ఆరంకెల ఉద్యోగాన్నీ ఆనందంగా వదిలేశాడు. గ్రామాల్లో వెలుగులు నింపుతూ ఎందరికో ఆప్తుడయ్యాడు.

ఆరంకెల ఉద్యోగాన్నీ ఆనందంగా వదిలేశాడు. గ్రామాల్లో వెలుగులు నింపుతూ ఎందరికో ఆప్తుడయ్యాడు.

Sunday June 21, 2015,

3 min Read

ఓ మంచి పని కొత్తగా ప్రారంభించాలనుకుంటే ఎన్నో ఇబ్బందులు, అడ్డంకులు వస్తుంటాయి. కానీ చేయాలనే సంకల్పం బలంగా ఉంటే..వాటన్నింటినీ సులువుగా అధిగమించవచ్చని చేతల్లో నిరూపించారు రుస్తుం సేన్ గుప్తా. 'బూంద్' సాయంతో దాదాపు వంద జిల్లాల్లో వెలుగులు నింపారు.

హిందీలో' బూంద్ ' పదానికి బిందువు అని అర్థం. కానీ అదే పదానికి నిరంతర శ్రమ అనే భావం కూడా వస్తుంది. ఇలా అనుకున్నదే తడువుగా తన కొత్త స్టార్టప్‌ కోసం మల్టీనేషనల్ కంపెనీలో ఫైనాన్స్ మేనేజర్ జాబ్‌కు గుడ్ బై చెప్పారు గుప్తా. ఆరంకెల జీతాన్ని త్యాగం చేసి..చివరకు ఓ సోషల్ ఆంట్రప్రెన్యూర్‍‌గా మారి బూంద్‌కు స్వాగతం పలికారు. గ్రామీణ భారత దేశంలో క్లీన్ ఎనర్జీ అందించడానికి ప్రణాళికలు తయారు చేశారు. వంద కోట్లకు పైగా ఉన్న భారత్‌లో కొంత మందికే అన్ని రకాల సేవలు అందుబాటులో ఉన్నాయి. కానీ గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ప్రజలకు కనీస అవసరాలు తీర్చుకొనే పరిస్థితి లేదు. మరో వైపు మిలినియర్స్..బిలియనర్స్‌గా మారిపోతున్నారే తప్ప.. గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ప్రజల జీవితాల్లో ఎలాంటి మార్పులు రావడం లేదు. వీళ్లందరి కోసం ఏదో చేయాలనుకున్నారు రుస్తుం సేన్ గుప్తా.

image


గుప్తా 'బూంద్' సంస్థ వ్యవస్థాపకుడు. గ్రామీణ భారతదేశానికి క్లీన్ ఎనర్జీ అందించడానికి రూపకల్పన చేసిన ప్రాజెక్ట్ ఇది. గ్రామాల్లో సోలార్ ల్యాంప్స్, మస్కిటో నెట్స్ డిజైన్ చేశారు. వీటిని అభివృద్ధి చేసి దేశంలోని గ్రామాల్లో పేద ప్రజలకు అందించాలనే లక్ష్యంతో సంస్థకు శ్రీ కారం చుట్టారు. సంస్థ తయారు చేసిన అన్ని రకాల ఉత్పత్తులు సరసమైన ధరలతో పాటు, అధిక నాణ్యత, సర్వీసు గ్యారంటీతో రూపొందిస్తున్నారు.

బెదిరింపులకు బెదర లేదు

బూంద్ సంస్థను ప్రారంభించినప్పుడు మొదట్లో రుస్తుం సేన్ గుప్తా ఎంతో ఇబ్బంది పడ్డారు. జార్ఖండ్, బెంగాల్ రాష్ట్రాల్లో ఉత్పత్తులు సరఫరా చేసే సమయంలో మావోయిస్టు తిరుగుబాటుదారుల నుంచి బెదిరింపులు వచ్చాయి. అయినప్పటికి గ్రామస్తుల్లో అవగాహన కల్పించి, వారితో కలిసి వడివడిగా అడుగులు ముందుకు వేశారు. రవాణా, ఫైనాన్సింగ్ విషయాలతో గ్రామాల్లోని ప్రజలు ఐక్యం కావడం ద్వారా వారి మైండ్ సెట్‌లో మారింది. అయితే తమ ఉత్పత్తులు ప్రజల ఆర్ధిక స్తోమతకు తగ్గట్టుగానే రూపొందించుకొనే అవకాశం ఇచ్చామని, ​​సేన్ గుప్తా చెప్పారు.

గ్రామాల్లో  బూంద్ సోలార్ ప్యానెల్స్

గ్రామాల్లో బూంద్ సోలార్ ప్యానెల్స్


నాలుగేళ్లలో 50 వేల మందికి..

2009 లో 'బూంద్ ' ప్రారంభించినప్పటి నుంచి 50 వేల మందికి పైగా తమ ఉత్పత్తులను అందించింది. వీరికి దాదాపుగా ఆరు వేల సోలార్ ప్యానల్స్ నుంచి విద్యుత్ సరఫరా అందజేస్తున్నారు. రాజస్థాన్, ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రాల్లో మూడు వేర్వేరు విభాగాలు పనిచేస్తున్నాయి. గ్రామాల్లో ఉండే వారికి రోజూ 4 నుండి పది డాలర్లు వరకు ఆదాయం లభిస్తోంది. బూంద్ సంస్థ గ్రామాల్లో ఉండే వారి కోసం 1౦ వాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేసింది. దాని నుంచి వచ్చే విద్యుత్ తో రెండు బల్బులు, సెల్ ఫోన్ చార్జింగ్ అవకాశం ఉంటుంది. దీనికయ్యే మొత్తాన్ని వివిధ రకాల దాతల నుంచి వచ్చే నిధులు సేకరించి అందిస్తున్నారు. అధిక నాణ్యతతో బూంద్ సౌర దీపాలు, వాటర్ ఫిల్టర్ మిషన్స్, మారుమూల గ్రామాల్లో దోమతెరలు అందిస్తున్నారు. ప్రస్తుతం బూంద్ దేశంలోని ఐదారు రాష్ట్రాల్లోని 100 జిల్లాల్లో కార్యక్రమాలు విస్తరించి లైటింగ్, మంచి నీరు, చెదలు తగ్గించే పరిష్కారాలు వివరించి..పదిలక్షల మందిని ప్రభావితం చేయగలుగుతోంది.

సేన్ గుప్తా మాత్రం బూంద్ పథకం ద్వారా గ్రామస్తుల జీవితాలను మెరుగుపరుస్తూ..స్థిరమైన లాభాలు కల్గిన సంస్థగా సృష్టించాలని కోరుకున్నారు. అయితే "నేను ప్రతి గ్రామంలో ఏమి పని జరుగుతుందో తెలుసుకోలేకపోవచ్చు, కానీ వారికి అవకాశాలు ఇవ్వడం ద్వారా వ్యక్తులతో కనెక్ట్ అయ్యేందుకు అవకాశం ఏర్పడింది. బ్యాంక్ కన్సల్టెంట్‌గా నా పాత ఉద్యోగంతో పోలిస్తే... ఈ పని పోలిస్తే అత్యంత సంతృప్తికరమైన అనుభవం. తక్కువ వ్యవధిలో అనేక మంది జీవితాల్లో అభివృద్ధి చూడటానికి అవకాశం లభించింది. మేము అందిస్తున్న సేవలతో సమాజంలో అవసరాలకు తగ్గట్టుగా నమూనాలు సృష్టించడానికి అవకాశం ఏర్పడుతోంది'' అని గుప్తా వివరించారు.

image


ఒక్కో అడుగు ముందుకు

ఏదో ఆకర్షణీయమైన ఉత్పత్తులు తయారు చేసి.. ఒకేసారి ఏదో సాధించాలన్న ఆలోచన తనకు లేదంటారు. " బూంద్ పనిచేస్తున్న ప్రాంతంలో స్థూల ప్రాజెక్టులు గురించి మాట్లాడుతూ చర్చించుకోవడం విన్నాను. హిందీలో ఉన్న ఓ సామెత ఏంటంటే.. చిన్న నీటి బిందువులు సముద్రంగా మారినట్లు.. చిన్న చిన్న ప్రాజెక్టులే పెద్ద పరిశ్రమలకు కారణమవుతుందని విశ్వాసం ఉంది. గ్రామాల్లో చేస్తున్న సామూహిక ప్రాజెక్టులు సత్ఫలితాలు ఇస్తున్నాయి. పశ్చిమ బెంగాల్లో, బూంద్ సంస్థ మత్స్య కారులకు తక్కువ వడ్డీకి రుణాలు అందించింది. (6 నెలలకు ఆరు శాతం చొప్పున) అంతేకాదు దారిద్ర్య రేఖకు దిగువన నివసిస్తున్న ప్రతిభావంతులైన విద్యార్ధులకు స్కాలర్‌షిప్ అందిస్తోంది. మణిపూర్‌లోని గిరిజన పాఠశాలల్లో విద్యార్థులకు అవసరమైన ఎడ్యుకేషనల్ ఎయిడ్స్ కూడా అందిస్తోంది.

సవాళ్లు అధిగమించి..

మా కలల విద్యుత్ ప్రాజెక్టు ఇప్పడే నిజరూపంలోకి వస్తోంది. బూంద్ ప్రాజెక్టు సక్సెస్ చేయడం ద్వారా అతిపెద్ద సవాల్‌ను అధిగమించానని చెప్తారు. ఆ స్థాయికి రావడం కోసం ప్రతి నిమిషం పని చేశానని, సోషల్ ఇంపాక్ట్‌గా మార్చడం కోసమే నంటారు సేన్. 

ఓ వ్యవస్థాపకుడు విజయాన్ని... పరాజయాన్నీ ఎప్పుడు గుర్తుంచుకోవాలి. జీవితంలో దారుణంగా ఉన్న ఆ రోజులు ఉత్తమమైనవిగా మారతాయంటూ ముగించారు సేన్ గుప్తా.