మేడ్ ఇన్ చెన్నై... 'డ్రోన్‌'కు ప్రపంచ ఖ్యాతి

భారత్ నుంచి మరో గ్లోబల్ బ్రాండ్టీనేజిలోనే ఆవిష్కరణలకు తెర తీసిన వెంకటేష్స్వదేశీ బ్రాండ్ కు రూపం తెస్తున్న చెన్నై ఫ్యామిలీ

మేడ్ ఇన్ చెన్నై... 'డ్రోన్‌'కు ప్రపంచ ఖ్యాతి

Friday May 08, 2015,

3 min Read

పక్షులను చూసి గాల్లో ఎగరాలనుకున్న చిన్నారి.. ఎగిరే చిన్న యంత్రాలను తయారు చేశాడు. ఆ చిన్నారిని తండ్రి వెన్నంటే ఉండి నడిపించారు. ఆ తండ్రి కొడుకుల కథ ఇప్పుడు దేశం మొత్తం మీద ప్రాచుర్యంలోకి వచ్చింది. దీంతో పాటు వారు తయారు చేసిన డ్రోన్ కూడా గ్లోబల్ బ్రాండ్‌గా మారింది. ఆ కథేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

Image credit - shutterstock

Image credit - shutterstock


బాలీవుడ్ మెగా హిట్ 3 ఇడియట్స్ ద్వారా బాగా పాపులర్ అయిన డ్రోన్స్‌కు ముందు, వెంకటేష్, తన తండ్రితో కలిసి యాంత్రిక అద్భుతాలను గురించి లోతుగా అధ్యయనం చేశారు. వెంకటేష్ ఇంజనీరింగ్ కాలేజీలో తండ్రి తో కలిసి ఎయిర్ మోడలింగ్‌పై దీర్ఘకాలం పాటు ఆవిష్కరణలు చేశారు. అది 2007 వ సంవత్సరం, వెంకటేష్ 1౩ ఏళ్ల వయస్సు... స్కూల్ ఏజ్‌లో ఉండగానే తండ్రి-కొడుకులు కలిసి శ్రీ సాయి ఎయిరో టెక్ ప్రెవేట్ లిమిటెడ్ (SSAI) కంపెనీ ప్రారంభించారు. అలా ప్రారంభమైన వారి అభిరుచి ఇప్పుడు కొత్త కొత్త ఆవిష్కరణలకు దారి తీసింది.

తండ్రీ కొడుకులిద్దరూ మొదటిసారిగా మిస్టర్ మాస్ ప్రారంభించారు. ప్రారంభ స్థాయిలోనే ఈ ఉత్పత్తి ఎయిరో మోడలింగ్ నేర్చుకోవడానికి కారణమైంది. తర్వాత 3,000 పైగా యంత్రాల అమ్మకాలు కొనసాగాయి. 2009 లో ఐఐటి ముంబై టెక్ ఫెస్ట్‌లో జరిగిన పోటీలో గెలిచింది . SSAI కూడా విజయవంతంగా రక్షణ అప్లికేషన్లు నేషనల్ ఏరోస్పేస్ లాబ్స్ (NAL), DRDO సహకారంతో డ్రోన్ ప్రాజెక్టులు పూర్తి చేయడంతో వారిలో ఆత్మవిశ్వాసం పెరిగింది.

వెంకటేష్ ఇప్పుడు చెన్నై లయోలా కాలేజీలో ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ మూడవ సంవత్సరం ఇంజనీరింగ్ విద్యార్థి. తన తండ్రి సాయి పట్టాభిరాం Symbiosis నుంచి ఎంబీఏ పూర్తి చేశారు. వెంకటేష్ టెక్నికల్ గురువు ఎంపి సాజు.. చెన్నై తోషిబా మెషిన్‌లో రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ వింగ్‌లో హెడ్‌. తన హైస్కూల్ రోజుల నుండి వెంకటేష్‌కు మార్గదర్శనం చేసేవారు. సాజు సూచనలతో వెంకటేష్ తన ఇంట్లోనే aero modelling గురించి నేర్చుకున్నాడు. చిన్న వయసులోనే సైన్స్ పై ఆసక్తితో వెంకటేష్ టెక్నికల్ గా ఎప్పటికప్పుడు అప్ డేట్ అయ్యేవారు. సాజు కూడా Arduino ద్వారా ఎంబెడెడ్ వ్యవస్థలను అతనికి పరిచయం చేశారు. వెంకటేష్ కష్టపడి 17 కిపైగా కంప్యూటర్ భాషల్లో పరిజ్ఞానం సాధించారు.

వెంకటేష్ గురువు సాజు కూడా ఉత్పత్తుల దిగుమతికీ, డ్రోన్స్ తయారీకి ప్రేరణ ఇచ్చారు. చివరి ఏడాది, తండ్రి కొడుకులు ఇద్దరూ SSAI భవిష్యత్తు పై చర్చించడానికి ఒక రోజు మార్నింగ్ వాక్‌లో చర్చ ప్రారంభించారు. బుర్రలకు పదును పెట్టారు. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా ఒక యూజర్ ఫ్రెండ్లీ యాప్‌ను విస్తరించి గాడ్జెట్ చేయగలిగితే మాత్రమే వాల్డ్‌లో టాప్ ప్లేయర్ కావచ్చని గ్రహించారు. విశ్వవ్యాప్తంగా డ్రోన్ నియంత్రించే వ్యవస్థ లేకపోవడం వల్ల పడుతున్న ఇబ్బందులపై చర్చించారు. అప్పటికే మార్కెట్లో ఉన్న లేజీ కంట్రోలర్స్ ఆపరేషన్ కష్టమైనదిగా భావించారు. అయితే ఆపరేటింగ్ డ్రోన్ గుర్తిస్తే, సంపూర్ణంగా కంట్రోలర్ ట్యూనింగ్ చేయవచ్చనుకున్నారు. కానీ అది పూర్తి చేయాలంటే ఒక నెల కంటే ఎక్కువ సమయం పడుతుంది. దీనిపై పూర్తిగా చర్చించుకున్న వెంకటేష్, ఆయన తండ్రి సాయి అప్లికేషన్ API ల ద్వారా నియంత్రణ చేయవచ్చని, అటువంటి వాటిని స్మార్ట్ ఫోన్స్‌కు, లింక్ చేయాలని నిర్ణయించుకున్నారు. 

వినియోగదారులు డ్రోన్స్ అనుకూలీకరణకు ఉన్నతిని ఇంజెక్ట్ చేయడం వల్ల ఈజీ పైలెట్ ఆవిష్కరణకు దారి తీసింది. Eazypilot యూజర్ ఫ్రెండ్లీ గాడ్జెట్. ప్రపంచవ్యాప్తంగా వివిధ కొలతలలో తయారవుతున్న ప్రత్యేక డ్రోన్స్‌ను ఇంటిగ్రేట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. 2013-14 ఏడాదికి గాను తమిళనాడు చిన్న తరహా పరిశ్రమల సంఘం, SSAI కు గ్రాంటును అందించింది. SSAI నుంచి సాంకేతిక సలహాలు తీసుకోవాలని NAL ఒప్పందం కుదుర్చుకుంది. 

డ్రోన్‌తో శ్రీసాయి ఎయిరోటెక్ ఇన్నోవేషన్ టీమ్

డ్రోన్‌తో శ్రీసాయి ఎయిరోటెక్ ఇన్నోవేషన్ టీమ్


కుటుంబం అంతా వెన్నంటే...

వెంకటేష్ టెక్నాలజీ డివిజన్ నిర్వహిస్తుండగా... ఆయన తండ్రి వ్యాపార అభివృద్ధి, ఫైనాన్స్ వ్యవహారాలు చూస్తారు..ఇక తల్లి ఆఫీసు నిర్వాహణా బాధ్యతలు పర్యవేక్షిస్తారు. సోదరి భాగస్వామ్యాలు, చట్టబద్దమైన ఆమోదాలను చూస్తారు. ఇంకా కోర్సు గురించి ఆలోచిస్తారు. ఇంట్లో అందరూ కలిస్తే... సంభాషణలన్ని SSAI చుట్టూనే తిరుగుతాయి."మాది గ్లోబల్ కంపెనీగా మారిందా.. లేదా.. అనుకుంటున్నారా అంటే దాని కోసం ఇంకా హార్డ్ వర్క్ చేయాల్సిన అవసరం ఉందంటారు వెంకటేష్. "