రెండేళ్ల సకల వైఫల్యాల పాలన..!!

రెండేళ్ల సకల వైఫల్యాల పాలన..!!

Thursday May 26, 2016,

5 min Read


పది రోజుల పాటు వ్యక్తిగత పనుల కోసం ఢిల్లీకి దూరంగా ఉండి.. నిన్న మధ్యాహ్నమే తిరిగి వచ్చా. ఈ రోజు ఉదయం న్యూస్ పేపర్లోన్నీ తిరగేట ప్పుడు మోదీ ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టి ఈ రోజుకి రెండేళ్లు పూర్తయిందని అర్థమయింది. పేపర్లన్నీ చూసిన తర్వాత నాకు నైతికత అంశం గుర్తుకు వచ్చింది. 2014 ఎన్నికలు ఇంకా నిన్నామొన్ననే జరిగినట్లు ఉన్నాయి. ఇప్పుడు మళ్లీ పెద్ద పెద్ద హోర్డింగులు దర్శనమిస్తున్నాయి. అన్నింటిలోనూ "ఆప్ కీ బార్ మోదీ సర్కార్ "అనే నినాదాలే. పార్లమెంట్ ఎన్నికల సమయంలో బీజేపీ ప్రచారానికి సంబంధించి ప్రధాన ట్యాగ్ లైన్ "ఆప్ కీ బార్ మోదీ సర్కార్ ". దీనితో పాటు అచ్చేదిన్ అనే స్లోగన్ కూడా విపరీతంగా ప్రచారం చేశారు.

ఈ రోజు ఉదయం మళ్లీ అప్ కీ బార్ స్లోగన్లు దాదాపు అన్ని న్యూస్ పేపర్లోనూ పెద్ద పెద్ద అక్షరాల్లో మొదటి పేజీల్లో కనిపించాయి. ఇది అత్యంత భారీ ప్రచార కార్యక్రమం. మోదీ ఆరాధాన భావాన్ని ప్రచారం చేయడాని భారీ ఎత్తున ఖర్చు చేస్తున్నారు. వీటితో పాటు నా దేశం పురోగమిస్తోంది.. పురోగమిస్తూనే ఉటుందని.. అనే అర్థంలో "మేరా దేశ్ బాదల్ రహా హై.. ఆగే బాదా రహా హై" అనే స్లోగన్లు కూడా హైలైట్ చేశారు. దేశం ఎప్పుడూ లేనంతగా అభివృద్ధి పథంలో పయనిస్తోందని.. అదంతా మోదీ పనితీరు వల్లేనని చెప్పడమే దీని ఉద్దేశం. ప్రతి ప్రభుత్వానికి తమ విజయాలను ప్రమోట్ చేసుకునే అధికారం ఉంటుంది. దీనిపై నేను ఎలాంటి వాదనకు దిగబోను. కానీ ఓ విజ్ఞానవంతమైన పౌరునిగా ప్రశ్నించే అధికారం నాకు ఉంది. ప్రకటనల్లో హోరెత్తిస్తున్నట్లుగా దేశం నిజంగా మారుతోందా..?

ప్రాథమికంగా ఓ ప్రశ్న..?. దేశప్రజలు 2014లో మోదీకి పూర్తి మెజారిటీ ఎందుకు కట్టబెట్టారు..?. అవినీతిని అంత మొందించడానికి, నిర్ణయాలు తీసుకోలేని నిస్సహాయతను తొలగించడానికి, విధాననిర్ణయాల్లో అపరిపక్వత లేకుండా చేయాడనికి .. అర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించడానికి ప్రజలు మోదీకి సంపూర్ణ మెజార్టీ కట్టబెట్టారు. ఇప్పుడు మోదీ ప్రభుత్వం ఈ అంశాలన్నింటిపైనా మోదీ ప్రభుత్వం సమర్థవంతంగా ముందుకెళుతోందా..? మన్మోహన్ సింగ్ నుంచి ప్రధానిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత దేశంలో విప్లవాత్మక మార్పులు వచ్చినట్లుగా ప్రస్తుతం మీడియాలో ప్రచారం హోరెత్తిస్తున్నారు. సంబరాలు చేసుకుంటున్నారు. నిజానికి ఆ ప్రచారంలో ఇసుమంతైనా నిజం ఉందా..?

image


మన్మోహన్ సింగ్ ప్రభుత్వం చరిత్రలోనే అత్యంత అవినీతి ప్రభుత్వంగా పేరు తెచ్చుకుంది. అందుకే ప్రజలు మార్పు కోరుకున్నారు. అలాంటి సమయంలో మోదీ రావడం కలసి వచ్చింది. అవినీతిని అంతమొందిస్తారని మోదీపై ప్రజలు చాలా ఆశలు పెట్టుకున్నారు. "నేను అవినీతిలో భాగం కాను.. వేరే ఎవరినీ భాగం కానివ్వను" అని ప్రమాణస్వీకారం చేసిన తర్వాత ఘనంగా ప్రకటించుకున్నారు కూడా. అయితే ఇప్పుడు పరిస్థితి దానికి విరుద్ధంగా ఉంది. మంత్రివర్గంలోని అరడజను మంది మంత్రులు ఆర్థిక నేరాలు, తీవ్రమైన అభియోగాలను ఎదుర్కొంటున్నవారున్నారు. వారిని మంత్రులుగా నియమించడం వల్ల వారి అవినీతికి, నేరాలకు మోదీ చట్టబద్దత కల్పించినట్లయింది. ఇది అవినీతిని సహించనన్న మోదీ ప్రకటనకు విరుద్ధంగా ఉంది.

అవినీతిపై ఎంతో దృష్టి పెట్టినట్లు చెప్పుకుంటున్న మోదీ ప్రభుత్వం రెండేళ్లుగా లోక్ పాల్ ను ఎందుకు నియమించలేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మన్మోహన్ సింగ్ హయాంలోనే లోక్ పాల్ బిల్లు పాసయింది. అయితే ఇప్పటికీ అది అమలులోకి రాలేదు. అగస్టా వెస్ట్ ల్యాండ్ స్కాంపై మోదీ ప్రభుత్వం దూకుడుగా వెళ్తోంది. గాంధీ, నెహ్రూ కుటుంబాన్ని కార్నర్ చేసేందుకు ఉన్న అన్ని అవకాశాలను ఉపయోగించుకుంటోంది. అయితే గత రెండేళ్లుగా ఈ స్కాంపై ఎందుకు దర్యాప్తు చేయలేదనే ప్రశ్నలకు మాత్రం బీజేపీ సమాధానం చెప్పలేకపోతోంది. అదే సమయంలో ఇటలీ ప్రభుత్వం ఈ కేసుపై విచారణ చేసి.. ఇద్దర్ని దోషులుగా గుర్తించి శిక్ష కూడా విధించింది. వాద్రా అనేక భూకుంభకోణాలకు పాల్పడ్డారని... బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత విచారణ జరిపించి చర్యలు తీసుకుంటామని ఎన్నికల ముందు అనేక సార్లు ప్రకటించారు. కానీ ఇప్పుడు మాత్రం సైలెంట్ గా ఉండిపోయారు. గత రెండేళ్ల కాలంలో అవినీతి విపరీతంగా పెరిగిపోయిందని.. ఇటీవల వెల్లడవుతున్న అనేక సర్వేలు వెల్లడిస్తున్నాయి.

ఆర్థిక వృద్ధిలో చైనాను దాటిపోతున్నామని.. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నామని మోదీ ప్రభుత్వం విపరీతంగా ప్రచారం చేసుకుంటోంది. అయితే వాస్తవానికి ఇలాంటి భావన వాణిజ్య, వ్యాపార వర్గాల్లో అసలు కలగడం లేదు. గణంకాలు విభిన్నమైన విషయాలు వెల్లడిస్తున్నాయి. 2015-16తో పోలిస్తే కోర్ సెక్టర్ అభివృద్ధి రేటు 2.7శాతానికి పడిపోయిందని వార్తాపత్రికలన్నీ ప్రకటించాయి. ఇది గత దశాబ్ద కాలంలోనే అత్యల్పం. గత ఏడాది ఈ రంగంలో వృద్ధి రేటు 4.5శాతంగా ఉంది. ఎగుమతులు తగ్గాయి..డాలర్ తో పోలిస్తే రూపాయి చాలా బలహీనంగా ఉందని ప్రభుత్వమే చెబుతోంది.

విదేశీ పెట్టుబడి దారులకు భారత్ ఇప్పటికీ ఆదర్శవంతమైన గమ్యస్థానం కాదు. ఉద్యోగాల కల్పనలో పూర్తిగా వైఫల్యం చెందారు. 2014ఎన్నికల్లో యువతకు మోదీ ఎంతో ప్రియపాత్రంగా కనిపించారు. ఎందుకంటే వారికి కొండమీది కోతిని తెచ్చిస్తామనే రీతిలో వాగ్దానాలు చేశారు. కానీ నిజానికి ఇప్పుడు పరిస్థితి తిరగడింది. ఉద్యోగాల కల్పన రేటు గత ఆరేళ్ల కనిష్టానికి దిగజారింది. 2015 తొలి తొమ్మిది నెలల్లో ఎనిమిది పారిశ్రామిక రంగాల్లో ఉద్యోగాల సృష్టి దారుణంగా తగ్గిపోయింది. కేవలం లక్షా యాభై ఐదు వేల ఉద్యోగాలు మాత్రమే సృష్టించారు. గత ఆరేళ్లలో ఇంత తక్కువ నియామకాలు ఎప్పుడూ లేదు. అభివృద్ధికి సంబంధించి ప్రభుత్వం విడుదల చేస్తున్న గణాంకాలపై నిపుణులు అనేక సందేహాలు వెలిబుచ్చుతున్నారు. అలాగే ఎన్నో సంస్కరణలు అలాగే ఉండిపోయాయి. జీఎస్టీ ఇప్పటికీ అమలులోకి రాలేదు. కారణం.. ప్రభుత్వ అహంకారితనం వల్లే.

మోదీ సహకార సమాఖ్య గురించి గొప్పగా చెబుతూంటారు. కానీ అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఢిల్లీల్లో చేసిన రాజకీయ వ్యవహారాలు.. మాత్రం మోదీని విపక్షాలను నిర్ధాక్షిణ్యంగా అణచివేసే ఇందిరాగాంధీ సరసన నిలబెట్టాయి. న్యాయవ్యవస్థ కూడా తీవ్ర అసంతృప్తిలో ఉంది. సాక్షాత్తూ సుప్రీంకోర్టు చీఫ్ జస్టీస్ నే.. న్యాయవ్యవస్థలో నియామకాల విషయంలో ప్రభుత్వ తీరును గుర్తు చేసుకుని పబ్లిక్ గా కంటతడి పెట్టారు.

విదేశీ వ్యవహారాల విషయంలో మోదీ విధానాలను ఆయన అనుచరులు టామ్ టామ్ చేసుకుంటున్నారు. భారత ప్రధానుల్లో అత్యధిక ప్రయాణాలు చేసినవారిలో మోదీనే ముందుంటారు. అందులో ఎలాంటి సందేహం లేదు. అయితే ఆయన సాధించేమీ లేదు. మోదీ పర్యటనల వల్ల ఏ ఒక్క ప్రపంచస్థాయి సంస్థ భారత్ లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రాలేదు. పాకిస్థాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ తో మోదీ మంచి సంబంధాలు నెరపుతున్నప్పటికీ.. భారత్-పాకిస్థాన్ సంబంధాలు ఎప్పుడూ లేనంతగా దిగజారాయి. కశ్మీర్లో మళ్లీ ఘర్షణలు తలెత్తుతున్నాయి. సరిహద్దుల్లో ఉద్రిక్తత పెరుగుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా కశ్మీర్ లో ఐసిస్ జెండాలు పదే పదే రెపరెపలాడుతున్నాయి.

భారత్ విదేశీ విధానం సరిగ్గా లేక పాకిస్థాన్ కు దూరమవుతూడటంతో వాళ్లు చైనాకు దగ్గరవుతున్నారు. భారత విదేశాంగ విధానంలో లోపం వల్లే పాకిస్థాన్.. భారత్ సరిహద్దుల వెంట రోడ్లు నిర్మించే అవకాశాన్ని చైనాకు ఇచ్చింది. నేపాల్ తో భారత్ కు ఎప్పటినుంచో స్నేహ సంబంధాలుఉన్నాయి. కానీ ఇప్పుడు మాత్రం కాదు. భారత్ పై నేపాల్ చాలా కోపంగా ఉంది. నేపాల్ అంతర్గత వ్యవహాల్లో మోదీ ప్రభుత్వం అవసరంగా జోక్యం చేసుకుంది. ఫలితంగా అక్కడి ప్రజలు కూడా భారత్ పై వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. భారత్ తో పోలిస్తే చైనాకే శ్రీలంక మరింత సన్నిహితంగా మారుతోంది. పాకిస్తాన్ ఉగ్రవాది అజార్ మసూద్ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించేందుకు చైనా అధినేత జి జింగ్ పింగ్ సాయం తీసుకునేందుకు మోదీ తన వంతు ప్రయత్నం చేశారు. కానీ చైనా నుంచి ఎలాంటి సహకారం లభించలేదు. పొరుగుదేశాలతో మనదేశ సంబంధాలు గతంలో ఎన్నడూ లేనంత దిగువస్థాయిలో ఉన్నాయి.

మతపరమైన హింస విషయంలో మోదీ ఎక్కడా మాట్లాడటం లేదు. మైనారిటీలో దేశంలో ఇప్పుడు చాలా అభద్రతాభావంలో బతుకుతున్నారు. తమకు కొన్ని అతివాద సంస్థల నుంచి తీవ్రమైన ముప్పు పొంచి ఉన్నదని వారు గట్టిగా నమ్ముతున్నారు. వివిధ మైనారిటీ సంస్థలు, వ్యక్తులపై జరిగిన దాడులపై ప్రధాని నోరు మెదపలేదు. ఇలాంటి వాటిని ప్రశ్నిస్తున్న వారిని జాతీయవాదం, దేశభక్తి అంటూ భయపెడుతున్నారు. అమీర్ ఖాన్, షారుఖ్ ఖాన్ లాంటి వారిపై ఇలాగే చేసి..అభద్రతలోకి నెట్టారు.

ప్రస్తుతం దేశం మతపరంగా విభజనకు గురువుతోంది. దీన్ని నిరోధించడానికి ప్రధానమంత్రి ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదు. భారతీయులు ఎన్నో ఆశలతో మోదీకి పట్టం కట్టారు. కానీ ఇప్పుడు అవన్నీ అడియాశలవుతున్నాయి. భారతదేశ ఉదారవాదం ఇప్పుడు ప్రమాదంలో పడింది. ఈ సున్నితమైన విషయాలను ప్రధాని పరిగణనలోకి తీసుకోవడం లేదు. ప్రధానికి ఇంకా మూడేళ్ల సమయం ఉంది. సిద్దాంతాల చట్రంలో బందీ అయి గతం విషయాల పట్ల ప్రతీకారం తీర్చుకునేలా

ప్రధాని వ్యవహరిస్తారో ప్రజాస్వామ్యాన్ని అనుసరిస్తారో చూడాలి. మోదీ 2019లో మరోసారి ప్రజల తీర్పును కోరాల్సి ఉంటుంది. ఆ విషయాన్ని మర్చిపోకూడదు.


రచయితః అశుతోష్, ఆమ్ ఆద్మీ పార్టీ నేత