యాప్స్‌లో ఉన్న సమస్యలకు పరిష్కారం చూపించే యాప్నాక్స్‌

టాప్ యాప్స్‌లో 80శాతం లూప్ హోల్స్ టెస్టింగ్‌తో పాటు పరిష్కార మార్గంసింగపూర్‌లో మొదలైన ప్రయాణం80శాతం గ్యారంటీ సొల్యూషన్ తో దూసుకుపోతున్న యాప్నాక్స్

యాప్స్‌లో ఉన్న సమస్యలకు పరిష్కారం చూపించే యాప్నాక్స్‌

Saturday May 16, 2015,

2 min Read

అప్లికేషన్‌లో లూప్ హోల్స్‌ను గుర్తించడం ఎలా ? యాప్ డెవలపర్స్‌తో పాటు ఎంటర్‌ప్రైజెస్ ఈ విషయంలో ఎంతో ప్రయాస పడతుంటాయి. దీనికో పరిష్కారమార్గం చూపుతానంటోంది యాప్నాక్స్. వారికి నిరంతరాయంగా సేవలందించడంతోపాటు అప్లికేషన్లపై ఎప్పటికప్పుడు అలెర్ట్ చేస్తుంది. సింగపూర్ కేంద్రంగా జనవరి 2014లో యాప్నాక్స్‌ను హర్షిత్ అగర్వాల్, సుభో హల్దర్, ప్రతీక్ పండా ప్రారంభించారు.

టీం యాప్నాక్స్

రెండేళ్ల పాటు రక్షణకు సంబంధించిన (సెక్యూరిటీ స్పేస్)లో పనిచేసిన తర్వాత సుభో... యాప్నాక్స్‌పై పని చేయడం ఆరంభించారు. అటు కస్టమర్లతోపాటు ఇటు యాప్ డెవలపర్ల సమస్యలను అర్థం చేసుకోవడంలో యాప్నాక్స్ తనదైన ముద్ర వేసిందనే చెప్పాలి. భద్రతా విలువల విషయంలో దీన్నో నమ్మదగిన భాగస్వామిగా గుర్తింపు తెచ్చుకుంది.

“మొబైల్ యాప్స్ ఫీచర్స్‌ని కలిగి ఉంటాయి తప్పితే, సెక్యూరిటీ విషయంలో కనీస విలువలు పాటించవు. ఇదే అసలు సమస్యకు కారణం” అని సుభో చెబుతున్నారు. దీంతో థర్డ్ పార్టీ హ్యాకర్లు యాప్‌లో ప్రవేశించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ కారణంగా కస్టమర్లకు యాప్‌పై నమ్మకాన్ని తగ్గించేలా చేస్తుంది. ప్రధాన బ్రాండ్లన్నీ మొబైల్ యాప్‌లలోకి ప్రవేశించడానికి , కస్టమర్లకు మరింత చేరువ కాడానికి విశ్వప్రయత్నం చేస్తున్నాయి. ఈ ఏడాది పూర్తయ్యే టప్పటికి 75శాతం యాప్‌లు బేసిక్ సెక్యూరిటీ టెస్ట్ విషయంలో ఫెయిల్ అవుతాయని అంచనా. 

''ఫేస్‌బుక్ , గూగుల్, మైక్రోసాఫ్ట్, స్కైప్, పేపాల్ తోపాటు చాలా వాటిల్లో లోటుపాట్లను గుర్తించామంటారు సుభో. గొప్పగా చెప్పుకొనే చాలా యాప్స్‌లో కూడా కనీసం సెక్యూరిటీ విలువలు పాటించక పోవడం ఇక్కడ మనం గమనించొచ్చు. మొదటి టాప్ 100 యాప్స్‌ లను మేం స్కాం చేశాం. దీనిలో 80శాతం సంస్థలపై హ్యాకర్లు సులువుా దాడి చేయొచ్చు. ఇప్పటి వరకూ మాకు సింగపూర్ లోనే బేస్ ఉండేది. ఇప్పుడు ఇండియాలో కూడా ప్రవేశించాం. ఇక్కడ తొందరగానే పుంజుకోగలిగామని సుభో అంటున్నారు.

హర్షిత్ అగర్వాల్, సుభో హల్దర్, ప్రతీక్ పండా- యాప్నాక్స్ వ్యవస్థాపకులు

హర్షిత్ అగర్వాల్, సుభో హల్దర్, ప్రతీక్ పండా- యాప్నాక్స్ వ్యవస్థాపకులు


మొబైల్ యాప్ సెక్యూరిటీ విషయంలో చాలా రకాలైన ఆఫ్‌లైన్ టెస్టులు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇవి మ్యానువల్ గా స్కాన్ చేస్తాయి. ఇవి పెద్దగా ఖర్చుతో కూడుకున్నవైతే కావు. ఆన్ లైన్ సొల్యూషన్స్ కూడిన మొబైల్ యాప్ స్కాన్ రిపోర్ట్ లను ఇవ్వడంతో పాటు కచ్చితంగా నిర్థారిస్తుంది. ఇదిలా ఉంటే పెద్ద బ్రాండ్‌ల విషయంలో నిర్ణీత బడ్జెట్ లేకుండా పరిష్కారం చూపించడం కష్టమే. యాప్నాక్స్... సోర్స్ కోడ్‌తో పాటు అప్లికేషన్ కోడ్‌లకు సెక్యూరిటీ ఆడిటింగ్ నిరంతరంగా చేస్తుంది.

పబ్లిష్ అవ్వడానికి ముందు, ఆ తర్వాత.. మొబైల్ యాప్స్‌ని ఆటోమేటిక్‌గా స్కాన్ చేస్తుంది. ఏదైనా సమస్య ఉంటే అలెర్ట్ చేస్తుంది. యాప్నాక్స్ టీం సెల్ఫ్ లెర్నింగ్ సిస్టమ్‌ని డెవలప్ చేసింది. నిరంతరంగా సిస్టమ్‌కి స్కోరింగ్ ఇస్తూ డెవలపర్స్ కోడింగ్ ప్రాక్టీస్ చేసుకోడానికి, హైక్వాలిటీ కోడ్‌ని మెయింటెయిన్ చేసేలా సాయపడుతుంది. ఏదైనా థ్రెట్ లేదా లూప్ హోల్ ఉండే అవకాశాలను బైనరీ కోడ్ ద్వారా 48 గంటల్లో స్కానర్ కనిపెట్టగలదు. యాప్నాక్స్, సింగపూర్‌కి చెందిన జాయ్ఫుల్ ఫ్రాగ్ డిజిటల్ ఇంక్యుబేటర్ (జెఎఫ్డిఐ ఏషియా)లో సభ్యత్వాన్ని కలిగి ఉంది. దీంతోపాటు ఇండియాలో మైక్రోసాఫ్ట్ వెంచర్స్ యాక్సలరేటర్‌లో యాప్నాక్ భాగస్వామి. పరిష్కారాలు చూపించడంలో యాప్నాక్స్ మరిన్ని విశేషాలను కలిగి ఉంది.