బెంగళూరు వర్సెస్ హైదరాబాద్! స్టార్టప్ హబ్ సింహాసనం దక్కేది ఎవరికి !?

బెంగళూరు వర్సెస్ హైదరాబాద్! స్టార్టప్ హబ్ సింహాసనం దక్కేది ఎవరికి !?

Wednesday January 27, 2016,

4 min Read

స్టార్టప్స్‌ కేరాఫ్‌గా బెంగళూరు ఉన్నత స్థాయికి చేరి అందరినీ ఆకర్షిస్తూ ఉండొచ్చు. కానీ హైదరాబాద్ కూడా ఇప్పుడిప్పుడే బెంగళూరుకు ధీటుగా ఓ బలమైన పునాది మీద పెద్ద వ్యవస్థ నిర్మించుకునేందుకు సిద్ధమవుతోంది. స్టార్టప్ హబ్‌గా ఎదిగేందుకు ఉవ్విళ్లూరుతోంది. ఒకప్పుడు టఫ్ కాంపిటీటర్‌ అవుతుందని అంతా భావించిన భాగ్యనగరి మరోసారి తన సత్తా ఏంటో ప్రపంచానికి చాటేందుకు సిద్ధమవుతోంది.

ఐటి ప్రభంజనం సమయంలో హైదరాబాద్ మైక్రోసాఫ్ట్, ఫేస్ బుక్, గూగుల్ వంటి ప్రఖ్యాత సంస్థలకు వేదికగా నిలిచింది. అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంతి చంద్రబాబునాయుడు.. అప్పట్లో మైక్రోసాఫ్ట్ అధినేతను కలవడం, ఆయను హైదరాబాద్ రప్పించి, ఒప్పించి ఇక్కడ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేయించడం వంటివి అందరికీ తెలిసిన విషయాలే. ఆ తర్వాత కొన్ని ప్రత్యేక తెలంగాణ ఉద్యమాలతో ఇక్కడి పురోగతికి కొద్దిగా బ్రేక్ పడింది. అభివృద్ధిపై దృష్టి సారించేందుకు అప్పట్లో ఎవరూ ఉత్సుకత చూపని రోజుల నుంచి ఇప్పుడిప్పుడే ఆ ముద్రను చెరిపేసుకుని ప్రపంచానికి తన సత్తా ఏంటో చాటేందుకు సన్నద్ధమవుతోంది.

ప్రభుత్వ అధికారులు, ఇన్వెస్టర్లు, ఇంక్యుబేటర్లు, స్టార్టప్స్.. ఇలా అందరూ కలిసి పూర్వవైభవం దిశగా అడుగులు వేస్తున్నారు. ఆ ప్రయత్నాల ఫలితం ఇప్పుడిప్పుడే కనిపిస్తోంది. గ్లోబల్ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్.. హైదరాబాద్‌లో 20లక్షల ఉత్పత్తులను నిల్వచేయగల సామర్ధ్యం ఉన్న అతిపెద్ద వేర్‌హౌస్‌ను నిర్మించింది. ఉబర్‌ కూడా స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఫెసిలిటీ ఇంటర్నేషనల్ ఆఫీసుకు హైదరాబాద్‌ను వేదికగా చేసుకుంది.

యువ, ఔత్సాహిక స్టార్టప్స్‌ కూడా ఎన్నో పుట్టుకొస్తున్నాయి. ప్రస్తుతం యువర్ స్టోరీ హైదరాబాద్‌లో 1800 స్టార్టప్స్‌ను ట్రాక్ చేస్తోంది.

image


నిధుల వరద

హైదరాబాద్‌ బిర్యానీ లాంటి ఇన్ఫర్మేషన్ చూసే ముందు.. కొన్ని బ్రీఫ్ డీటైల్స్ చూడండి. గ్రాఫిక్స్ రూపంలో..

image


గత కొన్నేళ్లుగా ఇక్కడి సంస్థల ఫండింగ్ ట్రెండ్

image


హైదరాబాద్ స్టార్టప్స్

మొబైల్ యాప్ ఫోకస్డ్ స్టార్టప్స్ అయిన కాన్వాస్ ఫ్లిప్, యాప్ వైరాలిటీ, జిఫీ.. హెల్త్ అండ్ వెల్నెస్ సెక్టార్లో దూసుకుపోతున్న మేనేజ్‌మైస్పా, జప్లుక్, మ్యాప్‌మైజీనోం, ట్రూవెయిట్, హెల్తియన్స్ వంటివి ఇప్పటికే మంచి ఫండింగ్ అందుకున్నాయి. ప్రైజ్ జుగాడ్, మై స్మార్ట్ ప్రైస్ వంటివి కూడా ఈ జాబితాలో ఉన్నాయి.

image


2015 సెప్టెంబర్‌లో నాస్కాం రూపొందించిన రిపోర్ట్ ప్రకారం దేశవ్యాప్తంగా జరుగుతున్న స్టార్టప్‌ జోరులో హైదరాబాద్ వాటా 8 శాతంగా ఉన్నట్టు అర్థమవుతోంది. 2018 నాటికి బెంగళూరుకు ధీటుగా హైదరాబాద్‌లో స్టార్టప్ ఎకో సిస్టమర్ రూపొందిద్దుకుంటుంది అనడంలో సందేహం లేదు అంటున్నారు 50కె వెంచర్స్ మేనేజింగ్ పార్ట్‌నర్ సంజయ్ ఎనిశెట్టి.

దేశవ్యాప్తంగా ఉన్న ట్రెండ్‌కు తగ్గట్టే హైదరాబాద్‌లో కూడా హైపర్‌లోకల్, ఈ కామర్స్ రంగాల్లో పెద్ద ఎత్తున క్వాలిటీ స్టార్టప్స్ వస్తున్నాయని సతీష్ చెప్తున్నారు.

అయితే ఈ మధ్యకాలంలో ఇక్కడి నుంచి ఎంటర్‌ప్రైజ్ సాఫ్ట్‌వేర్, కామర్స్, హెల్త్‌కేర్ రంగాల నుంచి కొన్ని స్టార్టప్స్ పుట్టకొస్తున్నాయి.

ఆంట్రప్రెన్యూర్ల సంఖ్య పెరగడంలో కూడా క్వాలిటీ స్టార్టప్స్‌ సంఖ్య కూడా పెరిగిందని రమేష్ చెబ్తున్నారు. గతేడాది నుంచి నాణ్యత,సత్తా ఉన్న సంస్థలు పెద్ద సంఖ్యలో వస్తున్నాయంటున్నారు.

''కార్పొరేట్ రంగంలో సుదీర్ఘమైన అనుభవాన్ని సంపాదించిన తర్వాత ఆ ఉద్యోగాలను వదిలేసి స్టార్టప్స్ మొదలుపెడ్తున్న వారి సంఖ్య హైదరాబాద్‌లో ఎక్కువగా ఉంది. నాణ్యత పెరుగుతోందనేందుకు ఇదే సంకేతం. అనుభవం వల్ల వివిధ అంశాలపై వాళ్లకు పట్టుకూడా పెరుగుతుంది. అనుభవం ఉన్న వాళ్లకు అన్ని విషయాలపైనా అవగాహన ఉంటుందనేది నా ఉద్దేశం కాదు.. కానీ అలాంటి వాళ్లు ఒక విషయాన్ని వివిధ కోణాల్లో ఆలోచించగలరు'' అంటున్నారు సిఐఈ హైదరాబాద్ సిఓఓ టామ్ థామస్.

ఇక్కడి వ్యవస్థ స్టార్టప్ హబ్‌గా ఎదగాడాన్ని ప్రత్యక్షంగా చూస్తున్న వాళ్లు కూడా అదే విషయాన్ని ధృవీకరిస్తున్నారు. ''హెల్త్ కేర్, ఫార్మా రంగాల్లో ఉన్న ప్రముఖ పేర్లన్నీ హైదారాబాద్‌ నుంచే వినిపిస్తాయి. ఇక్కడి ప్రజల్లో పారిశ్రామికతత్వం ఎక్కువ అంటున్నారు'' ఎండియా పార్ట్‌నర్స్ ఎండి సతీష్ ఆండ్ర.

ఇంతకీ హైదరాబాద్‌లో ఉన్న ఎకో సిస్టమ్ ఎలా ఉంది ? బెంగళూరును బీట్ చేసేందుకు ఎలాంటి ప్రత్యేకతలను భాగ్యనగరి పుణికి పుచ్చుకుంది.

I. మౌలికసదుపాయాలు (ఇన్ఫ్రాస్ట్రక్చర్)

ఏ స్టార్టప్ అయినా మొదటి అడుగువేయాలంటే ఒక్క ప్రోడక్ట్ మాత్రమే సరిపోదు. అందుకు సరైన టీంతో పాటు మౌలిక సదుపాయాల అవసరం కూడా ఎంతైనా ఉంటుంది. అదే హైదరాబాద్ ప్రత్యేకత. 2000 సంవత్సరం నుంచే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద హైదరాబాద్ దృష్టిసారిస్తూ వచ్చింది.

''ఇతర మెట్రోనగరాలతో పోలిస్తే హైదరాబాద్ అత్యంత చవకైన నగరం. మౌలిక సదుపాయాలు ఎప్పటి నుంచో మెరుగ్గా ఉన్నాయి. ఆ బలమైన పునాదుల మీద ఇప్పుడు భవంతుల నిర్మాణం జరుగుతోంది'' అంటున్నారు ప్రముఖ మెంటర్, అడ్వైజర్, ప్రోగ్రెస్ సాఫ్ట్‌వేర్ సెంటర్ హెడ్ రమేష్ లోగనాధన్.

A. ఇంక్యుబేషన్ సెంటర్లు

'' నేను సిఈఐలో పనిచేసేటప్పుడు 11 స్టార్టప్స్ మాత్రమే ఉండేవి. ఏడాది తర్వాత ఇప్పుడా సంఖ్య ఇంక్యుబేషన్‌లో 70కి పెరిగింది '' అంటారు జెంటీ ఫౌండర్ మనోజ్ సూర్య. ట్రిపుల్ ఐటిలో ఉన్న సిఐఈతో పాటు ఐఎస్‌బి, బిట్స్ పిలానీ కూడా ఇంక్యుబేషన్ సెంటర్లున్నాయి.

సిఐఈలో ఉన్న ఆంట్రప్రెన్యూర్లు విభిన్నమేమీ కాదు, కానీ ఇంక్యుబేషన్ సెంటర్ల ముఖ్యపాత్ర ఏంటంటే ఇక్కడి వాళ్లలో సాలిడ్ బేస్ ఏర్పాటు చేయడం. రాబోయే రోజుల్లో గొప్ప ఉత్పత్తులు వాళ్లు రూపొందించే విధంగా ప్రోత్సహించడం.. ఇందుకోసం వాళ్లను నిత్యం వెన్నుతడుతూ ఉంటాం అంటున్నారు స్టార్టప్ బైట్ కో ఫౌండర్, సిఈఓ ఇంక్యుబేషన్ మేనేజర్ ప్రవీణ్ దోర్న.

B. కో వర్కింగ్ స్పేస్

హైదరాబాద్‌ను బెంగళూరుతో పోల్చలేకపోయినప్పటికీ ఇక్కడి వ్యవస్థ మాత్రం నిద్రాణంగా లేదు. బలమైన ఎకో సిస్టం ఏర్పాటు చేసుకునే దిశగా సన్నద్ధం చేసుకుంటోంది అంటున్నారు స్టార్టప్ కోచ్ రఘువీర్ కోవూరు.

చాలా కో వర్కింగ్ స్పేసుల్లో ఫండింగ్, గ్రోత్ వంటి అంశాలపై ఎప్పుడూ చర్చలు జరుగుతూనే ఉంటాయి. మొదటి సారి ఆంట్రప్రెన్యూర్ అవతారమెత్తిన వాళ్లకు ఇలాంటివి ఎంతో ఉపయుక్తంగా ఉంటాయి.

II. మానవ వనరులు

స్టార్టప్స్, ఎకో సిస్టంను ఎప్పుడూ వాటిని ప్రారంభించిన వాళ్లను బట్టి, వాటిని వెనుక ఉండి నడిపించే వాళ్లను బట్టి ఆధారపడి ఉంటుంది. ప్రభుత్వ ప్రోత్సాహం, మెరుగైన మౌలిక సదుపాయాలతో అలరారుతున్న నగరంలో ఓ స్థిరమైన వాతావరణాన్ని, వ్యవస్థను నిర్మించడం ఇప్పుడు ఆంట్రప్రెన్యూర్ల బాధ్యత.

A. టాలెంట్‌కు కొదువ లేదు

సిటీలో పెరుగుతున్న విద్యా సంస్థలు, ఇంక్యుబేషన్ సెంటర్ల కారణంగా టెక్ టాలెంట్‌ ఉన్న జనాల లోటు కనిపించడం లేదు. బెంగళూరు తర్వాత హైదరాబాద్‌లోనే వివిధ రంగాల్లో టాలెంట్ పూల్ దొరుకుతోందని అంటున్నారు రమేష్. ప్రారంభ స్థాయి నుంచి టాప్ ఆర్డర్ వరకూ వివిధ స్థాయిల్లో కూడా ఇక్కడ నిపుణుల కొరత ఉండడం లేదు.

B. ఇంటర్‌లింక్డ్ నెట్వర్క్

స్టార్టప్స్, ఆంట్రప్రెన్యూర్స్ సంఖ్య పెరగడంతో నగరంలో ఉన్న అడ్వైజర్స్, మెంటర్స్, ఇంక్యుబేటర్ హెడ్స్, ఇన్వెస్టర్స్ అంతా కలిసి సంయుక్తంగా ఓ వ్యవస్థను రూపొందిస్తున్నారు. అందరి ఉద్దేశం ఒకటే.. స్టార్టప్స్‌కు అర్థం చేసుకోవడం, వాళ్లకు అవసరమైన సహకారాన్ని అందించడం.

ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్న ఎకో సిస్టం చాలా సింపుల్‌గా ఇంటర్‌కనెక్టెడ్‌గా ఉంటోంది.

చిన్న చిన్న లోపాలను అధిగమించడం

గతంతో పోలిస్తే హైదరాబాద్‌ జోరు పెరిగింది అనడంలో ఎలాంటి సందేహం లేకపోయినప్పటికీ ఫండింగ్ లాంటి విషయాల్లో మాత్రం బెంగళూరే ముందంజలో ఉంది. అద్భుతమైన వ్యవస్థ ఉన్నా.. కొన్ని సంవత్సరాల పాటు జరిగిన రాజకీయ అనిశ్చితి కారణంగా కొంత అడ్వాంటేజ్‌ను నగరం కోల్పోయింది.

టెక్నికల్ స్కిల్స్, టాలెంట్ ఉన్న వాళ్లకు కొదవ లేకపోయినప్పటికీ బెంగళూరు నుంచి పుట్టుకొస్తున్న వాటిల్లో మాత్రం నాణ్యత ఇంకా ఎక్కువగా ఉంటోంది. ''ప్రస్తుతం అన్ని రకాలుగా మేం సిద్ధమై ఉన్నాం. ఇప్పుడు వివిధ నగరాల నుంచి టాలెంట్‌ను ఆకర్షించాల్సిన సమయం ఆసన్నమైంది'' అంటారు టామ్.

ప్రస్తుతం దేశంలో ప్రతీ నగరం ఓ స్టార్టప్ హబ్‌గా ఎదిగేందుకు ఉవ్విళ్లూరుతోంది. కానీ హైదరాబాద్ మాత్రం వివిధ కోణాల్లో తనకున్న ప్రత్యేకతను చాటుకుంటూ లక్ష్యంవైపు దూసుకుపోతోంది. ''ప్రతీ ఒక్కరూ ఇన్ఫ్రాస్ట్రక్చర్, టాలెంట్, గ్రోత్ ఆపర్చునిటీస్ గురించి మాట్లాడుతూ ఉంటారు. కానీ అన్నింటినీ సమ్మిళితం చేసుకుని ముందుకుసాగితేనే ఓ బలమైన స్టార్టప్ ఎకో సిస్టమ్ ఏర్పడుతుంది. ఈ దిశగా హైదరాబాద్ శక్తివంచన లేకుండా కృషి చేస్తోంది'' అంటారు రమేష్ లోగనాధన్.

Original story written by Sindhu Kashyap

Translation by Chanukya

Images created by Aditya Ranade