సెల్ టవర్ నుంచి ఎంత రేడియేషన్ విడుదలవుతుందో తెలుసుకోవచ్చు  

0

మొబైల్స్ వాడకం పెరిగింది. దాంతోపాటు టవర్ల సంఖ్య కూడా పెరిగింది. అభివృద్ధికి సూచిక అని సంతోషించేలోపు- రేడియేషన్ పంజా విసురుతోంది. సెల్ టవర్ల దెబ్బకు ఊరపిచ్చుకలు ఉనికిని కోల్పోయాయి. మనిషి మనుగడ కూడా ప్రశ్నార్ధకంలో పడింది. ఈ నేపథ్యంలో కేంద్రం చొరవ తీసుకుని ఒక మంచి పనికి శ్రీకారం చుట్టింది.

మీ ఏరియాలో సెల్ టవర్ ఉందా? అయితే దాన్నుంచి ఎంత రేడియేషన్ విడుదలవుతుందో చిన్న క్లిక్ ద్వారా తెలుసుకోవచ్చు. ఏ సెల్ టవర్ నుంచి ఏ స్థాయిలో రేడియో ధార్మిక తరంగాలు విడుదల అవుతున్నాయో తెలుసుకోవచ్చు. పరిమితికి మించి రిలీజ్ అయితే వెంటనే ఫిర్యాదు చేయొచ్చు. తరంగ్ సంచార్ ఏర్పటు చేసిన వెబ్ సైట్లోకి వెళ్లి, మీరు ఉంటున్న ఏరియా తదితర వివరాలు నమోదు చేస్తే, టవర్ నుంచి వచ్చే రేడియేషన్ ఎంతో చెప్పేస్తుంది.

ఒకవేళ ఆ టవర్ మీద మీకు ఇంకా అనుమానం ఉంటే రూ. 4వేలు ఆన్ లైన్ లో చెల్లించి పరీక్ష నిర్వహించమని కోరవచ్చు. స్థానిక టెలికం ఎన్ఫోర్స్ మెంట్ రిసోర్స్ అండ్ మానిటరింగ్ ఆధ్వర్యంలో పరిశీలిస్తారు. దానికి సంబంధించిన డిటెయిల్డ్ రిపోర్ట్ ఫిర్యాదు చేసిన వ్యక్తి పంపుతారు. ఈ వెబ్ సైట్లో దాదాపు నాలుగున్న లక్షలకు పైగా మొబైల్ టవర్లు, 14 లక్షల బేస్ స్టేషన్ల రేడియేషన్ సమాచారం నిక్షిప్తమై ఉంది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ జరిపిన 25వేల అధ్యయానాల ప్రకారం, గత 30 ఏళ్లుగా సెల్ టవర్ల నుంచి విడుదలవుతున్న రేడియేషన్ మూలంగా మనుషులకు ఎలాంటి ముప్పు జరగలేదని కేంద్ర టెలికం మంత్రి మనోజ్ సిన్హా అన్నారు. డబ్ల్యూహెచ్‌వో సిఫారసు ప్రకారం సెల్ టవర్ల విషయంలో ఇండియా పదిరెట్లు కఠినమైన నిబంధనలు పాటిస్తోందని ఆయన అన్నారు.

Related Stories

Stories by team ys telugu