నేనో రొమాంటిక్ ఆంట్రప్రెన్యూర్

పర్సనలైజ్డ్ హనీమూన్ ప్లానింగ్‌ కోసం పుట్టుకొచ్చిన స్టార్టప్ఐఐఎం లక్నో పూర్వవిద్యార్థి ఆలోచనఫిక్స్‌డ్ ప్లాన్స్ లేకుండా కస్టమర్ అభిరుచికి తగ్గట్టు టూర్ఏడాదికి 500 జంటలకు ప్రపంచాన్ని పరిచయం చేయడమే లక్ష్యంమూడేళ్లుగా సాఫీగా సాగుతున్న 'హనీమూన్ హవెన్స్' జర్నీ

నేనో రొమాంటిక్ ఆంట్రప్రెన్యూర్

Sunday July 05, 2015,

3 min Read

మనకు తెలిసిన పని, మనసుకు నచ్చిన పని చేస్తేనే సక్సెస్ అవుతాం. అది లైఫ్‌లో అయినా వ్యాపారంలో అయినా. చేతన్ ఎల్లాపుర్కర్ కూడా అదే చేశాడు. అతడికి ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. అడ్వెంచర్స్ అంటే అంతకంటే ప్రాణం. తన ప్లస్ పాయింట్స్ ఏంటో తెలుసుకుని ఓ ఆంట్రప్రెన్యూర్ అయిపోయాడు. హనీమూన్ హవెన్స్ అనే కంపెనీకి ఓనరయ్యాడు.

చేతన్, హనీమూన్ హవెన్స్ ఫౌండర్

చేతన్, హనీమూన్ హవెన్స్ ఫౌండర్


చేతన్... MSRIT, బెంగళూరు నుంచి మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. ఐఐఎం లక్నో పూర్వవిద్యార్థి కూడా. చిన్నప్పటి నుంచే అతనికి ఫోటోగ్రఫీ, పెళ్లిళ్లు, డ్యాన్సింగ్ అంటే మహా సరదా. తనకు ఉన్న ఆసక్తినే ఎందుకు వ్యాపారంగా మలుచుకోవద్దు అనే ఆలోచన వచ్చింది. అప్పటి నుంచే తన కలను సాకారం చేసుకునే పనిలో పడ్డారు.

హనీమూన్ హవెన్స్ అనేది ఓ ప్రీమియం హనీమూన్ ప్లానర్స్. కొత్తగా పెళ్లైన వారికి, జంటలకు వీళ్లు యానివర్సరీ ట్రిప్స్‌ డిజైన్ చేస్తారు. 2012లో ప్రారంభమైన ఈ స్టార్టప్... డ్రీమ్ వెడ్డింగ్ డెస్టినేషన్‌ అనే కొత్త సర్వీసును కూడా ప్రారంభించింది.

అయితే బిజినెస్ ఆలోచన వచ్చిందే తడవుగా అందులో దూరిపోలేదు. అనుభవం సంపాదించేందుకు అదే రంగంలో ఉన్న కంపెనీలతో కలిసి పనిచేశారు. మేక్ మై ట్రిప్, యాత్రా కంపెనీల్లో పనిచేసి ట్రావెల్ రంగంలో ఉన్న లోటుపాట్లను తెలుసుకున్నారు. పర్సనలైజ్డ్ ప్లానింగ్‌ స్పేస్‌తో అంత మార్కెట్ ఉందా ? భవిష్యత్ ప్రణాళికలు ఏంటి అనే విషయాలపై చేతన్ ఏం చెబ్తున్నాడో చూద్దాం.

''2012లో ఒకసారి మా స్నేహితుడి పెళ్లికి వెళ్లినప్పుడు పుట్టిన ఆలోచన ఇది. సరదాగా గడిపేందుకు మేమంతా ఒక్క చోటికి చేరాం. త్వరలో పెళ్లి కాబోయే వాళ్లు అక్కడ చాలామంది ఉన్నారు. నేను ట్రావెల్ ఫీల్డ్‌లో ఉన్నానని అక్కడ అందరికీ తెలుసు. అందుకే వాళ్ల పెళ్లి తర్వాత హనీమూన్‌కు ఎక్కడికి వెళ్లాలి ? అక్కడ ఎలా ఉంటుంది అనే విషయాలను నన్ను ఆసక్తిగా అడగడం మొదలుపెట్టారు. అప్పుడే అనిపించింది.. 'రొమాంటిక్ ఆంట్రప్రెన్యూర్'గా మారేందుకు ఇదే సరైన సమయమని.

భారత్‌లో హనీమూన్ మార్కెట్‌ను ఇంకా పూర్తిస్థాయిలో ఎవరూ చేజిక్కించుకోలేదు. ఎంతో మంది ఆన్ లైన్ ట్రావెల్ ఏజెన్సీలు ఉన్నా.. వాళ్లు ఎవరూ కస్టమర్ ఇష్టానికి తగ్గట్టు వ్యక్తిగత ప్లాన్ ఇవ్వలేకపోతున్నారు.

కానీ మేం మాత్రం పూర్తిగా ఒక్కో కస్టమర్‌ ఇష్టానికి, వాళ్ల అభిరుచికి తగ్గట్టు కస్టమైజ్డ్ ట్రిప్స్ ప్లాన్ చేస్తాం. వాళ్ల టేస్ట్‌కు తగ్గట్టే మా ప్లాన్ ఉంటుంది. మా అంచనాల ప్రకారం పర్సనలైజ్డ్ హనీమూన్ ట్రావెల్ ప్లానింగ్ మార్కెట్ చాలా పెద్దది.

బడ్జెట్ పెళ్లికీ ప్లాన్ ఉంది

ప్రస్తుతం మేం 50కిపైగా రొమాంటిక్ హనీమూన్ ప్రాంతాలను మా కస్టమర్లకు సజెస్ట్ చేస్తున్నాం. పారదర్శకమైన ప్రైజింగ్, ఖచ్చితమైన సేవలతో పాటు హనీమూన్ గిఫ్టులు కూడా ఇస్తున్నాం. అంతే కాదు ఇతర ప్రాంతాల్లో పెళ్లిళ్లు చేసుకోవాలనుకునే వాళ్లకు కూడా సలహాలు ఇస్తుంటాం. డబ్బుల కంటే అనుభూతిని కోరుకుని ఎంజాయ్ చేసే కస్టమర్లకే మా ప్రాధాన్యతనిస్తున్నాం. అయితే ఇదే సమయంలో తక్కువ బడ్జెట్లో ప్రణాళికలు చేసుకోవాలనుకునే వాళ్లకు మా సేవలు అందుబాటులో ఉన్నాయి. కమిషన్, సర్వీస్ బేస్డ్ ఫీజ్‌ అనేది మా రెవెన్యూ మోడల్‌. వస్తున్న లాభాలతో మేం మనగలమనే నమ్మకం మాకుంది.

image


అతిపెద్ద ట్రావెల్ కంపెనీలతో పనిచేసిన అనుభవం నాకుంది. అక్కడే ఎన్నో విషయాలను నేను తెలుసుకున్నాను. నాకు అర్థమైంది ఏంటీ అంటే ఉద్యోగులు ఎప్పుడూ జీతాలు కోసమే పనిచేస్తారు, వాళ్లకు కస్టమర్ సంతృప్తి ఏ మాత్రం పట్టదు. ప్రతీ ఏడాదీ మేం 500 కొత్త జంటలకు సేవలను అందించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నాం. కస్టమర్లతోపాటు కొంత మంది హనీమూన్ ఎక్స్‌పర్ట్స్ కూడా మాతో చేరేందుకు అవకాశముంది.

బ్యాంక్ లోన్ ఇవ్వం పొమ్మన్నారు

అయితే ఇంతవరకూ సాగిన జర్నీలో అంతా పూలబాట మాత్రం కానేకాదు. నేను మొదట కంపెనీ ప్రారంభించాలని అనుకున్నప్పుడు ఒక బ్యాంక్ నా లోన్‌ను తిరస్కరించింది. అంతేకాదు మూడేళ్ల పాటు మరోలోన్‌కు అప్లై చేసుకునేందుకు కూడా పనికిరానని తేల్చేసింది. దీన్ని జీర్ణించుకోవడానికి నాకు చాలా కాలం పట్టింది. ఒక దశలో అంతా అయిపోయిందనే భావన వచ్చింది. వ్యాపారవేత్తగా ఎదగాలనుకున్న నాకు అదే మొట్టమొదటి చేదు అనుభవం. అయితే కుంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేశాను. ఒకటి నుంచి పది లక్షలకు, పది లక్షల నుంచి పది లక్షల డాలర్లకు ఎదిగేందుకు నా దగ్గర సత్తా ఉందని నమ్మాను. దగ్గర ఉన్న చిన్నమొత్తాన్నే వ్యాపారానికి వెచ్చించాను. అయితే మొదట్లో మాకు అనుభవం లేని వ్యవహారాలన్నింటిలో చేతులుపెట్టి ఇబ్బందిపడ్డాను. ఫ్లైట్ బుకింగ్స్, వీసా అసిస్టెన్స్, ఫారెక్స్ వంటివన్నీ చేశాం. కానీ అది మాకు సరిపడదని అర్థమైంది. అందుకే అలాంటి వాటన్నింటినీ ఔట్‌సోర్సింగ్‌కు ఇచ్చేసి మాకు పట్టున్న వాటిపైనే దృష్టిపెట్టాం.

image


''అంతకుముందు సంవత్సరం మా దగ్గర సేవలు పొందిన జంటలు యానివర్సీల కోసం మళ్లీ మా దగ్గరకే వస్తున్నారు. రెఫెరెన్సులు కూడా బాగా పెరిగాయి. నాకు పెద్ద పెద్ద లక్ష్యాలంటూ ఏమీలేవు. నా ప్లాన్ చాలా సింపుల్. ఏడాదికి 500 జంటలకు మా ద్వారా కొత్త వెకేషన్ అనుభూతిని రుచిచూపించాలి. ఏడాదిలో నెల రోజుల పాటు సెలవుపెట్టి ప్రపంచమంతా తిరగాలి. హనీమూన్ అనగానే హనీమూన్ హవన్ అనే పేరు ప్రతీ నోటా వినపడాలి. అదే నా లక్ష్యం, నా కల''.