టీచర్లను - తల్లిదండ్రులను కలిపి ఉంచే “యూలో”

1

పిల్లలకు మంచి చదువు చెప్పించాలని, వారిని గొప్పగా చూడాలని తల్లిదండ్రులందరూ కలలు కంటుంటారు. ఇందుకోసం మంచి వేదిక కోసం వెతుకుతుంటారు. అందరిలాగే తమ పిల్లలకోసం కూడా స్కూల్ వేటలో పడ్డారు అంకుర్ పాండే మరియు బద్రిష్ అగర్వాల్. అయితే.. ప్రీ స్కూల్ స్టేజ్‌లో తల్లిదండ్రులు - టీచర్ల మధ్య గ్యాప్ ఉందని గమనించారు. ఈ అంతరాన్ని పూడ్చేందుకు ఏ ఏ సమస్యలున్నాయో గుర్తించడం మొదలుపెట్టారు. ఇద్దరూ ఒకే తరహా సమస్యలు ఎదుర్కొన్నారు. దీని పరిష్కారం కోసం 2013లో ది యూలో ప్రారంభించారు. 

“ తల్లిదండ్రుల ఫోన్ కాల్స్, పేపర్ నోట్సుల నుంచి మేం విముక్తి కల్పించదలచుకున్నాం. ఆ స్థానంలో మొబైల్ ద్వారా ఎప్పటికప్పుడు విద్యార్థుల సమాచారాన్ని ఎప్పటికప్పుడు తల్లిదండ్రులకు చేరవేసేలా దీన్ని రూపొందించాం” అన్నారు బద్రిష్.

ఫోన్ చేయడం, డైరీలో రాసిపంపడం లాంటి సాధారణ పద్ధతులకు యూలో స్వస్తి చెప్పింది. దాని స్థానంలో ఫోన్ అప్లికేషన్‌ను తీసుకొచ్చాం. ఇది విద్యార్థి ఉండే ప్రదేశం, అతడి హాజరు, పనితీరు.. లాంటి అన్ని విషయాలను నమోదుచేస్తుంది. కంపెనీ ప్రతిష్టాత్మకంగా రూపొందించిన కనెక్ట్ఈజీ (KonnectEz) ఇప్పుడు బెంగళూరు, హైదరాబాద్ లోని 150 ప్రీ స్కూళ్లలో అమల్లో ఉంది. విద్యార్థులు, టీచర్లు, యాజమాన్యానికి సంబంధించిన విస్తృతస్థాయి సమాచారాన్ని ఇది నిక్షిప్తం చేస్తోంది. “ ప్రీస్కూల్ స్టేజ్‌లో విద్య అబ్బాలంటే పాఠశాలకు, తల్లిదండ్రులకు మధ్య మంచి సంబంధాలున్నప్పుడే సాధ్యమవుతుంది. వ్యవస్థాగత పనులు తగ్గించి పిల్లలపైన అధిక శ్రద్ధ చూపేందుకు మేం ప్రయత్నించాం” అంటున్నారు అంకుర్.

కనెక్ట్‌ఈజీని వాడుకుంటున్నందుకు తల్లిదండ్రులు సంవత్సరానికి కొంత మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. “ పాఠశాలలు భాగస్వాములవుతాయి కానీ డబ్బు చెల్లించవు” అంటున్నారు బద్రిష్. అహ్మదాబాద్ లో ఎంబీఏ పూర్తి చేయకముందు పలు సాఫ్ట్‌వేర్ మల్టీ నేషనల్ కంపెనీలకు టెక్నికల్ ఆర్కిటెక్ట్‌గా బద్రిష్ సేవలందించారు. ఇక సిన్సినాటి యూనివర్సిటీ నుంచి కంప్యూటర్ ఇంజినీరింగ్ లో ఎమ్మెస్సీ పూర్తి చేసిన అంకుర్ ప్రపంచవ్యాప్తంగా సెమీకండక్టర్ కంపెనీలలో పనిచేశారు. ఆ తర్వాత ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుంచి ఎంబీఏ పూర్తి చేశారు.

మెరుగైన ఇంజినీర్లను రిక్రూట్ చేసుకోవడం చాలా కష్టం. వ్యవస్థాపకులిద్దరూ తమకున్న టెక్నికల్ నాలెడ్జ్ తో దీన్ని రూపొందించారు. “ప్రారంభంలో తయారు చేసిన ప్రాజెక్టు చాలా తక్కువ స్కూళ్లలోనే ప్రారంభమైంది. స్పందన కూడా అంతంతమాత్రమే. అయితే ఈ పాఠశాలల్లో పనిచేసేవాళ్లు ఇతరులతో షేర్ చేసుకున్న అనుభవాల ద్వారానే మాకు ఎక్కువ ప్రచారం కల్పించింది. ఇంది మరిన్ని స్కూళ్లకు చేరువయ్యేలా చేసింది. దీని గురించి తెలుసుకున్నవాళ్లు దీనిపై పనిచేసేందుకు ఎక్కువ ఉత్సాహం చూపించారు.” అని చెప్తున్నారు అంకుర్.

సమాచారాన్ని మించిన వ్యవస్థ

బెంగళూరు కేంద్రంగా గతేడాది ఈ సంస్థ తన కార్యకలాపాలు మొదలుపెట్టింది. “ ఆరంభంలోనే ఇతర నగరాలకు కూడా వ్యాపించగలగడం మా సంస్థ అభివృద్ధికి నిదర్శనం” అంటున్నారు బద్రిష్. కనెక్ట్ఈజి అనేది మొబైల్ కేంద్రంగా పనిచేస్తుంది. అప్లికేషన్ ద్వారా ఎప్పటికప్పుడు తల్లిదండ్రుల మొబైళ్లకు సమాచారం అందిస్తుంది. “మాది మొబైల్ ఫస్ట్ స్ట్రాటజీ. దాని ద్వారానే మేము భిన్నత్వాన్ని చూపించగలుగుతన్నాం” అంటున్నారు అంకుర్. 

ఉదాహరణకు యూలో మొబైల్ అప్లికేషన్ ద్వారా తల్లిదండ్రులు టీచర్ తో నేరుగా మాట్లాడవచ్చు. పిల్లలకు సంబంధించిన ఫోటోలను, వారు పార్టిసిపేట్ చేసిన ఈవెంట్లను టీచర్లు నేరుగా తల్లిదండ్రులకు పంపించవచ్చు. ఇవన్నీ పిల్లల ఆల్బమ్ గా తయారవుతాయి. అంతేకాదు.. పిల్లలకు సంబంధించి ఏవైనా మందులు వేయాల్సిఉంటే టీచర్లకు రిమైండర్ కూడా సెట్ చేయవచ్చు.

యూలో టీమ్
యూలో టీమ్

మరింత ముందుకు..!

“ప్రీస్కూల్ స్టేజ్‌లో కొంతమంది పోటీదారులున్నరు” అంటున్నారు అంకుర్. ముంబై కేంద్రంగా నడుస్తున్న నిట్ ఆప్ (Knit App), ఎడునెక్స్ట్ కు చెందిన మై స్కూల్ (my School) మరియు బేబీ చక్ర (Baby Chakra) లతో యూలో పోటీపడుతోంది. ఇవన్నీ ఇప్పటికే మనుగడలో ఉన్న కంపెనీలు. డిజిటలైజింగ్ స్కూల్ కమ్యూనికేషన్ అనేది కొత్త ఆలోచన కాదు. అమెరికా- న్యూజెర్సీలోని మాంట్ క్లెయిర్ స్టేట్ యూనివర్సిటీకి చెందిన సుసానా జునియు అనే ప్రొఫెసర్ పేరంట్-టీచర్ కమ్యూనికేషన్ పై విస్తృతంగా అధ్యయనం చేశారు. కంప్యూటర్ మీడియేటెడ్ పేరంట్-టీచర్ కమ్యూనికేషన్ (Computer mediated parent- teacher communication) అనే పేపర్ కూడా సమర్పించారు.

ఇప్పుడు యూలో K12 సెగ్మెంట్ కు కూడా విస్తరించేందుకు ప్రయత్నిస్తోంది. “ ప్రస్తుతం వినియోగంలో ఉన్న ఏ సంస్థా కూడా మా అంతగా విద్యార్థులు, తల్లిదండ్రులు, టీచర్ల మధ్య కమ్యూనికేషన్ ను డెవలప్ చేయడం లేదు. ఇదే మమ్మల్ని మరింత వేగంగా అభివృద్ధి చెందేందుకు దోహదం చేస్తుంది” అనేది బద్రిష్.

మరిన్ని వివరాల కోసం ఇక్కడ తెలుసుకోండి.