విజేతలు సంతోషంగా ఉండరు... సంతోషంగా ఉండేవాళ్లు విజేతలవుతారంటున్న వనితా శాస్త్రి

కష్టపడ్డం తల్లినుంచే నేర్చుకోవాలినేర్చుకోవడం నిరంతర ప్రక్రియగా కొనసాగాలిఒక్కోసారి అభిప్రాయాలు చెప్పేందుకు ఆలస్యమవ్వచ్చు, ఓపిక పట్టాల్సిందేకళలు నేర్చుకోవడం కూడా పాఠ్యాంశంగా మారాలి

విజేతలు సంతోషంగా ఉండరు... సంతోషంగా ఉండేవాళ్లు విజేతలవుతారంటున్న వనితా శాస్త్రి

Monday May 18, 2015,

4 min Read

‘‘జీవితంలో కష్టాలు, సమస్యలు చుట్టుముడుతూ ఉంటాయి. వాటిని ధైర్యంగా ఆహ్వానించి, వాటినుంచి పాఠాలు నేర్చుకోవాలి. అప్పుడే కొత్త ఆలోచనలు మన మెదడులో చిగురిస్తాయి’’అంటారు అశోకా యూనివర్శిటీ డీన్, డా.వనితా సిన్హా శాస్త్రి. విద్యావేత్తగా, పారిశ్రామిక వేత్తగా, దాతగా ఆమె తన అనుభవాలను పంచుకుంటున్నారు.

కెరీర్ ప్రారంభంలో ఆమె రెడ్‌వుడ్ ఇన్వెస్ట్‌మెంట్ సిస్టమ్స్ బోస్టన్‌లో పనిచేశారు. ఆ తర్వాత లాభాపేక్ష లేని రెండు సంస్థలను ప్రారంభించారు. కార్నెల్ యూనివర్శిటీలో పిహెచ్‌డీ పూర్తిచేసిన డాక్టర్ వనితా సిన్హా శాస్త్రి ప్రపంచంలోనే ప్రముఖ విద్యాసంస్థలో బోధించారు. బోస్టన్ యూనివర్శిటీలోని స్కూల్ మేనేజ్‌మెంట్, మసాచుసెట్స్‌లోని వెల్లస్లీ కాలేజ్, డార్ట్‌మౌత్‌లోని యూనివర్శిటీ ఆఫ్ మాస్‌లో ఆమె పనిచేశారు.

డా. వనితా సిన్హా శాస్త్రి -డీన్ అశోకా యూనివర్సిటీ

డా. వనితా సిన్హా శాస్త్రి -డీన్ అశోకా యూనివర్సిటీ


రాజనీతి శాస్త్రం విద్యార్ధినిగా ఉన్నప్పుడు గాంధీ సిద్ధాంతాలకు ఆమె ప్రభావితురాలైంది. ఆయనలోని నిస్వార్థత, త్యాగగుణం, దానగుణం ఆమెని బాగా కదలించింది. సంప్రదాయ డ్యాన్సర్‌గా, నాటక కళాకారిణిగా మార్చింది. జీవితంలో ఎదురయ్యే ఒడిదుడుకులను, కష్టాలను ఆమె చాలా ఓపికగా ఎదుర్కొంది. పారిశ్రామికవేత్తగా అశోకా యూనివర్శిటీ డీన్‌గా విద్యార్ధులకు ఆమె స్ఫూర్తిదాయకమయిన పాఠాలు చెబుతున్నారు.

ఇద్దరు సోదరీమణులు, ఒక సోదరుడితో చక్కని కుటుంబ వాతావరణంలో పెరిగిన డా.వనితా సిన్హా శాస్త్రి కష్టపడే తత్వం, ఓపిక, సహనం తల్లినుంచే నేర్చుకున్నానని చెబుతారు. వివిధ విషయాలకు సంబంధించిన విషయ పరిజ్ఞానం ఆమె తల్లి చెప్పే పాఠాల్లో ఆమె గ్రహించేది. ఏ విషయాన్ని అంత త్వరగా నమ్మకపోవడం.. దానిగురించి లోతుగా పరిశీలన చేయడం ఆమెకి అలవాటుగా మారిపోయింది.

లేడీ శ్రీరాం కాలేజ్‌లో పొలిటికల్ సైన్స్ చదివిన వనితా జెఎన్‌యూలో ఎంఏ, ఎంఫిల్ చేశారు. పీహెచ్‌డీ కోసం కార్నెల్ యూనివర్శిటీకి వెళ్ళారు. మంచి విద్యా సంస్థలో విద్యాభ్యాసం మన జీవితంలో ఎన్నో మార్పులు తెస్తుందంటారు వనితా. నేర్చుకోవడం అనేది నిరంతరం కొనసాగాల్సిన ప్రక్రియ అంటారు వనితా.

‘‘ఉన్నత విద్యలో విప్లవాత్మకమయిన మార్పులకు నాంది పలికింది అశోకా యూనివర్శిటీ. బోస్టన్ నుంచి ఇండియాకు రావడం అశోకా యూనివర్శిటీలో చేరడం నాలో చాలా మార్పుల్ని తీసుకువచ్చింది. విద్యావేత్తగా, పారిశ్రామికవేత్తగా, నాయకత్వ లక్షణాలు పెంపొందించే గురువుగా అన్ని రకాలుగా నేను మారిపోవాల్సి వచ్చింది. ఇక్కడికొచ్చాక నాలోని అన్ని కోణాలు బయటపడ్డాయి. ప్రతిరోజూ విద్యార్ధులతో మమేకం కావడం, నాయకత్వ లక్షణాలు పెంచే, మోటివేషన్ కలిగించే కార్యక్రమాలతో నేను చాలా బిజీ అయిపోయాను’’ అంటారు వనితా.

సామాన్య శాస్త్రం, చరిత్ర, భాష, భారతీయ సంస్కృతి అంశాలను మెరూ ఎడ్యకేషన్ ఫౌండేషన్, హేబిటాట్ లెర్నింగ్ సెంటర్‌లో బోధించేదాన్ని. స్కూల్స్‌లో భారతీయ విలువలు, భారతదేశంలో వాణిజ్యంపై అమెరికాలో పాఠాలు చెప్పేదాన్ని. 2001-2002 లో న్యూ ఢిల్లీలో హెబిటాట్ లెర్నింగ్ సెంటర్ ఏర్పాటుచేసిన వనితా ఓ ఎన్జీవో సాయంతో డిజిటల్ లెర్నింగ్‌లో పేద విద్యార్ధులకు ట్రైనింగ్ అందించేవారు. ఒడిస్సీ నాట్యంలో శిక్షణా తరగతులు కూడా నిర్వహించారు వనితా. ప్రముఖ నాట్యకారులు మాధవి ముద్గల్, గురు కేలుచరణ్ మహాపాత్ర పర్యవేక్షణలో నాట్య తరగతులు ఉండేవి. నాట్యం అంటే వనితాకి ప్రాణం. అంతేకాదు బుక్స్ చదవడం, పరిశోధించడం, భారతీయ కళలు, నాట్య ప్రక్రియలపై ఆమె ప్రదర్శనలు ఇచ్చేవారు. అమెరికాలోని విద్యార్ధులకు హిందీ కూడా నేర్పించేవారు.

image


‘‘మహిళలకు నేనిచ్చే సలహా ఒక్కటే. మీలో అంతర్గత శక్తులను బయటికి తీసుకురండి. మీ అభిప్రాయాలను వ్యక్తీకరించడానికి కొంత సమయం పట్టవచ్చు. కానీ ముందడుగు వేయాల్సింది ఇప్పుడే. ఇదే సరైన సమయం’’ అంటారు వనితా.

నేను పీహెచ్‌డీ థీసిస్ రాసేటప్పుడు మా పిల్లలు చాలా చిన్నవారు. వారిని చూసుకుంటూ పీహెచ్‌డీ పూర్తిచేయడం కాస్త కష్టంగానే అనిపించేది. జీవితంలో కొన్ని కావాలంటే కొన్నిటిని భరించాలంటారు. నా విషయంలో నా ఫ్యామిలీ, తల్లిదండ్రులు, పిల్లలు ఎంతగానో సహకరించారు. వనితా ప్రతి ప్రయాణానికి ఆమె భర్త చేదోడు వాదోడుగా నిలిచారు. ‘‘నా భర్త నా ఆలోచనలను ఎంతగానే శ్రద్ధగా వినేవారు. వెన్నుతట్టి ప్రోత్సహించేవారు’’ అని తన అనుభవాలు చెబుతారు వనితా.

image


‘‘ఈరోజుల్లో మహిళలు అన్నిరంగాల్లో శరవేగంగా దూసుకుపోతున్నారు. వారికి అన్ని విధాలుగా సహకరించేందుకు, తగిన సలహాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాను. అశోకా యూనివర్శిటీలో మహిళా పారిశ్రామిక వేత్తల్ని తయారుచేసేందుకు జెన్‌ప్యాక్ట్‌తో కలిసి జెన్‌ప్యాక్ట్ సెంటర్ ఫర్ ఉమెన్ లీడర్ షిప్ అనే సంస్థను స్థాపించా’’ అని చెబుతున్నారు వనితా.

అసాధారణ విషయాల్లో భారతీయ మహిళలకు మించినవారు ఎవరూ లేరు. మూలాలు మరిచిపోకుండా ఆధునికతకీ, సంప్రదాయానికి మధ్య వారధి వేసుకుంటూ అత్యాధునిక సాంకేతిక విలువలతో ముందుకి వెళ్ళాలంటారు వనితా.

అప్పటివరకూ విదేశాల్లో పెరిగిన మా పిల్లలకు ఇప్పడిప్పుడే భారతీయ విలువలు అలవాటవుతున్నాయి. ఇక్కడి పండుగలు, పబ్బాలు, వేడుకలను వారికి పరిచయం చేయించానంటారు వనితా.

‘‘ఈ తరం యువత ఆధునికతను పుణికిపుచ్చుకుంటోంది. స్మార్ట్‌ఫోన్లు, యాప్స్‌తో ముందుకెళుతోంది. నేర్చుకోవడం అనేది జీవితాంతం జరగాల్సిన ప్రక్రియ. విద్యార్ధులు, పిల్లలు, బంధువుల నుంటి ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉండాలి’’ అంటారు వనితా. వివిధ కళలు నేర్చుకోవడం అనేది పాఠ్యప్రణాళికలో భాగంగా ఉండాలి. మైనర్ స్థాయి నుంచి నేర్చుకుంటుంటే పెద్దయ్యే సరికి కొన్ని విషయాల్లో పరిపూర్ణత సిద్ధిస్తుంది.

టెక్నాలజీ పరంగా ఎప్పటికప్పుడు మారుతున్న విద్యావిధానాలను ఇతర దేశాలనుంచి మనం అన్వయించుకోవాలి. పారిశ్రామికపరంగా ముందుకెళ్ళాలంటే మనకున్న పాలనా పరమయిన వాతావరణాన్ని మార్చుకోవాలి. 1991. 2000 నాటికి పారిశ్రామిక విధానంలో మార్పులు చోటుచేసుకున్నాయి. ఔట్‌సోర్సింగ్ విధానం ఎక్కువైపోయింది. అప్పట్లో ఇన్ఫోసిస్, విప్రో, టీసీఎస్ వంటి కంపెనీలు ప్రారంభమై ఎంతటి అభివృద్ధిని సాధించాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. స్టార్టప్ కంపెనీలు కూడా ఇప్పుడు దూసుకుపోతున్నాయి.

image


‘‘అమెరికాకు మన కంపెనీలకు ఒకటే తేడా. అక్కడ కంపెనీలు టెక్నాలజీని అందిపుచ్చుకుని ముందుకు సాగిపోతూ ఉంటాయి. మనకున్న వాతావరణం ఇంకా మారాలి. ఇక్కడ ఏదైనా కంపెనీ స్థాపించాలంటే పదిసార్లు ఆలోచిస్తారు. అమెరికాలో అయితే ఆలోచన రావడమే తరువాయి. పకడ్బందీ ప్రణాళికతో ముందుకెళుతుంటారు’’ అంటారు వనితా.

వివిధ కంపెనీలు నడుస్తున్న తీరు. వాటి విజయాలకు గల కారణాలు, అవి అనుసరిస్తున్న టెక్నాలజీని పరిశోధించాలి. కేస్ స్టడీ అనేది ఎంతో ముఖ్యం.

విశ్వవిద్యాలయాలు, ఇతర విద్యాసంస్థల్లో జరుగుతున్న పరిశోధనా ఫలితాలు త్వరగా బాహ్యప్రపంచంలోకి రావాలి. బోస్టన్‌లోని TiE Executive Director ఔత్సాహిక పారిశ్రామికవేత్తలతో నిరంతరం మమేకం అవుతూ ఉండేవారు. ఒకరి ఆలోచనల్ని మరొకరు పంచుకునేవారు. ఫలితంగా వారి వారి కంపెనీల్లో కొత్త కొత్త మార్పులు వచ్చేవి

‘‘విజేతలు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండలేరు. అలాగే సంతోషంగా ఉండేవాళ్ళంతా విజేతలవుతారు’’అంటారు వనితా. 

నిజమే సంతోషం, విజయం రెండూ ఎక్కువ కాలం నిలుపుకోవడం కష్టమే మరి.