాయి” అని చెబ్తున్నారు నవ్‌జీత్.

“ప్లేయర్లు ధరించే జాకెట్లపై వెలుగులు విరజిమ్మే లైట్స్ ఉంటాయి. ఒకేసారి 7 టీంలు గేమ్ ఆడొచ్చు. అద్భుతమైన పెర్ఫామెన్స్ ఉండేలా ఈ గేమ్ డిజైనింగ్ కోసం టెక్నాలజీ ఉపయోగించాం. ప్రస్తుతం 10 రకాల గేమింగ్ ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి”-నవ్‌జీత్.

website