ఫ్యాషన్ డిజైనర్, బేస్ బాల్ ప్లేయర్... ఇప్పుడు సక్సెస్‌ఫుల్ ఆంట్రప్రెన్యూర్

ఫ్యాషన్ డిజైనర్, బేస్ బాల్ ప్లేయర్... ఇప్పుడు సక్సెస్‌ఫుల్ ఆంట్రప్రెన్యూర్

Sunday August 30, 2015,

3 min Read

స్కూల్ అడ్మిషన్ కోసం వెళ్లి.. అడ్మినిస్ట్రేటర్‌గా మారారు.

కిడ్జీ ప్రీ స్కూల్‌తో మరో ప్రస్థానం ప్రారంభం.

80 మంది జీవితాలకు బీనా భరోసా.

మగాళ్లైతే ఏంటి గొప్ప ? అని ప్రశ్నించే బీనా అరవింద్.


చాలా మంది ఉద్యోగం చేసే మహిళలు, పిల్లలు పుట్టిన తర్వాతో లేదా బాధ్యతల భారంతో విశ్రాంతి తీసుకుంటారు. లెక్కల్లో చెప్పాలంటే దాదాపు 36 శాతం భారతీయ మహిళా ఉద్యోగులు పెళ్లైన తరువాత చేస్తున్నది అదే. కానీ బీనా అరవింద్ ఎంచుకున్న మార్గం మాత్రం విభిన్నమైనది. వినూత్నమైనది.

ఫ్యాషన్ డిజైన్‌లో డిగ్రీ పూర్తయిన తరువాత ఎప్పటి నుంచో కంటున్న కలను నేరవేర్చుకోవాలనుకున్నారు. ఓ బోటిక్‌ను ప్రారంభించాలని భావించారు. కానీ అప్పటికే తాను కవలలకు జన్మనివ్వబోతున్నట్లు తెలిసింది. అందరు మహిళల్లాగే ఆలోచించి కొత్త వ్యాపారం తన బిడ్డలపై ప్రభావం చూపుతుందని భావించి తన కలను కలగానే ఉంచేశారు. ఒక అవకాశం చేజారిపోతే .. మరో అవకాశం ఎదురు చూస్తుంది. బీనా విషయంలో అదే జరిగింది.

బీనా అరవింద్

బీనా అరవింద్


తన పిల్లలిద్దర్ని కిడ్‌జీ ప్రీ స్కూల్లో చేర్చేందుకు అడ్మిషన్ కోసం వెళ్లారు బీనా. అక్కడ సెంటర్ హెడ్‌తో మాట్లాడిన తరువాత తానే అలాంటి ప్రీ స్కూల్ ఎందుకు ప్రారంభించకూడదన్న ఆలోచన వచ్చింది. అందులో చాలా సానుకూల అంశాలే కనిపించాయి. చిన్నారులతో రోజంతా గడపొచ్చు. వాళ్ల కన్నీళ్లు, బోసినవ్వులు , ఆ అరపులు,కేకలు ..గందరగోళం.. కావలసినంత ఆనందాన్నిస్తాయి. మరో కలిసొచ్చే అంశం ఏంటంటే స్కూల్ అయిపోయిన తర్వాత రోజూ సాయంత్రాలు హాయిగా తన కుటుంబసభ్యులతో గడపొచ్చు.

2007లో మొట్ట మొదట కిడ్జీ ఫ్రాంచైజీని బెంగళూరులోని మర్థహళ్లిలో ప్రారంభించారు. కొత్తలో కిడ్జీ యాజమాన్యం నుంచి పూర్తిగా సహాయ సహకారాలు లభించాయి. కిడ్జీ ఫ్రాంచైజీ ఓనర్లను అన్ని రకాల పరీక్షలకు గురి చెయ్యడం ద్వారా భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందుల్నైనా ఎదుర్కొనే విధంగా తయారు చేస్తుంది యాజమాన్యం. ఆ తరువాత ఆమె మరో రెండు ఫ్రాంచైజీలు తీసుకున్నారు. వాటిని బ్రూక్ ఫీల్డ్స్, నారాయణపురలో ప్రారంభించారు. మార్థనహళ్లి సెంటర్ జాతీయ స్థాయి కిడ్జీ ప్రీ సూల్స్‌లో బెస్ట్ స్కూల్ గా వరుసగా మూడేళ్ల పాటు ఎంపికయ్యింది. మన తలరాతను మనమే మార్చుకోవచ్చంటారు బీనా. జీవితం అంటేనే పని చెయ్యడానికి పిలుపు. జరగాల్సినవి జరుగుతుంటాయి. నువ్వు మాత్రం విభిన్నంగా ప్రయత్నించు. 

"వర్తమానంపై దృష్టి పెడితే భవిష్యత్తులో దేని కోసం ఎదురు చూస్తామో అది జరుగుతుంది. " ఈ సూత్రాన్ని బాగా నమ్ముతారు బినా.

సందర్భానుసారంగా కొన్ని సార్లు తన బాధ్యతలనుంచి విరామం తీసుకొని తన కోసం కేటాయించుకుంటారు బీనా. ప్రయాణాలంటే ఆమెకు చాలా ఇష్టం. తన ఫ్రాంచైజీ ప్రారంభించినప్పటి నుంచి వేసవి సెలవులన్నీ అడ్మిషన్ల హడావుడితోనే గడిచిపోతాయి. అందుకే దసరా సెలవుల్లో తన కుటుంబసభ్యులతో గడిపేందుకు ప్లాన్ చేసుకుంటారు. దుబాయ్ ఆమెకిష్టమైన ప్రదేశం. ఎందుకంటే తన షాపింగ్ పిచ్చికి మందు అక్కడే దొరుకుతుంది కాబట్టి.

మహిళా ఆంట్రపెన్యూర్‌గా ఆమె ఎప్పుడూ ఇబ్బందిపడలేదు. పురుషులు, స్త్రీలు ఇద్దరూ భూమ్మీదే పుట్టారు . ఏంటి తేడా..? అంటారామె.

"గొప్ప గొప్ప వ్యక్తుల జీవితాలన్నింటిలోనూ ప్రతి ఒక్కరి విజయం వెనుక తల్లిగానీ, భార్యగానీ ఉన్నారని చెప్పడం మనం వింటూ ఉంటాం. కానీ ఎంత మంది గొప్ప మహిళలు తమ విజయం వెనుక తండ్రో, భర్తో ఉన్నారని చెప్పడం విన్నాం." అని ఎదురు ప్రశ్నిస్తారు బీనా.

కానీ ఆ విషయంలో బీనా చాలా అదృష్టవంతురాలు. ఆమె విజయతీరాలను చేరుకోవడం వెనకు ఆమె భర్త అరవింద్ సహాయ సహకారాలు పూర్తిగా ఉన్నాయి.

కిడ్‌జీలో పిల్లలు

కిడ్‌జీలో పిల్లలు


ఇది ప్రపంచాన్ని ఏలాలనుకునే మహిళలకోసం. " నిజానికి బీనా ఓ క్రీడాకారిణి కావడం వల్లే ఎక్కడికైనా వెళ్లాలి.. సాధించాలి అన్న స్ఫూర్తికి అలవడింది. ఆమె తన కాలేజీ రోజుల్లో బాస్కెట్ బాల్, వాలీబాల్, త్రోబాల్, వంటి చాలా ఆటలు ఆడేవారు. బేస్ బాల్ టీంలో కర్నాటక జట్టుకు కూడా ఆమె ప్రాతినిధ్యం వహించారు. అందుకే ఆమె ప్రతి రోజూ తన ఫిట్‌నెస్‌ను మెరుగుపరచుకోవడం కోసం ఇప్పటికీ కొంత సమయాన్ని కేటాయిస్తుంటారు.

ఆమెకు వ్యక్తిగతంగా అత్యంత సంతృప్తినిచ్చే అంశం తన స్టాఫ్ జీవితాల్లో మార్పు తీసుకురావడం. మొత్తం మూడు శాఖల్లో టీచర్లు, సహాయకులు, డ్రైవర్లు, సెక్యూరిటీ సిబ్బంది అంతా కలిపి సుమారు 80 మంది వరకు ఉంటారు. కొన్నేళ్ల నుంచే పని చేస్తున్నా వాళ్లందర్నీ తన కుటుంబసభ్యుల్లాగే చూసుకుంటారు బీనా. ఎన్నో ఎత్తుపల్లాలను వారితో కలిసి పంచుకున్నారు. తన విస్తారమైన విద్యాసంస్థల్లో ఎక్కువమంది మహిళలే. ఇదొక్క ఉదాహరణ చాలు ఓ మహిళా ఆంట్రపెన్యూర్‌గా ఎంత మంది మహిళల జీవితాల్లో మార్పు తీసుకురాగలరో చెప్పడానికి. వాళ్లంతా చాలా సంతృప్తితో సంతోషంతో ఎలాంటి ఆర్థిక కష్టాలు లేకుండా పని చేసుకోగలుగుతున్నారు.

బీనా తన ప్రీ స్కూళ్లలో డేకేర్ సదుపాయాలను ఏర్పాటు చెయ్యలేదు. వర్క్ లైఫ్ విషయంలో ఆమె రాజీ పడదల్చుకోలేదు. ఆర్థికంగా కొంత నష్టం రావచ్చు. కానీ పాత సామెత చెప్పినట్లు అన్నింటిని డబ్బుతో ముడిపెట్టలేం.

కాలేజీ రోజులు... ఉదయాన్నే లేవడం..రోజంతా బాగా గడపటం సంతోషం అంటే ఇదే అనుకుంటాం. కానీ బీనా దృష్టిలో బాల్యాన్ని నెమరు వేసుకోవడమే ఆనందానికి మూలం. "అందరూ భగవంతుని బిడ్డలే... ప్రతి ఒక్కరికీ ఆయన సాయం చేస్తాడు". ఎదగాలి.. ఎదగాలి ఎంత నేర్చుకుంటే అంత ఎదుగుతాం.


This article is sponsored by kidzee